సిద్దిపేట జిల్లా జర్నలిస్ట్ సంఘం ఉపాధ్యక్షులు తిప్పారం కనకయ్య మరియు గ్రామస్థులు
వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ కొమురవెల్లి యాదగిరిగుట్ట స్వర్ణ గిరి దేవాలయం కలుపుకొని వేములవాడ నుండి బస్సు నడపడం గురించి వేములవాడ డిపో మేనేజర్ సి హెచ్ మురళి కృష్ణ కు శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా జర్నలిస్ట్ సంఘం ఉపాధ్యక్షులు తిప్పవరం కనకయ్య దాసరి కనకయ్య మాజీ సర్పంచ్ కొమురవెల్లి అక్కనపెల్లి అశ్విందర్ రెడ్డి పాకనాటి కొండల్ మరియు కొమరవెల్లి గ్రామస్తులు యాదగిరిగుట్ట స్వర్ణగిరి దేవాలయలకు భక్తులు మరియు ప్రజలు వస్తూ ఉంటారు.పోతూ ఉంటారు.కావున భక్తులను మరియు ప్రజలను దృష్టిలో ఉంచుకొని వేములవాడ డిపో నుండి కొమురవెల్లి, రామ్ సాగర్, పెద్దిరాజుపేట,నాగపురి,శభాష్ గూడెం, పాల్వాపూర్,సింగారం, పాముకుంట,రాజపేట, గ్రామం ఎక్స్ రోడ్డు, అనంతపురం, కాల్వపల్లి,పొట్టి మర్రి ఎక్స్ రోడ్డు,చిన్న గౌరాయపల్లి, ముసాయిపేట, సైదాపురం, యాదగిరిగుట్ట, భువనగిరి,స్వర్ణ గిరి, దేవాలయం వరకు నడపవాల్సిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగినది.ఇట్టి గ్రామల ప్రజలు స్కూల్ పిల్లలు వ్యాపారస్తులు ప్రజలు, భక్తులు,మరియు బస్సు లేక దేవాలయాలకు పోవుటకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకుగాను నూతన బస్సు ప్రారంభించాల్సిందిగా వేములవాడ డిపో మేనేజర్ మురళి కృష్ణ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.అందుకు మేనేజర్ స్పందించి అధికారులతో రూట్ సర్వే చేయించి తొందరలో బస్సును ప్రారంభించడానికి సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన వేములవాడ పాత్రికేయులకు
మీడియా మిత్రులకు మరియు డిపో మేనేజర్ మురళి కృష్ణ కు సిద్దిపేట జిల్లా జర్ణలిస్ట్ సంఘం ఉపాధ్యక్షులు మరియు కొమరవెల్లి గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు…