Workers Demand Cancellation of Two-Photo Rule
రెండు ఫోటో విధానం రద్దు చేయాలి ఉపాధి హామీ కూలి ఏల్దండి ప్రకాశం
మొగుళ్లపల్లి నేటి దాత్రి
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ చట్టంలో రెండు పూటల ఫోటో విధానాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలు ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు రెండు సార్లు ఫోటో అప్లోడ్ చేయాలని నిబంధనను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం ఎలాంటి నైపుణ్యం లేని పనులను ఉపాధి హామీ చట్టంలో కల్పించాలని ఉన్నప్పటికీ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా విధాన్ని తీసుకొచ్చిందని కూలీలు ఆవేదన వ్యక్తిగతం చేశారు

ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉపాధి హామీకు కూలీలు పనులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు ఇప్పటికే ఒకపక్క చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా ఆలస్యం చేస్తూ మరో వైపు ఇలాంటి నిబంధన చేయడం ఉపాధి హామీ పేదలకు దూరం చేయాలనే కుట్రలో భాగమేనని వారు విమర్శించారు
