తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి కురుమ సంఘం అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎగుర్ల కరుణాకర్ ను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన సంఘ సభ్యులకు కురుమ బాంధవులకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా మీ ఇంటి కొడుకుగా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తంగళ్ళపల్లి కురుమ సంఘ సభ్యులకు ప్రజలకు కుల బాంధవులకు మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఒగ్గు కుంటయ్య ప్రధాన కార్యదర్శిగా బోడుపట్ల అంజయ్య కోశాధికారిగా దయ్యాల రాములు కార్యదర్శిగా కాకాల మల్లేశం ముఖ్య సలహాదారులుగా గుంటి రాములు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా ఈ ఏకగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు