సుచిలేని కల్తీ రుచి.. ప్రాణాలు హరీ!

-నాలుకకు సమ్మగా వుందని ఎగబడుతున్న జనం!

-జంక్‌ ఫుడ్‌ పేరుతో జబర్దస్త్‌ గా లాగిస్తున్నారు.

-ఇడ్లీ తినాలంటే విసుగు..చిరాకు.

-బిర్యానీ గుమగుమలంటేనే మోజు.

-ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.

-వైరస్‌లు వచ్చే అనగానే జంకుతున్నారు.

-దేశవాలీ వంటలు మానేస్తున్నారు.

-చైనా తిండిమీద ఎగబడుతున్నారు.

-ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

-వైరస్‌ లు వచ్చే అనగానే జంకుతున్నారు.

-తినేది రసాయనాలు కలిపిన ఆహారం!

-లొట్టలేసుకుంటూ మింగుతున్నాం.

-టెస్టింగ్‌ సాల్ట్‌లు విచ్చలవిడిగా వినియోగం.

-టేస్టీ ఆయిల్‌ గురించి తెలియని అమాయకులం.

-జంతు కళేబరాలనుంచి తయారు చేస్తున్న నూనెలు.

-టెస్టింగ్‌ ఆయిల్‌ పేరుతో మార్కెట్‌ లో అమ్మకాలు.

-హోటళ్లన్నీ కొనుగోలు చేస్తూ కలుపుతున్నారు.

-కుళ్లిన జంతు కలేబరం కొవ్వు కరిగిస్తున్నారు.

-హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.

-ఆహా…ఏమి రుచి అని లొట్టలేసుకుంటూ తింటున్నారు.

-సంపాదించేదే తిండి కోసమని ఖర్చు చేస్తున్నారు.

-ఇంట్లో వంటలు చేయడమే మర్చిపోయారు.

-మురిగిన వస్తువులను నూనెలో గోలిస్తే అదుర్స్‌ అని తింటున్నారు.

