Dance Tribute at Tirumala
తిరుమలలో నటరాజ డ్యాన్స్ అకాడెమీ బృందం నాట్య ప్రదర్శన.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
అన్నమాచార్యజయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల మే 6వ తేదిన తిరుమలలో జరిగిన శ్రీవారిభజన కూచిపూడి నాట్యసేవ అనే కార్యక్రమంలో బెల్లంపల్లి కి చెందిన నటరాజ డ్యాన్స్ అకాడమి విద్యార్థులు అద్భుతమయిన ప్రతిభను కనబరిచారు. ఆ వేంకటేశ్వరస్వామీ కీర్తిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని మైమరపింపచేసాయి. ఈ ప్రోగ్రామ్ లో చిన్నారుల తల్లులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నటరాజ డ్యాన్స్ అకాడమి నాట్య గురువు అర్చన జయప్రకాశ్, విద్యార్థుల తల్లిండ్రులు,పలువురు పాల్గొన్నారు.
