చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు…

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

 

గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..

 గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చిందని ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందన్నారు.

అభివృద్ధికి పునాదులు వేసింది టీడీపీనే..

ప్రజలతో ఉంటే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2028 నాటికి తన రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధికి పునాదులు వేసింది.. వేసేది టీడీపీనేనని.. విజన్-2020తో ఇది నిరూపితమైందని వెల్లడించారు. ప్రజల భవిష్యత్, ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలని తెలిపారు. భారతదేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పామని.. చేసి చూపించామని అన్నారు. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తులకు రాయలసీమ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

రాయలసీమలో ఉద్యాన రంగం అభివద్ధి..

రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ప్రతి వారం విశ్లేషిస్తూనే ఉన్నానని తెలిపారు. కార్యకర్తలకు, తనకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు పార్టీలో కూడా టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. సంక్షేమం తెస్తామని ఇంటింటికీ వెళ్లి చెప్పామని… ఆ సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు కూడా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version