Couple Supports Workers with Summer Aid
శ్రమజీవులకు అండగా.. ముదిగుంట దంపతుల ఉదారత
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలకు అనవేణ లావణ్య – లింగస్వామి దంపతులు మంగళవారం పండ్లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.భగభగలాడే ఎండలను సైతం లెక్కచేయకుండా కష్టపడి పనిచేస్తున్న కూలీల ఆరోగ్యం దృష్ట్యా,ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం వారి మానవత్వానికి నిదర్శనమని గ్రామస్తులు కొనియాడారు.పండ్ల ద్వారా కూలీలకు తక్షణ శక్తి లభించడంతో పాటు వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.ఇలాంటి విపత్కర వాతావరణంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం చేసిన లావణ్య – లింగస్వామి దంపతులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని, సమాజంలో ఇలాంటి మానవీయ కార్యక్రమాలు మరిన్ని జరగాలని పలువురు అభినందించారు.
