పర్యాటక బ్రోచర్ నీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
పర్యాటక ప్రదేశాల సమాచారం పై పోటీలు
పర్యాటకశాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ చేయడానికి ప్రోత్సాహికుల నుండి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా రూపొందించిన పోస్టర్ ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్, జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి జిల్లా టూరిజం అధికారి సి హెచ్ రఘు పర్యాటక బ్రోచర్ ని ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యం కల్పించే విధంగా 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి వీక్ క్రాంతి వెల్లడించారు.
తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మూడు ఫోటోలు, 60 సెకండ్ల వీడియో 100 పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా ఎన్ఫీల్డ్ పంపాలని సూచించారు. అందులో హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ వసతి తదితర వివరాలను తెలియజేయాలని సూచించారు 50,000 30,000 20,000 ఇస్తానన్నారు. పదిమందికి కన్సోలేషన్ బహుమతులు అంద చేస్తారు. సంక్రాంతి రోజున కైట్ ఫెస్టివల్లో బహుమతులను ప్రధానం చేస్తారు.
