మునిసిపల్ ఎన్నికల్లో గెలిచి చూపండి: మల్లారెడ్డి సవాల్

మీ దమ్ము మునిసిపల్ ఎన్నికల్లో గెలవండి
* కాంగ్రెస్ నేతలకు మల్లారెడ్డి బహిరంగ సవాల్
* మేడ్చల్ జిల్లా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

దమ్ముంటే మునిసిపల్ ఎన్నికల్లో గెలవందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. జిహెచ్ఎంసి పరిధిలోని కిష్టాపూర్ – పూడూర్ సర్కిల్ పరిధిలోని కెఎల్ఆర్ వెంచర్ లో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నన్ను ఆదరిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరి దమ్ము ఎంతుందో చూసుకుందామని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. అనంతరం పోటీల్లో గెలిచిన వారికీ మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంధాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version