Marxism Evolves with Changing World: CPI(M)
మారుతున్న ప్రపంచం మార్క్సిజం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/GLUE0bKop68?si=6chn-Y0AOMT4E5Nh
ప్రకృతి, మానవ సమాజం నిరంతరం మార్పు చెందుతున్నట్లే, మార్క్సిజం కూడా నూతన అంశాలను ఇముడ్చుకుంటూ అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు పేర్కొన్నారు. మే 5న కార్ల్ మార్క్స్ 209వ జయంతి
ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ పరిణామ క్రమంలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, యాజమాన్య పద్ధతుల మధ్య జరిగే ఘర్షణను మార్క్స్ శాస్త్రీయంగా విశ్లేషించారు. ఆదిమ, బానిస, ఫ్యూడల్ వ్యవస్థల నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా వచ్చిందో, భవిష్యత్తులో సోషలిజం రాక ఎందుకు అనివార్యమో ఆయన నిరూపించారు.
చారిత్రక అనుభవాలు: 1848 ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ నుండి నేటి వరకు కార్మికోద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. పారిస్ కమ్యూన్ వైఫల్యం నుండి పాఠాలు నేర్చుకుని, లెనిన్ నాయకత్వంలో రష్యాలో మొదటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించడం మార్క్సిజం యొక్క చైతన్యానికి నిదర్శనం.
సోషలిస్టు దేశాల ప్రయోగాలు: సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తి శక్తులను పెంచడానికి నూతన ప్రయోగాలు చేస్తున్నాయి. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థతో కూడిన సోషలిజంపై సీపీఐ(ఎం) తనదైన స్పష్టతతో ఉంది.
అమెరికా ఆధిపత్యానికి చరమగీతం: ప్రస్తుతం ప్రపంచం ఏకధృవ నుండి బహుళ ధృవ ప్రపంచంగా మారుతోంది. అమెరికా డాలర్ ఆధిపత్యం బలహీనపడుతోందని, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశాల ఐక్యతతో పీడిత ప్రజల పోరాటాలు మళ్లీ పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నేటి ఆటంకాలను అధిగమించి, మార్క్సిజం దిశానిర్దేశంలో దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం శ్రామికవర్గం సిద్ధం కావాలని బందు సాయిలు పిలుపునిచ్చారు.
