మజ్జిగ ప్యాకెట్ల పంపిణి
హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్ మర్రిచెట్టు సర్కిల్ వద్ద విఆర్4యు సంస్థ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్ నరేందర్‌రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ సెక్రటరీ ప్రదీప్‌రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్త ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చభారత్, పర్యావరణ పరిరక్షణ, అనాథ పిల్లలకు చేయూత వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు మజ్జిగ పంపిణీని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దిలీప్ థక్కడ్, సభ్యులు డాక్టర్ ప్రభావతి, సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.