ఎవడైతే నాకేంటి!?

`దొంగ మిల్లర్‌ జగన్‌ ‘‘బడివె’’ మాటలు!

`నా మిల్లులను టచ్‌ చేసే దమ్ముందా!

`అందరూ నా సొమ్ము తిన్నోళ్లే!

`ఎవడొస్తాడో రాని చూస్తా!

`500000 వడ్ల బస్తాలు లెక్కకున్నాయా?

`28 వేల బస్తాలల్లో 2000 పైచిలుకు బస్తాలు మాయం! మరి 500000 బస్తాలలో ఎన్ని బస్తాలు మాయం చేసినట్లు!

`ఆ రెండు మిల్లులకు కేటాయించిన 500000 బస్తాల లెక్కలు తేల్చండి!

`జగన్‌ బండారం బైట పెట్టండి.

`రైతులను మోసం చేసిన మిల్లులను మూసేయండి!

`అధికారులు, నా సొమ్ము తిన్న వాళ్లకు అంత ధైర్యముందా? అని సవాలు విసురుతున్నాడు.

`హనుమకొండ ‘‘జెసి’’ కోరిన రిపోర్ట్‌పై ఇప్పటివరకు స్పందించని, డీఎస్‌ఓ కొమురయ్య,సూపరిండెంట్‌ రోజారాణి,డిటి నాగేంద్ర ప్రసాద్‌..

`వరంగల్‌ మిల్లర్ల అవినీతిపై ఖమ్మం జెసి సివిల్‌ సప్లై కమిషనర్‌ కి సమర్పించిన ఆధారాలు.

`ఆ మహిళా అధికారికి గుణం కన్నా కులమే ముఖ్యమట? 

`మిల్లర్‌ జగన్‌ను కాపాడే తీరుతుందట?

`హనుమకొండ అధికారుల తీరుపై విస్తుపోతున్న ఖమ్మం అధికారులు.

`తనపై చర్యలు తీసుకుంటే అందరి గుట్టు బయట పెడతానంటున్న జగన్‌.

`జగన్‌ మిల్లుల్లో ఉన్న లక్షల వడ్ల బస్తాలని ఇతర మిల్లులకు తరలించాలని ఖమ్మం జేసి. ఆదేశాలు.

`అధికారులను అమ్మనా బూతులు తిడుతున్న జగన్‌?

`ఆ విషయం తెలిసినా చీమ కుట్టినట్లు కూడా లేని అధికారులు?

`ఖమ్మం జేసి ఎంక్వౌరీకి ఆదేశించి 15 రోజులకొస్తోంది?

`ఇంత వరకు హనుమకొండ ‘‘జెసి’’ కి ట్రక్‌ షీట్లు కూడా అందించని అధికారులు.

`5 లక్షల బస్తాల లెక్కలెప్పుడు తేల్చుతారు! జగన్‌ బండారం ఎప్పుడు బైట పెడతారు!

`జగన్‌ అక్రమ సంపాదన ఎప్పుడు వెలికితీస్తారు?

`రైతులకు న్యాయం ఎప్పుడు చేస్తారు?

`ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన వడ్లతోనే రూ.20 లక్షల మోసం చేసిన జగన్‌?

`20 ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో ఎంత మాయం చేసి వుంటారు?

`ఎన్ని కోట్లు వెనకేసుకొని వుంటాడు?

`అంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులంతా గప్‌ చుప్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

తవ్వుతున్నా కొద్ది హన్మకొండలోని ఓ అక్రమ మిల్లర్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అధికారుల అండదండలతో విచ్చలవిడిగా ఆ అక్రమ మిల్లర్‌ సాగిస్తున్న అక్రమ దందాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మిల్లర్‌ బాగోతాలపై నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూనేవుంది. ఆ వార్తలు వాస్తవాలను అంగీకరిస్తూ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండ అదికారులకు సూచిస్తూ నోట్‌ కూడా పంపించారు. ఆ నోట్‌ హన్మకొండ జిల్లా అధికారులకు చేరి కూడా సుమారు 15 రోజులౌతోంది. అయినా హన్మకొండ జిల్లా యంత్రాంగం కదిలింది లేదు. ఉలుకు లేదు. పలుకులేదు. పైగా అక్రమ మిల్లర్‌కు జగన్‌కు వంతపాడుతున్నారు. అండగా వుంటున్నారు. అతనికి తప్పించుకునేందుకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. ఆఖరుకు ఖమ్మం జిల్లా జేసినే బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే జగన్‌ వద్ద నుంచి లెక్కలేనంతసొమ్ము అదికారులు ఎప్పటికప్పుడు అందుకున్నారు. జగన్‌తో లాలూచీ పడ్డారు. అందుకే జగన్‌ ఇటీవల ఓ ఫంక్షన్‌లో అధికారులపై బూతులు సందించినట్లు కూడా విశ్వసనీయ సమచారం. ఆ ఫంక్షన్‌లో జగన్‌ మీద వస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? ఎవడొచ్చి నన్ను ఏం చేస్తారు? అంతా నా గుప్పిట్లో వున్నారు. నా చేతిలో వున్నారు. నేను చెప్పింది మాత్రమే వాళ్లు వినాలి. లేకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలుసు. అంటూ అదికారులన్న మర్యాద కూడా లేకుండా బూతులు సందిస్తూ ఆ ఫంక్షన్‌లో జగన్‌ హంగామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. నన్ను..నా మిల్లును టచ్‌ చేసే దమ్ము ఎవరికి వుంది? నా మిల్లు దగ్గరకు వచ్చిన మాట్లే ధైర్యం వాళ్లకు వుందా? అంటూ సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, కింది నుంచి పై స్దాయి దాక అందరూ నా సొమ్ము తిన్నవాళ్లే..నేను వేసే బిస్కట్లకు ఆశపడేవారే..అలాంటి వాళ్లు నా జోలికి వస్తారా? సివిల్‌ సప్లైకి చెందిన విజిలెన్స్‌ అయినా, ఎవరైనా సరే నా మిల్లుల కాంపౌండ్‌లోకి రాలేరు. ఎవడొస్తారో..రాని చూస్తా? అంటూ జగన్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జగన్‌కు కేవలం 28వేల బస్తాల వడ్లే వచ్చినట్లు అనుకుంటున్నారు. కాని నిజానికి 2024`25 తొలి సీజన్‌లోనే సుమారు 5లక్షల వడ్ల బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ ఖమ్మం జిల్లాలకు చెందిన వడ్లు కావడం విశేషం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన రైతులు ఎవరూ మిల్లర్‌ జగన్‌కు వడ్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒక వేళ ఇచ్చినా ముందు మురిపెంగా మాట్లాడే జగన్‌ తర్వాత ఎంత కోతలు కోస్తాడో..రైతులను ఎంత ముంచేస్తాడో అందరకీ తెలుసు. అందుకే జగన్‌ మిల్లులకు ఏ ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి కూడా జగన్‌కు వడ్లు ఇవ్వడానికి రైతులు అసలే ఒప్పుకోరు. అందుకే మిల్లర్‌ జగన్‌ ఖమ్మం జిల్లాకు చెందిన ఐకేపి సెంటర్ల నుంచి వడ్లు తెచ్చుకుంటాడు. ఖమ్మం జిల్లాకుచెందిన ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన 28వేల బస్తాలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేసినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. అది నిజమే అని ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ నిర్దారణ చేశారు. ఆ బస్తాలు ఏమయ్యాయో? వెంటనే రిపోర్టు కావాలని కోరిన సందర్భం కూడా వుంది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ఇప్పటి వరకు కదల్లేదు. అయితే జగన్‌ అక్రమ దందాలపై నేటిధాత్రి మరింత దృష్టిపెట్టడంతో ఖమ్మం జిల్లాలోని సుమారు 20 ఐకేపి సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 5లక్షల వడ్ల బస్తాలు జగన్‌ మిల్లులకు చేరినట్లు సమాచారం. 28వేల బస్తాలతోనే సుమారు 2వేల బస్తాలు మాయం చేసిన జగన్‌, 5లక్షల బస్తాలలో ఎంత మాయి చేసి వుంటాడో అర్ధం చేసుకోవచ్చు. 28వేల బస్తాలలో మాయం చేసిన 2వేల బస్తాల మూలంగా జగన్‌ 20లక్షల రూపాయలు రైతులను మోసం చేశాడు. అంటే 5లక్షల వడ్ల బస్తాలలో జరిగిన మాయంతో ఎన్ని కోట్లు కొట్టేశాడన్నది ఇప్పుడు లెక్క తేలాల్సి వుంది. ఇలా జగన్‌ చేస్తున్న మోసాలన్నీ హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు, రైతులకు పూర్తిగా తెలుసు. అయినా ఎవరూ మాట్లాడానికి ముందుకు వచ్చేవారు కాదు. జగన్‌ అరచకాలు అలా వుండేవి. గత ప్రభుత్వ హాయాంలో కులం పేరు చెప్పుకొని ప్రాపకం పొందేవాడు. ఇప్పటికి కూడా అదే సాగిస్తునాన్నాడు. ఆనాటి నుంచి జగన్‌ కనుసన్నల్లో వున్న అధికారులే ఇప్పటికీ వుండడంతో ఆయన ఆటలకు అడ్డు కట్ట పడడం లేదు. జగన్‌ మోసాలను ఎవరూ బైట పెట్టడం లేదు. పైగా జగన్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం జేసిని బురిడీకొట్టించాలని చాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి చేసిన స్కెచ్‌ జగన్‌, హన్మకొండ అదికారులు పసిగట్టకపోవడంతో అసలు బండారం బైట పడిరది. అయితే రెండు వేల బస్తాలకు సంబందిచిన సొమ్ము అందడంతో కాస్త ఆలస్యమైంది. అందుకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన సొమ్ము రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పమని జగన్‌కు హన్మకొండ అదికారులు సూచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఇంత జరుగుతున్నా జగన్‌ది అక్రమమని అనేందుకు కూడా హన్మకొండ అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఖమ్మం జేసి రిపోర్టునే తొందరపాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన రెండుమిల్లలకు ఎన్ని బస్తాల వడ్లు చేరాయో లెక్కలు తేల్చే పనిలో ఖమ్మం జిల్లా అదికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటి వరకు అందినసమాచారం మేరకు జగన్‌కు చెందిన మిల్లులకు ఇప్పటికే 5లక్షల బస్తాలు చేరినట్లు ప్రాధమిక సమచారం. ఇంకా లోతుగా తవ్వితే ఎంత చేరిందనేదానిపైకూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. జగన్‌కు ఇప్పుడు అసలైన భయం మొదలైంది. హన్మకొండ అదికారులను గుప్పిట్లోపెట్టుకొని ఆడినట్లే ఖమ్మం జిల్లా అధికారులను కూడా కొనేయాలనిచూశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి నిక్కచ్చిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. జరిగిన అక్రమ దందాలన్నీ బైట పెట్టాలనే చూస్తున్నారు. జగన్‌ వల్ల రైతులు ఎంతో మోసపోయారని గుర్తించారు. ఆ సొమ్ముంతా రైతులకు చేరేలా చూడాలనుకుంటున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి, కమీషనర్‌ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే హన్మకొండ అధికారులు కూడా రంగంలోకి దిగక తప్పదు. జగన్‌ బండారం బైట పెట్టక తప్పదు. ఎందుకంటే అప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అలాంటి పరిస్ధితి వస్తే జగన్‌ను దోషిని చేయడం ఖాయం. కాకపోతే హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా అదికారి జగన్‌కుచెందిన సమాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో జగన్‌ను కాపాడే బాద్యత ఆమె భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అదికారికి జగన్‌ గుణం, వ్యవహారం, అక్రమ దందాలకన్నా, మోసాలకన్నా కులమే ముఖ్యమట? జగన్‌కు కాపాడి తీరుతుందట? ఈ విషయాన్ని ఆమె కార్యాలయంలో ఇతర ఉద్యోగులతో బాహంటానే చెబుతున్నారట? హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారుల తీరుతో ఖమ్మం జిల్లా అదికారులు విస్తుపోతున్నారు. ఇదేం పద్దతని తప్పుపడుతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు మేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట? రోజు రోజుకూ మితిమీరిపోతున్న జగన్‌ వ్యాఖ్యలు తెలిసిన ఖమ్మం జేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. జగన్‌కు చెందిన మిల్లుల్లో ఖమ్మం జిల్లా రైతులకు చెందిన 5లక్షల వడ్ల బాస్తాలున్నాయా? లేవా? వుంటే లెక్కంత? ఎన్ని మాయమయ్యాయి? ఎలా మయ్యామయ్యాయి? అనే వివరాలు కావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యదావిధిగా ఇతర మిల్లులకు చెందిన వడ్ల ఖమ్మం వడ్ల లెక్కలో కలపడమో? లేక ఇతర మిల్లుల గోడౌన్లలో వున్న వడ్లు జగన్‌వి అని తేల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఇంత దూరం వచ్చేదాకా అదికారులు ఏం చేస్తున్నారు? తానిచ్చిన సొమ్ములు తిని, తనకు అన్యాయం జరిగే పరిస్ధితి వచ్చేదాకా అదికారులు నిద్ర పోతున్నారా? అంటూ జగన్‌ అదికారుల మీద కూడా చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అదికారులు కదులుతారా? లేక జగన్‌కే వత్తాసు పలుకుతారా? కోట్లలో రైతులను ముంచేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.

గుండె గుడిలో ఇందిరమ్మ గూడు.

`శీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం.

`రేవంత్‌ సర్కారులో పల్లెకు కొత్త దనం.

`తెలంగాణకు సరికొత్త నిండుదనం.

`తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం!

`శీనన్న చొరవతో పేద వారి ఇంటి కలకు మోక్షం.

`ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల పండుగ

`పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక.

`ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం.

`పేదవారి కళ్లలో ఆనందం.

`పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం.

`గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం.

`పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలమంతా ఆశల మేఘం.

`ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం.

`పేదలందరికీ కాంగ్రెస్‌ అందిస్తున్న వరం.

`జీవిత కాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ పల్లెల్లో పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలైంది. పల్లె సంబురపడుతోంది. దశబ్ధానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. పదేళ్లపాలు రెండు పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి, ఊరించి బిఆర్‌ఎస్‌ ఉసూరుమనిపించింది. ఎన్నికలెప్పుడొచ్చినా రెండు పడకల ఇల్లు ముచ్చట చెప్పుడు తప్ప తీర్చింది లేదు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసిఆర్‌ ఇచ్చింది లేదు. ఎన్నొన్నో చెప్పాడు. ఆఖరుకు కేసిఆర్‌ చేతులెత్తేశాడు. మాయ మాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగొట్టుకొని పదేళ్లు పాలించి, పట్టుమని పది ఇండ్లుకూడా ఇవ్వలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ మాటంటే మాటే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్సే. సొంత ఇల్లు అనేది అందిరకీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు వుండేవి. కాని తరం మారుతున్న కొద్ది ఆ ఇండ్లు పాతబడిపోవడం. కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరుగుతుండడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని, ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతోంది. గత యాభైఏళ్ల క్రితం వరకు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక గుడిసె వేసుకొని బతికేవారు. కాని ఈ రోజుల్లో గుడిసే వేసుకునేందుకు స్ధలం లేదు. కట్టుకునే స్ధోమత లేదు. దాంతో ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు ఇస్తుందా? అని ఎదురుచూసే రోజులు వచ్చాయి. పేదలు మరింతగా ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టుకునే స్ధితికి చేరింది. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వినిపిస్తేనే పేదల కళ్లలో ఆనందం నిండుతుంది. ఇక మంజూరైన వారి ఆనందానికి అవదులు వుండవు. కాంగ్రెస్‌ అంటేనే పేదల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమని దేశమంతా అందుకే ఇప్పటికీ ప్రజలు కొనియాడుతుంటారు. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కావడం వల్ల పేదలుకు ఎంతో మేలు జరిగింది. పేదలను ఒక స్దాయికి తీసుకురావాలన్న ప్రగతికి బాటలు పడిరది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడం మొదలైంది. అయితే అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మొదలైందంటే అది నిరంతర ప్రవాహంగా సాగాల్సిందే. ఒకప్పుడు దేశంలోని భూములున్నీ అగ్రవర్ణాల చేతుల్లో వుండేవి. ప్రభుత్వం ఆదీనంలో వుండేవి. వాటన్నింటిలో నూటికి తొంబైశాతం మేర ఆ రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఇందిరాగాంధీ భూములు పంచారు. ఆ భూములను సాగుయోగ్యం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, వాటిని సాగుయోగ్యం కోసం పక్క బావులు తివ్వించారు. అలాంటి బావులు ఇప్పుడు తవ్వించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయినా ఆరోజుల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, బావులు తొవ్వించి రైతులను చేశారు. కుల వృత్తులకు పరిమితైన ఆ వర్గాలను రైతులను చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అంతే కాకుండా దేశంలోని ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అప్పుడే మొదలైంది. అలా దేశంలో కొన్ని కోట్ల మందికి ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ వల్లనే సాధ్యమైంది. పల్లె పట్టణాలు అనే తేడాలేకుండా గర్‌ కుల్‌ అనే కాలనీలు పెద్దఎత్తున వెలిసిన రోజలవి. తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దేశంలోని అనేక పట్టణాలల్లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం చేసి, ప్రజలకు నీడ కల్పించారు. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడిరాష్ట్రంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో అటు రైతులకు, ఇటు పేదలకు అనేక రకాలమేలు చేశారు. అర్హలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించారు. ప్రతి ఊరిలోనూ, పట్టణాల్లోనూ ప్రభుత్వ భూములనే సేకరించి, ప్రజల చేతికి రూపాయి ఖర్చు లేకుండా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రతి పల్లెల్లో కనీసం 50 నుంచి వందకు తక్కువ కాకుండా ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి. ప్రతి పట్టణంలో వేలాది ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు అనేకం వున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఉపాధి హమీ అమలు చేసి, ఆర్ధిక ప్రగతికి తోడ్పాటు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనటు వంటి పధకం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్‌ రెండు పడకల గదుల ఇండ్లు అనికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య కాదని ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రుజువైంది. అందుకే తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను నమ్మారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీనే గెలిపిస్తే ఇప్పటి వరకు మరో ఇరవై లక్షల ఇండ్లకు పైగా నిర్మాణం జరిగేవేమో? కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో వున్న గృహ నిర్మాణ శాఖను రద్దు చేసినప్పుడే కేసిఆర్‌ నైజం బైట పడిరది. డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్లు అనేవి మిధ్యఅనేది తేలిపోయింది. కాని జనం కేసిఆర్‌ ఇస్తారన్న నమ్మకాన్ని రెండోసారి కూడా పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వడానికి సుముఖతచూపలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని నమ్మించి, గృహనిర్మాణ శాఖను వదిలించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆ శాఖను మూసేయించారు. దాని మనుగడ లేకుండా చేశారు. ఈ వాదన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. ఆ సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చిన్న పొరపాట్లు జరిగడం సహజం. అయినా ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా? అని కూడా అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని చెప్పి, అప్పటి ప్రతిపక్షాల నోరు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఇచ్చారు. కాని బిఆర్‌ఎస్‌కు సాద్యం కాలేదు. ఇవ్వాలన్న మనసు కేసిఆర్‌కు రాలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో కనిపించిన పండుగ మళ్లీ మొదలైంది. పల్లెల్లో పెద్దఎత్తున పండుగ వాతారణం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడిక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతంవున్న పరిస్ధితుల్లో ఊరుకి పది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14వేల గ్రామాలున్నాయి. పట్టణాలు 600లకు పైగా వున్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం రెండు లక్షలకు పైగా ఇండ్లు ఏక కాలంలో పూర్తయ్యే అవకాశం వుంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్దాయిలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు జరిగితే మూడేళ్లలో కనీసం 15లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగొచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం వుంది. ప్రతి పల్లెలోనూ కనీసం రెండు నుంచి మూడు వందల కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే సాద్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా ప్రజలకు హమీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాదినుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వ నిబద్దతకు నిరద్శనమని చెప్పొలి. పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతినియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4వేల ఇండ్ల నిర్మాణం మొదలైంది. మరో రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి, ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయంకూడా ఆసన్నమౌతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ చెప్పకతప్పదు.

తప్పిస్తే ఎంతిస్తావ్‌? తూకమెంత తూగుతావ్‌??

-అడిగినంత ఇస్తే అన్నీ మేం చూసుకుంటాం?

-అవసరమైతే ఖమ్మం జేసి రిపోర్ట్‌ తప్పని నోట్‌ పంపిస్తాం!

-జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం?

-సమస్య నుంచి పూర్తిగా బైట పడేస్తాం?

-కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం!

-మిల్లర్‌ జగన్‌తో అధికారుల బేరసారాలు?

-నేటిధాత్రి కథనంతో నీ పని ఔట్‌..? అంటూనే తూకమెంత అంటున్నారు?

-అన్ని శాఖ అధికారులు నేటిధాత్రి పేపర్‌ చూపించి జగన్‌ తో మంతనాలు?

-నేటిధాత్రి వార్త ఒక్కటి చాలు!

ఖమ్మం జేసి చేసిన పని అందరూ హర్షిస్తుంటే హన్మకొండ అధికారులు బేరాలు చేసుకుంటున్నారు?

-నా ఒక్కడి వల్ల కాదు..మిగతా మిల్లర్లతో కలిపి ఇస్తానని జగన్‌ హామీ.

-సివిల్‌ సప్లయ్‌ హన్మకొండ అధికారుల దిగజారుడు తనానికి పరాకాష్ట!

-రైతులను మోసం చేసిన జగన్‌కు వత్తాసు పలుకుతున్నారు.

-జగన్‌ బేరం ఒప్పుకుంటే ఖమ్మం జేసిదే తప్పని నిరూపిస్తాం?

-ఆదర్శంగా వుండాల్సిన అధికారులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు.

-రైతులను మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

-మిల్లర్లు, అధికారులు కుమ్మక్కైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.