మీరు చూసేందంతా నిజం కాదు..తినేందంతా ఆరోగ్యానికి పనికొచ్చేదే కాదు. అసలు ఆహారమే కాదు..విషం తింటున్నామని తెలిసే తింటున్నారు. చేజేతులా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. జిహ్వ చాపల్యం పెరిగి కొందరు, బద్దకం ఆవహించి మరి కొందరు మొత్తం మీద అందరూ బైట పుడ్‌ తినడానికే అలవాటు పడుతున్నారు. ఉదయం నిద్ర లేచిన నుంచి, రాత్రి నిద్రపోయేదాకా తింటున్నవన్నీ ప్రాణాలకు మీదకు తెచ్చేవే. శరీరంలో విషం నింపేవే, ఒళ్లు గుల్ల చేసేవే అని తెలిసినా ఎగబడి తింటున్నారు. కోరికోరి కొనుక్కొని రుచి కోసం చస్తున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా తినడం మానుకోవడం లేదు. జనం బతకడానికి తింటున్నారా? తినడానికి బతుకుతున్నారా? తింటూ బతుకుతున్నారా? బతకే తిండిగా మార్చుకొని తింటున్నారా? అర్దం కావడం లేదు. ఒకప్పుడు పట్ణణ ప్రాంతాల్లో కూడా హోటళ్లు ఎక్కవగా కనిపించేవి కాదు. ఇక ప్రత్యేకమైన వంట కాల కోసం కొన్ని మాత్రమే హోటళ్లు అక్కడక్కడా వుండేవి. కాని ఇప్పుడు అడుగడుగునా హోటళ్లు వెలుస్తున్నాయి. ఇక కర్రీ పాయింట్లు అనేవి పుట్టగొడుగులకన్నా ఎక్కువగా పుట్టుకొచ్చాయి. కాని విదేశీ ఆహార రుచులు ఎప్పుడైతే మన ఆహారపు అలవాట్ల మీద దాడి చేయడం మొదలు పెట్టాయో? అప్పటి నుంచి వంటల్లో రకరాలు వచ్చేశాయి. ఒకప్పుడు తినేవి, తిన కూడనవి అనే రకాలు వుండేది. కాని ఇప్పుడు అన్నీ తింటున్నారు. ఏది పడితే అది తింటున్నారు. ఎలా పడితే అలా తింటున్నారు. ఎంత ఖర్చైనా వెనుకాడకుండా తింటున్నారు. అసలు ఇంట్లో పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదన్నంతగా తింటున్నారు. ఏ క్షణం ఏది తినాలనిపించినా సరే క్షణాల్లో వచ్చి వాలే ఆర్టర్లే కాదు, ఎంత దూరమైనా వెళ్లి తిని రావాలనే కోరిక ప్రజల్లో మరింత పెరుగుతోంది. దాంతో తిండి మీద ద్యాస ఎక్కువౌతోంది. ప్రతి రోజు ఆర్డర్ల మీద ఆధారపడే తింటున్నారు. వీకెండ్‌లోనైనా కనీసం ఇంటి తిండి తింటున్నారా? అదీ లేదు. ఆ రెండు రోజులు ఎంజాయ్‌ పేరుతో మరింత గడ్డి తింటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గడ్డి తిన్నా ఆరోగ్యమే. కాని విషయాన్ని నింపుతున్న ఆహారాలను కోరి కోరి తెప్పించుకుంటున్నారు. వేడివేడిగా హోటళ్లలో చేయించుకొని తింటున్నారు. సంపాదించేదే తిండి కోసం అన్నట్లు తింటున్నారు. ఇంతలా గతంలో లేదు. ఈ మధ్య కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే ఈ రకమైన దారుణాలను తెచ్చిపెడుతున్నాయి. మనం తినే తిండి రుచికరంగా వుందా? లేదా? కమ్మటి గుమగుమలు వస్తున్నాయా? లేదా? ఆ గుమగుమలు మన మసాలా దినుసుల వానసలు కాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రకరకాల రసాయలు కలిసి విషపూరితమైన పదార్ధాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఇదిలా వుంటే మన దేశంలోనే బిపి. షుగర్‌, క్యాన్సర్‌ పేషెంటు ఎక్కువగా పెరగడానికి ప్రదాన కారణాలు కూడా ఈ పదర్ధాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. రకరకాల చైనీస్‌ పుడ్‌, వాటి రకాలను విరివిగా తింటూ వస్తున్నాం. గతంలో మాంసాహారాలు అంటే రెండు మూడు రకాలు వుండేవి. కాని ఇప్పుడు మాంసాహారాలలో రకరకాల వెరైటీలు వచ్చి చేరాయి. అవి పూర్తి విపరీతమైన ఆయిల్స్‌లో ముంచి వండుతున్నారు. మంట్లో మాడ్చుతున్నారు. దాని వల్ల శరీరాల్లో చెడు కొలెస్ట్రాల్‌ విపరీతంగా పెరిగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలు లేకుండా ఆహర పదర్ధాలను విరివిగా వినియోగిస్తున్నాం. అయితే టేస్టీ సాల్ట్‌ అనే రకమైన ఉప్పు రకం మన వంటింట్లోకి కూడా వచ్చి చేరింది. ఇక ఫంక్షన్‌లు, హోటళ్లలో టేస్టీ సాల్ట్‌ను విపరీతంగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది చైనా నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. ఈ టేస్టీ సాల్ట్‌ను చైనా లాంటి దేశాల్లో పైరుపై పురుగు మందులు, క్రిమి కీటక నాశనంగా వ్యవసాయ దారులు వినియోగిస్తారని తెలుస్తోంది. దానిని మనం వంటల్లో వాడుకుంటూ, రుచులు పెంచుకుంటున్నాం. