ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మహాదేవపుర్ నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలోని
పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ పల్లి గ్రంథాలయ సంస్థ చైర్మను కోట రాజబాబు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి నేతలకు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు. గత ప్రభుత్వ పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అయిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలనిపిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ కోట సమ్మయ్య కడార్ల నాగరాజు ఐత తిరుపతిరెడ్డి బుర్రి శివరాజు, మోతే సాంబయ్య, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version