Chairperson’s Surprise Inspection
25వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకస్మిక తనిఖీ
నర్సంపేట, నేటిధాత్రి:
మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ శుక్రవారం 25వ వార్డు పరిధిలోని ద్వారకపేట రోడ్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏరియాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్టల్స్, హాస్పిటల్స్, వాణిజ్య దుకాణాల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ యజమానులు, హాస్పిటల్ సిబ్బంది చెత్తాచెదారాన్ని రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో వేయవద్దని సూచించారు. చెత్తను పోగుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. హాస్పిటల్స్ నుంచి వచ్చే బయో మెడికల్ వేస్ట్, హాస్టల్స్ నుంచి వచ్చే ఘన వ్యర్థాలు రోడ్లపై వేయడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వాటర్ పైప్‌లైన్ లీకేజీ పనులను పరిశీలించి, వెంటనే మరమ్మతులు పూర్తిచేసి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈకార్యక్రమంలో వార్డు జవాన్ గోపగాని ప్రభాకర్, వాటర్‌లైన్ ఇన్ఛార్జ్ నాతి రాజు, వార్డు యూత్ నాయకులు నల్గొండ వంశీ, స్వామిశెట్టి ప్రభాకర్, స్వామిశెట్టి శేఖర్, ముద్రబోయిన రాజు, మాదాసి వెంకన్న, చీకటి విజయ్, రాజీర్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు.
