ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఫోటోకు పూల మాలలు వేసి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మోడీ రవీందర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద వారి బాటలో నడవాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈకార్య క్రమంలో ఉపసర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు బక్కశెట్టి రాజయ్య, తడగొండ శేఖర్, నీలం పరశురామ్, పన్యాల విద్యాసాగర్, మాజి సర్పంచ్ పాకాల రాములు, తడగొండ త్రినాథ్ వర్మ, బైరి అంజయ్య,పాదం సాగర్, శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
