తప్పు ఎవరిదైనా ప్రాణాలు పోయింది సామాన్య భక్తులవే
తిరుపతిపై రాజకీయాలు వద్దు
హిందువుల విశ్వాసాలు దెబ్బతీయొద్దు
రాజకీయంలోకి మతాన్ని లాగొద్దు
సమస్యలను మాత్రమే వెలుగులోకి తేవాలి
దేవుడిపై విశ్వాసమున్నవాడు తప్పు చేయడానికి భయపడతాడు
విశ్వాసహీనుడు మాత్రమే తప్పులు చేయడానికి వెరవడు
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు హిందువులు అతిపవిత్రంగా భావించే ఉత్తరద్వార దర్శనం కోసం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మరణించగా చాలమంది గాయపడిన సంఘటన నిజంగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతులకు రూ.25లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడం తాజా పరిణామం. నిజం చెప్పాలంటే గతంలో ఎప్పుడూ తిరుపతిలో ఇటువంటి సంఘటన జరగలేదు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా! కాకపోతే కొన్ని సందర్భాల్లో తోపులాటలు జరిగాయంతే! ఎప్పుడూ జరగని ఇటు వంటి దుర్ఘటన ఈసారి ఎందుకు జరిగిందనేది ఎవరికైనా ఆలోచన సహజంగానే వ స్తుంది. ఇటువంటి పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు మరే ఇతర సందర్భాల్లోనైనా కాస్త ఇబ్బందు లు ఎదురైనా ఇటువంటి దుర్ఘటనలకు తావులేని రీతిలో టి.టి.డి. అధికార్లు తగిన ఏర్పాట్లు చేస్తే, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి, అంతా సజావుగా జరిగేలా చూసేవారు. కానీ ఈసారి మాత్రమే ఇట్లా జరగడానికి కారణాలు పరిశీలిస్తే, అనువజ్ఞులైన అధికార్లు సెలవుల్లో వెళ్లడమో మరికొందరిని ఆయా విధులనుంచి తొలగించి మరో శాఖలకు బదిలీ చేయడమో జరగడం వల్ల, మిగిలిన అనుభవరాహిత్యంతో కూడిన అధికార్ల అవగాహనా లోపం, తగినంతమంది పోలీసు లు లేకపోవడం కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా బైరాగి పట్టెడ వద్ద తలుపులు తెరచిన వెంటనే భక్తులు ఒక్కసారిగా తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని వార్తలు వస్తున్నాయి. జనం తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి తోపులాటలు జరగడం తథ్యం. కానీ వీటిని నిర్వహించడమే అధికార్ల బాధ్యత! అదే ఇక్కడ కొరవడిరది. నెపం ఎవరో ఒకరిపై నెట్టేసి చేతులు దులుపుకోవడం కేవలం పలాయనవాదం తప్ప మరొకటి కాదు. పొరపాటుకు అందరూ బాధ్యులే!
ఆంధ్రప్రదేశ్‌లో కక్షసాధింపు సాధింపు రాజకీయాలు ఒక దుస్సంప్రదాయంగా మారిపోయింది. రాజకీయాలు చేయడంలో తప్పులేదు కానీ దేవుడి విషయంలో కూడా వాటిని తమకు అనుకూ లంగా మలచుకోవడానికి చేసే యత్నాలే లేనిపోని ఇబ్బందులకు కారణమవుతాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జరిగిన ప్రతి తప్పిదానికి జగన్‌ను సర్వపాపాలకు కారకుడన్నట్టు ప్రచారం చేస్తోంది తప్ప, తాము చెబుతున్న ఆ పాపాలను ఎంతమేర ప్రక్షాళన చేసామన్నది మాత్రం చెప్పదు! ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు వీరు ప్రచారం చేసిన స్థాయిలో లేకపోవడమే. గతంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారన్న నెపంతో టి.టి.డి.లో అనుభవం వున్న అధికార్లను వేరేశాఖలకు మార్పుచేయడం కూడా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి సక్రమంగా నిర్వహించలేకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. మరో ప్రధాన కారణంగా చెబుతున్నదేమంటే అంతకు ముందు రెండురోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు కు ప్పం నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడి భ ద్రతా ఏర్పాట్లలో తలమునకలుగా వుండటంతో, వైకుంఠ ద్వార దర్శనం సమయంలో బందో బస్తు విషయంలో రివ్యూ సమావేశాలు నిర్వహించలేకపోయారన్నది మరో వాదన వినిపిస్తోంది. దీని ఫలితం కూడా తొక్కిసలాట జరగకుండా నిరోధించలేకపోవడానికి మరో కారణంగా చెబుతు న్నారు.
గతంలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సమీప నియోజకవర్గ ప్రజలకు మాత్రమే దర్శనాలకు అనుమతించేవారు. ఇది రెండు రోజులపాటు జరిగేది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి, శ్రీరంగంలో వైకుంఠ ద్వార దర్శనం పదిరోజుల పాటు కొన సాగిస్తారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇక్కడ కూడా పదిరోజుల పాటు దర్శనానికి అనుమతించి, ఆందుకు అనువుగా టోకెన్లు జారీచేసేది. దీనివల్ల తాము వైకుంఠ ద్వార దర్శనం చేసుకో లేకపోయామన్న అసంతృప్తికి గురికాకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకొని సంతృప్తిగా వెళ్లేవారు. అయితే ఈసారి రెండు లేదా మూడు రోజులకు మాత్రమే టోకెన్లు జారీచేస్తారన్న ప్రచారం జరిగిందని చెబుతున్నారు. దీనివల్ల భక్తులు తమకు టోకెన్లు దొరకవన్న టెన్షన్‌లో ఒక్కసారిగా దూసుకు రావడంతో ఈ తొక్కిసాట జరిగిందనేది మరొక వాదన. నిజం చెప్పాలంటే ప్రజల్లో వుండే సహజ బలహీనత తామే ముందుండాలన్న ఉబలాటం లేదా బలీయమైన కోర్కె ఇటువం టి తొక్కిసలాటలకు కారణమవుతుంది. అది స్వామి దర్శనానికి కావచ్చు, సినిమా టిక్కెట్ల కోసం కావచ్చు లేదా మరే ఇతర క్రీడలను లేదా ఉత్సవాలను చూడటానికి వెళ్లినప్పుడు కావచ్చు. దీన్ని అంచనావేసి తగిన విధంగా వారిని నియంత్రిస్తూ అందిరికీ దర్శనమయ్యే విధంగా చూడటమే అధికార్ల విధి. ఇక్కడే టి.టి.డి. అధికార్లు మరియు పోలీసులు విఫలమయ్యారు. దుర్ఘటన జరిగింది కాబటి నెపం ఎవరో ఒకరిపైన వేయడానికే ప్రయత్నాలు జరుగుతాయి. పరిస్థితులను అంచనావేసి సమర్థవంతంగా పనిచేసేవాడెప్పుడూ సాకులు వెతకడు. సాకులు వెతి కేవాడికి సామర్థ్యం వుండదు! ఇది సహజం. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటనకు చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కనక స్పందించక తప్పదు. మరి ఇదే సంఘటన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగితే పరిస్థితిని ఎంతగా రచ్చ చేసేవారో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఎవరో ఒక అధికారి లేదా మరింకెవరిపైనో నెపం నెట్టేసి చేతులు దులిపేసుకుంటారు. జరిగేది అంతే! ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చం ద్రబాబు తన రాజకీయం కోసం తిరుపతి వెంకన్నను కూడా వదిలిపెట్టలేదన్నది సత్యం. లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారని స్వయంగా వెల్లడిరచారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వి చారణ ఎటుబోయిందో ఎవరికీ తెలియదు. ఒకవేళ అదే నిజమైతే మతం కోణంలో జగన్‌ను ఎంతటి తీవ్రస్థాయిలో అప్రతిష్ట పాలుచేసేవారో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి రాజకీయాలు చేసు కోవడంలో తప్పులేదు, దేవుడు, మతం, విశ్వాసం అనేవాటిని ఇందులోకి లాగడమే అభ్యంతరకరం! కానీ ఇటువంటి రాజకీయాల వల్ల టి.టి.డి. ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిరది. కాకపోతే ఆ ఏడుకొండల వెంకన్నపై హిందువుల అచంచల విశ్వాసం తిరుపతిపై వున్న భక్తి ప్రపత్తులను చెక్కుచెదరనీయకుండా కాపాడాయి.మరో విషయమేంటంటే చంద్రబాబు ఆవిధంగా తిరుపతి లడ్డూను తన రాజకీయ ప్రయోజనాలకోసం బజారుకీడ్చారు కనుక ‘పెద్దాయనకు’ కోపం వచ్చి ఇటువంటి దుర్ఘటన జరిగిందని వాదిం చే ‘వీర భక్తులు’ వుండవచ్చు. భగవంతుడెప్పుడూ తప్పుచేసిన వారిని శిక్షిస్తాడు తప్ప అమాయ కులను అందునా తన దర్శనం కోసం వచ్చినవారిపై ఇట్లా వ్యవహరించడు! అందువల్ల వారి అఅభిప్రాయాన్ని వారికే వదిలేయడం మంచిది!
