సంక్రాంతి ముగ్గుల పోటీల ప్రారంబించిన దోసకాయల
మేడ్చల్, నేటిధాత్రి :
సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ముగ్గుల పోటీల ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. ముడుచింతల పల్లి పరిధిలోని పొన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఏఎంసి చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి మెంబర్ గోగుల సరిత లతో కలసి దోసకాయల వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంప్రదాయ పండుగలుగా సంక్రాతి పండగా సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు వేదికగా నిలుస్తాయని అభినందించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి మెడబోయిన జ్యోతి రూ. 10000, రెండవ బహుమతి జజల పూర్ణిమ రూ. 6000, మూడవ బహుమతి మర్యాల బాల లక్ష్మీ రూ 3000, నాల్గవ బహుమతి రూ.2500 జి. శ్రీవాణి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి లతరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
