ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.
