telangana rice millers problems
గాడి తప్పిన మిల్లర్స్ అసోసియేషన్
`సఖ్యతగా ఉన్నంతకాలం సమస్యలు లేవు
`ఐక్యత లోపించి ఆగం చేసుకుంటున్నారు

`జిల్లాల అసోసియేషన్ల ప్రాధాన్యత తగ్గిస్తున్నారు
`సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించుకోలేకపోతున్నారు
`మిల్లర్ల ప్రాణాల మీదకు వస్తున్న పట్టించుకోవడం లేదు
`మిల్లర్లను కాపాడుకోవాల్సిన నాయకత్వం కల్లప్పగించి చూస్తున్నారు
`మిల్లర్ ఆత్మహత్య తోనైనా కనువిప్పు కలగలేదు
`అన్నం పెట్టే మిల్లర్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?
`అన్నదాతల ఆత్మహత్యల పరంపర మిల్లర్ల దాకా సాగాలా?
`ఇప్పటికైనా నాయకులు మేలుకోలేరా
`మిల్లర్ల సమస్యల మీద దృష్టి పెట్టలేరా
`మిల్లింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారా
`నాయకులుగా చలామణి అయితే సరిపోతుందా
`మిల్లర్ల సంక్షేమం పట్టదా
`పర్యావరణాన్ని పాడు చేసే గ్రానైట్ వ్యాపారులపై కేసులు ఉండవు
`కొండలు గుట్టలు మింగుతున్న వారిపై ఎలాంటి చర్యలు ఉండవు
`అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని కళ్ళెత్తి చూడరు
`ప్రతిరోజు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కనికరం ఎక్కువ
`అన్నం పెట్టే మిల్లర్ల మీద అలుసు ఎక్కువ
`బియ్యపు గింజ తక్కువైన పిడి ఆక్ట్, ఆరఆర్ యాక్ట్ అంటారు
`పెండింగ్ బకాయిలు అని మిల్లులను మూసేస్తారు
`ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను మాత్రం సంవత్సరాలకు కొద్ది వాయిదా వేస్తారు
`లక్షల కోట్లు బకాయిలు ఉన్న గ్రానైట్ కంపెనీల పై మాత్రం దృష్టి పెట్టరు
`వడ్ల గింజ పొట్టు పై కూడా లెక్కలు చూస్తారు
`ఇప్పటికైనా మిల్లర్ అసోసియేషన్ నాయకులు మేల్కోండి
`అందరూ కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి సాగండి
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలో 3వేలకు పైగా రైస్ మిల్లులున్నాయి. అందులో సగటున కనీసం మూడు లక్షల మంది కుటుంబాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదారపడి జీవనం సాగిస్తుంటాయి. ఉపాదికిని కల్పిస్తున్నాయి. తెలంగాణలో వున్న సుమారు 4కోట్ల మందికి అన్నం అందిస్తున్నాయి. తెలంగాణలో పండుతున్న వడ్లు, దేశానికి, విదేశాలకు ఎగుమతి అయ్యి వారికి కూడా అన్నం పెడుతున్నాయి. కాని మిల్లులు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. మిల్లర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాని ఎవరికీ పట్టదు. ఎవరూ పట్టించుకోరు. రాష్ట్ర నాయకులు పట్టించుకుంటారని జిల్లా నాయకులకు అనుకుంటారు. జిల్లా నాయకులు సమస్యల పరిష్కారంలో ముందుంటారని రాష్ట్ర నాయకులు అనుకుంటారు. కాని చిన్నా, చితక మిల్లర్ల సమస్యలు కొండలా పేరుకుపోతున్నాయి. సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఆదాయం రాక, సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు మెడమీద కత్తిలా వేలాడుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి మిల్లర్ల అసోసియేషన్‌కు కనిపించడం లేదా? నాయకుల దష్టిలో లేవా? అంటే వున్నాయి. కాని వాటి పరిష్కారానికి నాయకులకు సమయం సరిపోవడం లేదు. మిల్లర్ల సమస్యల పరిష్కారానికి పూను కోవడం లేదు. ఒక కాకికి ఆహారం దొరికితే నాలుగు కాకులను పిలుస్తుంది. ఒకకాకికి ఆపద వస్తే నలభై కాకులను పిలుస్తుంది. ఒక నాయకుడు ఎదగడానికి పది మంది నాయకుల ఎదుగుదలను ప్రోత్సహిస్తారు. ఒక