SC Corporation Loan Interviews Held in Jaipur Mandal
ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఇంటర్వ్యూలు నిర్వహణ
24 యూనిట్లకు 137 మంది అభ్యర్థుల దరఖాస్తులు
జైపూర్,నేటి ధాత్రి:
https://youtu.be/kn1CJRqGnTo?si=HR8wbD1a4wrQjT7x
ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఇంటర్వ్యూలు నిర్వహణ 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ..జైపూర్ మండలంలోని నాలుగు బ్యాంకులకు గాను మొత్తం 24 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు.కాగా 137 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.సంబంధిత బ్యాంకు మేనేజర్లతో కలిసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీపతి బాపు రావు, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) శివలీల,కార్యాలయ సూపరింటెండెంట్ జి.భాగ్యలక్ష్మి, సంబంధిత బ్యాంకుల మేనేజర్లు సుధీర్ కుమార్ (టీజీబీ జైపూర్), అనీష్ (టీజీబీ ఇందారం),రాకేష్ (టీజీపీ కుందారం),అమిత్ కుమార్ ( ఎస్బిఐ జైపూర్) పాల్గొన్నారు.అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు,అన్ని గ్రామపంచాయతీల నుండి వచ్చిన దరఖాస్తుదారులు హాజరయ్యారు.
