కవిన్ సరసన ప్రియాంక…

కవిన్ సరసన ప్రియాంక…

అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ కిట్ లో మరో అవకాశం వచ్చి పడింది. ప్రముఖ తమిళ నటుడు కవిన్ సరసన ఆమె ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతోంది.

మూడు పదుల వెన్నెల సోన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కు ఇంకా గ్రాండ్ విక్టరీ దొరకలేదు. అయితే… తమిళంలో ఆమె నటించిన ‘డాక్టర్ (Doctor), డాన్ (Don)’ చిత్రాలు కొంతలో కొంత ఊరటను కలిగించాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఓజీ’ (OG) లో నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘ఓజీ’ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.

తెలుగులోనూ ఇప్పటికే నటిగా తన సత్తా చాటడానికి శతవిధాలా ప్రయత్నించింది. నానిస్ ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక… ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ‘గ్యాంగ్ లీడర్’లో ఆమె చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే మరోసారి నాని సరసన ‘సరిపోదా శనివారం’ (Saripoda Sanivaaram) లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో మిస్ ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే… ప్రియాంక అరుల్ మోహన్ కు ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ లభించింది. హీరో కవిన్ (Kavin) తొమ్మిదో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కెన్ రాయ్ సన్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేబోతోంది. ‘కొత్త ప్రయాణం… కొత్త సినిమా’ అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కవిన్ సరసన ప్రియాంక తొలిసారి నటిస్తోంది. మరి సెప్టెంబర్ 25న రాబోతున్న ‘ఓజీ’తో ప్రియాంక స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోతుందేమో చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version