వ్యవస్ధ బాగు పడేతుందకు అందరి సహాకారం తీసుకుంటారు. ఇలా ఏరంగంలో చూసినా సహాకారమే కనిపిస్తుంది. కాని ఎందుకో మిల్లర్ల సమాజంలో మాత్రం ఎక్కడా ఆ సఖ్యత, ఐక్యత కనిపించడం లేదు. రాష్ట్ర నాయకుల్లో ఆదిపత్య పోరు విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో అసోసిషన్ గాడితప్పందనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మిల్ల్లర్ల అసోసియేషన్‌లో లుకలుకలు చిన్న మిల్లర్లకు శాపంగా పరిణమిస్తున్నాయి. మిల్లర్ల నాయకులు సఖ్యతగా వున్నంత కాలం ఎలాంటి ఇబ్బందులు లేవు. మిల్లర్ల కు సమస్యలు లేవు. వారి జీవితాలు నష్టాలు, కష్టాలు లేవు. కాని ఇటీవల మిల్లర్ల అసోసియేషన్‌లోనే ఐక్యత లోపించిందనే చర్చలు బాగా వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్ర స్ధాయి నాయకుల్లో దూరం, దూరం వుంటూ, జిల్లాల నాయకత్వాలకు ప్రాదాన్యత తగ్గస్తున్నారు. ఒక రకంగా వారి నాయకత్వాలను నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లా నాయకులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దు? తీసుకున్నా రాష్ట్ర నాయకుత్వాలకు సమాచారం అందించాలి. కాని ఏ నాయకుడికి ఏ సమాచారం ఇవ్వాలన్నదానిపై జిల్లా నాయకులకు స్పష్టత లేదు. ఒక నాయకుడికి సమాచారం ఇచ్చి, మరో నాయకుడికి ఇవ్వకున్నా కష్టమే. నాకెందుకు చెప్పలేదన్న మాటలే వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్ర నాయత్వాలలో వున్న అపార్దాలు, అసూయలు జిల్లా నాయకత్వాల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లా నాయకత్వాలు సొంత నిర్ణయాలు తీసుకోలేక సతమతమౌతున్నాయి. ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలన్నా, ప్రభుత్వాన్ని, అదికారులను కలవాలన్నా, తమ సమస్యలు చెప్ప్పుకోవాలన్న రాష్ట్ర స్ధాయి నాయకుల అనుమతి తీసుకోవాలి. ఏ నాయకుడి అనుమతి తీసుకోవాలో కూడా జిల్లా నాయకులకు ఇబ్బంది కరంగా మారింది. గత పదేళ్లలో మిల్లర్లకు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కాని ఇప్ప్పుడు జిల్లా నాయకులకు, చిన్న మిల్లర్లకు మాత్రం ఈ సమస్యలు గుదిబండలుగా మారిపోయాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించేందుకు మిల్లర్రాష్ట్రస్ధాయి నాయకులకు సమయమే దొకడం లేదా? మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులై వుండి వారి సమస్యలు తెలుసుకు నేందుకు, తీర్చేందుకు సమయం కేటాయించేం దుకు వీలు కావడం లేదా? ఏ యూనియన్ అయినా ఆ వ్యవస్ధల సమస్యల పరిష్కారానికే వుంటాయి. తాజాగా ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఆ యూనియన్ నాయకుల సమిష్టి కషితో సాద్యమౌతుంది. రాష్ట్ర నాయకత్వాం కూడా జిల్లాల నాయకత్వాలకు అండగా వుండ డంతో ముందుకు సాగుతోంది. అలాగే మిల్లర్ల యూనియన్ కూడా మిల్లర్లకు అండగా వుండాలి. కాని లోపం ఎక్కడ జరుగుతోంది? అనే ప్రశ్నలు అనేకం వినిపిస్తున్నాయి. మిల్లర్లలో అందరూ కడుపు నిండిన వారే లేరు? చాల మంది మిల్లర్ల కడుపు మండుతోంది. మిల్లర్ల ప్రాణాల మీదకు వస్తున్నా పట్టించుకోరా? మిల్లర్లను కాపాడుకోవాల్సిన బాద్యత రాష్ట్ర స్దాయి నాయకులకులేదా? మిల్లర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనువిప్ప్పుకలగడం లేదా? అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకుంటే సమజామంతా ఏకమౌ తుంది. మిల్లర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మిల్లర్ల అసోసి యేషన్ అంత బాధ్యతారాహిత్యంగా వుండడం సమంజసమా? అసోసియేషన్‌లో ఇంత నిర్లిప్తత అవసరమా? రైతులు ధాన్యం పండిస్తేనే సరిపోదు. