`హామీలన్నీ అమలు చేస్తాం..అప్పుడే ఓట్లు అడుగుతాం!
`పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతం!
`పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా..
`ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
`పాలేరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుత.
`ఈ ఐదేండ్లలో అద్భుత ప్రగతి చేసి చూపిస్తా.
`పాలేరును రోల్ మోడల్ గా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడత.
`పాలేరు ప్రగతి లో కొత్త చరిత్ర సృష్టించి చూపిస్తా.
`అన్ని రంగాలలో పాలేరును పరుగులు పెట్టిస్తా.
`ఒక్క సారి మాటిస్తే తప్పేది లేదు.. వెనుకడుగు వేసేది రాదు.
`పాలేరు తో పాటు తెలంగాణా మొత్తం అభివృద్ధి లో దూసుకు పోయేలా చేస్తా.
`పేదల కలల రూపం… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం!
`ఇందిరమ్మ ఇండ్లతో మోడల్ గ్రామాలుగా తెలంగాణా పల్లెలు.
`జూన్ 2న రెండో విడత!
`రెండో ఏడాది ఇందిరమ్మ ఇండ్ల జాతర!
`శర వేగంగా జరుగుతున్న మొదటి విడత నిర్మాణాలు.
`ఇప్పటికే అనేక చోట్ల పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లు.
`మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జి లతో జరుపుకుంటున్న గృహ ప్రవేశాలు.
`గత పాలకులు మాటలు చెప్పి మోసం చేశారు.
`పేదల కలలు నిర్వీర్యం చేశారు.
`ఇచ్చిన మాట తప్పి ప్రజలను మోసం చేశారు.
`డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో గెలిచి, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.
`తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ, ఎప్పటికీ కనిపించేవి ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే.
`పేదల పెన్నిధి కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానం ఎప్ప్పుడూ మర్చిపోని నాయకుడు రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇది ఎవరో అంటున్న మాట కాదు. సాక్ష్యాత్తు ఆయనను ఎన్నుకున్న పాలేరు నియోజకవర్గ ప్రజలు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించుకొని తాము పుణ్యం చేసుకున్నామని చెప్ప్పుకుంటున్నారు. అంతగా ఆయన ప్రజలను ప్రేమిస్తున్నారు. వారి సమస్యలు తీరుస్తున్నారు. పేదలకు అండగా వుంటున్నారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండాచూసుకుంటున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో సమస్యల వలయంలో చిక్కుకున్న పాలేరు నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సుందర వనం చేస్తున్నారు. నందన వనంలా తీర్చిదిద్దుతున్నారు. పాలేరు రూపురేUలు మార్చుతున్నారు. ఆదర్శ నియోజకవర్గంగా మార్చేస్తున్నారు. అంతలా అందమైన, ఆరోగ్యవంతమైన నియోజక వర్గంగా పాలేరును బాగు చేస్తున్నారు. ఎటు చూసినా పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అందుకే ఆయన గెలిచిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట చెబుతున్నారు. మళ్లీ ఎన్నికల నాటికి పాలేరు ప్రజలకు ఇచ్చిన అన్ని హమీలు నెరవేర్చిన తర్వాతే ఓట్ల కోసం వస్తాను. అలా చెప్పిన మాటకు కట్టుబడి ఆయన చేస్తున్న అభివృద్దిని చూసి అందరూ అబ్బురపడాల్సిందే. మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పార్టీ గెలుపుకు కీలక భూమిక పోషించిన నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందుతున్న పాలకుడిగా ఆయన పాలేరు నియోజకవర్గ ప్రజలుకు ప్రత్యేకంగా ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నారు. ఆ పరంపరలో అందరికంటే ముందున్నారు. తన నియోజకవర్గంలో వున్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. మొదటి దశ పూర్తయింది. అంతే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలోనే ఇండ్ల పంపణీ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొదటి దశలో ఇప్పటి వరకు సుమారు 5లక్షల ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్లే లెక్క. గత ఏడాది జూన్ 2 మొదలు పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణాలు దాదాపు పూర్తయిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దాదాపు గత ఏడాది ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు చాలా వరకు పూర్తయ్యాయి. అక్కడక్కడ మాత్రమే కొన్ని చివరి దశలో వున్నాయి. అవి కూడా నెలలో పూర్తికానున్నాయి. గత ఆరు నెలల కాలంగా పూర్తయిన ఇండ్లýలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసుకుంటూనే వున్నారు. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు గత ఆరు నెలలుగా ఒక జాతరలాగా జరుగుతున్నాయి. అందులోనూ పాలేరులో కూడా దాదాపు అన్ని ఇండ్లు పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ తొలి రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులు తమ స్వహస్తాలతో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు దగ్గరుండి చేయించారు. ప్రతి ఊరిలో ఇందిరమ్మఇండ్ల పండుగను జాతరలా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి ఆ ఖర్చులు కూడా పెట్టుకుంటూ లబ్దిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నారు. అలా మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి గ్రామంలోనూ వచ్చే నెల తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ దఫా కూడా మరో ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో మొదటి విడత పూర్తయింది. ఇంకా మÖడు విడతలు మిగిలివున్నాయి. ప్రతి విడతలో 5లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారు. మొత్తం ప్రజా ప్రభుత్వం ఎన్నికల నాటికి తెలంగాణ వ్యాప్తంగా 20లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదల కలలు నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. అంతటి మహాత్కార్యక్రమం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సాగడం ఆయన పూర్వ జన్మసుకృతం అంటున్నారు. అలా పేదలకు సేవ చేసే అవకాశం అతికొద్ది మందికి మాత్రమే వస్తుంది. కొన్ని ప్రభుత్వాలలోనే ఇలాంటి కార్యక్రమాలు సాద్యమౌతాయి. గత బిఆరఎస్ పాలకులు 2014 ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూంల గురించి మాయ మాటలు చెప్పింది. అంతకు ముందు పదేళ్ల కాలంపాటు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తం సుమారు 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసింది. ప్రతి ఒక్కరి సొంతింటికల నెరవేర్చింది. అయితే ఆ ఇందిరమ్మ ఇండ్లను ఎగతాలి చేస్తూ, గత పాలకులు డబుల్ బెడ్రూంలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. 2014 ఎన్నికల్లో అదికారంలోకి వచ్చారు. తెలంగాణలో పేదలందరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తామని చెప్పి, ఒక్కటి కూడా కట్టలేకపోయింది. పదేళ్ల పాటు పాలించిన బిఆరఎస్ పాలకులు తెలంగాణలోని ఏ ఒక్క పల్లెలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. డబుల్ బెడ్రూంల పేరు చెప్పి, రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ప్రజలను వంచించారు. దాంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. పేదల కలలు నెరవేర్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలకు తెలుసు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు పదేళ్లులో తెలంగాణలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ కాలనీలు కనిపిస్తాయి. ఏ ఊరిలోనైనా ఇందిరమ్మ ఇండ్లే వుంటాయి. కాని ఏ ఒక్క ఊరిలోనూ బిఆరఎస్ డబుల్ బెడ్ ఇల్లు అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణలో పేదవారి సొంతింటి కల నెరవేర్చేది కేవలం ఇందిరమ్మ రాజ్యమే..కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిరూపిస్తున్నారు. గతంలో 25లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసినా, ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వమే ఇండ్లు నిర్మాణంచేసి ఇచ్చింది. ఇప్ప్పుడు కూడా ప్రభుత్వమే స్దలమిచ్చి ఇండ్లు నిర్మాణం చేస్తోంది. ప్రతి ఊరిలో ఇప్ప్పుడు రెండు ఇందిరమ్మ కాలనీలు కనిపిస్తున్నాయి. అది కాంగ్రెస్ ప్రజా పాలనలో డబుల్ దమాకా అని ప్రజలు చెప్ప్పుకుంటున్నారు. రాష్ట్ర మంత్రిగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో నిర్మాణం చేస్తున్న ప్రతి ఇంటి రికార్డులను కూడా పరిశీలిస్తూ, పేదలను లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చిన హమీని నిలబెట్టుకుంటున్నారు. వచ్చే మÖడేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెలో తమకు ఇల్లు రాలేదనే పేద వారు లేకుండా చూడాలన్న లక్ష్యంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పని చేస్తున్నారు. అంతే కాకుండా తనను ఎన్నుకున్న పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. పాలేరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తున్నారు. మరో ఐదు తరాలు మంత్రి శ్రీనివాస్‌రెడ్డి పేరు చెప్ప్పుకునేలా పాలేరును తీర్చిదిద్దుతున్నారు. పాలేరును రోల్ మోడల్‌గా మార్చి నిలబెడుతున్నారు. పాలేరు ప్రగతిలో కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. అన్ని రంగాలలో పాలేరును పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్కసారి మాట ఇస్తే మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వెనుకడుగు వేయరన్న మాటను నిజం చేస్తున్నారు.