తిరుపతి సంఘటన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తుందనేది మాత్రం సత్యం. ముఖ్యం గా ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన, రెండు లక్షలకోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, విశాఖ రైల్వేజోన్ వంటి సానుకూల అంశాలతో జోష్‌లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వా నికి తిరుపతి దుర్ఘటన ఒక షాక్ వంటిదేనని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధాని పర్యటనను తనకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే చంద్రబాబు ప్రయ త్నాలను, వైఎస్సార్సీపీ గండికొట్టక మానదు. గతంలో తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా తనను విపరీతంగా అభాసుపాలు చేయడానికి యత్నించిన కూటమి నాయకులు, ఇప్పుడేం చెబుతారని జగన్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగడం ఇప్పటికే ప్రారంభించారు. దీంతో విశాఖలో సాధించినదాన్ని పక్కనబెట్టి ప్రత్యర్థుల ఎదురుదాడులను కాచుకోవడానికే నానా హైరానా పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజ రై ఇంటికి వెళుతున్న ఇద్దరు రాంచరణ్ అభిమానులు ప్రమాదంలో మరణించడంతో, జగన్ రోడ్లు అధ్వాన్నంగా వుంచడంవల్లనే ఇది జరిగిందని ప్రచారం చేశారు. ఇంతకాలం మీరు అధికా రంలో వుండి సరిదిద్దిందేమిటని ప్రశ్నిస్తే సమాధానం వుండదు. అంతలా తనపై దాడిచేస్తున్న కూటమి నేతలను వైఎస్సార్సీపీ అంతతేలిగ్గా వదిలిపెట్టదు. తనకు ఎంతమేర రాజకీయ ప్రయోజనం కలుగుతుందో అంతమేర చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు,ఆరోపణల దాడులు చేయకమానరు. తిరుపతి సంఘటన వైఎస్సార్సీపీకి ఒక అస్త్రంగా మారిందనుకోవాలి. ప్రస్తుతం ప్రధాని పర్యటన విజయవంతాన్ని ప్రచారం చేసుకోవాలో, ఆగంతుకంగా జరిగిన తిరుపతి సంఘటనపై వైఎస్సార్సీపీ ఎదురుదాడులను ఎట్లా కాచుకోవాలో తెలియని స్థితిలో ప్రస్తుతం చంద్రబాబు ప్ర భుత్వం కొట్టుమిట్టాడుతోంది. అయితే డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహ స్తుడు కనుక దీన్ని కూడా ఆయన తిమ్మిని బమ్మిని చేయగలరు. రాజమండ్రి పుష్కరాల సమయంలో తానుపుష్కరఘాట్‌ను సందర్శించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో చాలామంది మరణించారు. దాన్నే తన రాజకీయ నైపుణ్యంతో పక్కదోవ పట్టించగలిగారు. విజయవాడ వరదల సందర్భం గా ప్రభుత్వ వైఫల్యం బయటకు రాకుండా జాగ్రత్త పడగలిగారు. అటువంటి చంద్రబాబుకు ఇదొక లెక్క కాకపోవచ్చు.