Grand Farewell to Comrade Rajayya
కామ్రేడ్ రాజయ్య స్ఫూర్తితో ఉద్యమిస్తాం
ఘనంగా కామ్రేడ్ కంపేటి రాజయ్య అంతిమయాత్ర.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో, పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేసిన కామ్రేడ్ రాజయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని , కరీంనగర్ పట్టణంలోని రేగుర్తి, బృందావన కాలనీ రోడ్ నెంబర్ వన్ లో కామ్రేడ్ కంపేటి రాజయ్య అంతిమయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అంతిమయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు మంద నరసింహారావు, టి రాజారెడ్డి,సిపిఎం భూపాలపల్లి, జిల్లా కార్యదర్శులు బందు సాయిలు, సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం సుక్కయ్య, బోట్ల చక్రపానీలు , సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏ ముత్యంరావు అన్నారు. సిఐటియు రాష్ట్ర సీనియర్ నాయకులు పి రాజారావు కంపేటి రాజయ్య భౌతికకాయానికి పూలమాల లేసి జోహార్లు అర్పించారు.
సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన కంపేటి రాజయ్య(68) భౌతిక కాయంపై బుధవారం ఉదయం నాలుగు జిల్లాల నాయకత్వం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కంపేటి రాజయ్య ఇంటి నుండి స్మశాన వాటిక వరకు ఎర్రజెండాలు చేతబట్టి కామ్రేడ్ రాజయ్యకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సంతాప సభకు, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి అధ్యక్షత వహించగా నాయకులు ప్రసంగించారు. కామ్రేడ్ కంపేటి రాజయ్య
సిపిఎం పార్టీ
భూపాలపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, సింగరేణి సంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. చివరి శ్వాస వరకు శ్రమజీవులను ఐక్యం చేయడం కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు అనేక కేసులు పెట్టారన్నారు. కేసులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసిన నిబద్ధత కలిగిన కామ్రేడ్ అని కొనియాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కార్మిక వర్గ హక్కుల కోసం గొంతేత్తిన ధీరుడు అన్నారు. జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా చివరి శ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. వీరి మరణం పార్టీకి ప్రజా సంఘాలకు, పేద ప్రజలకు తీరని లోటు అన్నారు. గుడిష వాసులకు పట్టాలు రావాలని ఉద్యమించాడని అన్నారు.వీరి స్ఫూర్తితో జిల్లాలో శ్రామిక వర్గం పక్షాన నిరంతరం పోరాడుతామన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంద నరసింహ రావు టి రాజారెడ్డి తో పాటు సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు, చివరి అంత్రమయాత్రలో కామ్రేడ్ కంప్లీట్ రాజయ్య ఆడేమోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎడ్ల రమేష్, పోలేం రాజేందర్,గుర్రం దేవేందర్, జిల్లా కమిటీ సభ్యులు విజయలక్ష్మి, ఎస్ ప్రీతి, గడప శేఖర్, ఆకుదారు రమేష్, బిక్షపతి, మందమర్రి వెంకటస్వామి, మెండే శ్రీనివాస్ లతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, హనుమకొండ జిల్లా, పెద్దపెల్లి జిల్లా నాయకులు కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు, సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
