ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
క్లబ్ అధ్యక్షులు తిరుపతి
మల్లాపూర్ 24 నేటి ధాత్రి
మల్లాపూర్ మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామపంచాయతీలో శ్రీ కనకసోమేశ్వర లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అధ్యక్షులు రేవల్లి తిరుపతి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత నేత్రవైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవ చేయడం అని అలాగే విశేష స్పందన వచ్చిందని అలాగే విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సుమారు 150 మంది కంటి వైద్య శిబిరానికి హాజరుకాక 60 మందిని కంటి వైద్య శిబిరానికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్, మెట్పల్లి అధ్యక్షులు శ్రీనివాసరావు నాగేష్ ముద్దం ప్రసాద్ గౌడ్, సర్పంచ్ చిట్టా లక్ష్మణ్, సభ్యులు రంగు రామగౌడ్ కో, మిల్క్ నవీన్ శ్రీనివాసరావు లక్పత్ రెడ్డి నాగిరెడ్డి నల్ల ప్రవీణ్ డాక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
