-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం.
-లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే!
-దొంగలకిచ్చే ట్రీట్ మెంట్ జరగాలే!
-అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే!
-అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు!
-గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి.
-దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి.
-రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు.
-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలో అంతులేని అవినీతి.
-ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు.
-భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల చెలరేగిపోయారు.
-ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని మరీ సంపాదనకు ఎగబడ్డారు.
-ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనిశా వలకు చిక్కుకుంటున్నారు.
-అయినా కించిత్ కూడా ఎవరిలోనూ భయం లేదు.
-పదేళ్లుగా అడ్డగోలు దోపిడీ తో కోట్లు కూడబెట్టుకున్నారు.
-ఉద్యోగాలు పోయినా ఫరవాలేదని తెగిస్తున్నారు.
-ఇటీవల ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
-అసలు సూత్రదారి ‘‘సంతోష్’’ తప్పించుకున్నాడు?
-పాత్రదారులైన ఇతర ఉద్యోగులు పట్టుబడ్డారు.
-600 కోట్ల భూమి వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు.
-అసలు సూత్రదారి దర్జాగా తిరుగుతున్నాడు.
-అవినీతి కేసులో దోషిని చేయడానికి పై అధికారులే ముందుకు రావడం లేదు.
-అందుకే మంత్రి పొంగులేటి రంగంలోకి దిగనున్నారు.
-అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సిద్దమౌతున్నారు.
-రెవెన్యూలో త్వరలో సమూల మార్పులు.
-అవినీతి పరులపై కఠినమైన చర్యలు.
-రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన.
-రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఆస్థులు మీద నిఘా.
-రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెడితే కటకటాలే!
-ప్రజలను వేధిస్తే జైలు పాలు చేయడమే!
-పట్టుబడిన వెంటనే వారి ఉద్యోగాలు ఊడిపోవాలే!
-ఆస్థులన్నీ జప్తు జరిపి రోడ్డున పడాలే!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలోని కొన్ని శాఖల్లో అధికారుల అవినీతికి హద్దూ బద్దూ లేకుండాపోతోంది. మరీ ఇంత అన్యాయానికి ఎందుకు తెగబడుతున్నారని ప్రశ్నించే వారు కూడా లేకుండాపోతున్నారు. ఓ వైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు డేగ కండ్లేసుకొని జల్లపడుతున్నా అవినీతి ఆగడంలేదు. వారిలో భయం అన్నది కనిపించడం లేదు. నిత్యం ఎవరో ఒకరు ఎక్కడోఅక్కడ పట్టుబడుతూనే వున్నారు. ఈ ఏడాది కాలంలో 300లకు పైగా అధికారులు పట్టుబడ్టారంటే అవినీతి ఏమేరకు విశృంఖలంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత పదేళ్ల అవినీతి పరంపరను అవినీతి అదికారులు ఆపడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిందన్న భయం అంతకన్నా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దృష్టిపెట్టి అవినీతిని అంతం చేయాలని చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉద్యోగం వెలగబెట్టడమంటే ప్రజలను పీడిరచి సొమ్ము వసూలు చేయాలని అనుకుంటున్నారో ఏమో? ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన బాద్యతలో వున్నామన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు. అందుకే ఇంతగా భరితెగిస్తున్నారు. ఓ వైపు మేం వేతన జీవులమంటూ అమాయకపు చూపులు చూస్తూ, ప్రభుత్వం నుంచి పొందాల్సిన సదుపాయాలు పొందుతూ, హక్కులు సాధించుకుంటూనే వున్నారు. జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచినా, ప్రజలను పీడిరచడం మానుకోవడంలేదు. అవినీతిని ఆపడం లేదు. లంచాలకు మరిగి కోట్లు సంపాదించుకుంటున్నారు. మేం లేకపోతే వ్యవస్ధ నడవదన్న అహం అధికారుల్లో బాగా పెరిగిపోయింది. ఉద్యోగం పోతే జీవితం ఆగమైపోతుందన్న భయం లేకుండాపోయింది. ఎందుకంటే జీవితాంతం ఉద్యోగం చేస్తే జీతం ద్వారా వచ్చే ఆదాయం చాలా మంది ఉద్యోగులు అంతకు పది రెట్లు ఈ పదేళ్ల కాలంలో సంపాదించిపెట్టుకున్నారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఇండ్లు , స్ధలాలు కొని పెట్టుకున్నారు. హైదరాబాద్ లో కూడా చిన్నా చితక ఉద్యోగులు కూడా విల్లాలు కొనుగోలు చేసుకున్నారంటే అవినీతి ఎంతగా రాజ్యమేలుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద హోదాలలో వున్న అధికారుల సంపాదన ఎలా వుందో పట్టుబడిన వారిని చూస్తేనే తెలిసిపోతుంది. గత ప్రభుత్వ హాయంలో ధరణి మూలంగా రెవిన్యూశాఖ, భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చేసిన దోపిడీ అంతా ఇంకా కాదు. అవినీతికి పాల్పడి, అక్రమంగా సంపాదించిన అధికారుల ఆస్ధులు వెలికితీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో సరిసమానమౌతుందని అంటున్నారు. అంతలా ఈ పదేళ్ల కాలంలో ప్రజలు జలగల్లా పీల్చుకుతిన్నారు. ఇంకా చాలదన్నట్లు తింటూనే వున్నారు. జేబులు నింపుకుంటూనే వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. అయినా ఏ ఉద్యోగ వ్యవస్ధలో కించింత్ భయం కూడా కనిపించడం లేదు. ఉద్యోగం పోతే పోని అన్నట్లుగా తయారయ్యారు. అందుకే ఇలా భరితెగించి లాంచాలు తీసుకుంటున్నారు. రైతులు తమ భూమిని కుటుంబ సభ్యుల మీదకు మార్చుకుంటే కూడ లక్షల రూపాయలు ముట్టజెప్పుకోవడం ఏమిటి? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లింపులు చేస్తున్నా, అధికారులకు లంచాలు ఎందుకివ్వాలి. ప్రభుత్వానికి చెల్లిస్తున్న సొమ్ముకు పదింతలు లంచాలు వసూలు చేస్తున్నారు. కోట్లు రూపాయలు గడిస్తున్నారు. భూములను కుటుంబ సభ్యుల పేరు మీద మార్చడానికి కూడా లక్షల రూపాయలు వసూలు చేసి, కోట్లు కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడిన అధికారులను దారిలోకి తీసుకురావాల్సిన అసవరం వుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవిన్యూ శాఖ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సీరియస్‌గానే వున్నారు. అవినీతి అన్నది అన్ని శాఖలో పాతుకుపోయింది. వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిపోయింది.
తెలంగాణలో అవినీతి అధికారుల మూలంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. అందుకే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక పూర్తిగా రంగంలోకి దిగుతున్నారు. రెండు శాఖల్లో జరుగుతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పలు మార్లు చెప్పి చూశారు. హచ్చరించారు. అయినా అదికారుల్లో మార్పు రావడం లేదు. లంచాలవతారాలు మారడం లేదు. వారి చేతి వాటం ఆపడం లేదు. అధికారులు చేసే అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముంది. పైగా కొత్తగా భూ భారతి వచ్చింది. సమస్యలతో సతమతమౌతున్న రైతులు రెండు శాఖల కార్యాలయాలకు క్యూ కట్టే సమయం వచ్చింది. గత ప్రభుత్వం ధరణి దరిద్రం తెచ్చిపెట్టినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి తీరని సమస్యలు భూ భారతి ద్వారా తీరుతాయిని ఎన్నొ ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రైతులను, ప్రజలు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేసే పరిస్దితులు లేకపోలేదు. అందుకే మంత్రి పొంగులేటి ముందస్తుగా హెచ్చరించారు. రైతులనుగాని, ప్రజలను గాని ఇకపై ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అయినా లెక్క చేయకుండా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుండే అవకాశం వుంది. లంచం తీసుకొని దొరికిపోతే పోయేది ఉద్యోగమే కదా? అని ఇకపై అనుకుంటే పొరపాటు. గత పాలకులు అవినీతిని ప్రోత్సహించి, అధికారుల అవినీతిని చూస్తూ ఊరుకున్నారు. అధికారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నా పట్టించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఉపేక్షించే పరిస్ధితి లేదు. ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురిచేసినా, లంచాల కోసం పీడిరచినా, వేదించినా, ఒక్క రూపాయి తీసుకున్నట్లు సమచారం అందినా సరే ఆ ఉద్యోగి కొలువు ఊడిపోవడమే కాకుండా, ఉద్యోగిగా అవినీతి సంపాదన మొత్తం వెలికి తీస్తారు. ఆస్దులను జప్తు చేస్తారు. ఉద్యోగులను జైలు పాలు చేస్తారు. దాంతో కుటుంబం ఉద్యోగులు కుటుంబాలు వీధినపడే అవకాశాలున్నాయి. ఇంత కాలం అలాంటి భయం లేకపోవడం వల్లనే అధికారులు విచ్చలవిడిగా లంచాల రూపంలో దోచుకున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. నిజానికి లంచగొండి తనాన్ని దొంగతనంగా భావించాలి. ఒక దొంగ దొంగతనానికి పాల్పడితే పోలీసులు ఎలాంటి ట్రీట్ మెంటు ఇస్తారో! అలాంటి ట్రీట్ మెంటు అమలులోకి తీసుకురావాలి. ఓ వైపు విచ్చలవిడిగా అవినీతి సాగిస్తారు. మరో వైపు ప్రశ్నించిన ప్రజలను వేదిస్తారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తారు. ఇలా ప్రజలను తమ దారికి తెచ్చుకోవడానికి అధికారులు వేసే వేలం వెర్రి వెషాలకు కూడా అడ్డుకట్ట పడాలి. ఒక అదికారి నీతిగా నిజాయితీగా ప్రజలకు పనులు చేసి పెడితే దండం పెడతారు. దేవుడని కొలుస్తారు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాని అదే అదికారులు పీడిరచుకు తింటే నిత్యం శపిస్తారు. ఇలాంటి సమయంలో అదికారులు అత్యుత్సాహానికి పోయి బాదితుల మీద కేసులు నమోదు చేసి వేదిస్తుంటారు. ఇకపై ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అదికారులు దారికి రారు. వారి అవినీతిని ఆపరు. లంచాలు అడగాలంటే అదికారులు ధడ పుట్టాలి. అవినీతి చేయాలంటే చేతులు వణికిపోవాలి. గత పదేళ్ల కాలంలో అటు రెవిర్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖల్లో ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఏళ్ల తరబడి తిష్టవేసుకొని వున్నారు. అవినీతి సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఇది మరీ దారుణంగ తయారైంది. జిల్లా స్ధాయిలో పనిచేసిన రిజిస్ట్రేషన్ అదికారులు, ఉద్యోగులు చిన్న పట్టణాలలో పనిచేయడానికి నామోషీగా భావిస్తున్నారు. పాతుకుపోయిన దగ్గర కోట్లకు కోట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించుకున్నారు. ఇటీవల మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా పరిధిలో సుమారు 600 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి కనుసన్నల్లో హంపట్ చేశారు. ప్రభుత్వ భూమిని మాయం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేశారు. ఇది వెలుగులోకి రావడంతో కింది స్ధాయి ఉద్యోగులను బలి చేశారు. అంత పెద్ద రిజిస్ట్రేషన్ తంతు జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియకుండా జరిగిందా? అని నేటిధాత్రి అనేకసార్లు ప్రశ్నించింది. కాని సమాధానం చెప్పిన వారు లేరు. డిఆర్‌పై చర్యలు తీసుకున్నది లేదు. 600 కోట్ల రూపాయల స్ధలం మాయంలో సూత్రదారి బాగానే వున్నారు. కాని జిల్లా అధికారి ఆదేశాలను పాటించిన పాత్రదారులైన కింది స్ధాయి ఉద్యోగులు బలయ్యారు. జైలు పాలయ్యారు. అందుకే ఈ రెండు శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తే గాని వ్యవస్ధలు గాడిలో పడవు. అవినీతి ఆగదు. ప్రజలు మేలు జరగదు. లేకుంటే యాదా విధిగా అదే అవినీతి రాజ్యమేలక తప్పదు.