ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం — ప్రజల ప్రాణాలకు ప్రమాదం…

ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం — ప్రజల ప్రాణాలకు ప్రమాదం.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యరంగం దిశ తప్పిందని ఆరోపణలు

నేటిధాత్రి, వరంగల్‌:

 

ఉత్తర తెలంగాణకు ప్రాణాధారమైన ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి క్రమంగా దారుణంగా మారుతోంది. వైద్యం కోసం ఎన్నో జిల్లాల ప్రజలు ఆధారపడే ఈ ఆసుపత్రిలో నిర్లక్ష్యం అలవాటుగా మారిందంటూ రోగులు మరియు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూపరిండెంట్‌, ఆర్ఎంలు, డ్యూటీ డాక్టర్లు, విభాగాధిపతులు (హెచ్‌వోడీలు) ఇలా ప్రతీ విభాగం అధికారులూ తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

రోగ సేవకులు, నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజూ అనేకమంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని సమీక్షించే స్థితిలో ప్రభుత్వం యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ ముందుకు రాకపోవడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఉత్తర తెలంగాణ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ఆసుపత్రి ఇప్పుడు అవస్థల పాలవుతుంటే, బాధ్యత ఎవరిపైన అనే ప్రశ్న జనంలో తలెత్తుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version