Tribute to Tagore
సమాజ మార్పుకు దోహదపడ్డ మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్
డాక్టర్ రోహిత్ సాదు
పరకాల,నేటిధాత్రి
భారత జాతీయ గీత రచయిత,విశ్వకవి,నోబెల్ బహుమతి గ్రహీత రవింద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా డాక్టర్ రోహిత్ సాదు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.భారతీయ సాహిత్యం,సంస్కృతి,విద్యా రంగాలకు ఠాగూర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ సాదు మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా మానవతా విలువలు,దేశభక్తి,సామాజిక చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు.ఆయన రచించిన జనగణమన దేశ ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించే గొప్ప గీతమని అన్నారు.సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు దోహదపడిన మహనీయుల్లో ఠాగూర్ ఒకరని కొనియాడారు.ప్రస్తుత యువత మహాకవి ఠాగూర్ ఆలోచనలు,రచనల నుండి స్ఫూర్తి పొంది విద్య, సంస్కృతి,సేవా భావం వైపు ముందుకు సాగాలని డాక్టర్ రోహిత్ సాదు ఆకాంక్షించారు. దేశానికి,సమాజానికి ఉపయోగపడే విలువలను ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
