Farmer Unity is True Strength
సహకార భావం రైతు బలం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోరైతు వేదికలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఒక్క రైతు కంటే సమిష్టి రైతు శక్తి ఎంతో గొప్పది. రైతుల ఐక్యతతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది అని పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతం, రైతుల ఐక్యత, ఎఫ్పీఓల ఎఫ్ పి ఓ ఎస్ ద్వారా సమిష్టి మార్కెటింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వినియోగం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, చెల్పూర్ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