-మిల్లర్‌ జగన్‌ దోపిడీని ఎవరూ ఆపలేరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
హన్మకొండలోని సివిల్‌ సప్లయ్‌ అధికారులు అవినీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. శాఖ సాక్షిగా తప్పులుచేస్తారు. మిల్లర్లచేత తప్పులు చేయిస్తారు. తమ తప్పు లేని నిరూపించే ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన మిల్లర్లను తప్పిస్తారు. ప్రతిసారి మాకేమిస్తారని మోసం చేసిన మిల్లర్లకు అండదండలందిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన అదికారుల ఘనకార్యమని అందరూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద సంఘటన జరిగింది. తెలంగాణలో ఈ సీజన్‌లో సన్న వరి రకాలను రైతులు రికార్డు స్ధాయిలో పండిరచారు. అందులో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 92శాతం సన్న వడ్లు పండిరచారు. దాంతో ఐకేపి సెంటర్లకు పెద్దఎత్తున వడ్లు వస్తున్నాయి. వాటిని మిల్లులకు పంపించడానికి ఆ జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో పొరుగున వున్న హన్మకొండ జిల్లా రైస్‌ మిల్లులకు ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఓ యాభై లారీల వడ్లను పంపించారు. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ సూచించిన మిల్లులకు ఆ లారీలు చేరాలి. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన మిల్లులకు ఆ వడ్లు చేరలేదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అదికారులకు అనుంగుడైన, అత్యంత సన్నిహితుడైన జగన్‌ అనే మిల్లులకు చేరాయి. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన వడ్ల బస్తాలకు, రైతులకు అందిన సొమ్ముకు మధ్య ఏదో తేడా కనిపించింది. దాంతో ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆరా తీశారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల బస్తాలలో సుమారు 2000వేల బస్తాలను హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌ మాయం చేశాడు. ఈ విషయం పసిగట్టిన జాయింట్‌ కలెక్టర్‌ బస్తాల మాయంపై సంబందిత జగన్‌కు చెందిన మిల్లులకు తఖీదులు జారీ చేశారు. దాంతో జగన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జగన్‌ మాయం చేసిన వడ్ల బస్తాల గురించి ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌కు ఎలా తెలిసిందని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. ఇరుక్కున్నానని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిందేమిటంటే ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి బస్తామీద దాని బరుకు చెందిన తూకం రాయించారు. ఈ విషయాన్ని మోసం చేసిన మిల్లర్‌ జగన్‌ పసగట్టలేదు. హన్మకొండ జిల్లాకుచెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులు గుర్తించలేదు. వచ్చిన లారీల నుంచి వడ్లు దించుకున్నామా? అందులో నుంచి 2వేల బస్తాలు మాయం చేశామా? అన్నట్లు జగన్‌ ఆత్రపడ్డారు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. తన బాధను హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అదికారుల ముందు పెట్టాడు. వెతకబోయిన తీర కాళ్లకు తగిలినట్లు హన్మకొండ సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ను నేటిదాత్రి దినపత్రిక వుంచారు. ఈ విషయాన్ని నేటి దాత్రి దినపత్రిక ఎప్పుడో ప్రచురించింది. ఓ తరాజులో నేటి దాత్రి దినపత్రిక పెట్టినట్లు, మరో తూకంలో ఎంత ఇస్తావ్‌ అన్న ప్రశ్నలు పెట్టేశారు. తప్పు జరిగింది. జగన్‌ తప్పుచేశాడు. కాని మాకేం తెలియదు. జగన్‌కు వడ్లు ఇవ్వడం వరకే చూసుకున్నాం. కాని జగన్‌ వడ్లు మాయం చేసిన సంగతి మా దృష్టికి రాలేదని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేసు తమ మీదకు రాకుండా పూర్తిగా జగన్‌ మీదకు తోసేసే స్కెచ్‌ వేశారు. దాంతో జగన్‌ అదికారుల కాళ్లా వేళ్లా పడే పరిస్దితి వచ్చింది. ఇదే సరైన అవకాశం అనుకున్నారు. తప్పిస్తే ఎంతిస్తావ్‌ అనే బేరానికి వచ్చారు. తూకమెంత తూగుతామని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అడిగినంత ఇస్తే తప్ప నిన్ను రక్షించలేమంటూ జగన్‌కే తెగేసి చెప్పేశారు. మేం అడిగింది తూకంలో వేస్తే అన్నీ మేం చూసుకుంటామని జగన్‌కు అదికారులు భరోసా ఇచ్చారు? హన్మకొండకు చెందిన అదే సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఖమ్మం జేసి ఇచ్చిన రిపోర్టు తప్పని తాము నోట్‌ చేస్తామని, సమాదానం పంపిస్తామని జగన్‌కు చెప్పారు. ఈ విషయంలో జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం. ఎలాంటి కేసు జగన్‌ మీదకు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యంగా నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన కథనంతో జగన్‌ ఇక నీపని ఔట్‌ అంటూ బెదించారు. కేసులు ఎదొర్కొక తప్పదని భయపెట్టారు. నిన్ను లోపలికి పంపించేందుకు నేటి దాత్రి ఒక్క వార్త చాలంటూ జగన్‌కు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి అటు పొల్యూషన్‌ డిపార్టుమెంటు అధికారులు కదిలారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో మూడు శాఖల అధికారులు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఊరుకుంటాయా? వాటి పని అవి మొదలు పెట్టాయి. దాంతో ఇంత మంది అధికారులకు ఏక కాలంలో సమర్పణలు అంటే నా ఒక్కడి వల్లకాదని జగన్‌ అధికారులకు తేల్చి చెప్పాడు. నాతో పాటు వున్న అన్ని మిల్లులపై కూడ చర్యలుంటాయని అదికారులు సహకరిస్తే, వసూలు చేసి ఇస్తానని జగన్‌ హమీ ఇచ్చాడు. ఇది సివిల్‌ సప్లై శాఖతోపాటు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌శాఖల దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అని ప్రజా సంఘాలు అంటున్నాయి. జగన్‌ బేరం ఒప్పుకుంటే ఏకంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దే తప్పని నిరూపిస్తామని అధికారులు అంటున్నారంటే ఎంతగా దిగజారి పోయారో అర్ధం చేసుకోవచ్చు. ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డంగా సంపాదనకు ఎగబడ్డారు. తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారిని కాపాడి సంపాదన పెంచుకుంటున్నారు. రైతులను నిండా మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మిగతా మిల్లర్లతో మాట్లాడి అదికారులు చెప్పిన మూట సమర్పించడానికి జగన్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో హన్మకొండ అదికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కైతే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కాపాడలేడన్న సామెతను నిజం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మిల్లర్‌ జగన్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయం ఖమ్మం అధికారులు తెలుసుకొని, వెంటనే రంగంలోకి దిగితే అసలు మోసగాళ్లంతా బైటకు వస్తారు. ఖమ్మం జేసి పంపిన రిపోర్టు తప్పని నిరూపించే ప్రయత్నం చేయకముందే అసలు నిజాలు బైట పెట్టి, చర్యలు చేపడితే అందరి బండారం బైటకొస్తుంది. హన్మకొండ సివిల్‌ సప్లై అదికారుల చేతి వాటమే కాదు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌ అధికారుల అవినీతి బాగోతం అంతా బైటపడుతుంది.

మామూళ్ల మత్తు వదలరా! 

లంచాలు తీసుకోకుండా బతకరా!!

`పట్టుబడిన వారిపై చర్యలేవి!

`కొలువులు పోకపోతే భయమెక్కడిది!

`శాఖ పరమైన చర్యలు అని చేతులు దులుపుకోవడమేమిటి!

`ఉద్యోగానికి ముందు పోలీసు కేసులుంటే పనికి రారు.

`ఉద్యోగంలో పట్టుబడి కేసులైనా కొలువు పోదు.

`ఇవేం చట్టాలు…చచ్చు బండలు.

`తప్పు చేశాడని కళ్ల ముందు కనిపించినా చర్యలు వుండవు.

`లంచం నేరమైనా శిక్షలుండవు.

`కేసు ఫైల్‌ చేసి అధికారులు చేతులు దులుపుకుంటారు.

`నాయకులు జోక్యం చేసుకొని కొలువులిప్పిస్తారు.

`దర్జాగా లంచావతారి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు.

`అంతకు మించి లంచాలు లేకుండా కొలువే చేయడు.

`తప్పు చేసి దొరికిన రోజే శిక్ష ఖరారు చేయాలి.

`వెంటనే విచారణ జరిపించి చర్యలు చేపట్టాలి.

`వేల మంది ఉద్యోగులు పట్టుబతున్నా భయం లేదు.

`పట్టుబడినా నష్టమేమీ లేదన్న ధైర్యం ఉద్యోగులలో పెరిగిపోయింది.

`అత్తారింటికి వెళ్లొచ్చినట్లు నాలుగు రోజులు జైలు..తర్వాత బెయిలు.

`ఉద్యోగం కోసం మరునాటి నుంచి ప్రయత్నం.

`లంచాన్ని నమ్ముకొని మళ్ళీ కొలువులో చేరడం.

`లంచావతారులకు శిక్ష అంటే ఇంతేనా!

`ఏసిబికి మరిన్ని అధికారాలు కట్డబెట్టలేరా?

`పట్టుబడిన వెంటనే చర్యలు తీసుకునే అధికారం ఇవ్వలేరా!

`వందల మంది పట్డుబడుతున్నా లాభం ఏముంది?

`కోట్లు సంపాదించుకున్న ఉద్యోగులకు భయం ఎందుకుంటుంది.

`ఒకప్పుడు నాయకులైతే చాలు తరతరాల సంపాదన అనుకునే వారు.

`ఇప్పుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు.

`కోట్లు సంపాదించుకోచ్చనుకుంటున్నారు.

`ప్రజలను రూపాయి అడగడానికి నోరు రానంత భయం కలగాలి.

`లంచం తీసుకొని దొరికిన వారి ఆస్థులన్నీ జప్తు చేయాలి.

`కఠినమైన చట్టాలు తీసుకు రావాలి.

`ఉద్యోగులంటే ప్రజలకు సేవకులు అని తెలిసి రావాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 మామూళ్ల మత్తు వదలరా? లంచాలు తీసుకోకుండా బతకలేరా? అంటూ తెలంగాణ సమాజం లంచాలవతారులైన కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. నిలదీస్తోంది. నిందిస్తోంది. తూతూ అంటూ ఉమ్మెస్తోంది. ఉందుకా బతుకులు పాడుగానని శపిస్తోంది. అయినా మారరు. మారితే ఉద్యోగులెందుకౌతారు? మారితే కోట్లు ఎలా కూడబెట్టుకుంటారు. ఎవరెన్ని తిట్టినా మారం..ఎవరెంత బాధపడినా వదిలిపెట్టం. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల అనుసరిస్తున్న ధోరణి. అసలు ఇంతగా ప్రబుత్వ ఉద్యోగులు భరితెగించడానికి కారణం కూడా రాజకీయ పార్టీలు, పాలకులు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు. అన్ని పార్టీల అలుసు..వారి అవసరాలే ఉద్యోగులను అవినీతి పరులుగా మారేందుకు కారణమయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల మందు అవినీతికి తావు లేని సమాజం నిర్మాణం చేస్తామని రాజకీయ నాయకులు , పార్టీలు ప్రతిసారి గొప్పగా చెబుతాయి. గెలిచిన తర్వాత అదే ఉద్యోగులచేత అవినీతి పనులు చేయిస్తుంటాయి. దొంగ చేతికి తాళమిచ్చి సొమ్ము పోవొద్దంటే ఊరుకుంటారా? ఇది కూడా అంతే..ప్రజలను పీడిరచకుండా, వేదించకుండా, సేవకులైన పని చేయాలని ఏ పాలకులు ఉద్యోగులను బెదించడం లేదు. అందులో చిత్త శుద్ది వుండడం లేదు. ఎందుకంటే మేం తిట్టినట్లు చేస్తాం..మీరు పడినట్లు నటించండి? అన్న దోరణితో సాగుతోంది. లేకుంటే అదికారులు ఇంత విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు? ఏ దైర్యంతో తీసుకుంటున్నారు. ప్రజల నుంచి చిన్న, చితకా పైనైనా సరే లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అవి పైసాల..లేక పెంకాసులనుకుంటున్నారా? జీతాలు లక్షల్లోకి పెరిగిన తర్వాత ఉద్యోగులు లంచాల రేట్లు కూడా పెంచేశారు. వెలల్లో వున్నప్పుడు వేలల్లో వసూలుచేసేవారు. ఇప్పుడు సగటు ఏ ఉద్యోగికి లక్షకు తక్కువ జీతం లేదు. అందుకే లంచాలు కూడా లక్షలు వసూలు చేస్తున్నారు. జీతం నెలకొక్కొసారి తీసుకంటే, లంచం రోజూ తీసుకుంటున్నారు. నెలలోనే కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు మాత్రం వాళ్ల సంపాదన వాళ్లెకే తెలియనంతగా పోయింది. వాళ్లేం వ్యాపారం చేసి సంపాదించడం లేదు. కష్టం చేసి చెమటోడ్చడం లేదు. ఏసిలో కూర్చోని సంతకం చేసేందుకు లక్షలు తీసుకుంటున్నారు. ఇంత అన్యాయమా? రైతులను వేదించుకుతింటున్నారు. వేపుకు తింటున్నారు. పీడిరచుకుతింటున్నారు. ఆఖరుకు చచ్చిన రైతు పిండాకుడు కూడా తినడానికి వెనుకాడడంలేదు. ఇంతగా ఉద్యోగులు దిగజారి పోవడం తెలంగాణ సమాజపు దౌర్భాగ్యం. అయినా ఈ రోజు భూముల ధరలు పెరిగాయంటే అది ఉద్యోగుల పుణ్యం కాదు. కష్టం వచ్చినా సరే అప్పులు చేసుకున్నారు. కష్టపడి రూపాయి,రూపాయి సంపాదించి తీర్చుకున్నారు. కాని భూములు అమ్ముకోలేదు. అలా దాచుకున్నదే భూమి. ఆ భూమి నుంచి బుక్కెడు బువ్వ రాని సమయంలో మట్టి తిని రైతులు బతికారు. మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు. ఆకలి దహించివేయకుండా నడుము చుట్టూ కడుపును గుడ్డతో బిగించి కట్టుకున్నారు. కడుపు డొక్కలీడ్చుకుపోయినా సరే ఎవరి వద్ద చేయి చాచకుండా బతికారు. అడుక్కొని బతకడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి, అడ్డకూలీలుగా నైనా బతికారే గాని, ఎక్కడా చేయి చూపి బతకలేదు. పల్లెను వదిలి పొట్ట చేత పట్టుకొని, పట్నం వచ్చి ఎంతో మంది రైతులు హోటళ్లలో ఎంగిలి గ్లాసులు కడిగారు. ప్లేట్లు తోమారు. పల్లెలో తలబిరుసుతో బతికిన రైతు తల దించుకొని పని చేశాడు. తలెత్తి చూడకుండా కన్నీటిని మింగుతూ కాలం గడిపారు. భూమి తల్లిని నమ్ముకొని బతికారు. ఇల్లూ, వాకిలి వదిలేసి, ముసలి, ముకతకు ఇంటి కావాలి పెట్టి పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు. కంటికి నిద్రలేని రాత్రులు గడిపారు. బతికుండగా మళ్లీ పల్లెను చూస్తామా? అని దిగులుతో దిన దిన గండంగా బతికారు. కాలం కలిసి వచ్చింది. తెలంగాణ వచ్చింది. భూముల ధర వచ్చింది. సాగుకు నీరొచ్చింది. రైతులో మళ్లీ ఆశ చిగురించింది. వలస బతుకులకు ఓదార్పు దొరికింది. వలస జనమంతా పల్లెకు చేరింది. అయితే భూముల ధరలు పెరిగింది అదికారులకు లంచాలిచ్చేందుకు అన్నట్లుగా తయారైంది. తమ భూములను తమ పిల్లల పేరు మీద మార్చాలన్నా లక్షలు లంచాలివ్వాల్సిందే. అమ్ముకోవాలన్నా లంచమే.కొనుక్కొవాలన్నా లంచమే. అధికారులు తప్పులు చేసి, సరిదిద్దాలనుకున్నా లంచమే..పల్లె పట్నం అనే తేడా లేదు. ఎక్కడ విన్నా గోవింద నామం లెక్క లంచం..లంచం అనే మాట వినిపిస్తోంది. వినీ వినీ జనానికి విసుగొస్తోంది. అధికారులకు మాత్రం మరింత బలుపొస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు కూడా విపరీతంగా జీతాలు పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత జీతాలు తెలంగాణలో వున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతాలున్నాయని తెలుస్తోంది. పైగా ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలి. లంచాలు తీసుకునే బుద్ది మారడం లేదు. ఉద్యోగుల దుర్భుద్ది మారడం లేదు. లంచాలు తీసుకొని దొరుకుతామన్న భయం లేదు. దొరికిన వారిలో కూడా ఆ భయం కళ్లల్లో కనిపించడం లేదు. లంచం తీసుకున్న ఓ అధికారి ఇటీవల సోఫాలో కూర్చొని ముసిముసి నవ్వు నవ్వుతున్నాడు. ఏసిబికి పట్టుబడిన భయం ఒక్క శాతం కూడా లేదు. ఏం చేస్తారు? మహా అయితే కోర్టుకు తీసుకెళ్తారు. నాలుగు రోజులు జైలులో పెడతారు. ఎందుకంటే ఆ జైలులో కూడా క్రిమినల్స్‌ గా చూడరు. గౌరవంగా చూస్తారు. కాకపోతే నాలుగు రోజులు ఇంటికి దూరమౌతాము. తర్వాత బైటకొస్తాం…కొంత కాలం హాయగా కాలం గడుపుతాం..మళ్లీ కొలువు తెచ్చుకుంటామన్న ధీమా అవినీతి అదికారులలో పెరిగిపోయింది. సహజంగా ఎవరికైనా సరే ఉద్యోగానికి ముందు ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్లు సమర్పించుకోవాలి. పోలీసు కేసులుంటే ఉద్యోగం రాదు. కాని ఉద్యోగం చేస్తూ ఎన్ని సార్లు పట్టిబడినా ఉద్యోగం పోదు. పోలీసులు కేసులైనా లెక్కలేదు. జైలు జీవితం అనుభవించినా కొలువు మళ్లీ రాకుండాపోదు. ఇదెక్కడి న్యాయమో అర్దం కాని పరిస్దితి. అవినీతి నిరోధక శాఖ అధికారులుకు రెడ్‌ హాండెడ్‌గా దొరికినా సరే , తమను అన్యాయంగా ఇరికించారని వాదించుకుంటున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మళ్లీ ఏసిబితో ప్రమేయం లేకుండా సంబందిత శాఖల పెద్దల చేత జరిగే విచారణలో అబద్దాలు రాసుకుంటున్నారు. న్యాయస్దానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదికారులను లంచాలతో కొడుతున్నారు. కొలువులు తెచ్చుకుంటున్నారు. అలా ఉద్యోగం పోతోంది. ఇలా వస్తోంది. ఇక అవినీతి ఉద్యోగులకు భయం ఎందుకంటుంది. తప్పు చేసిన దొరికినా చర్యలు లేనప్పుడు ఇక పట్టుకోవడం ఎందుకు? మళ్లీ వదిలేయడం ఎందుకు? అసలు ఎందుకు పట్టుకుంటున్నట్లు. ఎందుకు వదిలేస్తున్నట్లు? ఈ ఏడాది ఎంత లేదన్నా కనీసం ఓ వెయ్యి మందికి తక్కువ కాకుండా లంచాలు తీసుకొని దొరికి వుంటారు. వాళ్లలో కొలువులు పోయిన వారు ఎంత మంది వున్నారు. మళ్లీ కొలువుల్లో చేరిన వారు మాత్రం వున్నారు. అసలు ఈ మధ్య రోజుకు ముగ్గురు నుంచి నలుగురు, ఐదురుగు పట్టుబడుతున్నారు. ఇలాంటి అవినీతి అదికారుల మూలంగా సామాన్యుడు తన జీవితంలో సొంతిళ్లు కట్టుకోలేదు. వంద జగాల స్థలం కొనుగోలు చేసుకోలేడు. అప్పులు చేసి, చిన్న గుడిసె కట్టుకోవాలన్నా దాని పర్మిషన్‌కు లక్షలు ఇస్తే గాని పర్మిషన్‌ రానంత దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. పెళ్లిళ్లు పేరంటాలకు ఎవరైనా బ్యాండు మేళం మాట్లాడుకుంటారు. ఉద్యోగులు,పోలీసుల కుటుంబాలలో పెళ్లి, పేరంటాలైనా వారిని మాట్లాడుకుంటారు. అలాంటి బ్యాండు మేళం వారి వల్ల పర్యావరన నష్టం జరగుతుందని పోలీసులు వాయిద్యాలు తీసుకెళ్లిన ఘటనలో వాటిని వదిలేయాలంటే లంచం అడిగిన దౌర్భాగ్యులు కూడా వున్నారంటే ఈ సమాజం బాగుపడుతుందా? ఏడాదిలో ఇతర సమయాల్లో కూలీ పనులు చేసుకంటూ, పెళ్లిళ్ల సీజన్‌లో బ్యాండు వాయిస్తూ పొట్ట పోసుకునే వారి నుంచి కూడా వేలకు వేలు లంచాలు తీసుకున్నారంటే వాళ్లను ఉద్యోగులంటారా? రాక్షసులంటారా? ఇంతగా లంచం కోసం దిగజారి బతకాలా? ఒక్కసారి ఆలోచించండి.

ఎవర్రా ఆ కూత కూసింది! ఎక్కడ రా ‘‘రియల్‌ భూమ్‌ తగ్గింది!?

 

`కార్పోరేట్‌ బిల్డర్ల మాయాజాలం.

`రియల్‌ హల్‌ చల్‌..సామాన్యులు బెంబేల్‌.

`కొనాలనుకుంటే గుండె గుబేల్‌!

`రియల్‌ తగ్గిందన్న ప్రచారమంతా ఫేక్‌.

`రియల్‌ వ్యాపారులాడుతున్న నాటకం.

`గత ఏదాడితో పోలిస్తే పెరిగిన ధరలు.

`వ్యాపారం పడిపోయిందని దొంగేడుపులు.

`బడా కంపెనీలు ఎక్కడా రూపాయి తగ్గించింది లేదు.

`హైదరాబాద్‌లో సంపన్నులే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి.

`ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దీన స్థితి.

`అప్పార్టుమెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి.

`సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు.

`లక్ష ఇండ్లు ఖాళీ అనేది శుద్ధ అబద్దం.

`బ్యాంకర్లకు కుచ్చు టోపీ పెట్టే వ్యవహారం.

`హైదరాబాద్‌లో బిల్డర్లు వేలల్లో వున్నారు.

`వాళ్లు ఇస్తున్న ధరలకు కార్పొరేట్‌ కంపెనీలు ఇవ్వడం లేదు.

`మునిగిపోతున్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

`ఇతర బిల్డర్లు స్వేర్‌ ఫీట్‌కు రూ.6 వేలు చార్జ్‌ చేస్తున్నారు.

`కార్పొరేట్‌ బిల్డర్లు రూ. 20 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

`మధ్య తరగతి ప్రజలు కిరాయిలకు వుండలేరు. ఇల్లు కొనుక్కోలేరు.

