Grand Birthday Celebrations for Former MLGrand Birthday Celebrations for Former MLA GandraA Gandra
ఘనంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షధ్వానాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సందడిగా మారింది.
అనంతరం గండ్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షులు కరాటే శీను ఆధ్వర్యంలో జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, వారు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
