భద్రాచలం నేటి ధాత్రి
రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *సిపిఐఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ లు మాట్లాడుతూ భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన అంబేద్కర్ మీద ఆధారపడే అమిత్ షా పదవుల ఫలాలు అనుభవిస్తున్నాడని ఆ విషయం దేశవ్యాప్త ప్రజలకు అందరికీ తెలుసని వారన్నారు అయినా అవన్నీ మర్చిపోయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ ఏవైనా దేవుడా అని వ్యాఖ్యానించడం సరైనది కాదని వారు అన్నారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు నిజంగానే దేవుడని చీకటి బతుకులకు ఆయన కొనియాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటైనప్పుడు నరేంద్ర మోడీ ఈ పదవికి కారణం అంబేద్కర్ అని ఆయన రాసిన రాజ్యాంగమేనా అని ఆరోజు గొప్ప చెప్పినవారు ఈనాడు అంబేద్కర్ దేవుడా అని కించపరచడంలో అంతర్వేమిటో అర్థం చేసుకోవాలి వారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ మన ధర్మ శాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అన్నారు. పైగా క్షమాపణలు చెప్పకపోగా నరేంద్ర మోడీ అమిత్యాలు కలిసి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని కాంగ్రెస్ పార్టీ ఏ అంబేద్కర్ ని అవమానించిందని సమర్థించుకుంటున్నారు ఏది ఏమైనా రాజ్యసభలో ప్రత్యక్షంగా కామెంట్ చేసి కించపరిచిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా నాయకురాలు పొడుపు గంటి సమ్మక్క సిపిఎం మండల నాయకులు బాలాజీ వర్మ వరలక్ష్మి షారోని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు గొంది ముయ్యన్న మల్లేష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు