మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
మున్సిపల్ 6వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినీలతో నారీ శక్తి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి మున్సిపల్ 6 వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి హాజరు కావడం జరిగింది.వారు విద్యార్థులకు మహిళా బిల్లు 33./. శాతం రిజర్వేషన్ గురించి వివరించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ద్వారా నిర్ణయాధికారంలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలు రాణిస్తున్నారని, ఇప్పుడు చట్టసభల్లో కూడా అడుగుపెట్టడం ద్వారా మహిళల సమస్యలు, విద్య, ఉపాధి వంటి అంశాలపై మరింత సమర్థవంతంగా పోరాడవచ్చని తెలిపారు. అంతేకాకుండా దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మైలురాయి అని కొనియాడారు.
ఈ సందర్భంగా, ప్రతి మహిళా మేధావి, చదువుకున్న యువతులు రాజకీయాల్లోకి రావాలని, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు కల్పించిన ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సామాజికంగా ఆర్థికంగా కూడా వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు భుఖ్య భాగ్య,బూర పద్మ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ సరూప, వేషాల సత్యవతి, కవిత, సునీత లతోపాటు పార్టీ జనరల్ సెక్రటరీ దొంగల రాజేందర్, మనోహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,తిరుపతి రెడ్డి,పొన్నాల కొమరన్న తదితరులు పాల్గొన్నారు
