గుర్తు తెలియని వ్యక్తి మృతి.. స్థానికంగా కలకలం.
అనంతగిరి, నేటి ధాత్రి:
కోదాడ పట్టణ సమీపంలోని తమ్మర గ్రామ శివారులో కోదాడ-ఖమ్మం పాత హైవే ప్రక్కన గల కోటేశ్వరమ్మ చాపల మార్కెట్ వద్ద, ఒక గుర్తుతెలియని మగమనిషి, వయసు అందాజ 35 నుండి 40 మధ్యలో ఉండి, గుండ్రటి మొహం, ఫుల్ గడ్డం తోటి, తెల్ల పూలు కలిగిన బూడిద రంగు చొక్కా, బ్లూ కలర్ జీన్స్, తెలుపు రంగు ఆఫ్ బనియన్ ధరించి చనిపోయి ఉన్నాడు. ఈ మృతి చెందిన వ్యక్తి గురించి చుట్టుప్రక్కల షాపు వారిని విచారించగా అతను బస్ కోసం ఎదురుచూస్తూ, అలాగే చనిపోయినడని, ఈ యొక్క విషయంలో బహుశా అతను వడదెబ్బకు గురి అయినట్లుగా ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ యొక్క విషయం గురించి పూర్తిస్థాయి విచారణ చేపట్టడం జరుగుతుంది. అందుకుగాను మొదటగా మృతుని గుర్తింపు కు సంబంధించిన వివరాలు తెలిసినచో ఈ క్రింది నెంబర్ అనంతగిరి ఎస్సై 8712686046 కు తెలుపగలరన్నారు.