`హైదరాబాద్‌లో పేక మేడల్లా పెరుగున్న బిల్డింగులు.

`ఆకాశాన్నంటుతున్న అప్పార్టుమెంట్ల ధరలు.

తెలంగానలో రియల్‌ వ్యాపారం కుదేలైందంటూ మొసలి కన్నీరు కారుస్తున్న వాళ్లుంతా జనం రక్తం మరిగిన వాళ్లే. అమ్మకాలు లేకుండా దివాళా తీస్తున్నామంటూ దొంగేడుపులు ఏడుస్తున్న వారంతా మోసగాళ్లే..అవును ఇది ముమ్మాటికీ నిజం. వ్యాపారం అంటే లాభాపేక్ష కోసమే చేసినా, కొంతైనా న్యాయంగా, ధర్మంగా చేయాలి. కాని ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేసి, రూపాయి విలువైన భూమిని వంద రూపాయలకు అంటగట్టినప్పుడు తెలియదా? ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కోట్లకు కోట్లు, వందల వేల కోట వ్యాపారం చేసింది నిజంకాదా? రియల్‌ వ్యాపారం పేరుతో బ్యాంకులను నమ్మించి అప్పులు తీసుకున్నది నిజం కాదా? సామాన్య ప్రజలకు అందమైన బ్రోచర్లు చూపించి, అసలు ప్లాట్‌ ఎక్కడుందో చూపించకుండా వేధించిన సంస్ధలులేవా? ఇప్పటికీ రియల్‌ వ్యాపారలు వేసిన వెంచర్లలో తమ ప్లాట్‌ ఎక్కడుందో కూడ తెలియకుండా, లక్షలకు లక్షలు చెల్లించిన బాధితులు హైదరాబాద్‌ పరిసరాల్లోనే కొన్ని వేల మంది వున్నారు. చూపించిన ప్లాట్లనే వందల మందికి చూపించి, అమ్మిన ప్లాట్లనే పది మందికి అమ్మిన దొంగ వ్యాపారులేరా? ఏదో ఆగమైపోతున్నామంటూ లేనిపోని లెక్కలు చెప్పి ఇంకా ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు. బ్యాంకులను ముంచేద్దామని చూస్తున్నారా? వ్యాపారాలు పడిపోయాయి. నిర్మాణంలో వున్న ప్లాట్లు అమ్మకాలు జరడం లేదు. కట్టిన విల్లాల్లో గబ్బిలాలు చేరుతున్నాయంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఏ వ్యాపారమైనా సక్కగా చేస్తే ఏ నష్టం వుండదు. ఎక్కడా ఆగిపోదు. కాని రియల్‌ వ్యాపారం పేరుతో జనం సొమ్మును మంచినీళ్లలా తాగారు. జనం దగ్గర డబ్బులు లేకుండా చేశారు. భూమి మీద పెట్టుబడి పెడితే పదింతలౌతుందని నమ్మించారు. జనం చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారు. పది రూపాయలకు కొన్న భూమిని వెయ్యి రూపాయలకు అమ్మారు. ఆ వెయ్యి నుంచి మరిన్ని కొని లక్షకు అమ్మి కోట్లకు పడగలెత్తారు. చిన్న చిన్న కార్యాలయాల్లో అద్దెలకు రూంలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన వాళ్లు ఎక్కడైనా కిరాయలు కడుతున్నారా? అంతస్దుల మీద అంతస్దులు కట్టి కార్యాలయాలు చేసుకున్నారు. వాటిని కూడా చూపించి మరింత జనాన్ని దోచుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం పడిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ మధ్య ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడే భహిరంగంగానే చెప్పాడు. రియల్‌ వ్యాపారులు ప్రభుత్వాన్ని దించేయమంటున్నారు. అవసరమైన సొమ్ము ఇస్తామని కూడా చెబుతున్నారని అన్నాడు. అంటే ప్రభుత్వాలనే మార్చేంత శక్తివంతులయ్యారు. ఒకప్పుడు అనామకులుగా వున్న వారు రియల్‌ పేరుతో కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వాలనే శాసించే స్ధాయికి చేరుకున్నారు. అయినా హైదరాబాద్‌లోనే కాదు, పరిసర ప్రాంతాలతోపాటు, తెలంగానలో ఎక్కడైనా సామాన్యుడు ఓ వంద గజాల స్దలం కొనుక్కునే పరిస్టితి వుందా? భూములన్నీ కొని, చేతుల్లో పెట్టుకొని అమ్ముపోతలేవు. వ్యాపారాలు సాగడం లేదంటూ మాట్లాడేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు కొన్నప్పుడు భూమి విలువ ఎంత? ఇప్పుడు రియల్‌ వ్యాపారులు పెంచి అమ్ముతున్న ధరలుఎంత? ఇప్పటికీ రియల్‌ వ్యాపారులు కొన్న ధరలకు సగం దరలు పెంచి అమ్మినా తెలంగాణలో ఎంతో మంది ఇంటి స్ధలాలు కొనుగోలు చేసుకునేందుకు సిద్దంగా వున్నారు. కాని సొంతింటి కలను అందని ద్రక్షను చేసేశారు. అమ్మకాలు లేవంటూ సొల్లు పురాణం చెబుతున్నారు. నిజంగా హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారం ఆగిపోతే ఎక్కడా నిర్మాణాలు జరగొద్దు.కాని నగరశివారుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు సాగుతూనే వున్నాయి. అంతస్దుల మీద అంతస్ధులు కడుతూనే వున్నారు. అవన్నీ ఎందుకు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు. ఎవరు కట్టమంటున్నారు? చిన్న చిన్న నిర్మాణ సంస్దలు నడిపేవారు మహా అయితే నాలుగైదు అంతస్ధులు మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. కాని కార్పోరేట్‌ శక్తులుగా మారి, ఎకరం, రెండెకరాల్లో అంతస్ధుల మీద అంతస్ధులు పెంచుకుంటూ, ముప్పై, నలభై అంతస్ధులు నిర్మాణం చేస్తున్నారు. హైరేజ్‌ అప్పార్టుమెంట్లు అని కలరింగులిస్తున్నారు. వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగముందా? రియల్‌ వ్యాపారులకు డబ్బులు సమకూర్చే ఏటిఎం మిషన్లుగా నిర్మాణాలు మారుతున్నాయి. తప్ప కొనుగోలు చేసిన వారు నానా కష్టాలు పడుతున్నారు. ఒకప్పటి కన్నా ఇప్పుడే స్ధలాలు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా సామాన్యుడు భయపడుతున్నాడు. బెంబేలెత్తిపోతున్నాడు. భూముల ధరలు గతంకన్నా మరింత పెంచి, అమ్ముడయ్యే ఒక్కదాని మీదే లాభాలన్నీ వచ్చేలా అమ్మకాలు సాగిస్తున్నారు. పైగా అమ్మకాలులేవని నాటకాలాడుతున్నారు. సామాన్యుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కునే పరిస్దితి వుందా? రియల్‌ వ్యాపారం తగ్గిందని అంటున్నమాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ ప్రచారమంతా ఫేక్‌ అని కూడాతెలుస్తోంది. గత ఏడాదితో పోలీస్తే ధరలు పెరిగాయే తప్ప ఎక్కడా తగ్గలేదు. కాకపోతే అమ్మకాలు తగ్గివుండొచ్చు. అయినా రియల్‌ వ్యాపారులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ ఏడాది రియల్‌ వ్యాపారులు చాల మంది అత్యంత ఖరీదైన కార్లు కొన్నట్లు ఒక సర్వేలో తేలింది. వ్యాపారమే ఒడిదొడుకులు వున్నప్పుడు ఖరీదైన కార్లు ఏ వ్యాపారికొనుగోలు చేయడు. కాని ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని వందల ఖరీదైన కార్లు రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయి. బడా కంపనీలు ఎక్కడా ఒక్క రూపాయ తగ్గించినట్లు దాఖలాలు లేవు. కొన్ని చిన్న కంపనీలు ఇస్తున్న ధరలకు, కార్పోరేట్‌ సంస్దలు ఇస్తున్న ధరలను పోల్చి చూస్తే, వ్యాపారం ఎక్కడా దిగిజారినట్లు లేదు. అవే ప్రాంతాలు. అక్కడే స్ధలాలు. అయినా చిన్న చిన్న కంపనీలకు, కార్పోరేట్‌ సంస్దల నిర్మాణాలలో వ్యత్యాసం ఎందుకుంటోంది. పైగా చిన్న చిన్న వ్యాపారులు నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో స్ధలం కూడా ఎంతో ఎక్కువ వస్తుంది. అదే కార్పోరేట్‌ సంస్ధలు నిర్మాణం చేసే అప్పార్టుమెంట్లలో ధరలు ఎక్కువే. భవిష్యత్తులో వచ్చే స్ధలం చిన్నదే. అంటే ఏ రకంగా చూసినా కార్పోరేట్‌ సంస్ధలు చేసే నిర్మాణాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం వుండదు. ఇక హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగం చేసే సామాన్యులకు ఇల్లు కొనుగోలు అనేది జీవితంలో జరిగే పని కాదు. నెలకు కనీసం ఓ రెండు లక్షల రూపాయల జీతం చేసే వారికి కూడా కొనడం భారమే. ఇక నెలకు రూ.30, 40 వేలు సంపాదించుకునేవారికి కిరాయలు కూడా చెల్లించడం కష్టంగానే మారుతోంది. జూబ్లీహిల్స్‌లో ఒకప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారితోపాటు, సినీ రంగానికి చెందిన వాళ్లంతా రూ.10 రూపాయలకు గజం చొప్పున కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు అదే జూబ్లిహిల్స్‌ గజం ధర కనీసం 3లక్షల రూపాయలుగా అమ్మకాలు సాగుతున్నాయి. అసలు సంసన్నులే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలుచేసుకోలేని స్ధితికి రియల్‌ వ్యాపారులు తెచ్చారు. ప్రైవేటు ఉద్యోగుల పరిసి ్ధతి మరీ దారుణమనే చెప్పాలి. అప్పార్టు మెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి. ఇదంతా కార్పోరేట్‌ వ్యాపారుల మాయా జాలం. ఎందుకంటే ప్రభుత్వ ధరలకు, వ్యాపారులు చెప్పే ధరలకు ఎక్కడా పోలిక లేదు. కోట్ల రూపాయలు తీసుకుంటూ ప్రబుత్వ ధరలకు టాక్స్‌లు చెల్లిస్తున్నారు. జనం సొమ్ముతోనే కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. అటు ప్రజలను , ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. పేకమేడలు ఎన్ని పెరిగినా అక్కరకు రావు. సామాన్యులకు అందుబాటులో ఇల్లు లేనప్పుడు కొనుక్కునేవాడు కూడా కరువౌతారు. అంతే కాని వ్యాపారాలు ఏమీ ఆగలేదు. ధరలు తగ్గించడానికి వ్యాపారులు సిద్దంగా లేరు. కొనుగోలు చేసేంత శక్తి సామార్దాలు ప్రజల వద్ద లేదు.

కేరళలో కమల వికాసానికి బీడీజేఎస్‌ అడ్డంకి?

`బీజేపీ సొంత ప్రయత్నాలు చేసుకుంటేనే మేలు

`బీడీజేఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం

`కమ్యూనిస్టులను ఎదుర్కోవాలంటే వ్యూహం మార్చక తప్పదు

`వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే చెమటోడ్చక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పరశురాముడు నడయాడిన నేల కేరళ. దేవభూమిగా చెప్పుకునే ఈ రాష్ట్రంలో సనాతనధర్మం, హిందూత్వ సిద్ధాంతంతో భాజపా ఎందుకని చొచ్చుకొని లేకపోతున్నదని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా వామపక్ష భావజాలం ప్రజల్లో బలీయంగా నాటుకొనివుండటం ఒకవైపు కాగా మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ కూటమి కూడా బలమైన పునాదులు కలిగివుండటమన్నది సాధారణంగా చెప్పే కారణం. మరో విషయమేంటంటే రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింల జనాభా అధికంగా వుండటం, వీరిలో క్రైస్తవులు కాంగ్రెస్‌కు, ముస్లింలు వామపక్ష కూటమికి గట్టి మద్దతుదార్లుగా వుండటంతో బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకోలేకపోతున్నదనేది సాధారణవిశ్లేషణ. వీటితోపాటు పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా విస్తరణను అడ్డుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఇదిలావుండగా రాబోయే ఏడాదికాలం లోగా బీజేపీ కేరళలో ఎన్నికల పరంగా రెండు పరీక్షలను ఎదుర్కోబోతున్నది. మొదటిది వచ్చే డిసెంబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు కాగా, వచ్చే ఏడాది ఎండాకాలంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో గట్టి ప్రభావశీలక పనితీరు ప్రదర్శించకపోతే, రానున్న కాలంలో పార్టీ విస్తరణఅవకాశాలు దెబ్బతినే ప్రమాదం వుంది. ప్రస్తుతం బీజేపీకి కేరళలో భారత ధర్మ జనసేన(బీడీజేఎస్‌) భాగస్వామిగా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో (2024) ఈ రెండు పార్టీలు కలిపి రాష్ట్రంలో 19శాతం ఓట్లు సాధించాయి. ఇదే ఎన్నికల్లో త్రిస్సూర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గె లుచు కుంది కూడా. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో ఈ రెండు పార్టీలు గత ఎన్నికలకంటే కొంత మెరుగైన పరితీరు ప్రదర్శించిన మాట వాస్తవం. ఇదే సమయంలో అట్టింగళ్‌, అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ మూడోస్థానంలో వుండటం గమనార్హం. ఇందుకు మురళీధరన్‌, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ శోభా సురేంద్రన్‌ల ప్రచార సరళే కారణ మని చెప్పక తప్పదు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 కాంగ్రెస్‌ కూటమివిజయం సాధించగా, కమ్యూనిస్టుల కూటమి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల కృషి కారణంగా ఆరు సెగ్మెంట్లలో పార్టీకి 40శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఇక నిమమ్‌ సెగ్మెంట్‌లో ఏకంగా 45శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మ రో 17 సెగ్మెంట్లలో 30శాతం వరకు ఓట్లు సంపాదించుకోగలిగింది. కాంగ్రెస్‌ వృద్ధనేత రమేష్‌ చెన్నితలకు కంచుకోటగా పరిగణించే హరిపాడ్‌ సెగ్మెంట్‌లో బీజేపీ సహచరి బీడీజేఎస్‌ వెయ్యి ఓట్ల లీడ్‌ సాధించింది. అయితే ఈస్థానాన్ని గతంలో బీజేపీ గెలుచుకుందన్న విషయం మరువరా దు. మరో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 25శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా పోలవడం, లెఫ్ట్‌ రమరియు కాంగ్రెస్‌ కూటములను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీట్లు గెలుచుకోకపోయినా క్రమం గా రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదనడానికి ఇవి సంకేతం. గతంతో పోలిస్తే పార్టీ కొంత సానుకూల స్థితికి చేరుకునేదిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. సరిగ్గా ఇదేసమ యంలో నూతన బీజేపీ సారథిగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ను రాష్ట్ర రథసారథిగా పార్టీ నియమించడంగమనార్హం. ఇదిలావుండగా పార్టీకి మద్దతుగా వున్న బీడీజెఎస్‌ పనితీరు నిరాశాజనకంగా వుండటాన్ని ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం. 

గత లోక్‌సభ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీడీజేఎస్‌ ఓట్లశాతం సింగిల్‌ డిజిట్‌ను మించకపోవడం నిరాశను కలిగిస్తోంది. అదీకాకుండా ఆయా సెగ్మెంట్లలో పోలైన ఓట్లశాతం బీజేపీకిస్థానికంగా వున్న బలం వల్ల వచ్చినవేనని కూడా విశ్లేషణలో తేలింది. ఉదాహరణకు కయాంకు లం అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీడీజేఎస్‌ అభ్యర్థికి 33శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలయిన ఓట్లు 26శాతం! అంటే ఇక్కడ బీడీజేఎస్‌ అభ్యర్థికి ఈమాత్రం ఓట్లు పోలయ్యాయంటే అందుకు బీజేపీకి స్థానికంగా వున్న బలమే కారణమన్నది స్పష్టమైంది. నిజానికి బీడీజేఎస్‌ 2015లో ఏర్పాటైంది. శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) కు రాజకీయ విభాగంగా, ఎజవా ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)ను కూడగట్టే లక్ష్యంతో వెల్లప్పల్లి నటేషన్‌ నాయకత్వంలో ఇది ఆవిర్భవించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా వున్న ఎజవావర్గం ప్రజల ఓట్లను ఆకర్షించడం దీని ఏర్పాటు లక్ష్యం. ఇదే సమయంలో ఎజవా వర్గాల్లో క మ్యూనిస్టు కార్యకర్తల హింసాత్మక దాడులనుంచి రక్షణగా వుంటుందన్న లక్ష్యంతో కూడా ఈ బీడీజేఎస్‌తో భాజపా జతకట్టింది. లక్ష్యం ఏదైనా ఓట్ల విషయానికి వచ్చేసరికి ఎజవా వర్గంవారు కమ్యూనిస్టులకే సానుకూలంగా వ్యవహరించడంతో బీడీజేఎస్‌ నుంచి ఆశించిన ప్రయోజనాన్ని బీజేపీ పొందలేకపోయింది. ఎన్నికల్లో ఎజవా వర్గం ఓట్లు ఎన్నికల్లో అత్యంత కీలకం. ఈ వర్గా ల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి బీడీజేఎస్‌తో కలిసి పనిచేయడం బీజేపీకి కలిసిరాలేదు. అదీకా కుండా ఎజవా వర్గ ప్రజల్లోకి తనకై తాను చొచ్చుకొని వెళ్లాలంటే బీడీజేఎస్‌ పెద్ద అడ్డంకిగా మారింది. అట్లాగని కమ్యూనిస్టు కార్యకర్తల దాడులు ఆగాయా అంటే అదీలేదు. ఈ నేపథ్యంలో బీడీజేఎస్‌ భాజపా ఎదుగుదలకు ఒక గుదిబండలా మారుతోందనేది క్రమంగా వెల్లడవుతున్న సత్యం. అదీకాకుండా ఈ వర్గాల్లో ఎస్‌ఎన్‌డీపీ, కమ్యూనిస్టు కార్యకర్తల మధ్య తరచుగా జరిగే సంఘర్ష ణలు బీజేపీ విస్తరణకు ప్రధాన అవరోధంగా మారాయి. ఈ సంఘర్షణలు ఎంతమాత్రం వాంఛనీయం కావనేదీ బీజేపీ నాయకత్వ ఉద్దేశమైనా, స్థానిక రాజకీయ పరిస్థితులు, మార్క్సిస్టుల దా డులు, స్వీయరక్షణకోసం ప్రతిఘటించక తప్పని పరిస్థితులున్నాయి. ప్రస్తుతం మార్క్సిస్టు కార్యకర్తల దాడులనుంచి రక్షణకోసం బీడీజేఎస్‌పై ఆధారపడుతున్నప్పటికీ, భాజపా తనకు తాను ఎజవా వర్గ ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవాలంటే మరో తోవను ఎంచుకోక తప్పదు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, దీన్ని ఎదుర్కొనేందుకు భాజపాఅక్కడ తనకంటూ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. అదేమాదిగా ఇక్కడ కూడా వ్యవహరించకపోతే తన ఉనికిని విస్తరించుకోవడం కష్టం కాగలదు. అట్లాగని ఎజవా వర్గాల్లో విస్తరించే ప్రయ త్నాలను కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం కూడా భ్రమే. అయితే ఇక్కడ గుర్తుం చుకోవాల్సిన అంశమేంటంటే బీజేపీ`బీడీజేఎస్‌ కూటమిగా వుండటం పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తున్నదనేది తిరుగులేని సత్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వ్‌ అయిన 14 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు తిరుగులేని ఆధిపత్యం వుంది. ఎట్లా అంటే, మహారాష్ట్రలో బీజేపీ`శివసేన కూటమిగా కొనసాగినంత కాలం మరాఠా ఓట్లను కోల్పోయారు. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు బీజేపీకి ఈ వర్గాల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలైంది. అదేవిధంగా బీడీజేఎస్‌నుంచి విడిపోతే భాజపా సొంతంగా ఈ వర్గ ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవచ్చనేది ఒక విశ్లేషణ. ఇక్కడ ‘కులాలకతీతంగా’ అనే భావన ప్రతికూల ప్రభావానే చూపుతుంది తప్ప సానుకూల ఓట్లను రా ల్చదనేది సుస్పష్టం. 

ప్రస్తుతం ఎజవా కమ్యూనిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో ‘ఉద్రిక్త శాంతి’ కొనసాగుతున్నదంటే, ఇక్కడ బీజేపీ విస్తరణకు తన ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ఇవ్వడమే. గత మార్చి 25 నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్టీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు ముందు పనిచేసినసురేంద్రన్‌ పార్టీ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లా ను పాలనాపరంగా రెండుగా విభజించారు. బూత్‌ స్థాయివరకు సమన్వయ సహకారాలు కొనసా గేలా చర్యలు తీసుకున్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇప్పటివరకు ఆయా జిల్లాల నాయకత్వాలతో రెండుసార్లు చర్చలు జరిపారు. ఇదే సమయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. యాప్‌ ఆధారంగా నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు నెలల కాలంలో అప్పటివరకు 19వేలుగా వున్న సభ్యత్వం ఏకంగా లక్ష దాటింది!

