జయశంకర్ పేరుతో యునివర్సిటీని స్థాపించాలి

జయశంకర్ పేరుతో యునివర్సిటీని స్థాపించాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హాబ్ గా ఏర్పాటు చెయ్యాలి

సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మరపేల్లి మల్లేష్

వికెసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వికేసి విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మరపేల్లి మల్లేష్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లాలో సమృద్ధిగా వనరులు ఉన్న వెనుకబడి పోతావుంది పాలకుల నిర్లక్ష్యం మూలంగా విద్య వైద్యం అందని ద్రాక్షలా మారింది భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి జిల్లాను పారిశ్రామికంగా బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవడంలో పాలకుల విఫలమయ్యారని ఆరోపిస్తున్నాను ఈ జిల్లాలో విద్యారంగానికి పెద్దపీట వేసి కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని నిరుపేద విద్యార్థుల కోసం పై చదువుల కోసం జయశంకర్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని పాలకులను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా స్టడీ సర్కిల్ ఎడ్యుకేషన్ హబ్బుగా ఏర్పాటు చేయాలని విద్యార్థులకు యువకులకు అందుబాటులో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నేటి నుంచి యూనివర్సిటీ కోసం ఉచిత కోచింగ్ సెంటర్ల కోసం జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పాటు చేసేంతవరకు ప్రతిరోజు ఉద్యమాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలో ఉన్న అధికార యంత్రం గానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విద్యార్థి యువతీ యువకుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని భూపాలపల్లి జిల్లాలో ఉన్న అధికారులకు జిల్లాలో ఉన్న పాలకులకు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో అక్కల బాబు యాదవ్ యు వై ఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు బోయ సదానందం రాజమణి మహిళా నాయకురాలు పాల్గొన్నారు

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మున్సిపల్ 6వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీలతో నారీ శక్తి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి మున్సిపల్ 6 వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి హాజరు కావడం జరిగింది.వారు విద్యార్థులకు మహిళా బిల్లు 33./. శాతం రిజర్వేషన్ గురించి వివరించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్‌సభ రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ద్వారా నిర్ణయాధికారంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలు రాణిస్తున్నారని, ఇప్పుడు చట్టసభల్లో కూడా అడుగుపెట్టడం ద్వారా మహిళల సమస్యలు, విద్య, ఉపాధి వంటి అంశాలపై మరింత సమర్థవంతంగా పోరాడవచ్చని తెలిపారు. అంతేకాకుండా దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మైలురాయి అని కొనియాడారు.
​ఈ సందర్భంగా, ప్రతి మహిళా మేధావి, చదువుకున్న యువతులు రాజకీయాల్లోకి రావాలని, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు కల్పించిన ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజికంగా ఆర్థికంగా కూడా వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు భుఖ్య భాగ్య,బూర పద్మ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ సరూప, వేషాల సత్యవతి, కవిత, సునీత లతోపాటు పార్టీ జనరల్ సెక్రటరీ దొంగల రాజేందర్, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,తిరుపతి రెడ్డి,పొన్నాల కొమరన్న తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

#భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి పండ్ల పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశాన్ని ప్రధాని మోదీ మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి,సకల జనులకు సమన్యాయం చేకూర్చాలన్న బాబాసాహెబ్ ఆశయాలను నిజం చేస్తూ.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని,సామాజిక సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక అడుగులే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళులు అన్నారు.బీజేపీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ కు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రధానం చేసిందని,భారతదేశపు సామాజిక నిర్మాణాన్ని అద్వితీయ పాత్రను పోషించిన అత్యున్నత పురస్కారమిచ్చి గౌరవించుకుంది బిజెపి పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, మండల కార్యదర్శులు ఓదెల అశోక్,పున్నం కృష్ణమూర్తి,పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వతాలు,ఎస్సీ మోర్చా మండల నాయకుడు జన్ను మధు, యువ మోర్చా మండల అధ్యక్షుడు తిమ్మాపురం శివ, నాయకులు ములుక రాజేష్, ధర్మారం క్రాంతి కుమార్,కొనకటి సుధాకర్,బల్ల రాజు,ఈర్ల రవి, మార్తా రవీందర్,దొమ్మటి బచ్చలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ పవర్ జిల్లా గౌరవ సలహాదారుడిగా రంజిత్ కుమార్…

బీసీ పవర్ జిల్లా గౌరవ సలహాదారుడిగా రంజిత్ కుమార్

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవాభావం కలిగిన నాయకుడు శ్రీ రాసమల్ల రంజిత్ కుమార్ (ఆర్‌కే)ను బీసీ పవర్ సంస్థ జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమించారు.ఈ సందర్భంగా బీసీ పవర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మచ్చిక రాజు గౌడ్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల స్థితిగతులను అధ్యయనం చేస్తూ, అన్ని కులాల భాగస్వామ్యంతో బీసీల హక్కుల సాధన కోసం సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రధాన సమస్యల పరిష్కారం, వారి జీవనోపాధి మెరుగుదల దిశగా బీసీ పవర్ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.అలాగే అన్ని కులాల ప్రజలు తమ విలువైన సమయాన్ని కేటాయించి బీసీ పవర్ సంస్థకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో బీసీ పవర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆబోతు రాజు యాదవ్ సూచన మేరకు రాసమల్ల రంజిత్ కుమార్ ను జిల్లా ముఖ్య సలహాదారుడిగా నియమించినట్లు తెలిపారు.

బాలానగర్‌లో బీసీ ఐక్యవేదిక ఏర్పాటు

బానిసత్వం వద్దు.. బీసీల కులాల ఐక్యత ముద్దు.

“కుట్రలతో.. బీసీ కులాలు బలైపోతున్నాం.”

“బీసీ కులాల నాయకులారా.. ఇక మేల్కొనండి”

“బీసీలకు అన్యాయం జరిగితే.. ఊరుకునేది లేదు”

“బాలానగర్ లో.. బీసీ ఐక్యవేదిక ఏర్పాటు”

బాలానగర్ /నేటి ధాత్రి.

బీసీల హక్కుల సాధన, సామాజిక సాధికారత లక్ష్యంగా మండలంలో శుక్రవారం ‘బీసీ ఐక్యవేదిక’ కొలువుదీరింది. శుక్రవారం బాలానగర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సామాజిక ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సవాళ్లు, రాజకీయంగా దక్కాల్సిన ప్రాధాన్యతపై ఈ వేదిక పోరాడుతుందన్నారు. బీసీల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బీసీల సమస్యలపై నిరంతర చర్చలు జరపాలని, అవసరమైతే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు.. “రాజకీయాలు ఎన్నికల వరకేనని, బీసీల హక్కుల విషయంలో మనమంతా ఒక్కటే” అని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగేలా చూడటమే ఈ ఐక్యవేదిక ప్రధాన విధి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version