రాజకీయాలతో దెబ్బతింటున్న టి.టి.డి. ప్రతిష్ట

 

భగవంతునికి`భక్తునికి మధ్య రాజకీయులే అడ్డుగోడలు

భక్తికి స్థానం లేదు…అంతా ఆధిపత్యమే

టిటిడీకి వైరస్‌గా మారిన కుల రాజకీయాలు

భక్తులకు నిలువుదోపిడి`స్వామికి శఠగోపం

‘అయ్య’పేరు చెప్పి అంతా దండుకోవడమే

టి.టి.డి.ని హిందూ సంస్థలు నిర్వహిస్తేనే సముచితం

ప్రభుత్వ పెత్తనంతో భక్తి మటుమాయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలాతిరుపతి, భక్తి సౌరభాలతో పరిమళించాల్సింది పోయి, రాజకీయ దుర్గంధంతో ముక్కుపుటాలను ఎగరేస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీలో టీటీడీ అధికార్ల నిర్వాకం కారణంగా ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంతోమంది గాయాలపాలై చికిత్సపొందుతున్నారు. ఇందుకు ప్రధా నంగా వెలెత్తి చూపాల్సింది ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడి అసమర్థ నిర్వాకాన్ని, చేతకానితనాన్ని మా త్రమే. ఎందుకంటే గతంలో ఏ టీటీడీ ఛైర్మన్‌ హయాంలో కూడా ఇంతటి ఘోరం జరగలేదు. ‘తొక్కిసలాట దురదృష్టకరం. జరిగిన దానికి చింతించడం తప్ప ఏం చేయలేం. పోలీసులే అంతాచూసుకుంటామని చెప్పారు’ వంటి మాటలు చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని, భక్తుల పట్లఅయనకున్న నిర్లక్ష్యాన్ని, భగవంతుడి పట్ల భక్తిభావం లేకపోవడాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. భక్తులకు అన్ని ఏర్పాట్లు, వారికి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుం టూ అధికార్లకు దశానిర్దేశం చేయాల్సిన టి.టి.డి.ఛైర్మన్‌ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? భక్తులుమరణిస్తే కనీసం వారిపట్ల సానుభూతి లేదు సరికదా, తాను పూర్తిగా బాధ్యత వహించాల్సి అంశాన్ని పోలీసులపైకి నెట్టేసి చేతులు దులుపుకోవడం ఆయన నిర్లక్ష్యానికి, దేవుడంటే భయంలేని తనానికి నిదర్శనం. ఇది చాలు ఆయన టి.టి.డి.ఛైర్మన్‌ పదవికి ఎంతమాత్రం అర్హుడు కాదని చెప్పడానికి. సమర్థుడైన నాయకుడు తన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి వెనుకాడడు అనేదానికి తెలంగాణ మాజీ మంత్రి కె.టి.ఆర్‌. గొప్ప ఉదాహరణ ఈ ఫార్ములా రేసు నిర్వహణకు తానే ఆదేశా లిచ్చానని ఎ.సి.బి.విచారణలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మంత్రి హోదాలో విచక్షణాధికా రంతోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పడం ఆయనలోని సమర్థనాయకత్వ లక్షణాన్ని వెల్లడిస్తోంది. మరి ఇక్కడ టి.టి.డి. ఛైర్మన్‌ సంఘటన తప్పిదాన్ని తనపై వేసుకోవడానికి ముందుకు రాలేదు. బాధ్యత వహించాల్సిన పోస్టులో ఉన్నది ఆయనే మరి! మరొకరు కాదు!

ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి అధికారదర్పంతో ఎవరినీ విడిచిపెట్టమని హూంకరించి, కొందరు అధికార్లను సస్పెండ్‌ చేయించి, మరో ఇద్దరిని బదిలీ చేసి మృతులకు నష్టపరిహారం ప్రకట చేయించి హడావుడిచేసి వెళ్లిపోవడం తప్ప, జరిగిన సంఘటనపై ఆయనలో కించిత్‌ బాధ కని పించలేదు. చర్యలు తీసుకున్నామని ప్రజలకు చూపడానికి మాత్రమే అన్నట్టుగా ఆయన పర్యటన సాగింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దుర్ఘటన జరిగిన వెంటనే తిరుపతి వెళ్లారు, బాధితులను పరామర్శించారు, పరిస్థితిని సమీక్షించారు. చివరకు ‘ఉప ముఖ్యమంత్రి హోదాలో తప్పు ఒప్పుకుంటున్నా. పారిపోవడంలేదు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి, వెంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెబుతున్నా’ అని చెప్పారు. జరిగిన సంఘటనకు తనకు సంబంధం లేకపోయినా ఆయన తనకు తగిన రీతిలో స్పందించడం ‘పరిణితి’ని, ‘ప్రాప్తకాలజ్ఞత’ను తెలియజేస్తోంది. సహజంగానే వినేవారికి, చూసేవారికి పవన్‌ కళ్యాణ్‌లో ఒక పరిణిత నాయకుడు కనిపిస్తాడు తప్ప, అహంభావం, అధికారదర్పం కనిపించవు. తిరుపతి వెంకన్నతో పెట్టుకుంటే ఎట్లా వుంటుందో చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ ప్రతి విషయాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం మాత్రమే ఆయనకు అలవాటు తప్ప మిగతా విషయాలపై ఆయన పట్టించుకోరు. ఆయన సమక్షంలోనే టీటీడీఛైర్మన్‌, ఈవోలు దూషించుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిల నియామకం విషయంలో బాబు తీసుకున్న ‘కమ్మ’టి నిర్ణయం ఇంత నిప్పచ్చరంగా మారింది. ఈ వో శ్యామలరావును కూడా ఆయనే నియమించినప్పటికీ ఈ ఎపిసోడ్‌లో బాబు మద్దతు తన సామాజిక వర్గానికే వుంటుందన్నది నిష్టుర సత్యం. ఆంధ్రలో కులపిచ్చి రాజకీయాలు ఏనాడో ముదిరి పాకాన పడ్డాయి. ఇప్పుడది టీటీడీకి చేరింది. కమ్మ వర్సెస్‌ రెడ్డి రాజకీయాలు తితితే పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. భక్తికి కులం వుండదు. ఆ భగవంతుని దృష్టిలో అంతా సమానమే! ఏ పనిలో నైపుణ్యం వున్నవారిని ఆపనిలో పెడితే దానికి న్యాయం జరుగుతుంది. నడపడం రానివాడిని డ్రైవర్‌ని చేస్తే ప్రమాదాలు, ప్రాణాలుపోవడాలు జరుగుతాయి. ఇప్పుడు తిరుపతిలో జరిగిందిదే. పాలనా దక్షత ముఖ్యం ‘కులం’ లేదా ‘డబ్బు’ కాదన్న సత్యం మరోసారి స్పష్టమైంది.

ప్రస్తుత సంఘటన నేపథ్యంలో తిరుపతి జేఈఓ, తిరుపతి ఎస్పీ, సీఎస్వోలపై బదిలీవేటు పడిరది. క్రైమ్‌ డి.ఎస్‌.పి, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. వీరెవ్వరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కాదు. ఇక్కడ విచిత్రమేమంటే సంఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సింది ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు. ఇంత ఘోరం జరిగితే తక్షణమే ఆయన్ను పదనినుంచి తొలగించాలి లే దా విచక్షణతో ఆయనే రాజీనామా చేయాలి. ఇక్కడ కులం కాదు ప్రధానం. తప్పు చేసిందెవరు? ప్రధాన బాధ్యత వహించాల్సిందెవరు? అన్న అంశాలను మాత్రమే! ఇందులో కులం ప్రసక్తి వుం డకూడదు. పరిస్థితి చూస్తుంటే తాను నియమించారు కాబట్టి శ్యామలరావును ఏమనలేక బాబు మిన్నకుండి వుండవచ్చు. అలా కాకపోతే ఈపాటికే ఆయన బదిలీ జరిగిపోయి వుండేది.
గత ప్రభుత్వ హయాంలో ప్రతి చిన్న సంఘటనకు మతం పేరు చెప్పి జగన్‌ను బదనాం చేయడానికే ప్రయత్నించారు. జగన్‌లో లోపాలున్నా, ఆయన దేవుడి పట్ల భయభక్తులు ప్రదర్శిస్తారు. అ న్యమత ప్రచారంపై ఆరోపణలున్నప్పటికీ, అవి జగన్‌ కాలంలో వచ్చినవి కావు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా కొనసాగినవే! ప్రస్తుత నాయకత్వం ఎవరికీ దేవుడంటే భక్తి, భయం వున్నట్టు లేదు! ‘డబ్బు’ ‘అధికారం’ మాత్రమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