ఇప్పుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రధానంగా వచ్చే డిసెంబర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని అదేవిధంగా ప్రతి పట్టణ మున్సిపల్‌ వార్డుకు ఒకరిని చొప్పున ఇన్‌చార్జ్‌ నియామకాలు పూర్తిచేశారు. ‘వికసిత కేరళం’ కింద జిల్లాలో ఐదుగురితో కూడిన ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలోపేతంగా పనిచేసేందుకు వీలుగా చేసిన సంస్థాగత ఏర్పాటిది. అయితే రాష్ట్రస్థాయిలో ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ పోస్టు ఇంకా ఖాళీగానే వుంది. ఇదే సమయంలో మధ్యస్థాయి పోస్టులు కూడా చాలావరకు బర్తీ కాలేదు. ఉన్నతస్థాయి, క్షేత్రస్థాయి నాయకత్వాల మధ్య ప్రథానమైన అనుసంధానాన్ని ఏర్పచ డంలో ఇవి కీలకం. ఈ నియామకాల్లో జాప్యం జరిగేకొద్దీ పార్టీలో గ్రూపులు, రాజకీయాలు మరింత బలోపేతమవుతాయి. అందువల్ల ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం పార్టీకి ఒక శాపం వంటిదనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలు ఎదగడానికి యత్నిస్తున్న పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ గ్రూపురాజకీయాలు పెచ్చరిల్లితే రాజీవ్‌ చంద్రశేఖర్‌ వాటిని అరికట్టడంతో పరిమిత పా త్రనే పోషించగలరు తప్ప పూర్తిస్థాయిలో నియంత్రించలేరు. ఎందుకంటే ప్రస్తుతం పార్టీని ఏకతాటిపై నడిపించే సామర్థ్యమున్న రాష్ట్రస్థాయి నాయకుడు అత్యంత అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం కె.జి.మారర్‌ ఆవిధంగా పార్టీని నియంత్రించగలిగారు. అటువంటి నాయకత్వం ఇప్పుడు పార్టీకి అత్యవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత బలంగా వున్న సీపీఐఎం మాదిరిగానే సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొనిరాక తప్పదు. వీటితో పాటు రాష్ట్రంలో అధికార కూటమికి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే యంత్రాంగం ఇప్పుడు పార్టీకి అవసరం. బాహ్య సమస్యలను ఎదుర్కోవడానికి, అంతర్గత సమస్యల పరిష్కారానికి, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం కావడానికి నిధులు కూడా అవసరమే. ఇన్ని సమస్యలను అధిగమించి రానున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శించాలంటే చమటోడ్చక తప్పదు!

ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.

-మంత్రి ‘‘ఉత్తమ్‌’’ పర్యవేక్షణ.. కమీషనర్‌ ‘‘చౌహాన్‌’’ కార్యదక్షత.

-మిల్లర్‌ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు!

-జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు.

-అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు?

-అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు.

-అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష.

-ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ..

-వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ.

-మిల్లర్‌ నుంచి ముక్కు పిండి వసూలు… రైతుల ఖాతాలో పైసలు.

-2 వేల బస్తాలు మింగిన మిల్లర్‌ జగన్‌కు చుక్కలు..

-టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌…తాట తీసిన ఆఫీసర్‌.

-మరో సారి జగన్‌ మోసం బైట పడిరది!

-‘‘నేటిధాత్రి’’ ముందే పసిగట్టి చెప్పింది.

-రెండు వేల వడ్ల బస్తాల స్వాహా వెలుగులోకి వచ్చింది?

-అధికారులను గుప్పిట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు.

-2 వేల బస్తాలు కన్నం పెట్టాడు.

-ఖమ్మం జేసి వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు.

-ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు.

-అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు.

-మిల్లర్‌ జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-దేశంలోనే ఇది మొదటి సారి అని అంటున్నారు.

-రైతులను వందల కోట్లు ముంచిన మిల్లర్లు?

-రైతులను నిలువుగా మిల్లర్‌ ముంచాలని చూశాడు.

-అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు.

-ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌.

-అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం.

-రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.

-ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ప్రజలకు మేలైన, మెరుగైన పనులు చేయొచ్చని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొంత మంది అక్రమ మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. గత ప్రభుత్వ పెద్దలు కళ్లు చూసుకోవడం వల్ల మిల్లర్లు కొందరు రైతులను విపరీతంగా మోసం చేసే వారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారు. రైతులకు చెందాల్సిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే వారు. రైతుల గోస పుచ్చుకునే వారు. ఆ సమయంలో మిల్లర్లు చెప్పిందే వేదమన్నట్లు చేసే వారు. అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు ఎంతో నష్టపోయే వారు. యధా రాజ, తదా ప్రజా అన్నట్లు అధికారులు మేమేం తక్కువ అన్నట్లు మిల్లర్లకే సాయపడేవారు. వారు కూడా రైతులను దోచుకునేందుకు పరోక్షంగా సహకరించే వారు. రైతుల ఆందోళన అరణ్య రోదనయ్యేది. పట్టించుకునే వారు కాదు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా గత పాలకుల కాలంలో జరిగింది. కానీ ఇకపై మిల్లర్ల ఆట కట్‌ అనే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రూపాయి కూడా మోసానికి గురి కాకుండా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ తీసుకుంటున్న చర్యల మూలంగా రైతులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా చూసే రోజులు రాబోతున్నాయి. ఇది ఎంతైనా తెలంగాణ రైతుకు వరమనే చెప్పాలి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షణతో కమీషనర్‌ చౌహాన్‌ కార్యదక్షతతో కూడుకున్న చర్యల వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఏర్పడిరది. గతంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు, అధికారులను కూడా తప్పు దోవ పట్టించేలా వుండేవి. పైకి మాత్రం రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేసే వారు. చేతులు దులుపుకునే వారు. దాంతో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే వారు అసలే కాదు. నేటిధాత్రి లాంటి మీడియాలో ఎన్ని కథనాలు రాసినా పట్టించుకునే వారు కాదు. స్పందించే విధానం వుండేది కాదు. ఇక రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాత్రం నామ మాత్రపు స్పందన కనబర్చినట్లు నటించే వారు. అంతకు మించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో అధికారులకు అప్పగించి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని చెప్పడం గతంలో చూడలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వడ్ల సేకరణలో అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అది ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తన కర్తవ్యాన్ని అంకిత భావంతో అమలు చేశారు. ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టారు. తప్పు చేసిన మిల్లర్‌ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ వుండాల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఆ కధ ఏమిటో తెలియాలి. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వడ్లు హన్మకొండ జిల్లాలో వున్న కొన్ని మిల్లులకు జాయింట్‌ కలెక్టర్‌ సిఫారసు చేశారు. వాటిని ఖమ్మం జేసి సూచించిన విధంగా ఎంపిక చేసిన మిల్లర్లకు చేరలేదు. మధ్యలో హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఓ మిల్లర్‌ కు కొమ్ము కాసే పని పెట్టుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల వడ్లను జగన్‌ అనే మిల్లర్‌ కు మళ్లించారు. నిజానికి చెందాల్సిన మిల్లర్లకు చెందకుండా చేశారు. అధికారుల అండతో జగన్‌ అనే మిల్లర్‌ ఆ వడ్ల నుంచి ఏకంగా 2 వేల బస్తాలు మింగేశాడు. తప్పుడు లెక్కలు సృష్టించాడు. బస్తాకు కోసే వడ్ల విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించాడు. ఈ విషయం తెలిసిన ఖమ్మం జేసి సదరు మిల్లర్‌ జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. ఓ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం నేటిధాత్రి మిల్లులకు ప్రచురించింది. అది ఖమ్మం జిల్లా జేసికి చేరింది. అంటే వెంటనే స్పందించారు. నివేదిక తెప్పించుకున్నారు. మిల్లర్‌ చేసిన మోసం పసిగట్టారు. రెండు వేల బస్తాలకు సంబంధించిన సొమ్ము కక్కాల్సిందే అని నోటీస్‌ జారీ చేశారు. ఇది సివిల్‌ సప్లయ్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారి అంటున్నారు. గతంలో ఇలా స్పందించిన అధికారి ఎవరూ లేరని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఎంతో ఊరట కలిగించడమే కాదు, మోసపోయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి, రైతుల కష్టానికి టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌ తాట తీసే పని ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ పెట్టుకున్నాడు. ఒక మిల్లర్‌ ప్రభుత్వం కళ్లు గప్పి, రైతులను మోసం చేసి, రెండు వేల వడ్ల బస్తాల స్వాహా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు. ఏ పనైనా తూతూ మంత్రంగా చేసే అలవాటు హన్మకొండ అధికారులకు వుంది. లారీలు వచ్చాయా? వాటిని తమకు అనుకూలమైన మిల్లర్‌ జగన్‌కు అందించామా! లేదా!! అనేదే చూసుకున్నారు. కానీ బస్తాలపై వున్న మర్మం కనిపెట్ట లేకపోయారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో తెలివిగా ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు. అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. మొదటి నుంచి నేటిధాత్రి ఈ విషయం చెబుతూనే వుంది. అధికారులను హెచ్చరిస్తూనే వుంది. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు నేటిధాత్రి అందిస్తున్న వార్తలను పెడ చెవిన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగినట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. పదేళ్లు తిష్ట వేసుకొని తినడం అధికారులకు అలవాటైంది. రైతులను మోసం చేయడం మిల్లర్లకు సామాన్యమైపోయింది. రైతుల నెత్తిన కోత శఠగోపం పెట్టడం నిండా ముంచడం బాగా అలవాటైపోయింది. అదే ధోరణి విచ్చలవిడిగా సాగుతోంది. మమ్మల్ని అడిగేవారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? నేటిధాత్రి రాస్తూనే వుంటుంది. అదంతా కామనే అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా జేసి ఇచ్చిన రaలక్‌తో ఒక్క సారిగా హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారుల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉన్నత స్థాయిలో వున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇంత అద్భుతంగా వుంటాయి. ప్రజలకు మేలు చేసేలా వుంటాయి. అని నిరూపనైంది. జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. ఇలాంటి వ్యవహారాలు అన్ని జిల్లాలలోనూ సాగుతున్నాయి. అన్ని జిల్లాల అధికారులు ఖమ్మం జిల్లా అధికారులను ఆదర్శంగా తీసుకుంటే ఏ మిల్లర్‌ మోసానికి పాల్పడలేడు. రైతుల సొమ్ము అప్పనంగా దోచుకునే వెలుసుబాటు అసలే వుండదు. రైతులను కొట్టి కోట్లు మింగాలనుకుంటున్న మిల్లర్లు తప్పులు చేయడానికి అసలు ఆస్కారం వుండదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులను వందల కోట్లు ముంచుతూనే వున్నారు మిల్లర్లు. వారికి సహకరిస్తూనే వున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? జరగడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌. అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం. ఏటా రైతుల వద్ద కోసిన వడ్లతో మిల్లర్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మిల్లర్ల దోపిడీ ఆపండి. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు మిల్లర్లకు సహకారం ఆపండి. 

బాక్స్‌.

ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలం!

ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్‌ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విషయాన్ని, విజయాన్ని కాంగ్రెస్‌ క్రాడర్‌ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయినా కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా కాంగ్రెస్‌ క్యాడర్‌ కళ్లు తెరవండి. ప్రతిపక్షాల నోరు మూయించండి.

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

 

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

తమిళనాడులో కులం, పేదరికం ఒక విరోధాభాస

పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే అధికారానికి ముప్పు

విజయ్‌ వ్యూహాలు డీఎంకేను దెబ్బకొట్టే అవకాశం

కులాల కుంపట్ల సెగ అంటని బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్‌ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే బలంగా వుంటాయన్న సంగతి అదరికీ తెలిసిందే. ఈ నేప థ్యంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎఐడీఎంకెలను, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఏవిధంగా ఎదుర్కొని నెట్టుకు రాగలుగుతుందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దళపతి రాబోయే ఎన్నికలకోసం ఇ ప్పటినుంచే చాపకింద నీరులా తన వ్యూహాలను అమలుపరచడం మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టునుంచి ఆయన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వృధాచలం నియోజకవర్గం నుంచి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే), దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీల స్టాండ్‌ ఏవిధంగా వుండబోతున్నది కూడా ఆగస్టు నాటికి స్పష్టమయ్యే అవకాశముంది. ముఖ్యంగా పీఎంకేకు ఓబీసీవర్గమైన వన్నియార్లలో మంచి బలముంది. దివంగత సినీ హీరో విజయకాంత్‌ నెలకొల్పిన డీఎండీకేకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టును కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ, సెమీ`అర్బన్‌ ప్రాంతాల్లోని దళిత, ఓబీసీ వర్గాల ఓట్లపై టీవీకే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
పీఎంకే, డీఎండీకేల అసంతృప్తి
ప్రస్తుతం డీఎండీకేకు నాయకత్వం వహిస్తున్న ప్రేమలత ఏఐడీఎంకే పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. సీట్ల కేటాయింపులో తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఏఐడీఎంకే నాయకుడుపళినిస్వామిపై ఆగ్రహంతో వున్నారు. ఇక పీఎంకే విషయానికి వస్తే దీని వ్యవస్థాపకుడు రామ్‌దాస్‌, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా వున్న అంబుమని రామ్‌దాస్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రామ్‌దాస్‌, ఏఐడీఎంకేతో నేరుగా చర్చలు జరపాలని భావిస్తుంటే, అంబుమని రామ్‌దాస్‌ ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దమధ్య నెలకొన్న విభేదాలకు కారణం. ఈ విభేదాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉత్తర తమిళనాడుకు చెందిన పది జిల్లాల్లో ఈ పార్టీ ప్రభావం అధికం. ఈ అసంతృప్తి వీరిని పీఎంకేవైపుకు మొగ్గు చూపేలా చేస్తే అప్పుడు ఒక్క ఏఐడీఎంకేకు మాత్రమే కాదు డీఎంకేకు కూడానష్టం కలిగించక మానదు. ఎట్లా అంటే డీఎంకే కూటమిలో వున్న విడుత్తలై చిరుతైౖగలల్‌ కచ్చి (వీసీకే)కు ఈ ప్రాంతంలో దళితుల్లో మంచి బలం వుంది. పైరెండు పార్టీల ప్రభావంతో ఈ ఓ ట్లు కూడా చీలి టీవీకే ఖాతాలోకి వెళ్లకూడదనేం లేదు. క్రైస్తవుడైన విజయ్‌, వచ్చే ఆగస్టులో వృ ధాచలం నుంచి ప్రారంభించే యాత్రలో వన్నియార్లు (ఓబీసీలు), దళితులు, మత్స్యకార్లు, క్రైస్తవ వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గతంలో వృధాచలం డీఎండీఏకేకు గట్టి పట్టున్న ప్రాంతం. డీఎండీకే, పీఎంకేలు ప్రస్తుతం ఏఐడీఎంకేతో జట్టుకట్టి వున్నాయి.
ప్రస్తుతం విజయ్‌ ‘టీవీ’ని తన పార్టీ గుర్తుగా చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలోనే ‘టీవీ`కే’కు ఓటువేయండి నినాదంతో ముందుకెళ్లవచ్చు. అదీకాకుండా ‘టీవీ’ ప్రజలకు ఏవిధమైన కష్ట లేకుండా తేలిగ్గా గుర్తుండిపోతుంది కూడా. ప్రస్తుతం విజయ్‌ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరవుతుండటాన్ని ఏవిధంగా తీసుకోవాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకేకు ఇది సానుకూల పరిణామమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అభిమానం వేరు ఇది ఓటుగా మారడం వేరని చెబుతున్నారు. విజయ్‌కాంత్‌ వంటి స్టార్‌ హీరో పెట్టిన పార్టీకే దిక్కులేదు, ఇప్పుడు విజయ్‌ పార్టీ కూడా ఇదేబాటలో పయనిస్తుందని అంచనాలు కట్టే నిరాశా వాదులుకూడా లేకపోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే విజయ్‌ తన ఛరిష్మాతో పదిశాతం ఓట్లు సాధించుకోగలిగితే డీఎంకే కొంప నిండా మునిగినట్టేనన్నది మాత్రం సుస్పష్టం.
యువకుల్లో మద్దతు
వర్తమాన పరిస్థితి పరిశీలిస్తే దళపతికి యువకుల్లో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో, ప్రధానంగా మైనారిల్లో పట్టు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వర్గాలు సంప్రదాయికంగా డీఎంకే మద్దతు దార్లు. ఈ వర్గాలు దళపతిని కేవలం వెండితెరవేల్పుగా మాత్రమే కాదు, ఎంతోకొంత చేసిచూ పించే నాయకత్వ లక్షణాలు కలిగినవాడిగా పరిగణించడం మొదలైంది. మొదట్లో విజయ్‌ టీవీకేను స్థాపించిన తర్వాత, రాజకీయ పండితులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ కే 5 నుంచి 6శాతం వరకు ఓట్లు సంపాదిస్తుందని అంచనాలు కడుతున్నారు. మరి గతంలో కమల్‌ పెట్టిన మక్కల్‌ నిధి మయమ్‌ (ఎంఎన్‌ఎం) 2021లో కేవలం 2.52శాతం ఓట్లు మాత్రమేసాధించింది. దీంతో పోలిస్తే టీవీకే చాలా ముందంజలో ఉన్నట్టే లెక్క! అంతేకాదు ఇతర పార్టీ లనుంచి 2`3శాతం ఓట్లు చీల్చగలడన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. తాను సొంతంగా 5శాతం ఓట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికి మొత్తంమీద చూసుకుంటే గరిష్టంగా 8శాతం ఓట్లు సాధించగలడన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలించే వారి అంచనా. అయితే విజయ్‌ ‘వర్క్‌ ఫ్రం హోం’ రాజకీయాలు నడుపుతారన్న విమర్శకులు కూడా లేకపోలేదు. ఇదిలావుండగా ఎన్నికలు దగ్గరపడ్డే కొద్దీ ఈ అంచనాల్లో మార్పు కచ్చితంగా వుండి తీరుతుంది. ఎందుకంటే విజయ్‌ ప్రధానంగా దళితులు, ఆర్థికంగా అణగారిన వర్గాలు, శ్రామికులపై దృష్టి పెట్టి తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది ఓట్ల చీలికవల్ల సాధ్యమవుతుందని అనుకునేదాని కంటే, వివిధ వర్గాల ప్రజల ఆలోచనా శైలిలో వస్తున్న మార్పుల వల్ల అని చెప్పవచ్చు. మరి ఈ వర్గాలే డీఎంకేకు వెన్నెముకగా నిలుస్తున్నారు మరి!!
కులరాజకీయాలు అధికం
తమిళనాడులో కులరాజకీయాల ప్రభావం ఎక్కువన సంగతి తెలిసిందే! కులాభిమానం, పేదరికం అనే రెండు అంశాలు విరోధాభాస వంటివి. ఎందుకంటే పేదలు అన్నివర్గాల్లో వున్నారు. కాకపోతే దళితుల్లో వీరి సంఖ్య అధికం. వన్నియార్లు, గౌండర్లు, థెవరాల వంటి ఓబీసీ కులాలవా రు, ఇప్పుడు విజయ్‌కు దళితులు పూర్తి అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. ఈ ఓబీసీలకు, దళితులకు ఎంతమాత్రం పొసగదు. ఇప్పుడు పట్టల్‌ మక్కల్‌ కచ్చి (పీఎంకే)కు వన్నియార్లలో బలం వుంది. అదే విడుత్తలై ఛిరుతైౖౖగల్‌ కచ్చి (వీసీకే)కు దళితుల్లోని పరైయార్‌ వర్గం మద్దతుంది. మరి ఈ రెండు పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకేలకు వ్యతిరేకం కానప్పటికీ, ఒకే కూటమిలో వుండటం సాధ్యంకాదు. ఇప్పుడు వెన్నియార్‌లు విజయ్‌కి అభిమానులుగా ఉన్నప్పటికీ, టీవీకేకు అత్యధికశాతం దళితుల మద్దతుండటంవల్ల, వారు పీఎంకేకు అనుకూలంగానే వుంటారుతప్ప దళపతివైపు మొగ్గు చూపరు.
ఏఐడీఎంకే `బీజేపీ కూటమి భవితవ్యం?
ఈవిధంగా ఓబీసీ లెక్కలు సంక్లిష్టమయంగా వున్న నేపథ్యంలో ఏఐడీఎంకాేబీజేపీ కూటమికి అను కూలంగా మారే అవకాశాలు ఎక్కువ. పశ్చిమ తమిళనాడులోని కొంగు వెల్లలార్‌ గౌండర్లు ఎప్పటికీ ఏఐడీఎంకేకు అనుకూలమే. ఎందుకంటే ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ కులానికి చెందినవాడే! ఉత్తర తమిళనాడులో బలమైన వెన్నియార్ల మద్దతున్న పీఎంకే ఇప్పుడు ఏఐడీఎంకాేబీజేపీ అలయన్స్‌ వైపు చూస్తుండటం గమనార్హం. దక్షిణ మరియు డెల్టా ప్రాంతాల్లో థేవర్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌సెల్వం, ప్రస్తుత టీటీవీ నాయకుడు దినకరన్‌లు ఈ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ తిరిగి ఏఐడీఎంకాేబీజేపీ కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అదీకాకుండా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయనార్‌నాగేంద్రన్‌ థెవర వర్గానికి చెందినవాడు. పన్నీర్‌సెల్వం, దినకరన్‌లు ఎన్‌డీఏ కూటమిలోకి చేరి తే, అప్పుడు కూటమికి థెవర వర్గంలో తిరుగుండదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే సైద్ధాంతిక ప్రాతిపదిక తప్ప, కులానికి ప్రాధాన్యత లేకపోవడంతో, దానికి ఇప్పటివరకు వున్న ఓట్లశాతంలో ఏవిధమైన మార్పు వుండదు. ఎందుకంటే దీని మద్దతుదార్లు సైద్ధాంతిక ప్రాతిపదికన వుండటం గమనార్హం. అందువల్ల విజయ్‌ ప్రభావం ఇతర పార్టీ లపై పడినంతగా భాజపాపై పడదు. విజయ్‌వల్ల బాగా దెబ్బతినేది సీమన్స్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కచ్చి (ఎన్టీకే) తమిళనాడుకు మరింత స్వేచ్ఛ కావాలని పోరాడే పార్టీ ఇది. యువకులు ప్రధానంగా రాజ్యాన్ని వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులు. వీరంతా ఇప్పుడు తమ అ భిప్రాయాన్ని విజయ్‌కి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అధికార డీఎంకే పార్టీ విషయానికి వస్తే, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవు. రాష్ట్రం మొత్తంమీద పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోనే డీఎంకేకు అసలైన ప్రమాదం పొంచివుంది. ఉదాహరణకు 2021లో కువందంపాలయం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థికి 9,776 ఓట్ల మెజారిటీ వచ్చింది. విచిత్రమేమంటే ఇక్కడ కమల్‌ హసన్‌ పార్టీ ఎంఎన్‌ఎంకు 23527 ఓట్లు రాగా, ఎన్టీకే పార్టీకి 17897 ఓట్లు వచ్చాయి. మరి ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే ఏఐడీఎంకేకు వచ్చిన మెజారిటీ ఓట్లకంటే ఎక్కువ. ఇదే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పార్టీల ఓట్లశాతం గమనిస్తే, ఎంఎన్‌ఎం పార్టీకి వచ్చిన ఓట్లు 18శాతం. 2016 ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పోల్చినప్పుడు డీఎంకే నుంచి చీల్చుకున్న 6శాతం ఓట్లున్నాయి. నాటి ఎన్నికల్లో డీఎంకే ఈ నియోజకవర్గం నుంచి 3శాతం ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం!
ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దళపతి నేతృత్వంలోని టీవీకే మొత్తంమీద పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమవుతుంది.
ఓటుబ్యాంకు రాజకీయాలు, కూటములు కట్టడంలో డీఎంకేకు తిరుగులేదు. దీంతోపాటు కుల రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట! ఈ నేపథ్యంలో దళపతి పార్టీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో నేటి పరిణామం ఒక్క సత్యాన్ని వెల్లడిస్తోంది. సంప్రదాయికంగా తమిళ రాజకీయాల్లో వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఏమీ తెలియని ఒక కొత్త నాయకుడు విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. ఛరిష్మా ఓటుగా మారితే, అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు సునామీలో కొట్టుకుపోయి, రాష్ట్రంలో కొత్త రాజకీయశకం ప్రారంభం కాగలదు.

