పాపపు మల్లారెడ్డి కాలేజీలో పాడు పనులు!

 

`నీతులు చెప్పే మల్లారెడ్డి, నీతి మాలిన పనులేమిటి!

`అన్నం తింటున్నావా! అశుద్దం తింటున్నావా!!

`అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా?

`కాలేజీ కూల్చిన నాడు మొసలి కన్నీరు పెడితివి.

`అమ్మాయిలకు అన్యాయం జరిగితే నోరెందుకు మెదపడం లేదు!

`మల్లారెడ్డి కాలేజీలో మానవమృగాలు!

`ఆడపిల్లల జీవితాలతో ఆటలు.

`వివాదాల మల్లారెడ్డి కాలేజీలో వికృతచేష్టలు!

`మల్లారెడ్డి రెడ్డి పని మటాష్‌!

`తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు!

`రంగంలోకి దిగిన మహిళా కమిషన్‌.

`300లకు పైగా వీడియోలు తీసినట్లు ఆరోపణలు.

`విద్యా సంస్థల ముసుగులో అమ్మాయిల జీవితాలు ఆగం చేస్తావా?

`ఘటన జరిగి ఇన్ని రోజులౌతున్నా నోరు పడిపోయిందా!

`మదమెక్కిన మాటలు..దిగజారిన చేష్టలు?

`మల్లారెడ్డి కాలేజీలలో అమ్మాయిలకు రక్షణ లేదు?

`అమ్మాయిలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చామకూర మల్లారెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఒక ప్రజా ప్రతినిధి. ఒకసారి పార్లమెంటు సభ్యుడు. రెండు సార్లు ఎమ్మెల్యే. ఐదేళ్లు మంత్రి. ఎంతో సామాజిక బాధ్యత వుండాల్సిన వ్యక్తి. ఎన్నుకున్న ప్రజలకు ఎంత జవాబు దారితనంగా వుండాలో, విద్యా సంస్థల అధినేతగా అంతకు మించి బాధ్యతగా వుండాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా వుండాలి. విద్యా సంస్థలలో చీమ చిటుక్కుమన్నా స్పందించాలి. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించిన విద్యార్థులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్లలో పెట్టుకొని కాపాడాలి. కానీ మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏం జరుగుతోంది? అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిన యాజమాన్యం ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వుంటుంది. తెల్లారి లేస్తే నీతులు వల్లించే మల్లారెడ్డి కాలేజీలో నీతిమాలిన పనులు జరుగుతుంటే నిద్రపోతున్నాడా? ఆ దుశ్చర్యలకు మల్లారెడ్డి రెడ్డి ప్రోత్సాహం వుందా? లేకుంటే మల్లారెడ్డి కాలేజీలో జరిగిన సంఘటన మీద నాలుగైదు రోజులుగా ఆందోళన వ్యక్తమౌతోంది. మల్లారెడ్డి రెడ్డి ఎందుకు ముఖం చాటేసినట్లు? ఎందుకు బైటకు రావడం లేదు? పిల్లలకు ఎందుకు ధైర్యం చెప్పడం లేదు. తప్పు చేసిన వారిని చట్టానికి పట్టించి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని మాటెందుకు ఇవ్వడం లేదు. మూడు రోజుల క్రితం సమస్య వెలుగులోకి వచ్చిన సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో హుషారుగా, ఎగిరెగిరి దుంకుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పుడు ఎక్కడ? ఏ కలుగులో దాక్కున్నాడు? ఇంత జరుగుతున్నా ఎందుకు విద్యార్థుల ముందుకు రావడం లేదు. పాపపు మల్లారెడ్డి కాలేజీలో పాడు పనులేమిటి అని పిల్లల తల్లిదండ్రులు తిట్టిపోస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైటాయించి ఒక రోజంతా నిరసనలు తెలిపాయి. తెలంగాణ మహిళా కమీషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ళ శారద కాలేజీని సందర్శించారు. సుమోటోగా కేసు నమోదు చేసినట్లు వెల్లడిరచారు. కాలేజీ యాజమాన్యం మీద చర్యలకు ఆదేశిస్తామని ప్రకటించారు. అయినా మల్లారెడ్డి లో చలనం లేదు. భయం లేదు. తప్పు జరిగిందన్న ఆందోళన కూడా కనిపించడం లేదు. విద్యార్థుల ముందుకు రాలేదు. వారికి దైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. మామూలు సమయాలలో పనికి రాని ముచ్చట్లు వెకిలి వేషాలు వేసే మల్లారెడ్డికి విద్యార్థుల సమస్య పట్టలేదా? ఇది మల్లారెడ్డి దుర్మార్గానికి పరాకాష్ఠ కాదా? ఎక్కడికి వెళ్లినా కష్టపడ్డా, పూలమ్మిన, పాలమ్మినా అంటూ చెప్పిందే చెప్పి, నీతుల మీద నీతులు వల్లించే మల్లారెడ్డి కాలేజీలో నీతి మాలిన పనులేమిటి! అని అడిగే వారికి కనీసం సమాధానం కూడా చెప్పడానికి మనసు రావడం లేదా? అందుకే విద్యార్థి లోకం మొత్తం మల్లారెడ్డిని అన్నం తింటున్నావా! అశుద్దం తింటున్నావా!! నిలదీస్తున్నారు. తిట్టు పోస్తున్నారు. శాపాలు పెడుతున్నారు. ఎప్పుడైతే రాజకీయాలలోకి మల్లారెడ్డి వచ్చాడో అప్పటి నుంచే కళాశాలలు విస్తరించడమే కాదు, నీతి మాలిన పనులు చేయడం మొదలైందని కూడా జనం విమర్శిస్తున్నారు. గతంలో మల్లారెడ్డి కాలేజీలు చెరువులు ఆక్రమించి కట్టారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. మంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు భూములు ఆక్రమించాడని ఆరోపణలున్నాయి. మల్లారెడ్డి కాలేజీలు తమ భూములను ఆక్రమించి నిర్మాణం చేశారని బాధితులు చేసిన పిర్యాదులున్నాయి. మూడు చింతలపల్లి గ్రామ శివారులో మల్లారెడ్డి గిరిజన ప్రజల భూములు ఆక్రమించాడని ఎన్నికల ముందు పోలీసు స్టేషనులో పిర్యాదు చేసిన వాళ్లున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. అలాంటి మల్లారెడ్డి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ఇలాంటి సాక్ష్యాలు చాలని జనం అంటున్నారు. ఒక విద్యా సంస్థల అధినేతగా వుండి ఓసారి కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా ధనవంతులైన అమ్మాయిలకు లైన్‌ వేసి, పెళ్ళి చేసుకొని సెటిలవ్వాలంటూ విద్యార్థులకు సూచించిన దౌర్భాగ్యుడు మల్లారెడ్డి. కళాశాల వార్షికోత్సవ వేడుకలలో ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం మల్లారెడ్డికి అలవాటే…వెకిలి చేష్టలు పరిపాటే! ఇప్పుడు తన కాలేజీలో అమ్మాయిల బాత్‌ రూముల బైట వెంటిలేటర్లలో కెమెరాలు అమర్చి వీడియోలు తీస్తున్నారని పిర్యాదు చేస్తుంటే పట్టించుకోవా? అంత కండకావరమా?

అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? కాలేజీ కూల్చివేతల నాడు మొసలి కన్నీరు పెడితివి. అయ్యో..అయ్యో..కుయ్యో..మెర్రో అని వగలమాటలు మాట్లాడితివి. అధికారంలో వున్న నాడు మంత్రి హోదాలో మల్లారెడ్డి చేసిన హంగామా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మంత్రి పదవిలో వుండి ఎంత దిగజారిన మాటలు మాట్లాడాడో ప్రజలకు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని ఎలా విమర్శించావో తెలియంది కాదు. సవాళ్ల మీద సవాళ్లు చేసి, తొడగొట్టి కుటిల మాటలు మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పుడు నోరు ఎందుకు పెగలడం లేదు. తాజాగా ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో కూడా నిద్రపోతలేనని దొంగ ఏడుపులు ఏడ్చాడు. తనకేదో అన్యాయం జరిగిపోతోందని పెడబొబ్బలు పెట్టాడు. ఇప్పుడు అమ్మాయిలకు అన్యాయం జరిగితే మల్లారెడ్డి నోరెందుకు మెదపడం లేదు! స్వయంగా తన కాలేజీలోనే దుర్మార్గం చోటు చేసుకుంటే జనం ముందుకు ఎందుకు రావడం లేదు. మల్లారెడ్డి కాలేజీలో మానవమృగాలున్నాయని తేలిపోయింది. అమ్మాయిల జీవితాలను ఆగం చేసే దుష్టులున్నారని తెలుస్తోంది. ఆ వీడియోలు బైటకు వెళ్లిపోయాయని అంటున్నారు? వీటికి నైతిక బాధ్యత మల్లారెడ్డిది కాదా? మల్లారెడ్డి కాలేజీలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ ఆయన బాధ్యత కాదా? ఫీజుల వసూలు చేసుకొని దాచుకోవడం వరకే మల్లారెడ్డి పాత్రనా? స్వయంగా తన కాలేజీలో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న దుర్మార్గులున్నారని ఇంత వరకు మల్లారెడ్డికి తెలియదంటే నమ్మగలమా? వివాదాల మల్లారెడ్డి కాలేజీలో వికృతచేష్టలు! జరుగుతున్నాయన్న సంగతి తెలియకుండా వుంటుందా? అందుకే మల్లారెడ్డి రెడ్డి పని మటాష్‌! మహిళా కమిషన్‌ చాలా సీరియస్‌గా వుంది. ఇంత జరుగుతున్నా మల్లారెడ్డి మౌనం అంగీకారమే లెక్క అని చెప్పకతప్పదు. తప్పుల మీద తప్పులు మల్లారెడ్డి చేస్తున్నాడు! అందుకే రంగంలోకి మహిళా కమిషన్‌ దిగింది. నిజానికి ఆ మధ్య భోజనాల విషయంలోనే మహిళా కమిషన్‌ రంగంలోకి దిగుతుందనుకున్నారు. ఆడపిల్లల స్నానాల గదుల్లో కెమెరాలు అమర్చినట్లు తేలడమే కాదు 300లకు పైగా వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలను విద్యార్థులు వార్డెన్‌ ప్రీతి రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆమె చెప్పిన తల తిక్క సమాదానాలు చెప్పింది. పైగా అమ్మాయిలు బాత్‌ రూమ్‌లలో ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలున్నాయనే ఏర్పాటు చేసినట్లు కూడా ప్రీతి రెడ్డి అన్నట్లు కొందరు విద్యార్థులు చెప్పడం జరిగింది. లక్షలు పోసి ఇంజనీరింగ్‌ విద్య చదివే అమ్మాయిలు ఉరి వేసుకోవడానికి కాలేజీలకు వస్తారా? విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి వుండడానికి ఇంటర్‌ కాలేజీ కాదు. ఇంజనీరింగ్‌ చదివే అమ్మాయిలు అంత బలహీనమైన ఆలోచనలు చేయరు. ఇంజనీరింగ్‌ విద్య అంత ఒత్తిడితో కూడుకున్న చదువు కాదు. ఆడుతూ పాడుతూ నాలుగేళ్లు పూర్తి చేస్తారు. అలాంటి ఇంజనీరింగ్‌ అమ్మాయిలు ఏదైనా అఘాయిత్యం చేసుకునే పరిస్థితులు సృష్టించబడితే తప్ప అంత తొందరగా బలహీనమైన నిర్ణయాలు తీసుకోరు. అలాంటిది వార్డెన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటేనే అందులో ఏదో మర్మం వుందని అర్థం చేసుకోవచ్చు. ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయి అయినా ఇలాంటి వీడియోలు బైటకు వస్తే బతికే అవకాశం వుండదు. అంటే ఇలాంటివి తమ కాలేజీలో జరిగే అవకాశం వుందని వార్డెన్‌ అనుకున్నారా? వీడియోలు బైటకు వచ్చే ప్రమాదముందని ముందే గ్రహించారా? అనే విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం వుంది. వార్డెన్‌ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే తప్ప అసలు నిజాలు వెలుగు చూడవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!