ఈ వారంలో అతి పెద్ద అలాస్కా సమ్మిట్‌లో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ సమావేశమయ్యారు. సమ్మిట్ తర్వాత, ట్రంప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లను విధించకోవచ్చని సంకేతం ఇచ్చారు. ఈ సమావేశం రష్యా-యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విశేషంగా గమనించబడింది.
పైగా, ఇండస్ వాటర్స్ ట్రిటీ విషయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ హెచ్చరికలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షరీఫ్, బిలావాల్ భుట్టో భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్ భారత్, చైనా పట్ల రష్యన్ ఆయిల్ టారిఫ్‌లలో భిన్నమైన విధానాన్ని చూపడం గమనార్హం.
ఇతర ఘటనల్లో, గాజాలో ఇజ్రాయిల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్-జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణించారు. చైనాలో యువకులు ఉద్యోగం కనిపించేలా కనిపించడానికి చెల్లిస్తున్నారు. అలాగే, ఒక వైరల్ వీడియోలో కిల్లర్ వేల్ లైవ్ షోలో ట్రైనర్‌ను అటాక్ చేసింది.
Tag: US
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి నెలకు కొలపాలని వారన్నారు. యుద్ధం సరైన పద్ధతి కాదన్నారు.అమెరికా సామ్రాజ్య వాదాన్ని నెలకొల్పాలని పచ్చిమ ఆసియాపై ఆదిపత్యం చేసుకోవాలని దురుద్దేశంతో ఇరాన్ పై దాడులు చేపించడం జరుగుతుందన్నారు.ఇరాన్ ఆణుఅయుధాలను తయారు చేస్తుందని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు తీసుకవచ్చి యుద్ధం చేస్తున్నారని అన్నారు. యుద్దాల వల్ల వేలాదిమంది ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారని, పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరుగుతుందని తెలిపార.
యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ట్రంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ సుధాకర్ రెడ్డి మాతంగి రాంచందర్ క్యాతరాజు సతీష్ నెరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ పీక రవికాంత్ గోనెల తిరుపతి రమేష్ చారి గోలి లావణ్య శ్రావణి పల్లెర్ల రజిత శ్రీలత వాసం రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