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ టేస్టీ సాల్ట్‌ మూలంగా రక్త నాలాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా దాని వాడకం మోతాదును మించి వాడుతున్నారు. దాంతో బిపిలు చిన్న వయసులోనే పెరుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇక మరో భయంకరమైన నిజం ప్రజలంతా తెలుసుకోవాలి. ఇప్పటికే ప్రజలు వంట్లో వాడుతున్న రిఫైండ్‌ ఆయిల్‌ మూలంగా రకరకాల రోగాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నా, చౌక కావడంతో వాటినే అన్ని వర్గాల ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని రకాల వంటలకు రిఫైండ్‌ ఆయిల్స్‌ వాడుతున్నారు. రిఫైండ్‌ ఆయిల్స్‌ మూలంగానే క్యాన్సర్‌ లాంటి వ్యాధులు పెరిగిపోతున్నాయంటున్నా, వాటిని వినియోగించక తప్పడం లేదు. వీటికి తోడు ఇటీవల మార్కెట్‌లో టేస్టీ ఆయిల్స్‌ అనేవి ప్రత్యేకంగా అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఆ ఆయిల్స్‌ను హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా వాడుతున్నారు. అటు రిఫైండ్‌ ఆయిల్స్‌తోపాటు టేస్టీ ఆయిల్స్‌ వినియోగిస్తున్నారు. అసలు టేస్టీ ఆయిల్స్‌ ఎలా తయారుచేస్తారో తెలిస్తే గుండె బుభేల్‌ మనడం ఖాయం. అసలు విషయాలు తెలిస్తే నోట్లోకి ముద్ద కూడా దిగదు. ఒకరిని చూసి ఒకరు హోటళ్లు విచ్చలవిడిగా వాడుతున్నారు. జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ రెండురకాల నూనెల మూలంగా ఆహారపదార్దాలకు వస్తున్న రుచి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఆ వంటకు, రుచులకు అలవాటు పడుతున్నారు. అందువల్ల ఆ టేస్టీ ఆయిల్‌ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అ వసరం అందిరకీ వుంది. నిత్యం మన దేశంలో కొన్ని లక్షల జంతువులు కబేళాలకు తరలుతుంటాయి. వాటి నుంచి మాంసం తీసిన తర్వాత మిగిలే ఎముకలను కొంత కాలం ఎండబెట్టి, వాటిని మరికొంత కాలం పెద్ద పెద్ద ట్యాంకులలో పులియబెట్టి, బెల్లం తయారు చేసే లాంటి పెద్ద కడాయిలలో వాటిని మరిగించి దాని నుంచి కొవ్వును వేరు చేస్తారు. కొవ్వును మళ్లీ కరిగించి నూనెలు చేస్తారు. చదువుతుంటేనే కడుపులో దేవేసినట్లనిపించేటువంటి నూనెలను నిత్యం ఆహార పదార్దాల ద్వారా తీసుకుంటున్నారు. ఇలా వచ్చే నూనెను టేస్టీ ఆయిల్‌పేరుతో పెద్దఎత్తున వాడుతున్నారు. అసలు ఒక జంతు కళేబరం ఒక రోజు దాటితే వచ్చే దుర్వాసన ఎంత భయకంరంగా వుంటుందో తెలియంది కాదు. దాని నుంచి వచ్చే దుర్వాసనను ఒక్క క్షణం కూడా భరించలేం. అలాంటి జంతు కళేబరాలను రోజుల తరబడి ఎండబెట్టి, నాన బెట్టి, పులియబెట్టి, వేడి చేసి కొవ్వును తీస్తే వచ్చే నూనెలో ఆరోగ్యం వుంటుందా? రుచి వుంటుందా? అలాంటి జంతు కలేబరాల నూనెను టేస్టీ ఆయిల్‌ అని ముద్దుగా పేరు పెట్టి వంటకాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారు. జనం ఆ ఆహార పదార్దాలను లొట్టలేసుకొని తింటున్నారు. ఇక జనం రోగాల బారిన పడమంటే ఎందుకు పడరు? అనారోగ్యాల పాలైన ప్రాణాలు ఎందుకు కోల్పోరు. రుచి కోసం, జిహ్వ చాపల్యం కోసం నిత్యం స్తోమతను బట్టి, వందలు, వేలు తగలేస్తున్నారు. అనారోగ్యాలను కోరి కోరి ఇంటికి, వంటికి తెచ్చుకుంటున్నారు. కరోనా లాంటి మహమ్మారి వస్తోందంటే మళ్లీ మన నిమ్మకాయలు, మన మనసాలలు, అల్లం, తేనెలు, వెల్లుల్లి, సొంటిలు కావాలని ఆరోగ్యాలు కాపాడుకుంటారు. పాండమిక్‌ రోజులు పోగానే మళ్లీ జంక్‌ పుడ్‌ల మీద పడుతుంటారు. నోటిని మాత్రం అదుపులో పెట్టుకోవడం లేదు. జనం కష్టపడి సంపాదిస్తున్న సొమ్ములో సగానికిపైగా తిండి కోసం హోటళ్ల మీద ఆదారపడి, చెత్తా చెదారం అంతా తింటున్నారు. అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరి మిగతా సొమ్ము హరతి కర్పూరం చేసుకుంటున్నారు. ఇంటిలోని భోజనం మర్చిపోయారు. కూరగాయల భోజనం ఎప్పుడో మర్చిపోయారు. ముక్కలేనిదే ముద్ద దిగదు. అందులోనూ రకరకాల రుచుల పేరుతో చైనీస్‌ అంటూ రకరకాలు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. మన ఇంట్లో వున్న గోదుమ పిండితో వంటకాలు చేసుకోరు. కాని చైనా నుంచి దిగుమతి చేసుకునే మైదాతో తయారైన నూడుల్స్‌ లాగిస్తుంటాం. ఇంట్లో శుచి శభ్రతతో చేసుకునే వంటలు ఎవరికీ నచ్చడం లేదు. కాని అసలు శుచి, శుభ్రత అనేది కంటికి కూడా కనిపించని వాతావరణంలో వంటలు చేసిచ్చే హోటళ్ల భోజనాలపై విపరీతమైన మోజు పెంచుకుంటున్నారు. అంతే కాదు స్ట్రీట్‌ పుడ్‌ ఏ ఒక్కటీ వదలడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!