Grand Birthday Celebrations for Payam Venkateswarlu
పినపాక శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గుండాల,నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో యువజన నాయకుల నాయకత్వం లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోంబోయిన ముత్తయ్య,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కె ఖదీర్ ముఖ్య అతిధులు గా వచ్చారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రజా సేవ చేస్తూ గ్రామ పంచాయతీ స్థాయి నాయకుడి నుండి ఎమ్మెల్యే గా ఎదిగి ఎన్నో ఒడిదోడుకులు తట్టుకుని ప్రజల క్షేమమే తన జీవిత లక్ష్యం అని భావించిన మృధుస్వభావి, నిగర్య పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే జీవించె వ్యక్తిత్వం వారిది, శాసనసభ్యులు గా ఎదిగి అటు నియోజకవర్గం లో ఇటు మండలంలో పాయం నాయకత్వం లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది అని ప్రజలకు ఎలాంటి ఆపద ఉన్నా అన్నా అంటే నేను ఉన్నా అని అందరికీ అందుబాటులో ఉంటూనే మండలానికి కావాల్సిన సీసీ రోడ్లు గాని బీటి రోడ్లు గాని ప్రజలకు ఎలాంటి వసతులు కావాలన్నా చేసి పెట్టె అభివృద్ధి ప్రదాత మన పాయం వెంకటేశ్వర్లు లని వారు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ జీవితంలో అనేక ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం గుండాల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి బాణా సంచా పెల్చుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ దవఖానా లో రోగులకు పండ్లు, బ్రేడ్ పంచడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, సాయనపల్లి సర్పంచ్ కల్తీ కృష్ణవేణి, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు, రోళ్లగడ్డ సర్పంచ్ భూక్య మంగమ్మ, వార్డ్ సభ్యులు పూనెం లక్ష్మి, ఈసం చంద్రయ్య, జాటోత్ వీరన్న, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, భూక్య శ్రీను, రోళ్లగడ్డ జీపి మాజీ సర్పంచ్ అజ్మీరా మోహన్, ముత్తాపురం,మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, అబ్దుల్ నభి, కాసీం, వాజీద్ పాషా, బొర్రా వెంకటేశ్వర్లు, బోడ వెంకటరామ్, ఊకె బాబురావు, జోగ రమేష్, పదుగోనిగూడెం మాజీ ఉప సర్పంచ్ పెండకట్ల పాపారావు, ఎస్కె ఇశ్రార్, బొంగు చంద్రశేఖర్, గడ్డం రాజేష్, కీసరి సాగర్, మోహన్, అరెం నరసింహారావు,బానోత్ నరేందర్, మహిళా నాయకులు తిర్రి సుగుణ, సోషల్ మీడియా సభ్యులు మండలోజు కిరణ్, నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
