స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తి
రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ,స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలు, ఆలోచనలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశ గొప్ప చరిత్రను గుర్తించేలా చేసిన మహానుభావుడు స్వామి వివేకానందని తెలిపారు.యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్,బియ్యాల సతీష్ రావు,ఆకుల అశోక్ వర్ధన్,తుల ఆంజనేయులు,అవిడపు రాజబాబు, బుద్దారపు రాజమౌళి,బింగి సత్యనారాయణ,మెరెడికొండ శ్రీనివాస్,వెలుముల దుర్గా ప్రసాద్,కాశెట్టి నాగేశ్వర్ రావు,బూర్ల చిరంజీవి,బోయిని దేవేందర్,అరె సతీష్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు
