టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్.
చందుర్తి, నేటిధాత్రి:
కులగణనను మళ్లీ సర్వే చేయాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తగ్గించి చూపారు. 42 శాతం సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటుంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాదు. చట్టబద్ధత కూడిన రిజర్వేషన్లను అమలు చేస్తేనే అన్నింట్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతాయి. జనాభాపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అందకుండా చేసింది. బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. తాజా కుల గణన ప్రకారం బీసీలు ఒక కోటి 85 లక్షల మంది ఉంటే దామాషా ప్రకారం 51 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ ఇటీవల సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46% ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇది కచ్చితంగా మోసమే 2014 నాటి సమగ్ర కుటుంబ సర్వేలో 56% ఉన్న బీసీలు తాజా సర్వే నాటికి ఇంత భారీగా ఎలా తగ్గుతారు కొత్త ఫార్మాట్లో బీసీ కులాలను చేపట్టాలి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి లేదంటే ఉద్యమిస్తాం అని టిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు తెలియజేసారు