CMRF Aid Distributed to Beneficiaries
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు కొండంత అండ: వి. జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లిలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
ముఖ్యమంత్రి సహాయ నిధి సి ఎం ఆర్ ఎఫ్ అనేది కేవలం నిధి మాత్రమే కాదని, అది నిరాశలో ఉన్న నిరుపేదలకు ఆశ అని, బాధలో ఉన్న వారికి అండగా నిలిచే గొప్ప బలమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ రాజ్యం’ లక్ష్యంతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. అనారోగ్యం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవడంలో సీఎంఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకే బాలరాజ్, రాములు గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్, సంజు, మోహన్ రెడ్డి, చిన్న, రాంచందర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, ముజీబ్, సుధాకర్, తిరుపతి, వెంకన్న, ప్రభాకర్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
