లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని గోదావరిరోడ్డు రాంనగర్ కు చెందిన గాధనవేని తిరుపతి అనే 25సంవత్సరాల యువకుడు ఇంట్లో స్లాబ్ కింద ఉండే సీలింగు ఫ్యాన్ కోండికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతుడు ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం సెంట్రిగ్ పని చేసుకుంటున్నాడు. తన అన్న ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడు కూడా రెండుసార్లు ఆర్మ్ ఉద్యోగ కోసం దరకాస్తూ చేసుకొని రన్నింగ్ లో క్వాలిఫై కాలేకపోయాడు. దానితో చాలా బాధపడుతూ దిగులుగా ఉండేవాడు. ఆన్నకి ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యాడు తనకి ఉద్యోగం రావడం లేదంటూ బాదపడితే ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పేవాళ్ళు. అదేక్రమంలో నిన్న అనగా ఆదివారం రాత్రి కూడా బాధపడితే ఇంట్లో వాళ్ళు ఓదార్చి వెళ్లి పడుకోమని చెప్పగా గదిలోకి వేల్లి గడియ పెట్టుకొని పడుకున్నాడు. ఈరోజు ఉదయం మృతుడు లెవలేదని ఇంట్లో వాలు తలుపు కొడితే తీయలేదు స్థానికులను పిలిచి తలుపు పగులకొట్టి చూసేసరికి ఉరికి వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. మృతుడి తండ్రి కొమురయ్య పిర్యాదు మేరకు లక్షెట్టిపేట ఎస్సై సతీష్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.