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

‘‘నేటిధాత్రి’’, ఎఫెక్ట్‌

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

`కలెక్టర్‌ కళ్ళు కప్పి.. జగన్‌ కు అప్పజెప్పి.

`సన్నాలకు జగన్‌ కన్నం!

`వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!!

`అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!!

`కిలాడీ జగన్‌ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు

`జగన్‌ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు

`రైతుల ‘‘ట్రక్‌ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు

మూటగట్టుకుంటున్నాడు

`మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు

`పొల్యూషన్‌ అధికారుల నోరు నోట్లతో మూయిస్తున్నాడు

`ఇరిగేషన్‌ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు

`‘‘జేసి’’ని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్‌

`అధికారులందినీ గుప్పిట్లో పెట్టుకున్నారు

`మిల్లింగ్‌లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు

`గుమస్తా పని చేసి గూడుపుఠాణి నేర్చుకున్నాడు

`సన్నాలొద్దని గాయి గాయి చేశాడు

`ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు

`అటు రైతులను నిండా ముంచుతున్నాడు

`ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు

`కులం పేరు అడ్డం పెట్డుకొని కుటిల నీతికి పాల్పడుతున్నాడు

`మహా మాయగాడుగా వడ్లన్నీ మాయం చేస్తున్నాడు

`‘‘నేటిధాత్రి’’ కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు

`హన్మకొండ అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు

`ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్‌కే కట్టబెట్టారు

`ఎంక్వౌరీకి ఆదేశించినా హన్మకొండ అధికారులు కళ్లు తెరవడం లేదు

`ఖమ్మం జెసి నుంచి రికవరీ ఆర్డర్లు వచ్చినా హన్మకొండ అధికారులు మేలుకోవడం లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కొందరికి కాలం కలిసి వస్తుంది. మరి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి కొందరకి పేరు కలిసివస్తుంది. రాజపకీయం కలిసి వస్తుంది. కాని ఓ వ్యక్తికి మాత్రం అన్నీ కలిసి వస్తాయి. ఏక కాలంలో అన్నీ కలిసివస్తుంటాయి. అలా పుర్కర కాలం నుంచి సివిల్‌ సప్లయ్‌ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంచెలంచెలుగా కాదు, ఏకంగా ఒక్కసారే ఎదిగాడు. మోసాలకు వెన్నతో పెట్టిన విద్య అనే పదానికి నిర్వచనమయ్యాడు. అందరూ గుమస్తా జగన్మోహన్‌ రావు అంటుంటారు. పేరు ముందు వుండే కులం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. రాజకీయం వెన్నంటే వున్నట్లు చేసుకున్న ప్రచారం కలిసి వచ్చింది. అందుకు సివిల్‌ సప్లై శాఖ కూడా అండదండలు అందించింది. సహజంగా ఎవరికైనా వారి అదృష్టమే కలిసి వస్తుంది. కాని ఈ వ్యక్తికి ఇతరుల అదృష్టం కూడా లాక్కునేంత శక్తి వుంది. అందుకే మల్టీ టాలెంటెడ్‌ మాయగాడు అని అందరూ అంటుంటారు. ఒక గుమస్తా నుంచి ఏకంగా మిల్లర్‌గా ఎదగడమే కాదు, బినామీలతో మిల్లర్ల వ్యవస్ధను సృష్టించుకున్నాడు. మిగతా మిల్లర్ల నోరు కొడుతున్నాడు. ఇతర మిల్లర్లకు రావాల్సిన వడ్లను కొల్లగొడుతుంటాడు. అధికారులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. వారి బలహీనతలను తాను సొమ్ము చేసుకుంటున్నాడు. తోటి మిల్లర్లకు అన్యాయం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. రైతులను నిండా ముంచేస్తున్నాడు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాడు. సాగు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఎన్ని రకాలా మోసాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆచరించి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో మోసం, ఒక రకంగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు. ఇదే అదునుగా సివిల్‌ సప్లై శాఖ ఉద్యోగులతో సహకారంతో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సన్నాలను తను సొంతం చేసుకున్నాడు. నిజానికి అవి హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు కేటాయించారు. ఆ మిల్లులకు కాదని, రాత్రికి రాత్రి తన చాణక్యం ప్రదర్శించి, వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. కలెక్టర్‌కు తెలియకుండానే సివిల్‌ సప్లై శాఖ అధికారులు సహకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఈ జగన్‌కు వున్నవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు. గతంలో సన్నాలు తీసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి చేసినా వద్దని వారించాడు. ప్రభుత్వాన్నే ఎదిరించాడు. మాకు దొడ్లు వడ్లు మాత్రమే కావాలిన మొండికేశాడు. సన్నాల వల్ల తాము ఎంతో నష్టపోతామని, తాము నష్టాల బారిన పడిపోతామని అనేవాడు. ఇదే విషయంలో ఒకటి, రెండు సార్లు జాయింట్‌ కలెక్టర్‌ సమావేశానికి హజరుకాలేదు. కొన్ని సార్లు హజరైనా తన నిరసన తెలియజేస్తూ వెళ్లిపోయేవాడు. తమకు సన్నాలు వద్దని సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయేవాడు. అలాంటి జగన్‌ ఇప్పుడు సన్నాలు మాత్రమే కావాలంటున్నాడు. ఆయనకు రా రైస్‌ మిల్లులు లేవు. కాని సన్నాలు కావాలంటున్నాడు. ఇతర రా రైస్‌ మిల్లులకు చెందాల్సిన సన్నాలను కూడా లాగేసుకుంటున్నాడు. ఖమ్మం నుంచి 50 లారీల వడ్లు హన్మకొండ జిల్లాకు వచ్చాయి. వాటిని ఇతర మిల్లుకు అదికారులు కేటాయించారు. అయినా వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లానుంచి వచ్చిన వడ్లలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేశాడు. తప్పుడు లెక్కలు చూపించాడు. వడ్లు తీసుకొని, బియ్యం చేసే సరఫరాకు పెద్ద తేడాను తెలివిగా చూపించాడు. ఇది అధికారులు గమనించారు. దాంతో ఖమ్మం అధికారులు వెంటనే అలెర్టయ్యారు. ఇక్కడ ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన సన్నాల బస్తాల మీద తూకం రాయించారు. అక్కడ జగన్‌ దొరికిపోయారు. ఇచ్చిన సన్నాలుకు, జగన్‌ మిల్లులనుంచి వెళ్లిన బియ్యానికి పొంతన లేదు. దాంతో కమీషనర్‌ కార్యాలయానికి సమాచారం అందించి, ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఏఏ మిల్లు ఎంత మోసం చేసిందనే విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. అవి వసూలు చేస్తున్నారు. ఇలా సివిల్‌ సప్లైయ్‌ని పుష్కర కాలంగా మోసం చేస్తూ వస్తున్న జగన్‌ కిలాడీ వేషాలు అనేకం వున్నాయి. ఆయన చేస్తున్న ఘనకార్యాలు తక్కువేం కాదు. రైతులు తెచ్చే వడ్లకు ట్రక్‌ షీట్ల పేరుతో ప్రభుత్వం రవాణ చార్జీలు చెల్లిస్తుంది. అలా ప్రతి సీజన్‌లో కొన్ని మండలంలోని రైతులందరికీ ఆ సొమ్ము చేరాలి. కాని జగన్‌ ఆ వడ్లకు సంబందించిన ట్రక్‌ షీట్ల పేరుతో వచ్చే సొమ్మును మింగేస్తుంటాడు. ఆ సొమ్ము వెలల్లోనో, లక్షల్లోనో కాదు, ఏకంగా కోట్లలో వుంటుంది. అలా రైతులకు రావాల్సిన రవాణ ఖర్చులు మొత్తం తనఖాతాలోనే వేసుకుంటాడు. రైతుల చేత మాత్రం సంతాకాలు తీసుకుంటుంటుంటాడు. ఇలా ప్రతిసీజన్‌లో కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ చేస్తున్నాడు. జిల్లాలో అందరికీ అందాల్సిన సన్నాలన్నింటినీ ఈసారి సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ మిల్లులకే అప్పగిస్తున్నారు. మిగతా మిల్లర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. అయినా ఆ మిల్లులను సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే అదీ లేదు. సహజంగా బాయిల్డ్‌ మిల్లులకు నీటి శుద్ద ప్లాంట్లు వుంటాయి. జగన్‌కు చెందిన మిల్లులకు కూడా వున్నాయా? అంటే వున్నాయన్నట్లు వున్నాయి. అవి పనిచేస్తున్నాయా? అంటే తూతూ మంత్రంగా పనిచేస్తాయి. కాని వాటి పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ వుండదు. కాని అంతా బాగుందనే అదికారులు రిపోర్టులిస్తుంటారు. మరి నిజమేనా? అని ఆరా తీసేవారే లేకుండాపోయారు. బాయిల్డ్‌ మిల్లులో వడ్లు ఉడకపెట్టడానికి పెద్దఎత్తున నీటిని వినియోగిస్తారు. ఆ నీటిలో కొన్ని కెమికల్స్‌ కూడా మిక్స్‌ చేస్తారు. వడ్లను ఉడకపెడుతుంటారు. ఆ తర్వాత ఆ నీళ్లను బైటకు వదిలేస్తారు. అలా బైటకు పంపే నీరు ఎంతో దుర్గంధంతో వుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయేంత ధుర్గంధం వెదజల్లుతుంది. అలాంటి నీటిని మిల్లు పరిసరాల్లో వుండే నీటి శుద్ది ప్లాంటులోకి పంపించాలి. ఆ నీటిని శుద్ధి చేసి, బైటకు వదిలేయాలి. కాని జగన్‌కు చెందిన మిల్లుల నుంచి వెలువడిన ఆ నల్లని రంగుతో, దుర్గంధంతో కూడిన నీటిని మిల్లుల వెనక నుంచి వెళ్లే సాగు నీటి కాలువలో కలిపేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. కాని అదికారులు అటు వైపు వెళ్లరు. చూడరు. మిల్లుపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే మిల్లుల వెనక నుంచి సాగు నీటి కాలువ వెళ్తుందని వాళ్లకు తెలుసు. ఆ కాలువలోకి జగన్‌కు చెందిన మిల్లుల నీరు వెళ్లి ఆ కాలువలో చేరుతుందని తెలుసు. కాలువలో నీరంతా కలుషితమైపోతుందని తెలుసు. ఆ కాలువ ద్వారా వెళ్తున్న కెమికల్‌తో కూడిన మురుగునీరు పక్కనే వున్న చెరువులో చేరుతుందని తెలుసు. ఆ మిల్లుల వ్యర్దాల నీరు చెరువులోకి చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని తెలుసు. ఆ చెరువు నుంచి మరో చెరువుకు అదే నీరు వెళ్లి చేరుతుందని తెలుసు. అయినా అదికారులు కదిలింది లేదు. మిల్లుల మీద చర్యలు తీసుకున్నది లేదు. సరే ఇరిగేషన్‌ శాఖ అంటే పట్టించుకోలేదు. కాని పర్యావరణానికి హనీ కలిగే ఏ సంస్ధనైనా నిర్ధాక్షిణ్యంగా నిలిపివేసే శక్తి, హక్కు వున్న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏం చేస్తుందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక రోజో, రెండు రోజులో కాదు, నెలలు అసలే కాదు. ఏకంగా సంవత్సరాల తరబడి ఆ మిల్లులనుంచి వ్యర్ధాలన్నీ సాగు నీటి కాలువలోకి పంపిస్తున్నారు. పర్యావరణం పాడౌతోంది. నీరు కాలుష్యమైపోతోంది. మిల్లుల పరిసరాల్లో పెద్దఎత్తున దుర్గంధం వెదజల్లబడుతోంది. కాని అధికారులు ముక్కు మూసుకుంటున్నారు. అప్పుడప్పుడు మిల్లుల తనిఖీకి వచ్చినప్పుడు కళ్లు కూడా మూసుకుంటున్నారు. మిల్లుల్లో వుండాల్సిన నీటి శుద్ది ప్లాంటు కళ్లముందు పని చేయడం లేదని కనిపిస్తున్నా..బాగుందనే రిపోర్టు రాసేస్తుంటారు. పక్కనే సాగు నీటి కాలువను తొంగి కూడా చూడరు. అందులో కలుస్తున్న నీటిని పట్టించుకోరు. ఇలా వ్యవస్ధలను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సినన్ని దర్మార్గాలు జగన్‌ చేస్తున్నాడు. జాయింట్‌ కలెక్టర్‌ ఏం చేయగలడని కూడా తోటి మిల్లర్ల ముందు సవాలు కూడా విసురుతుంటాడని విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పుడు సెలవులు ముగించుకొని జాయింట్‌ కలెక్టర్‌ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్‌ మీద చర్యలు తీసుకుంటారా? జగన్‌ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

హోం మినిస్టర్‌ రాములమ్మ.

-తెలంగాణ తొలి మహిళా హోం మినిస్టర్గా విజయశాంతి.

FOR E-PAPER CLICK BELOW LINK

https://epaper.netidhatri.com/view/610/netidhathri-e-paper-3rd-june-2025

-తెలంగాణ కోసం అందరినీ ధిక్కరించిన ధీశాలి విజయశాంతి.

-నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న ఏకైక తెలంగాణ నాయకురాలు.

home minister vijayashanthi

-డిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

-బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఉద్యమ కారులతోనే ఎదుర్కోవాలి.

-బిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటే విజయశాంతి లాంటి వాళ్లే కావాలి.

-ఉద్యమ ఆకాంక్షలు, కేసిఆర్‌ మోసాలు తెలిసిన నాయకురాలు విజయశాంతి.

-అధిష్టానం ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

-ఏపిలో కూడా మహిళా హోం మంత్రి వున్నారు.

-డైనమిక్‌ విజయశాంతికి హోం బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు.

-రాములమ్మ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఇచ్చిన మాట.

-తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆనాడు పార్టీలో చేరారు.

-అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.

-తెలంగాణ కోసం తల్లి తెలంగాణ ఏర్పాటు చేసిన విజయశాంతి.

-రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితం త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి.

-ఏనాడు పదవుల కోసం ఆశించి రాజకీయాలు చేయలేదు.

-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి కెరియర్‌ కూడా వదులుకున్నారు.

-ఎన్నికల రాజకీయాలలో పదవుల అనుభవించిన వారు త్యాగాలు అని చెప్పుకుంటున్నారు.

-విజయశాంతి త్యాగం అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కవ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాములమ్మ హోం మంత్రి కాబోతున్నారా? అంటే డిల్లీ సర్కిళ్లలో ఔననే సమాధానం వస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీల నుంచి ఎవరూ మంత్రి లేరు. ఎమ్మెల్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి మరింత ప్రాదాన్యతనిచ్చినట్లు సంకేతాలు కూడా కాంగ్రెస్‌ పంపాలని అనుకుంటోంది. అందుకే ఆరు మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం వుంది. అయితే అవి ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక ఇంకా కొంత కాలం ఆగి చేస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరమైన పదవులు ఇప్పటికే చాలా వరకు కొలిక్కి వచ్చాయి. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లే లెక్క. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మాత్రమే మిగిలివున్నాయి. పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇంకా రాలేదని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌లో వున్న పార్టీపరమైన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలందరూ పార్టీ అటోమెటిగ్‌గా ఉపాధ్యక్షులౌతారు. ఇది అనాదిగా ఆపార్టీలో అనుసరిస్తున్న సంప్రదాయమే. అవి కూడా పూర్తయనట్లే లెక్క. ఇక మిగిలినవి మంత్రి పదవులు. నామినేటెడ్‌ కార్పోరేషన్‌పదవులు ఇంకా కొన్ని పెండిరగ్‌లో వున్నాయి. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో నామినేటెడ్‌ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. కాని మంత్రి పదవుల పంపకాలలో కొన్ని పీట ముడులున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఒక్క రాములమ్మకు మాత్రమే మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆమె మెదక్‌ పార్లమెంటును పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ నుంచి సూచనలు వచ్చినా ఆమె పార్టీకి సేవ చేయడానికే పరిమితయ్యారు. అందుకే ఆమె 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌గా బాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదని ఎన్ని రకాల వార్తలు వచ్చినా స్పందించలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా వున్నానని కూడా చెప్పలేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆమె చేసుకుంటూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా పార్టీపై ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాను చేసిన సేవలకు, తెలంగాణ ఉద్యమ కారిణిగా సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని మాత్రం నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు వరంగా మారింది. తెలంగాణ వచ్చిన సమయంలో పార్టీ ఆమెకు కొన్ని వాగ్ధానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే సముచితస్ధానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ పదేళ్లలో ఆమె ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, కాంగ్రెస్‌లోనే వున్నది. ఓ దశలో రాములమ్మ కాంగ్రెస్‌లో వున్నట్లా? లేనట్లా? అంటూ వార్తలు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి పిలుపు లేదని కూడా ఆమె ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేసింది లేదు. సమయం కోసం వేచి చూశారు. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కూడా ఆమెకు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎంత నిబద్దతతో వుంటుందో ఈ ఒక్క విషయంలోనే తేలిపోయింది. ఎంతో మంది పేరు ఎమ్మెల్సీల ఎంపికలో వచ్చినా, విజయశాంతికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. విజయశాంతి అంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎంత విశ్వాసమో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి అంటే సామాన్యురాలు కాదు. ఆమె ఒకప్పటి సినీ సూపర్‌ స్టార్‌. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, మూడు దశాబ్దాల పాటు ఆమె సినీ పరిశ్రమను ఏలిన నటి. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో ఆమె అగ్రశ్రేణి నటిగా ఓ వెలుగు వెలిగారు. దేశమంతా లేడీ అమితాబ్‌ అని కీర్తించేవారు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలో వుండేవారు. కేరిర్‌ పీక్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఆమె జై తెలంగాణ అన్నారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ ఇచ్చింది చాలు. ప్రేక్షకుల ప్రేమచాలు. ఇక తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వస్తున్నానని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. నిజానికి ఆమె రాజకీయంగా పదవులే కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పదవులు వచ్చేవి. తమిళనాడులో కూడా ఆమెకు పెద్ద పెద్ద పదవులే వచ్చేవి. ఎందుకంటే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విజయశాంతి ఎంతో సన్నిహితురాలు. ఆమె రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడు నుంచికూడా ఎమ్మెల్యే అయ్యేది. మంత్రి అయ్యేది. కాని ఆమె తెలంగాన ఉద్యమంలోకి వచ్చారు. కేరీర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన వద్దనుకున్నారు. కార్లు, అద్దాల మేడలు, ఏసి గదుల్లో జీవితం వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలకు తోడుగా పోరాటంలోకి దిగారు. తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె ఉద్యమానికి ఖర్చు చేశారు. తల్లి తెలంగాణ పార్టీ నిర్వహణకు కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఆమె ఆ పార్టీని అలాగే నడిపి వుంటే ఆమె రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. ఆమె ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చేది. కేసిఆర్‌ మాటలు నమ్మి, కేవలం తెలంగాణ కోసం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది కేసిఆర్‌ పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేయొద్దని సూచించారు. కేసిఆర్‌ వల్ల మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. ఎందుకంటే అప్పటికే తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ అంతటా విస్తరించింది. అన్ని జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు పోటీగా తల్లి తెలంగాణ ఎదిగింది. ఆ పార్టీ కోసం, ఉద్యమం కోసం కొన్ని వందల మంది తల్లి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దఎత్తున ఖర్చు చేసింది. వాళ్లందరికీ బిఆర్‌ఎస్‌లో సముచిత స్ధానం వుంటుందని విజయశాంతిని నమ్మించారు. చివరికి ఆమెను కూడా కేసిఆర్‌ నట్టెట ముంచారు. తొలుత విజయశాంతిని సొంత చెల్లెలుకన్నా ఎక్కువ అంటూ ఆమెను నమ్మించారు. తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిస్తూ పోయారు. అయినా ఆమె ఏనాడు వెరవలేదు. తెలంగాణ కోసం మాత్రమే తాను వచ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు ప్రత్యేకమైన రాజకీయం అవసరంలేదని తేల్చి చెప్పారు. టి ఆర్‌ఎస్‌ నుంచి తప్పించినా, ఆమె చిరునవ్వుతోనే స్వాగతించింది. తాను కోరుకున్న రాష్ట్రం ఏర్పాటైందన్న సంతోషమే ఆమె ఎక్కువ పడిరది. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన చరిత్ర చాలనుకున్నది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానన్న మాటను కూడా నిలబెట్టుకున్నది. ఆమె అంకితభావం కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోరాట పటిమ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష్యంగా చూసింది. డిసెంబర్‌ 9 ప్రకటన పరిణామాల తర్వాత జరిగిన ఉద్యమంలో విజయశాంతి చూపిన చొరవ అంతా ఇంతా ఇంతా కాదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సాగిన పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్కనాడు సజావుగా సాగకుండా అడ్డుకున్న ఏకైన నాయకురాలు విజయశాంతి. నాలుగేళ్ల సుధీర్ఘ కాలం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ఆమె సభ జరుగుతున్నంత సేపు నిలబడి నిరసన తెలియజేసేశారు. వెల్‌లోకి దూసుకెళ్లెవారు. ఆ అవకాశం దక్కనప్పుప్పుడు తనసీట్‌ వద్దనే నిలబడి నిరసన తెలియజేసేవారు. నిజానికి లోక్‌సభ సమావేశాలకు కేసిఆర్‌ పెద్దగా హజరయ్యేవారు కాదు. బడ్జెట్‌సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదు. కాని విజయశాంతి ఏ ఒక్కరోజు కూడా వెళ్లకుండా వుండలేదు. నిరసన తెలియజేయని రోజంటూ లేదు. అలా నాలుగు సంవత్సరాల పాటు లోక్‌సభలో నిరవదిక నిరసన చేసిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమకారిణి విజయశాంతి త్వరలో తెలంగాణ మంత్రి కానున్నారు. ఆమె చేసిన త్యాగం వృధా కాలేదు. కాస్త ఆలస్యం కావొచ్చు. కాని గుర్తింపు ఎప్పటికైనా పక్కా అనుకున్న ఆమె నమ్మకం మరోసారి నిలబడిరదనే చెప్పాలి.