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చే యంత్రంగం వుండాలి. ప్రజలకు అన్నం అందించ డంలో మిల్లర్ల పాత్ర సామాన్యమైంది కాదు. ఇది పూర్వ కాలం కాదు. ఎవరి దాన్యాన్ని వాళ్లు దంచుకొని తినలేరు. ఇప్పటికైనా మిల్లర్ల నాయకులు మేలుకోరా? చిన్నా, చితక మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్పందించలేరా? మిల్లర్ల సమస్యలు ప్రస్తావించలేరా? మిల్లర్ల మద్దతుగా గొంతు సవరించుకోలేరా? అటు అదికారులకు, ఇటు ప్రభుత్వానికి సమస్యలు చెప్పలేరా? అలాంటప్ప్పుడు యూనియన్లు ఎందుకు? వాటికి నాయకులు ఎందుకు? వాటి కోసం హడావుడి ఎందుకు? మిల్లింగ్ వ్యవస్ధను మిల్లర్ల నాయకులు పట్టించుకోకపోతే ఎప్ప్పుడో పెద్ద మిల్లర్లు కూడా మునిగేదాకా రావొచ్చు? ఒకప్ప్పుడు చిన్న విద్యా సంస్ధలను పెద్ద పెద్ద కార్పోరేట్ విద్యాసంస్దలు వచ్చి మింగేశాయి. ఇప్ప్పుడు ఆ పెద్ద పెద్ద విద్యా సంస్ధలను మింగేందుకు ఉత్తరాది నుంచి మరింత పెద్ద సంస్ధలు వాలిపో తున్నాయి. అలాగే చిన్న చిన్న మిల్లులను రాష్ట్ర నాయకులు కాపాడకపోతే, ఆ వ్యవస్ధను కాపాడుకోలేకపోతే రేపో మాపో ఆదాని, అంబానీ లాంటి వారు మిల్లింగ్ వ్యవస్దలోకి దూరితే పెద్ద పెద్ద మిల్లర్లమని ఫోజులు కొడుతున్న వాళ్లు కూడా ఊకలో కొట్టుకుపోవచ్చు. తౌడు కూడా దక్కకపోవచ్చు. అందుకే చిన్న మిల్లర్లను కాపాడుకోండి. మీ మనుగడను కూడా ప్రశ్నార్ధం చేసుకోకండి. యూనియన్లకే మిల్లర్ల సంక్షేమం పట్టకపోతే ఎలా? అయినా మిల్లర్లు చేసిన అన్యాయమేమీ లేదు. వాళ్లు మోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, వాళ్లు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యమైపోతున్నాయి. దాంతో అదికారులు దాడులు, మిల్లుల సీజ్‌లు, పిడి యాక్టు వంటి కేసులతో మిల్లర్లు భయపడుతున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల రాయల్లీ చెల్లించకుండా గ్రానైట్ కంపనీలు దశాబ్ధాల తరబడి ప్రభుత్వాన్ని మోసం చేస్తూనే వున్నారు. వాళ్లను అటు అదికారులుగాని, ఇటు పాలకులకు గాని ముట్టుకోరు.అటు పర్యావరణాన్ని పాడు చేసి, ఇటు అనుమ తులను దుర్వినియోగంచేసి ఇష్టారాజ్యం చేసే గ్రానైట్ వ్యాపారుల జోలికి కూడా ప్రభుత్వం పోదు. ఎదుకంటే వాళ్ల యూనియన్లు అంత స్ట్రాంగ్‌గా వున్నాయి. కొండలు గుట్టలు, వాగులు, వంకలు మింగుతూ, ఇసుక, మట్టి, కంకర రవాణా చేసే వాళ్లు కొన్ని వేల కోట్ల రాయల్టీలు చెల్లించాల్సి వుంది. అయినా అధికారులు వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరు. కారణం వారి నాయకులు పాలకుల వద్ద పరపతి కలిగి వుంటారు. చిన్నా, చితకా వ్యాపారులను కూడా కాపాడుతుంటారు. కాని మిల్లర్ల సంఖ్య కూడా పెద్దది. అయినా యూనియన్ నాయకులు మాత్రం వారి స్వార్ధం చూసుకుంటున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. అన్నం పెట్టే మిల్లర్ ఎందుకు అలుసైపోతు న్నాడో నాయకులే ఆలోచించుకోవాలి. ప్రాలకులకు, అదికారులకు ప్రతిసారి మిల్లర్లే ఎందుకు టార్గెట్ అవుతారు అనేదానిపై నాయకులు దష్టి పెట్టాలి. మిల్లర్ల మధ్య వున్న సఖ్యత నాయకుల మధ్య లేకుండాపోతోంది. అందుకే పాలకులు, అదికారులు పదే పదే టార్గెట్ చేస్తుంటారు. ఇప్పటికైనా మిల్లర్ల అసోసియేషన్ మేలుకొని, అందరూ ఐక్యత కనబర్చితే ఏ మిల్లర్‌కు అన్యాయం జరగదు.
