Former MLA Supports Disabled Family in Kodad
నిరుపేద వికలాంగుల కుటుంబానికి అండగా ఉంటా.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
కోదాడ, నేటి ధాత్రి:
పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో కామల్ల రామకృష్ణ కుటుంబం గత కొద్దికాలంగా నివాసం ఉంటున్నారు వీరి కుటుంబంలో ముగ్గురు ఉండగా ముగ్గురు వికలాంగులే ప్రతిరోజు ఒక పోరాటంగా మారిన ఆ కుటుంబ దయనీయ పరిస్థితిని తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మానవత్వంతో స్పందించి వారు నివసిస్తున్న ఇంటికి వెళ్లి స్వయంగా సందర్శించారు.ఆ కుటుంబ ఇంటి పరిస్థితి వారి కష్టాలు వారి బాధలను అడిగి తెలుసుకుని మల్లయ్య యాదవ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు వారు ఒంటరిగా లేరని భరోసా కల్పించారు.ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అన్ని విషయాల్లో తన పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. వికలాంగుని కుటుంబం మాట్లాడుతూ.మా బాధను గుర్తించి మా ఇంటికి వచ్చి ఆదరించిన వ్యక్తి మా కోసం చేసిన సహాయాన్ని మరువలేమని ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు. తమలాంటి నిరుపేదలకు అండగా నిలవడం నిజమైన ప్రజాసేవ అని వారు మల్లయ్య యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అలువాల వెంకట్, నాయకులు గోసు లక్ష్మయ్య, హుస్సేన్, తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.
