కార్మికులకు నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి..
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
భూపాలపల్లి నేటిధాత్రి
కార్మికులకు నష్టాన్ని కలిగించే నాలుగు నల్ల చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయూసీ మధుగాని విజయేందర్, ఐఎన్టీయూసీ జోగబుచ్చయ్య, సి ఐ టియు కంపేటి రాజయ్య, టీబీజీకేఎస్ బడితల సమ్మయ్య లు డిమాండ్ చేశారు. కేటీకే ఓసి-3 యూజీ గని లో పిట్ సెక్రటరీ ఎల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో జాతీయ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు విభజించి కార్మిక హక్కులను కాల రాసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వo బీజేపీ చట్టాలు సవరణ చేసి 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయబోతుందని వాపోయారు. ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భూపాలపల్లి ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు నూకల చంద్రమౌళి, కార్మికులు పాల్గొన్నారు.