ఖద్దరు కక్షలకు ఖాకీ బలి !?

`పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు.

`రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్న పోలీసు?

`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.

`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.

`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.

`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.

`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.

`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.

`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.

`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.

`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.

`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.

`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

`కాంగ్రెస్‌ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.

`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.

`కాంగ్రెస్‌లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.

`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.

`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.

`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.

`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.

`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.

`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.

`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.

`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.

`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.

`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.

`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.

`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.

`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్‌ఫర్‌ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్‌ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్‌ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్‌ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్‌ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్‌ బుక్‌, పింక్‌ బుక్‌, బ్లాక్‌ బుక్‌ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్‌ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

వచ్చే సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి దేశీయ సెమికండక్టర్‌ చిప్‌లు

 

`28`90 నానోమీటర్‌ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు

`దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు

`దేశ అవసరాలతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే యత్నాలు

`వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సెమికండక్టర్‌ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్‌ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్‌ చిప్‌ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్‌ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ తయారీ చిప్‌ ఈ ఏడాది చివరల్లో మార్కెట్‌లోకి రానుంది. మే 29న జరిగిన కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వార్షిక వాణిజ్య సదస్సులో ఈ అద్భుత విషయాన్ని ప్రకటించారు. 2022లో భారత్‌ ఈ చిప్‌ తయారీ రంగంలోకి భారత్‌ ప్రవేశించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం విశేషం. ఈ ప్రకటనతో భారత్‌ అంతర్జాతీయ చిప్‌ మార్కెట్‌లో తన వంతు వాటాను సాధించేందుకు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు పడినట్లయింది. ముఖ్యంగా చిప్‌ తయారీలో టెక్నాలజీ నోడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. మొత్తం చిప్‌ మార్కెట్‌లో 60శాతం టెక్నాలజీ నోడ్‌ ఆక్రమిస్తోంది. ప్రస్తుతం భారత్‌ ఈ రంగంలో పట్టును సాధించేందుకు వ్యూహా త్మకంగా గట్టి ప్రయ్నతం చేయనుంది. ఆటోమోటివ్‌, టెలికమ్యూనికేషన్‌, విద్యుత్‌ వ్యవస్థలు, రై ల్వే సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో టెక్నాలజీ నోడ్‌ చిప్‌లకు అత్యధిక డిమాండ్‌ వుంది. ప్రస్తుతం మనదేశంలో ఆరు ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదేసమయంలో దేశంలో రూ.76వేల కోట్లతో సెమికండక్టర్‌ ఎకోసిస్టమ్‌ రూపకల్పన జరుగుతోంది. దీన్ని సెమికండక్టర్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సెమికండక్టర్‌ చిప్‌ల దిగుమతిపై మనదేశం పూర్తిగా ఆధారపడాల్సి వస్తున్నది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తం గా చిప్‌తయారీ దెబ్బతిన్న ప్రభావం మనదేశంపై బలీయంగా పడినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో చిప్‌లు ప్రతి రంగానికి అత్యంత అవసరమైన నేటి కాలంలో, వీటిపై పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదని అప్పుడే భారత్‌ గుర్తించి, వీటి తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన కృషిని ప్రారంభించింది. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో తయారైన చిప్‌లు మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో పాటు మనదేశం ప్రపంచ చిప్‌ మార్కెట్‌లో వాటా సంపాదించడం తో పాటు మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. 

వ్యూహాత్మక ప్రకటన

దేశంలో తొలి సెమికండక్టర్‌ చిప్‌ తయారీ ప్రకటన వెనుక ఎంతో జాగరూకత, వ్యూహాత్మకత ఇమిడి వున్నాయి. చిప్‌లను స్వదేశంలో తయారుచేయడం వల్ల మనకు దిగుమతుల భారం తగ్గ డంతో పాటు గ్లోబల్‌ మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సాంకేతిక రంగంలో మన సార్వభౌమాధికారాన్ని సుస్థాపితం చేయడంతో పాటు ఆర్థికపరంగా ఇతరదేశాలతో మరింత పోటీ పడేస్థితికి ఎదగవచ్చు. కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ`2వ సదస్సులో మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చేసిన ప్రకటనలోని సారాంశం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్‌ వుండటంతో పాటు 60% డిమాండ్‌ వున్న టెక్నాలజీ నోడ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించి సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యమన్నది స్పష్టం చేస్తున్నది. ఈరంగంలో మార్కెట్‌ గతిశీలతపై ఇప్పటికే మనదేశం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ సెమికండక్టర్‌ పరిశ్రమకు వాణిజ్యపరంగా బలమైన పునాది వేసేందుకు మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

2030 నాటికి గ్లోబల్‌ సెమికండక్టర్‌ చిప్‌ల మార్కెట్‌ ఒక ట్రిలియన్‌ డాలర్లను మించిపోనున్నదన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో మనదేశం చిప్‌ మార్కెట్‌లోకి త్వరలో ప్రవేశిస్తుందన్న ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పుడు మనదేశం ప్రధానంగా చిప్‌లకు సంబం ధించి దేశీయ అవసరాలను పూర్తిచేస్తూనే, ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించే రీతిలో వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి వుంటుంది. మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పిన విధంగా మనం కేవలం ఫ్యాబ్రికేషన్‌పై మాత్రమే దృష్టిపెట్టడం కాదు మొత్తం ఎకోసిస్టమ్‌ను పరిపూర్ణంగా నిర్మించా ల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ రంగంలో భారత్‌ సంపూర్ణ దృక్కోణం ఏవిధంగా వున్నదీ అర్థమవుతోంది. అంటే తయారీతో పాటు దేశీయంగా మేధోఆస్తుల అభివృద్ధి, ఉత్పత్తి డిజైన్‌, ప్రామాణీకరించడం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ టెక్నాలజీపైనే మనదేశం ప్రధానంగా దృష్టిపెట్టడానికి కారణం, ప్రపంచంలో ఈ సెగ్మెంట్‌కున్న డిమాండ్‌ మాత్రమే! అతి చిన్న నానోమీటర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన కారణం కేవలం దీనికున్న ప్రాసెసింగ్‌ శక్తి మరియు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం. అదీకాకుండా 28ా90 నానోమీటర్‌ సెగ్మెంట్‌ ప్రస్తుతం పారిశ్రామిక రంగం, దాంతో మమేకమై పనిచేసే వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది భారత్‌లో వినియోగానికి తక్షణం అవసరం. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్‌కు కూడా దీని అవస రం చాలా అధికంగా వుంది. ఈ సెగ్మెంట్‌లో తయారీని కొనసాగించాలని నిర్ణయించడానికి మరో కారణం తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత ఆధునిక టెక్నాలజీ నోడ్స్‌ రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసుకోవడం.

సాంకేతిక ప్రత్యేకతలు మరియు అనువర్తనాలు

28`90 నానోమీటర్‌ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన అనేక పరిశ్రమలకు కావలసిన సంక్లిష్ట అనువర్తనాలకు ఈ నానోమీటర్‌ టెక్నాలజీ ఒక వేదికగా నిలుస్తుంది. ఈ నానోమీటర్‌ పరిమాణంలోని అతిచిన్న చిప్‌ల కారణంగా, తయారు చేసే సెమికండక్టర్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ పనితీరు, తక్కువఖర్చు మరియు తయారీ సంక్లిష్టతల మధ్య అద్భుతమైన సమ న్వయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్‌ పరంగా అత్యంత స్థితిస్థాపక లక్షణం వుంటుంది. ఫౌండ్రీ మార్కెట్‌ షేర్‌ 7.5%ను సుస్థిరంగా వుండేలా చూడగలదు. అంటే ఫ్రౌండ్రీ స్థాయిలో 15బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల మార్కెట్‌ అన్న మాట. ఇదే స్థితి కొనసాగితే 2030 నాటికి 200 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను తేలిగ్గా సాధించవచ్చు. 

దేశీయ పరిశ్రమలకు ఉపయోగం

28ా90 నానోమీటర్‌ రేంజ్‌ దేశీయ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరం. అంతేకాదు దేశీయ మార్కెట్‌ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా దేశానికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్‌ రంగాన్ని తీసుకుంటే ఈ చిప్‌లు ఇంజిన్‌ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉద్గమిస్తున్న విద్యుత్‌ వాహనాలకు అవసరమైన సాంకేతిక అవసరాలను ఈ 28ా90 నానోమీటర్‌ రేంజ్‌ తీర్చగలుగుతుంది. ఇక టెలికమ్యూనికేషన్‌ రంగం గురించి చె ప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రంగానికి చిప్‌ సాంకేతిక పరిజ్ఞానం ఒకరకంగా ప్రాణం వంటిదనే చెప్పాలి. నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు, బేస్‌ స్టేషన్లు, వినియోగదారుల ఉపకరణాలు, విద్యుత్‌ వ్యవస్థలు ఈ చిప్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తాయి. అంతేకాదు విద్యుత్‌ నిర్వహణ మరియు గ్రిడ్‌ గరిష్టంగా పనిచేయడంలో ఇవి చాలా అవసరం. రైల్వేల్లో ఆ ధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థల్లో ఈ చిప్స్‌ను విస్తృతంగా వాడతారు. అంతేకాదు రైలు నియంత్రణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల్లో, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా చిప్‌లు బాగా అవసర మవుతాయి. 

దేశభద్రత మరింత పటిష్టం

28`90 ఎన్‌ఎం నానో టెక్నాలజీని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌లు ఈ చిప్స్‌ విస్తృతంగా ఉప యోగపడతాయి. ప్రస్తుతం మనదేశ ప్రాథమిక దశలో వున్న సెమికండక్టర్‌ పరిశ్రమ దేశంలోని బహుళ మార్కెట్‌ వ్యవస్థల అవసరాలను తీర్చగలుగుతుంది. కాగా మనదేశంలో సెమికండక్టర్‌ చిప్‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌ాఆక్టోబర్‌ మధ్యకాలంలో మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా వే స్తున్నారు. ఈ చిప్‌లు అందుబాటులోకి వస్తే ఆర్థికంగానే కాదు, దేశభద్రత కూడా మరింత పటిష్టమవుతుంది. ఈ నానో చిప్‌ల తయారీలో పరిణితి సాధించిన తర్వాత 14ా7 ఎన్‌ఎం చిప్‌ల తయారీకి ముందడుగు వేయవచ్చు.

కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం
ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే
అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం
ఎదుగుదల లేని అణగారిన కులాలు
ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన
కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు
అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం
సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన
డెస్క్‌ ,నేటిధాత్రి: 
కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తిచేశాయి. ఇక జనతాదళ్‌ (యు) బిహార్‌లో దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన పూర్తిచేసింది. కులగణనలో సశాస్త్రీతను ప్రశ్నించినవారు లేకపోలేదు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కలిగివున్న కులాలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఈ కులగణను వ్యతిరేకించడాన్ని కూడా మనం చూశాం. బీజేపీ మొదట్నుంచీ కులగణను వ్యతిరేకిస్తోంది. ఓట్లకోసం హిందువులను విభజించి ప బ్బం గడుపుకోవాలన్న దురాశతోనే విపక్షాలు కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయంటూ వాదించినా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దీన్ని ప్రధానాస్త్రంగా ఉపయోగించడంతో తప్పనిపరిస్థితుల్లో కేంద్రం వచ్చే జనగణనతోపాటు కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. విచిత్రమేమంటే విపక్షాలు దేన్నయితే తమ ప్రధాన అస్త్రంగా మలచుకోవాలనుకుంటున్నాయో అది బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రా ల్లో బలీయంగా వున్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఈ కులగణన ఫలితాలు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయనేది ఇప్పుడిప్పుడే వెల్లడవుతుండటం తాజా పరిణామం. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌ (యునైటెట్‌) పార్టీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓబీసీ కులాలకు చెందిన నాయకులకు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే పరిస్థితి ఏర్పడిరది. అదెట్లాగో పరిశీలి ద్దాం.
మింగుడుపడని సమస్య
ఎస్సీ వర్గాలను ఉపకులాలుగా వర్గీకరించమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఆవర్గాల్లో సమస్యాత్మకంగా మారినట్టే, ఇప్పుడు కులగణన ఓబీసీ (ఇతర వెనుకబడిన కులా లు) రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు మింగుడు పడటంలేదు. పైకి కులగణన వల్ల అధిక జనాభా కలిగిన ఓబీసీ కులాలవారికి ప్రయోజనం కలుగుతుందని పైకి ఎంతగా విపక్షాలు వా  దించినా, ఓబీసీల్లోని కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్న సంగతి ఇప్పుడు మరింత   ప్రస్ఫుటం కానుంది. అంటే ఓబీసీకులాల్లోనే అసమానతలు బహిర్గతమవుతున్నాయి. రాజ్యాం  గం ప్రసాదిస్తున్న రిజర్వేషన్ల ఫలాలను కూడా వీటిల్లోని కొన్ని కులాలుమాత్రమే అనుభవించడమేకాకుండా మరోపక్క రాజకీయ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో  కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వైనం కులగణన పుణ్యమాని మరింత స్పష్టంగా వెల్లడి కానుంది. ఇప్పటివరకు ఓబీసీ భజన చేస్తున్న విపక్షాలకు ఇదొక విరోధాభాస వంటిదేనని చెప్పాలి. 
కొన్ని కులాలదే ఆధిపత్యం
1931లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో కులగణన నిర్వహించిన తర్వాత, మళ్లీ దాన్ని చేపట్టడం ఇదే ప్రథమం. కేంద్రం నిర్ణయాన్ని ఎస్‌.పి, ఆర్‌జేడీ, జెడీ(యు), కాంగ్రెస్‌ పార్టీలు స్వాగతిం చాయి. కేంద్రం నిర్ణయం తీసుకోవడం తన ఘనతేనని జేడీ(యు) చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కాకపోతే ఇప్పుడు ఎస్‌.పి, ఆర్‌జేడీలు కూడా ఈ అంశాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఈ మూడు పార్టీలు జయ ప్రకాష్‌ నారాయణ్‌ యుగం, మండల్‌ కమిషన్‌ కాలం తర్వాత వెలుగులోకి వచ్చినవే. ఎందుకంటే ఈ మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఓబీసీలకు చెందిన కొన్ని కులాల నాయకులు మాత్రమే! ఓబీసీల ఐక్యతారాగం వెనుక ఆయా కులాల ‘సామాజిక`ఆర్థిక వెనుకబాటు’ అనే ని నాదం ప్రధాన పాత్ర పోషించిందనేది కీలక సత్యం. ఇందులో భాగంగానే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి, ములాయంసింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ`క్షత్రియ ఆధిపత్యాన్ని దెబ్బతీసి ఓబీసీల పాలనను అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ‘ఓబీసీ’ కులంకార్డుతో రాజకీ  యాలు నడిపి ఆర్‌జేడీ పాలనను తీసుకొచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అణగదొక్కామని ప్రచారం చేసుకున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, వారిని తలదన్నే రీతిలో తన కుటుంబ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఓబీసీల్లో ఎవరినీ పైకి రానీయకుండా అప్రతిహతంగా బిహార్‌ను పాలించారు. ఇక నితీష్‌ కుమార్‌ విషయానికి వస్తే, ఆయన పై ఇద్దరు నాయకులంత దూకుడుగా కాకుండా, మధ్యేమా ర్గంలో తన ఓబీసీ రాజకీయాన్ని కొనసాగించారు.బిహార్‌ రాజకీయాల్లో యాదవుల (ఓబీసీలు) వెన్నుదన్నుతోనే ఆర్‌జేడీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో వీరి జనాభా     14% కావడం ఇక్కడ కీలకం. 
ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి వస్తే యాదవుల జనాభా 8 నుంచి 10శాతం వరకు వుంటుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓబీసీల్లోని ఇతర ఉపకులాలు, ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో నితిష్‌కుమార్‌ ప్రధానంగా కూర్మీలు (ఇది ఆయన కులం) మరియు కోయిర్లపై ఆధారపడి తన రాజకీయాన్ని నడిపారు. ఈ రెండుకులాలు కలిపితే 7 నుంచి 10శాతం వరకు వుంటారు. అయితే తీవ్రంగా వెనుకబడిన కులాల్లో (ఈబీసీ) ఆయన గట్టి పట్టును సంపాదించడం కూడా జేడీయూ అధికారంలోకి రావడానికి మరో కారణం. ఎందుకంటే ఈబీసీల జనాభా రాష్ట్రంలో36% వరకు వుంది. 
ఇక ఓబీసీ పల్లవి కష్టం
ఈవిధంగా ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌లు ఓబీసీ రాజకీ యాల నేపథ్యంలో ఎదిగినా, చివరకు ఈ వర్గాల్లో కేవలం ఒక్క కులం మాత్రమే ఆధితపత్యం వహించడం చివరకు చోటుచేసుకున్న పరిణామం. ఇప్పుడు చేపట్టిన కులగణన వల్ల, ఓబీసీల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారన్న నిజం బయటకు రావడం ఈ నాయకులకు మింగుడుపడటం లేదు. అంటే ఓబీసీల్లో ఎన్నో కులాలున్నప్పటికీ కేవలం ఒకే ఒక కులం అగ్రవర్ణాలను తలదన్నే రీతిలో ఆధిపత్యం వహిస్తున్నదన్న సత్యం బహిర్గతం కావడంతో ఇప్పుడు ఆయా నాయకులకు ఓబీసీ పల్లవిని అందుకోవడం కష్టంగా మారింది. అంతా ఓబీసీలే అనేది ఒక సత్యమైతే, వీరిలో ఒక కులం మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నదనేది మరో సత్యం. ఈవిధంగా కులగణనలో ఓబీసీ అనేది ఒక విరోధాభాసగా తయారైంది! దేశ జనాబాలో ఓబీసీలదే సింహభాగమని పై మూడు రాజకీయ పార్టీల వాదన. అందుకనే కులగణ చేపడితే ఓబీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీ యపరంగా న్యాయం జరుగుతుందని వీరు చేస్తున్న వాదన కూడా సహేతుకమే. అయితే ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం ఓబీసీల్లో ఏదో ఒక కులం చేతిలోనే వున్నదనేది ఈ కులగణనద్వారా స్పష్టమవుతోంది. అంటే ఎస్సీ రిజర్వేషన్లలో మాలలు ప్రయోజ నం పొందినట్లుగానే, ఓబీసీల్లో యాదవుల వంటి కొన్ని కులాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయని చెప్పవచ్చు. 
‘యాదవీకరణ’
ఓబీసీ రాగం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు ఓబీసీల్లోని ‘యాదవ’ కులానికి చెందినవారు. ఎప్పుడైతే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు అధికారంలోకి వచ్చాయో అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో కేవలం ఈ కులానికి చెందినవారే ఎక్కువగా ప్రయోజనం పొందడం మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ‘యాదవీకరణ’ జరిగిందనేది ప్రధానంగా వచ్చిన ఆ రోపణ. ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు యు.పి.లోని 1526 పోలీస్‌ స్టేషన్లలో,    600 యాదవ్‌ కులానికి చెందిన పోలీసు అధికార్ల ఆధిపత్యంలో వుండేవని ఒక నివేదిక వెల్లడిరచింది. లక్నో, మధుర, కాన్పూర్‌, ఘజియాబాద్‌, సంభాల్‌, బడౌన్‌ వంటి నగరాల్లోని పోలీస్‌ స్టేషన్లలో 40శాతం వరకు యాదవుల ఆధిపత్యంలోనే వుండేవి. సీనియర్‌ అధికార్ల అంచనా ప్రకారం 50శాతం పోస్ట్‌లను అనధికారికంగా యాదవ్‌లకు రిజర్వ్‌ చేసి వుంచేవారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కేవలం ఎస్‌.పి. ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడే ఇట్లా జరిగిందా అంటే, బీఎస్‌పీ అధికారంలో వున్న 2011వ సంవత్సరంలో కూడా ఇదే తంతు  కొనసాగడం విశేషం. బీఎస్‌పీ కాలంలో ప్రావెన్షియల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పీసీఎస్‌) పరీక్షా ఫలితాల్లో 176 మంది ఓబీసీలు ఉత్తీర్ణులైతే వీరిలో 147మంది యాదవులు! దీంతో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం మరో 86మంది అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 54 మంది మళ్లీ యాదవులే వుండటం గమనార్హం! ఈ 54 మందిలో చివరకు   ఇంటర్వ్యూలో 50 మంది ఎంపికయ్యారు. 2011 నుంచి 2014 వరకు వివిధ రకాల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన అభ్యర్థులే ఎంపికవడం గమ నార్హం. తర్వాతి కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 8 నుంచి 14 టిక్కెట్ల ను యాదవులకే కేటాయించింది. 2024లో అఖిలేష్‌ యాదవ్‌ తమ కులానికి కేవలం నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇచ్చారు. ఆ నలుగురూ కూడా ఆయన కుటుంబసభ్యులే! నెల క్రితం వరకు యు.పి.లోని 22 జిల్లాల్లో పార్టీ ఆధిపత్యం యాదవుల చేతుల్లోనే కొనసాగింది.
బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ
ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఐదేళ్లపాటు బిహార్‌ను పాలించారు. ఆయన పాలన దేశంలోనే గొప్ప అవినీతి, అరాచకాలకు బ్రాండ్‌గా మారిపోయింది. వివిధ శాఖలకు చెందిన అధికార్లు వేధింపుల భయంతో బదిలీలు చేయించుకున్నారు. కొద్దో గొప్పో సంపద కూడబెట్టుకున్న వారు దాన్ని బయటపెట్టడానికి భయపడ్డారు. భద్రతకోసం మహిళలు, పురుషులపై మరింతగా ఆధారపడాల్సి వచ్చింది. ఓబీసీ కులాల్లో పేదలు మరింత పేదలుగా మారగా, ధనికులు మరింతధనికులయ్యారు. లాలూ కాలంలో భూమి లావాదేవీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలైన వాటి ల్లో ఎక్కువ ప్రయోజనం పొందింది యాదవులే. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సురేంద్రయాదవ్‌, సాధుయాదవ్‌, సుభాష్‌ యాదవ్‌ వంటివారు రాష్ట్ర యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకఛ  త్రాధిపత్యంగా అధికారాన్ని చెలాయించారు. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణన ప్రకారం, ప్రభుత్వ సర్వీసుల్లో 6,21,4811 మంది ఓబీసీలుండగా వీరిలో 2,89,538 (46.59%) మంది యాదవులే! ఆవిధంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓబీసీల్లో యాదవులను ఎంతగా పైకి తీసుకొచ్చారో మిగిలినవారిని అంతగా నిర్లక్ష్యం చేశారు. ఉదాహరణకు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం టిక్కెట్లను కేవలం యాదవులకే ఇచ్చిన ఘనత లాలూది. 2023లో 15 జిల్లాల్లో పార్టీకి నాయకత్వం వహించింది యాదవులే! లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కులపిచ్చి ఎంతగా ముదిరిపో యిందంటే ఆఖరుకు ముస్లింలు ఆధిపత్యం వహించే స్థానాల్లో కూడా యాదవులకే టిక్కెట్లు ఇచ్చేస్థాయికి చేరుకుంది. 
కూర్మీ కోయిర్లు మరియు లవ్‌కుశ్‌ ఐకమత్యం
నితిష్‌కుమార్‌ కూర్మీ`కోయిర్‌ కులాలను ఒకే విధంగా చూస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమతు ల్యాభివృద్ధి వుండాలనేది ఆయన అభిమతం. అందుకనుగుణంగానే ఆయన విధానాలు కొనసా గుతాయి. ఉపేంద్ర కుశావహ, శకుని చౌదరి (బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి తండ్రి) నితిష్‌కు గట్టి మద్దతుదార్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూర్మీ`కోయిరీ సంయోజనను లవ్‌`కుశ్‌గా రాష్ట్ర ప్రజలు పరిగణిస్తారు. భూకమతాలను కలిగివుండి వ్యవసాయంపై ఆధారపడే ఈ వర్గాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలను నితిష్‌ ప్రభుత్వం క ల్పించింది. ప్రస్తుతం బిహార్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్‌లో 46.6% యాదవులే వున్నారు. అదే లవ్‌`కుశ్‌వర్గం ఓబీసీ రిజర్వేషన్లలో 36.9% కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర జనా భాలో యాదవులు 14.27% కాగా కోయిరీ`కూర్మీ ప్రజలు 7.09%. ఇప్పుడు మొత్తం ఉద్యోగాల్లో కోయిరీ`కూర్మీ ప్రజలు కేవలం 2.47పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. అంటే ఇక్కడ జనాభా సంఖ్యకు, పొందుతున్న ఉద్యోగాలకు పొంతన వుండటంలేదనే అర్థం! ఎందుకంటే ప్రభుత్వ ఉ ద్యోగాల్లో యాదవుల ప్రాతినిధ్యం 1.55గా వుంది మరి!!
ఇతర రాష్ట్రాల్లో కూడా
ఈవిధంగా జనాభా సంఖ్యకు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యానికి పొంతనలేకపోవడం కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితం కాదు. జార్కండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే ఓబీసీ వర్గాల్లోని ఆధిపత్య కులాలు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతుండగా, మిగిలినవారికి అవి అందుబాటులో లేవు. ఆర్‌జేడీ, ఎస్‌.పి., జెడీ(యు) వంటి ప్రాంతీయ పార్టీలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తొలగించి వెనుకబడిన తరగతులకు అధికారాన్ని కట్టబెట్టాయని కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ, వెనుకబడిన కులాల్లో అట్టడుగున వున్న కులాల స్థితిగతుల్లో ఏవిధమైన మార్పు లేదన్నది అక్షరసత్యం. అందువల్ల కులగణన అనేది కేవలం  సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఓబీసీ వర్గాల్లోని కొన్ని కులాలు అగ్రవర్ణాలను మించిన స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. జనాభాపరంగా తక్కువగా వున్న కులాలు, తమ అస్తిత్వంకోసం ఒక ఆధిపత్య కులానికి మద్దతు పలకాల్సి వస్తుండటంకూడా గమనించాలి. ఇప్పుడు బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ను చాలామంది యాదవులు అనుమాన దృక్కులతో చూస్తున్నారు. కుశావహలకు అనుకూలంగా ఆయన మెలగడమే కారణం. జార్ఖండ్‌ లో గత ఎన్నికల్లో సురేష్‌ మెహతో నేతృత్వంలో ఆల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (ఏజేఎస్‌యూపీ) ఏర్పాటైంది. సురేష్‌ మెహతోను తరచుగా కూర్మీ మెహతోగా పిలిచేవారు. అయితే 2024 అ సెంబ్లీ ఎన్నికల్లో జైరామ్‌ మెహతో నాయకత్వంలోని జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా కూర్మీల్లో ఎక్కువ మద్దతును సాధించింది. అంటే కూర్మీలు జైరామ్‌ మెహతా పార్టీపైనే విశ్వాసం వుంచారు.ఏతావాతా చెప్పొచ్చేదేమంటే కులగణన ఓబీసీ పార్టీల్లో కొనసాగుతున్న సమతుల్యతను దెబ్బతీయవచ్చు. తమకు సంద్రాయంగా విధేయులుగా వున్న వర్గాల్లో తమ బలాన్ని నిలుపుకుంటూనే, త మను తాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఓబీసీ పార్టీల మనుగ డ కష్టం.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

నివేశన స్థలాల సర్వేకోసం ‘స్వామిత్వ’ పథకం

`డ్రోన్‌ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం

`అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా 

`డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం

`కచ్చితమైన మార్కింగ్‌తో యాజమాన్య హక్కు పత్రాలు

`ఎన్నో సమస్యలకు పరిష్కారం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ ఆబాదీ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్‌ 24న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అధికశాతం మందికి సరైన పత్రాలు లేకపోవడంతో, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వారి ఇళ్లను కూల్చివేసేందుకు కోర్టులు ఆదేశాలిస్తున్నాయి. తాతలు, తండ్రుల కాలంనుంచి నివాసముంటున్న తమకు ఇటువంటి దు స్థితేంటని ఆయా నివాసగృహాలకు యజమానులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీరి నివేశనస్థలాల సర్వే చేసి అధికారిక పత్రాలను జారీచేయడం ఒక్కడే పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన పథకమే ‘స్వామిత్వ’. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ)లు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా అమలు చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని గృహయజమానులకు సరైన పత్రాలు లేకపోవడంతో, ఇళ్ల సరిహద్దులు నిర్ధారించడం ఒక ప్రధాన సమస్య కాగా, వీరినుంచి శాస్త్రీయంగా పన్నువసూలు, గ్రామాల అభి వృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని భీ మ్‌వాలా గ్రామానికి చెందిన వినోద్‌ అనే 21 సంవత్సరాల యువకుడికి రెండేళ్ల క్రితం వరకు తన నివేశన స్థలానికి సంబంధించి ప్రభుత్వంతో వివాదం నడిచింది. అతను నివసిస్తున్న ఇంటికి యాజమాన్య హక్కులను నిర్ధారించే పత్రాలేవీ లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని అక్రమంగా ఆక్రమించి చేసిన నిర్మాణంగా పరిగణించి కూల్చివేయడానికి సిద్ధం కావడంతో వివాదం కోర్టుకు చే రింది. ఒకప క్క కోర్టు కేసు నడుస్తుండగానే 2023లో స్వామిత్వ పథకం కింద గ్రామాన్ని డ్రోన్‌ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ విధంగా నిక్కచ్చి సర్వే నిర్వహించి గ్రామస్థులకు యాజమా న్య హక్కుల పత్రాలను అందజేశారు. వినోద్‌ తండ్రి కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు డ్రోన్‌ సర్వే నిర్వహించిన తర్వాత అతని ఇంటిని కచ్చితమైన మార్కింగ్‌తో యాజమా న్య హక్కు పత్రాన్ని ప్రభుత్వం జారీచేసింది. దీన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టులో సమర్పించగానే, ఇంటిని కూల్చవద్దని ప్రభుత్వాధికార్లను ఆదేశించింది. స్వామిత్వ పథకం వల్ల కలిగే ప్రయోజనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

నిజం చెప్పాలంటే ఇటువంటి భూవివాద కేసులో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి వుంటున్నాయి. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం భారత కోర్టుల్లో కేసులు పెద్ద ఎత్తున పెండిరగ్‌లో వుండటానికి భూవివాదాలే కారణమని స్పష్టం చేసింది. దేశంలో 66% సివిల్‌ కేసులు ఆస్తుల తగాదాలకు సంబంధించినవేనని సంస్థ పేర్కొంది. ఇటువంటి కేసులు పరిష్కారం కావడానికి కనీసం 20 ఏళ్లయినా పడుతోంది! అదీకాకుండా గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన 25% తీర్పులు కేవలం భూవివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కోర్టులో ప్రస్తు తం పెండిరగ్‌లో వున్న ప్రతి మూడు కేసుల్లో రెండు ఆస్తి వివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. 

స్వామిత్వ పథకం కింద డ్రోన్‌ సర్వేల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, కర్ణాటక,పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 5వేల గ్రామాల్లో ఇళ్లస్థలాల యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభించింది. నిజానికి 2020లో సర్వే ఆఫ్‌ ఇండియా మొట్టమొదటిసారి భూమి మ్యాపింగ్‌ కోసం డ్రోన్‌ల కొనుగోలు ప్రారంభించింది. ప్రస్తుతం సర్వే నిర్వహించడానికి మైక్రో డ్రోన్లు (250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు) మరియు చిన్న డ్రోన్లు (2 కిలోల నుంచి 25 కిలోల బరువు) వాడుతున్నారు. 

సర్వే ఏవిధంగా మొదలైంది?

నిజం చెప్పాలంటే మనదేశంలో భూ సర్వే నిర్వహించడం అత్యంత క్లిష్టమైన కార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ కష్టం. ఎందుకంటే ఎవరివద్దా ఎటువంటి పత్రాలు లేకపోవడం, సరైన రికార్డులు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్రిటిష్‌ వలస పాలనలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఇళ్లను ని ర్మించుకోవడం ఆనవాయితీగా వుండేది. వీటికి ఎటువంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేదా మరే ఇతర ఆధారాలు వుండేవి కావు. ఇటువంటి ఆవాస ప్రాంతాలను ‘ఆబాదీ’గా వ్యవహ రించేవారు. అ పేరునే ఇప్పటికీ వాడుతున్నారు. బ్రిటిష్‌ వారి కాలం లేదా స్వాతంత్య్రానంతర కాలంలో ఇటువంటి ఆవాసాల విషయంలో ఏవిధమైన సర్వే నిర్వహించలేదు. ఫలితంగా తరతరాలుగా ఏవిధమైన పత్రాలు లేకుండానే ఆయా గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ వస్తున్నారు. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. ఆయా గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్నులు వసూలు చేయ డం, సరిహద్దు నిర్ధారణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించిన వివాదాల పరిష్కారం పెద్ద సమస్యగా మారింది. వివాదాలు వచ్చినప్పుడు తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ తమవద్ద ఎటు వంటి పత్రాలు లేకపోవడంతో ఆయా గృహ యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడం మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో భర్త చనిపోయిన మహిళకు తన భర్త వాటాను ఇవ్వకుండానే, వెళ్లగొట్టిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. 

మొట్టమొదటగా వున్న మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించడానికి 2019లో సర్వే ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిఈ గ్రామాల్లో ఇళ్లకు కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించడంతో ఇంటిపన్ను వసూళ్లు, సరిహ ద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటువంటి సమస్యలను పరిష్కరించే క్రమంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మహారాష్ట్ర గ్రామాల్లో డ్రోన్‌ టెక్నాలజీ సహాయంతో సమస్యను పరిష్కరించిన విధాన్ని వివరించడంతో, నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ‘స్వామిత్వ’ పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. విశేషమేంటంటే 2020 సంవత్సరంలో ఏప్రిల్‌ 24వ తేదీన కోవిడ్‌ తీవ్రంగా వున్నప్పుడే దీన్ని ప్రారంభించడం విశేషం. అంతేకాదు అదే ఏడాది అక్టోబర్‌ నాటికి లక్ష ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి. 2025 ఏప్రిల్‌ నాటికి స్వామిత్వ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. మే మొదటివారం నాటికి దేశంలో ఈ పథకం కింద నోటిఫై అయిన 3.45లక్షల గ్రామాల్లో, 3.22 లక్షల గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే మొదలైన దగ్గరినుంచి ఇప్పటివరకు 10.46 కోట్ల ఇళ్ల స్థలాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసారు. 1.67 గ్రామాలకు సంబంధించి 2.54కోట్ల ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి.  

మాన్యువల్‌ సర్వేలో పొరపాట్లు

భూమి సర్వేలో ఎంతో నైపుణ్యమున్న సర్వేయర్లను నియమించినా, పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రజలు సర్వేయర్లను అనుమతించని సందర్భాలు కూడా చాలానే వున్నాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించడానికి సుదీర్ఘ సమయం పట్టడం కూడా సం ప్రదాయ సర్వే విధానాలు పెద్దగా విశ్వసనీయతను పొందకపోవడానికి మరో కారణం. పోనీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సర్వే నిర్వహించాలనుకున్న, అవి కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో వుండటంతో సర్వే కచ్చితంగా సాధ్యంకాదు. ఈ ఫలితాలు గ్రామీణ భూకమతాలను నమోదు చేయడానికి సహకరించవు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల సర్వేకు అసలు పనిచేయవు. వీటి సర్వేకు కొద్ది సెంటీమీటర్ల మీటర్ల తేడాతో కూడిన కచ్చితత్వం కావాలి. ఇవి ఉపగ్రహ చిత్రాల ద్వారా సాధ్యం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. 

డ్రోన్లతో ప్రయోజనం

ఉదాహరణకు కొన్ని రకాల డ్రోన్లు 35 నుంచి 45 నిముషాల కాలంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో సర్వే నిర్వహించగలవు. ఇదే సమయంలో 4.35 కిలోల బరువును కూడా మోయ గలవు. మరికొన్ని డ్రోన్లు 40 నిముషాల వ్యవధిలో 4 కిలోమీటర్లు, మరికొన్ని 60 నిముషాల వ్యవధిలో 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలుగుతాయి. సగటున 40 నిముషాల కాలంలో 1 చదరపు కిలోమీటరు సర్వే పూర్తి చేస్తాయి. మరి ఇదే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణాన్ని 3`4 సభ్యులతో కూడిన బృందం సర్వే పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. అంతేకాదు పోస్ట్‌ ప్రాసెస్డ్‌ కైనమాటిక్స్‌ (పీపీకే) సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సర్వేలో ఎటువంటి తేడా రాకుండా మరింత కచ్చితంగా వుండేలా చూస్తున్నారు. ఇదే సమయంలో 567 కంటిన్యూవస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేటస్‌ (సీఓఆర్‌ఎస్‌) స్టేషన్లను కూడా ఈ సర్వేలో భాగంగా నెలకొల్పారు. ఈ సీఓఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ భూమిపై కచ్చితమైన ప్రదేశాల్లో మార్కింగ్‌ చేయడానికి ఉపయోగపడతా యి. 

సర్వే కొనసాగే విధానం

ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలి. రాష్ట్ర చట్టాల పరిధిలో సర్వే చేయాల్సిన గ్రామాల జాబితాను సర్వే ఆఫ్‌ ఇండియా కు అందజేయాలి. 

శిక్షణ పొందిన రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పంచాయతీకి సర్వేకు సంబంధించిన సమాచారం అందిస్తారు. 

సర్వే ఆఫ్‌ ఇండియా టీమ్‌లు, అవసరమైన సీఓఆర్‌ఎస్‌ మరియు గ్రౌండ్‌ కంట్రోలింగ్‌ పాయింట్లను ఎంపిక చేస్తాయి.

సర్వే చేయాల్సిన ప్రాంతాన్ని గ్రామసభలో నిర్ణయిస్తారు.

సర్వేకు ముందు గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను తెల్లని గీతలతో మార్క్‌ చేస్తారు. 

తర్వాత డ్రోన్‌లు సర్వే చేయాల్సిన ప్రదేశంపై ఎగిరి ఫోటోలు తీస్తాయి. 

ఈ చిత్రాలను 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రాసెస్‌ చేస్తారు.

ఈ మ్యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. వీటి ఆధారంగా ప్రభుత్వం నిజమైన యజమానులను గుర్తించి, మరోసారి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుంటుంది.

ఆవిధంగా అప్‌డేట్‌ అయిన తర్వాత ఈ మ్యాప్‌లను సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపుతారు.

తప్పులు సరిదిద్దిన తర్వాత యజమానులకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను తయారు చేస్తారు.

గ్రామాల్లో చేపట్టే ప్లానింగ్‌ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మ్యాప్‌లనే ఆధారంగా తీసుకుంటారు. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా నివేశన స్థలాల సర్వేలకు డిమాండ్‌ పెరగడంతో సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్‌ల సేకరణకు టెండర్లను పిలిచింది. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కేవలం మూడు డ్రోన్‌ కంపెనీలు మాత్రమే ముందుకు రాగా, తాజాగా పిలిచిన టెంటర్లలో 20 కంపెనీలు పాల్గనడం దేశంలో డ్రోన్‌ సర్వేకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ‘స్వామిత్వ’ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, భూ సర్వేలో డ్రోన్‌లను ఉపయోగించడానికి ముందుకు రావ డం విశేషం. ఇదే సమయంటో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను అప్‌డేట్‌ చేయడానికి ‘నేషనల్‌ జియోస్పే షియల్‌ నాలెడ్జ్‌`బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్స్‌ (నక్షా)ను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు బెంగళూరు నగరానికి సంబంధించి ‘డిజిటల్‌ ట్విన్‌’ను అభివృద్ధి పరు స్తున్నారు. నగరాభివృద్ధి ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

సామాజిక యుద్ధం ‘‘కవిత’’

`సామాజిక తెలంగాణ ‘‘కవిత’’ తోనే సాధ్యం.

`’’కవిత’’ రాజకీయ పార్టీ పెడితే ‘‘బహుజన ప్రభంజనం’’.

`తెలంగాణ సామాజిక భవిత ‘‘కవిత’’.

`’’కవితే’’ సామాజిక ‘‘సైన్యం’’.

`’’కవిత’’ బహుజన ‘‘సామాజిక స్వరం’’.

`తెలంగాణలో సామాజిక న్యాయం కోసం సవరించిన గళం.

`’’కవిత’’ ఒక సామాజిక బాధ్యత.

`’’కవిత’’ సామాజిక తెలంగాణ విజ్ఞత..

`సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారిలో అగ్రకులాల సామాజిక వేత్తలే ఎక్కువ.

`సతీ సహ గమనం రద్దుకు కారణం రాజా రామ్మోహన్‌ రాయ్‌.

`వితంతు వివాహాలు జరిపించినది వీరేశలింగం పంతులు.

`కన్యాశుల్కం రాసింది గురజాడ.

`సహపంక్తి భోజనాలు పెట్టిన పలనాటి బ్రహ్మనాయుడు.

`అదే బాటలో ఇప్పుడు ‘‘కవిత’’.

`బహుజన రాజకీయం కోసం కదిలిన తెలంగాణ ‘‘కాళిక’’ కవిత.

`భవిష్యత్తులో బడుగుల రాజ్యం కోసం ‘‘కవిత’’ తపన.

`బడుగులను ఏకం చేసే యజ్ఞంలో తొలి అడుగు ‘‘కవిత’’.

`ఇంత కాలం బడుగులను, బడుగులే నమ్మలేదు.

`బడుగులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

`సామాజిక తెలంగాణ ఆవిష్కరణ కోసం ‘‘కవిత’’ కదలివస్తోంది.

`బడుగులంతా ఏకమైతే నవ రాజకీయం నిర్మాణమౌతుంది.

`’’కవిత’’ కు పల్లె తెలుసు..పల్లె జీవితం తెలుసు.

`’’కవిత’’ అంటే పువ్వుకు తెలుసు.

`తెలంగాణలో వున్న ప్రకృతి ప్రతి కొమ్మకు తెలుసు.

`’’కవిత’’ పిలుపు తెలంగాణ ఉద్యమానికి తెలుసు.

`తెలంగాణ ఉద్యమ రాజకీయానికి బతుకమ్మగా తెలుసు.

`’’కవిత’’ అంటే డిల్లీ రాజకీయానికి ధీర వనితగా తెలుసు.