లడ్డూ రాజకీయం చేసి కెలికిందీ చంద్రబాబే. అది బూమరాంగ్‌ అయింది. విజయవాడలో వరద ల సమయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపించినా మీడియో హోరులో ప్రతిష్ట దిగజారకుండా కాపాడుకున్నారు. ఇప్పుడు టి.టి.డిలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈప్రమాదం విషయంలో ఆయన తన సామాజిక వర్గం వారిని వెనుకేసుకొచ్చే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ తప్పు ఒప్పుకుంటున్నానంటూ చేసిన ప్రకటన మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి బాగా వెళు తుంది. ఈ సందర్భంగా ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు రాజకీయపరంగా వున్నప్పటికీ, తొలుతగా ఆయన ‘క్షమాపణలు’ కోరడం ఆయనలోని ‘నిరంహకార’ తత్వాన్ని వెల్లడిరచింది. ఇదే పని చంద్రబాబు నాయుడు లేదా బి.ఆర్‌.నాయుడు చేయలేదు. అది వారి నైజం. ఇప్పుడు చంద్ర బాబు తాను నిజమైన పాలనాదక్షుడిని అని నిరూపించుకోవాలంటే తక్షణమే టి.టి.డి.ఛైర్మన్‌ బి.ఆర్‌. నాయుడిచేత రాజీనామా చేయించాలి. ఈవో, అదనపు ఈవోలను బదిలీ చేయాలి. ఆవి ధంగా పైస్థాయిలో సమన్వయంతో పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాను సమర్థ నాయకుడిగా గుర్తింపు పొందుతారు. పర్యటనలో హడావుడి ప్రదర్శించి మృతులకు ఒకొక్కరికి రూ.25లక్షలు టి.టి.డి. నుంచి నష్టపరిహారం ప్రకటించి, ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొకరికి రూ.5లక్షలు, మరో 33 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షలు చెల్లిస్తామన్నారు. ఈ మొత్తాలను తిరుమల తిరుపతి దేవస్థానం చెల్లిస్తుంది. మరి దేవాలయానికి వచ్చే ఆదాయం భక్తులనుంచే కదా! అంటే భక్తుల డబ్బులే భక్తులకు ఇచ్చారన్నమాట! ఇదే హిందూమత సంస్థ ఆధ్వర్యంలో దేవాలయం నడిచి నట్లయితే ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం వుండేది కాదు! ఏవిధంగా చెప్పొచ్చంటే, ఇటీవల విజయవాడ సమీపంలో జరిగిన హైందవ సభకు అన్ని లక్షలమంది హాజరైనా ఎంతటి క్రమశిక్షణతో నిబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే.ఆలయాలు కూడా హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో జరిగితే వాటి గౌరవం ప్రతిష్ట, భక్తి ప్రపత్తులు చక్కగా పరిఢవిల్లుతాయి.రాజకీయ పార్టీల ఆధీనంలోకి హిందూ ఆలయాలు వెళితే ఏం జరుగుతుందో, ప్రతిష్ట ఎంత గా మంటగలిసి పోతుందో తితితే గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!