యువతకి స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద-జాతీయ యువజన అవార్డు గ్రహీతలు..

*యువతకి స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద-జాతీయ యువజన అవార్డు గ్రహీతలు
రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు

రామడుగు, నేటిధాత్రి:

 

స్వామి వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత అని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు
రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు లు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రామడుగు మండలంలోని వెదిర గ్రామ పంచాయతీ పరిధిలోని వేదిర ఎక్స్ రోడ్డు స్వామి వివేకానంద చౌరస్తా వద్ద గల స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అయన విగ్రహనికి జాతీయ యువజన అవార్డు గ్రహీత అవార్డు అలువాల విష్ణు ఆధ్వర్యంలో మండలం లోని పలువురు ప్రజాప్రతినిధులను అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
అనంతరం నూతనంగా గెలిచిన యువజన సంఘాల ప్రతినిధులను చేనేత శాలువ, మొక్కను అందజేసి జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణులు మాట్లాడుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక గర్వకారణమైన మహానుభావుడు స్వామి వివేకానంద అని వారు పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన స్వామి వివేకానంద, యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలని తన బోధనల ద్వారా తెలియజేశారని వారు అన్నారు. “లేచిరండి… మేల్కొనండి లక్ష్యాన్ని చేరే వరకు ఆగవద్దు” అన్న ఆయన సందేశం నేటికీ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని వారు తెలిపారు.
విద్య అనేది కేవలం ఉపాధి కోసం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, మానవ విలువల అభివృద్ధికి ఉపయోగపడాలని స్వామీజీ బోధించారని గుర్తు చేశారు. శారీరకంగా, మానసికంగా, నైతికంగా బలమైన యువతే బలమైన భారతదేశాన్ని నిర్మించగలదని ఆయన నమ్మకం అని వారు అన్నారు. ఈసందర్భంగా దేశంలోని యువత అంతా స్వామి వివేకానంద ఆశయాలు, సిద్ధాంతాలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని వారు పిలుపునిచ్చారు. సమాజ సేవ, పేదల అభ్యున్నతి, జాతీయ సమైక్యతకు యువత ముందుండాలని వారు కోరారు.
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు, యువతి దేశ నిర్మాణంలో భాగస్వాములై భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రామడుగు ఎంపీఓ శ్రావణ్ కుమార్, సర్పంచులు శనిగరపు అంజన్ కుమార్, మోడీ రవి, మేకల మల్లీశ్వరి ప్రభాకర్ యాదవ్, రెండ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్లు, దుద్యాల రాజిరెడ్డి, కటకం మనీష్, యువజన సంఘాల సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అమీరశెట్టి భూమిరెడ్డి, ఎన్.ఎస్.ఎస్.జాతీయ ఇందిరా గాంధీ అవార్డు గ్రహీత రేండ్ల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు జవ్వాజి హరీష్, బొమ్మరివేణి తిరుపతి, శనిగరపు అర్జున్ కుమార్, లేఖ రాజు, అలువాల శంకర్, నాగుల రాజశేఖర్, పోచంపల్లి నరేష్, కొడిమ్యాల రాజేశం, అంబటి వినోద్, జవ్వాజి అజయ్, రెండ్ల అంజి, నేరెళ్ల మారుతి, పర్లపల్లి రాజు, నిట్టూ బీరయ్య, మహేష్, అశోక్ రెడ్డి, కిరణ్ తేజా, రేణికుంట బాపురాజు, మచ్చ రమేష్, మహేష్, అంజన్ కుమార్, స్వామి , శ్రీనివాస్, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version