చిట్యాల, నేటిధాత్రి :
భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన 14వ నవంబర్ ను భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం గా జరుపుకుంటారు అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసిబాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహ మ్మద్ మాట్లాడుతూ నెహ్రూ గారు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయి 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసే ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను తెలియజేశారు అతనికి విద్యార్థులు అన్న పిల్లల అన్న చాలా ఇష్టం అందుకే అతనిని పిల్లలు చాచా నెహ్రూ అని కూడా సంబోధిస్తారు ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి నెహ్రు గారిని ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కరస్పాండెంట్ కోరారు ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.