`మహిళా రిజర్వేషన్‌ కోసం ‘‘కవిత’’ చేసిన పోరాటం తెలుసు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                             

కవిత తెలంగాణ సామాజిక యుద్దం. నిరంతర ప్రజాసంగ్రామం. కవిత ఒక సామాజిక న్యాయం. కవిత ఒక సామాజిక ధ్యేయం. కవిత ఒకసామాజిక లక్ష్యం. కవిత తెలంగాణ సామాజిక పోరాట గుమ్మం. సామాజిక తెలంగాణ ఆలోచనలు చేసిన వారు చాలా మంది వున్నారు. అటు వైపు అడుగులు వేసిన వారు లేరు. కాని చెప్పినట్లే ప్రయాణం మొదలు పెట్టిన కవిత. మూగబోయిన బడుగుల గొంతౌతున్న కవిత. బడుగుల కోసం గొంత్తిత్తి నినదిస్తున్నది కవిత. బిసిలలో సామాజిక చైతన్యం రగిలించే యజ్ఞం కవిత. ఈ తరంలో సామాజిక తెలంగాణ ఆలోచన మొదలైన కవిత తోనే సామాజిక నిర్మాణం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక తెలంగాణ కవితతోనే సాధ్యమౌతుందన్న భరోసా ఏర్పడుతోంది. కవిత ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే బహుజన ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు. కాని ఎమ్మెల్సీ కవిత పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలుసు. కవిత మొండి ధైర్యం గురించి కూడా తెలుసు. అందుకే కవిత విషయంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. రాజకీయపార్టీ అంటే కుటుంబ సమస్య కాదు. ప్రజా సమస్య. ప్రజల కోసం ఆలోచించే సమస్య. ప్రజల వైపు నుంచి దృక్కొణం వుండాల్సిన సమస్య. అందువల్ల ఎలాగైనా కవితను రాజకీయ యవనిక మీద ప్రత్యేక గుర్తింపు రావడం కొన్ని రాజకీయ పక్షాలకు ఇష్టం వుండదు. అంతే కాదు స్వపక్షంలో కూడా అలాంటి అభిప్రాయం ఎవరికైనా వుండొచ్చు. అందుకే కవిత సూటిగా, స్పష్టంగానే కేసిఆర్‌ చుట్టూ దెయ్యాలున్నారని కుండబద్దలు కొట్టిచెప్పారు. కాసేపు ఆ రాజకీయం పక్కన పెడితే, కవిత ఆది నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటం వుండేది. అందుకే ఆమె తనదైన శైలిలో ఉద్యమ స్వరూపానికి నాంది పలికింది. ముందు తెలంగాణలో జాగృతి అనే సంస్ధ ద్వారా తెలంగాణ సమజాన్ని చైతన్య పర్చేందుకు అడుగులు వేసింది. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ సమాజంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు మరొకరు లేరు. నేరుగా కవిత ఉద్యమంలోకి వెళ్లొచ్చు. ఉద్యమ కారిణిగానే గుర్తింపు పొందొచ్చు. కాని ఆమె తెలంగాణ నవ సమాజం గురించి ఆలోచనలు చేసింది. ఉద్యమం ఓ వైపు కేసిఆర్‌ చేస్తున్నప్పుడు, తాను తెలంగాణయువతకు ఎలా సాయ పడాలన్న ఆలోచన చేయడం అంటే కన్న తల్లి పిల్లల గురించి ఆలోచన చేయడం లాంటిదే అని చెప్పకతప్పదు. అలా అప్పటి యువతకు అవసరమైన ఎడ్యుకేషన్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోసం కృషి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతలో ఉద్యమ చైతన్యం రగిలించడంలో కవిత ప్రదాన పాత్ర పోషించింది. అందుకే జాగృతి అనే సంస్ధకు అంతటి పేరు వచ్చింది. ఒక దశలో బిఆర్‌ఎస్‌కు సమాంతరంగా జాగృతి నిర్మాణం జరిగింది. అలా చిన్న వయసులోనే కవిత తెలంగాణ సమాజ గతి కోసం, ప్రగతి కోసం ఆలోచనే కాదు, ఆచరణ కూడా చూపించింది. అందుకే అందరి మన్ననలు పొందింది. అంతే కాకుండా కవిత తెలంగాణ ఉద్యమ కాలమంతా బీద, బిక్కి, బడుగుల జీవితాలు చాల దగ్గరుండి చూశారు. పల్లె జీవితాన్ని కళ్ల నిండా చూశారు. పల్లె బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బతుకమ్మ పేరుతో ఊరూరు తిరిగినప్పుడు పల్లె వేధనలు తెలుసుకున్నారు. చిద్రమైన ఆనాటి పల్లె బతుకులు చూసి చలించిపోయారు. ఉద్యమ సమయంలోనే ఆమె సామాజిక సృహను కూడా తన దాతృత్వంతో చూపించారు. అప్పుడే తెలంగాణలో సామాజిక న్యాయం రాజకీయ పరంగా అందితే తప్ప అంతరాలు, అవరోధాలున్న సమాజంలో మార్పులు తీసుకురావొచ్చని ఆలోచన చేశారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే తెలంగాణ సామాజిక భరోసా కవిత అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నంత కాలం కవిత ఏం చేసిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదీ ఏక కాలంలో పూర్తి కాదు. అన్ని సమస్యలు ఒకే సారి నెరవేరవు. ఆ సమయంలో సామాజిక తెలంగాణ కన్నా, సాగు నీటి తెలంగాణ ముఖ్యం. అన్న పూర్ణ తెలంగాణ ముఖ్యం. ఆకలిని తరిమేసే తెలంగాణ ముఖ్యం. తెలంగాణలో ఆకలి కేకలు లేకుండా చూడాల్సిన సమయం. తెలంగాణలో ఎప్పటికైనా సామాజిక తెలంగాణ సాదించొచ్చు. కాని ముందుకు తెలంగాణ నుంచి ఆకలిని తరిమేయాలి. అనారోగ్యాన్ని తరిమేయాలి. నీటి గోసలు లేకుండా చూసుకోవాలి. గుక్కెడు మంచి నీటికోసం తల్లడిల్లిన తెలంగాణ గుండెను చూసిన వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్దమౌతాయి. తెలంగాణలో మొదటి ప్రాదాన్యతగా ప్రాజెక్టుల నిర్మాణం. సాగు సంపద పెంచడం. రైతును రాజును చేయడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో కేసిఆర్‌ ముందుకు సాగారు. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెబుతారు. కడుపు నిండా తిన్న తర్వాతే కంటికి కునుకైనా, పక్కవారితో కబుర్లైనా చెప్పుకునే అవకాశం వుంటుంది. ఓ వైపు ఆకలి దహిస్తుంటే నిద్ర వస్తుందా? పక్కవారితో సంబాషణ సాగుతుందా? అది అప్పటి తెలంగాణపరిస్దితి. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టికరమైన తెలంగాణ. ఆకలి తెలంగాణ పొలిమేర దాటిపోయింది. రైతు సంతోషంగా వున్నారు. విద్య, వైద్యం ఎంతో కొంత బాగానే అందుతోంది. ఇక మిగిలింది..రావాల్సింది సామాజిక చైతన్యం. సామాజిక తెలంగాణ నిర్మాణం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకు కవిత కంకణం కట్టుకొని భయలుదేరింది. కవితే ఒక సమాజిక సైన్యంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తోంది. అందరికన్నా ముందు సామాజిక తెలంగాణకు గళమైంది. తన స్వరం పెంచింది. నిజాన్ని నిర్భయంగా చెప్పింది. సామాజిక తెలంగాణ సాధన జగాల్సిన అవసరాన్ని గుర్తించింది. సామాజిక తెలంగాణ ఆవిష్కారం జరిగితే తెలంగాణ రాష్ట్ర పరిపూర్ణమౌతుందన్నారు. ఇంతకన్నా తెలంగాణ కోసం గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు. ఇదే సమయంలో కవిత రాజకీయ స్వార్ధం కోసం బహుజన వాదం ఎత్తుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి పరిస్ధితి ఎలా వుంటుందంటే అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తిననివ్వదన్న సామెతను నిజం చేస్తుంటారు. బిసిలై వుండి బిసిల ఐక్యత కోసం పాకులాడరు. ప్రయత్నం చేయరు. కాని బిసిలలో చైతన్యం కోసం కవిత ప్రయత్నం చేస్తుంటే ఆమె ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. బిసిలను ఏకం చేయడానికి బిసిలే అవసరం లేదు. సామాజిక సృహ వున్న వారు ఎవరైనా సరే ఆ బాధ్యతను తీసుకోవచ్చు. ఇప్పుడు కవిత కూడా అదే చేస్తున్నారు. చరిత్రలో సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన వారిలో ఎక్కువ మంది అగ్ర కులానికి చెందని వాళ్లే వున్నారు. సామాజిక న్యాయం కోసం వాళ్లే కృషిచేశారు. అందుకే చరిత్రలో నిలిచారు. చరిత్ర గతిని మార్చారు. స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లేయులు పాలనలో ఎంతో దుర్మార్గమైన ఆచారం వుండేది. భర్త చనిపోతే వెంటనే ఆమెను కూడా భర్తచితిపై వేసేవారు. దానికి సతీ సహగమనం అని పేరు పెట్టి, సజీవంగా వున్న మహిళను ఆ మంటల్లోనే తగలబెట్టేవారు. దాన్ని సంప్రదాయం అనేవారు. కాని అలాంటి అనాగరిక చర్యను వ్యతిరేకించింది రాజారామ్మెహన్‌ రాయ్‌. ఇంగ్లీషువారితో పోరాటం చేసి, వారిని ఒప్పించి, మెప్పించి సతీసహగమనాన్ని రద్దు చేయించారు. సామాజిక రుగ్మతను పారద్రోలాడు. ఇక చిన్న వయసులోనే పెళ్లిల్లుచేసి, భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతున్న మహిళల జీవితాల్లో మళ్లీ వివాహం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వీరేశలింగం పంతులుది. అందుకే ఇప్పటికీ ఏపిలో కొట్టుకొని పోయేను కొన్నికోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు…అని ఆ ఆంధ్ర సమాజం వేనోళ్ల పొగుడుతుందంటే కారణం వీరేశలింగం చూపిన దారి. ఆ వీరేశలింగం అగ్ర కులానికి చెందిన సామాజిక వేత్తే. అలాగే వరకట్న సమాజంలో ఆడపిల్ల నలిగిపోతుంటే, కన్నాశుల్కం వస్తే గాని ఆడ పిల్ల జీవితం బాగు పడదని ఎలుగెత్తి చాటి గురజాడ అప్పారావు కూడా ఉన్నత వర్గానికి చెందని మహానుభావుడే. ఇక మనుషుల్లో తేడాలు వుండొద్దని, చిన్నా, పెద్ద అనే తేడా వయసులో, గుణంలో తప్ప కులంలో కాదని చెప్పేందుకు పలనాటి బ్రహ్మనాయుడు చాప కూడుతో సహపంక్తి భోజనాలు పెట్టించేవారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆనాడే కృషి చేశాడు. ఆయన నిమ్మ వర్గం కాదు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలగాలని కోరుకోవడంలో అగ్ర కులాలు ముందుండి ప్రశ్నించడాన్ని నిరసించడం అజ్ఞానానికి,అవివేకానికి నిదర్శనమౌతుంది. ఆంగ్లేయులతో ఆనాటి రాజులెంతో మంది పోరాటం చేశారు. వాళ్లంతా తమ రాజ్యాల రక్షణ కోసం పోరాటం చేశారు. వారి పేర్లకు చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కాని ప్రజా స్వామ్యం కోసం, ప్రజా పాలన కోసం గాంధీజీ పోరాటం చేశారు. అందుకే మహాత్ముడయ్యారు. దేశానికిస్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఆయనను ఆనాడు మీరెందుకు అని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు కూడా కవితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సామాజిక న్యాయం కోసం కవిత వేసే అడుగులు వెనక్కి పడేది లేదు. అందుకే సామాజిక న్యాయం కోసం కవితది అపర కాళిక అవతారం చూస్తారంటున్నారు.

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

’’నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన మంత్రి ‘‘కొండ సురేఖ.’’

`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’

`’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన.

`‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్‌ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు. 

`ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్‌ మిల్లుల కెమికల్‌ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన వార్తపై వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు.

`నగరంలో ఇలాంటి మిల్లులు ఎన్ని వున్నాయి, వారి వివరాలు కూడా అందించమని మంత్రి ‘‘కొండా సురేఖ’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు కూడా సూచించారు. తాను ప్రస్తుతం డిల్లీ వెలుతున్నట్లు, వచ్చిన వెంటనే పూర్తి సమాచారం ఆధారాలు అందించమని వాటి ఆధారంగా తగు చర్యలకు ఆదేశిస్తామని ఎడిటర్‌ ‘‘కట్టరాఘవేంద్రరావు’’కు మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? అనే విచక్షణ పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డ దారులు తొక్కడం చాలా మంది చేస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డ దారులు వెతుక్కుంటున్న వాళ్లు కూడా వుంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని, వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మా కేమిటి అనే ధోరణి అవలంభిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్‌ లో వున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచి నీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్‌ నగరాలకు మంచి నీటిని సరఫరా చేసే కాలువలలో మిల్లు కెమికల్‌ నీటి వ్యర్థాలు యదేచ్చగా వదిలేస్తున్నారు. రాంపూర్‌లో వున్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి నీటి కాల్వలోకి మిల్లుల కెమికల్‌ వాటర్‌ వదిలి నీటిని కాలుష్య కాసారం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మిల్లుల నిర్వాకం నిర్వకానికి సహకరిస్తూ అమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్‌ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిసే ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్‌ వ్యర్థాలు ..అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట మారిపోయింది. అయినా మురుగునీటిని మంచి నీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతోంది. సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు మిల్లర్లు యదేచ్చగా సాగిస్తున్న దుర్మార్గాన్ని వెనకేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బాయిల్డ్‌ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం వుంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంటు ఏర్పాటు జరుగుతుంది. కానీ అది తూతూ మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచి నీటి కాలువలు మొత్తం కలుషితమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలో చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడిక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవునా మంచి శుద్దమైన మంచి నీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడడంతో పాటు, కలుషితమైపోతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్ఛే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్‌ ప్రతి నీటి చుక్క కాలుష్యాన్ని మొసుకుపోతోంది. ఇక ఆ పక్కనే వున్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్‌ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యమౌతోంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్‌ వాటర్‌ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్య్స శాఖ దృష్టికి వచ్చినా ఆ అధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారు. వాటర్‌ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కదలకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. నేటిధాత్రి కథనంలో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లుల కెమికల్‌ నీరు కాలువలో కలవడమే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాంపూర్‌ మిల్లులు వదిలిన రసాయన నీరు..మంచి నీటి కాలువలో చేరుతూ వుండడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. పాపానికి సంకేతం. పర్యావరణం మీద చిన్న పాటి నిర్లక్ష్యం కూడా వహించకూడని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల జాడెక్కడ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా అధికారులు చోద్యం చూడడం అంటే ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప మరేం లేదు. హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ ,కామదేను ట్రేడర్స్‌ ,వినాయక ఇండస్ట్రీస్‌ ,మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్‌ ,శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌ ,శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ,శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్‌ ,సూర్య ఇండస్ట్రీస్‌ ,సూర్య తేజ ఇండస్ట్రీస్‌లు సాగిస్తున్న అరాచకం సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు కళ్లు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ముక్కుపుటాలు అధిరేలా వాసన వస్తున్నా అధికారులు తొంగి చూడొద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమికల్‌ కలిసిన మిల్లుల క్రిటికల్‌ వాటర్‌ మంచినీటి కాలువను కలుషితం చేస్తున్నా కనిపించడం లేదా? నిలదీస్తున్నా స్పందన కరువౌతోంది. అవే నీటిని మున్సిపల్‌ వాటర్‌ బోర్డు ప్రజలకు పంపిస్తున్నారన్న సంగతి కనిపించడం లేదా?ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అనుకునేలా మిల్లర్లకు వరంగా మారి ప్రజలకు శాపమౌతోంది. కలుషిత నీటిని తాగుతున్నారన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం వారి బాధ్యతారిత్యానికి నిదర్శనమనే చెప్పాలి. వరంగల్‌ ప్రజలకు శాపంగా మారుతున్నా మిల్లులకు సహకరిస్తూ, ఉదాసీనత చూపిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్‌ చేస్తున్న కిలాడి మిల్లర్‌ ఎర్రబెల్లి..

దేశంలో నమోదవుతున్న కోవిడ్‌`19 కేసులు

భయపడాల్సిన అవసరం లేదు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

చిన్నచిన్న ఉత్పరివర్తనాలు సహజం భయం వద్దు: డాక్టర్లు

దేశవాసుల్లో రోగనిరోధకశక్తి బాగా పెరిగింది: డాక్టర్లు

రాకపోకలపై ఆంక్షలు లేవు: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ముంబయి ప్రశాంతం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్‌ భయం లేదు

ద.కొరియా, జపాన్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్ల ధరలు

సింగపూర్‌లో వేగంగా విస్తరిస్తున్నా మరణాలు లేవు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో గత కొద్ది రోజులుగా కోవిడ్‌`19 కేసులు బయటపడుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన అడ్వయిజరీలో, వ్యాధి తీవ్రత చాలా తక్కువగా వున్నదని, ఎటువంటి భయం అవసరంలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం మే 19 నాటికి దేశ వ్యాప్తంగా 257 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదైన వాటిల్లో అత్యధిక కేసుల్లో తీవ్రత చాలా తక్కువగా వున్నందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. ఇంటివద్దనే వీటికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు రోజువారీ సమాచారం వెల్లడిస్తోంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీచేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మే 19 నాటికి కేరళలో 95G, మహారాష్ట్ర 56G, తమిళనాడు 66G, కర్ణాటక 8G, గుజరాత్‌ 6G, ఢల్లీి 3G కోవిడ్‌ కే సులు నమోదయ్యాయి. కోవిడ్‌కు ఇప్పుడు ఇతర వైరల్‌ వ్యాధుల మాదిరిగానే చికిత్స అందించవచ్చునని భయపడాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రతను పాటించడం, పెద్ద సమూహాలకు దూరంగా వుండటం వంటి ముందు జా గ్రత్త చర్యలు పాటిస్తే, కోవిడ్‌ను నివారించవచ్చునని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్‌పీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీ సెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లు ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ా19 తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా కోవిడ్‌ కే సులు నమోదవుతున్నాయి. ఇదిలావుండగా పుదుచ్చేరి, రాజస్థాన్‌, సిక్కిం, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ కేసులు నమోదు కావడం, దేశంలో వ్యాధి విస్తరిస్తున్న తీరును వెల్లడిస్తోంది. 

రోగుల డిశ్చార్జ్‌

మే 12 నుంచి దేశవ్యాప్తంగా 112 మంది కోవిడ్‌ సోకిన రోగులకు చికిత్స అందించి, తగ్గిన తర్వాత ఇళ్లకు పంపేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఇదిలావుండగా మే 29న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నేతృత్వంలో దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై ఒక సమావేశం జరిగింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డివిజన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గన్నారు. ఇదిలావుండగా కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలతో ఇద్దరు రోగులు గత జనవరిలో మృతిచెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వీరిద్దరికి ఇతర మెడికల్‌ కాంప్లికేసన్స్‌ వున్నట్టుకూడా స్పష్టం చేసింది. మహారాష్ట్రలో గత జనవరి నెలలో 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించగా వీటిల్లో 106 కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. వీటిల్లో 101కేసులు ముంబ యిలో కాగా మిగిలినవి, పూణె, ఠాణె మరియు కొల్హాపూర్‌లో నమోదయ్యాయని వివరించింది.కేవలం మనదేశంలో మాత్రమే కాదు, దక్షిణకొరియా, చైనా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల్లో కూడా కోవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరంలేదని, తగిన చికిత్స అందుబాటులో వున్నదని ఆయా దేశాలు హెల్త్‌ అడ్వయిజరీలు జారీచేశాయి. అంతేకాదు వ్యాక్సినేష న్‌ గురించిన తాజా సమాచారాన్ని తమకు తెలపాలని, కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చునని ఆయా దేశాలు ఆరోగ్య మంత్రిత్వశాఖలు అడ్వయిజరీలు జారీచేశా యి. 

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు మౌనంగా వుండాలని పిలుపునిచ్చింది. ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితి అదుపుతప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందు కు ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేశామని కూడా వివరించింది. ఇదిలావుండగా బెంగళూరులో 84ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌`19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత మరణించినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ ఈ వృద్ధుడు మే 17న మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికార్లు ధ్రువీకరించారు. ఆయన మే 13న ఆసుపత్రిలో చేరగా, కోవిడ్‌`19 పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన మరణించిన తర్వాత వచ్చిన రిపోర్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కర్ణాటకలో కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార్లు అప్రమత్తమయ్యారు. వీటిల్లో 32 కేసులు కేవలం బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ రోజువారీ కార్యకలాపాలను నిరభ్యంతరంగా నిర్వహిస్తూనే, కొన్ని సాధారణ ముం దు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రజల రాకపోకల పై ఏవిధమైన ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడిరచారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా చాలాకాలం తర్వాత రాష్ట్రం లో తొలికేసు తీరప్రాంతమైన విశాఖపట్టణంలో బయల్పడటం గమనార్హం. రోగి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన డాక్టర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇదిలావుండగా తెలంగాణలో ఒక కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ వ్యాధి సోకింది ఒక వైద్యుడికి కాగా, ఆయనకు ప్రయాణ చరిత్ర వున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. అయితే ఐదు రోజులు ప్రొటకాల్‌ పాటించిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కోవిడ్‌ లక్ష ణాలు లేవు. ఇదిలావుండగా కోవిడ్‌ వైరస్‌కు చిన్నచన్న ఉత్పరివర్తనాలు సహజమని, ప్రజల్లో ఇప్పటికే రోగనిరోధకశక్తి బాగా పెరిగిపోవడంతో, భయపడాల్సిన అవసరంలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

రెండు మ్యుటేషన్లు కారణం

ఒమిక్రాన్‌ బిఎ.2.86కు సంబంధించిన జెఎన్‌.1 వేరియంట్‌కు చెందిన ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8మ్యుటేషన్లు తాజాగా బయల్పడుతున్న కోవిడ్‌`19 కేసుల్లో కనిపిస్తున్నాయని అధికార్లు చెబుతు న్నారు. ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, హాంకాంగ్‌ల్లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడిరచిన సమాచారం ప్రకా రం జె.ఎన్‌.1 వేరియంట్‌కు సంబందించి 30 మ్యుటేషన్లున్నాయి. వీటిల్లో ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8 వర్షన్లు తాజా కేసుల్లో కనిపిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇదిలావుండగా హాంకాంగ్‌లో కోవిడ్‌ా19 పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకోమారు కోవిడ్‌ చురుగ్గా కనిపిస్తుండటాన్ని గుర్తించారు. దీన్నొక సైక్లిక్‌ ప్రాసెస్‌గా అక్కడి వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కాగా దక్షిణ కొరియాలో 65 సంవత్సరాలు దాటినవారికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ కాలపరిమితిని జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. గత మూడేళ్ల కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే కోవిడ్‌ ప్రధానంగా చలి, ఎండాకాలాల్లో బాగా వ్యాపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదిలావుండగా సింగపూర్‌లో ఏప్రిల్‌ 27 నుంచి మే 3 మధ్యకాలంలో అంటే వారంరోజుల్లో 14,200 కోవిడ్‌ కేసులు నమోదయ్యా యి. అంతకు ముందువారం దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య 11,100. 

పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్లు

 కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన కోవిడ్‌ కిట్‌ తయారీ కంపెనీలు, హ్యుమాసిస్‌ కంపెనీ, ల్యాబ్‌ జీనోమిక్స్‌ కంపెనీ, సీజిన్‌ ఇన్‌కార్పొరేషన్‌, ఎస్‌.డి. బయోసెన్సార్‌ ఇన్‌కార్పొషన్‌ షేర్లు అమాంతం పెరిగిపో యాయి. ఇక ద.కొరియాకు చెందిన ఎస్‌.కె. బయోసైన్స్‌ కంపెనీ షేర్లు ఏకంగా 7.2% వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఒక కొరియాకు చెందిన డయాగ్నస్టిక్‌ కిట్‌ తయారీ సంస్థ సుజన్‌ టెక్‌ ఇన్‌కార్పొరేషన్‌ షేర్లు ఏకంగా 29% పెరిగాయి. ఇక జపాన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ డైసీ శాంక్యో సంస్థ షేర్లు 7.4% పెరిగాయి. ఇక హాంకాంగ్‌కు చెందిన షాంఘై జున్సీ బయోసైన్సెస్‌ కంపెనీ షేర్లు కూడా వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 

గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌

ఆసియా దేశాల్లో కోవిడ్‌`19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ) మే 19న సమావేశమైంది. ఈ సందర్భంగా కోవిడ్‌`19పై ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌ను కోరుతూ స్లొవేకియా ప్రవేశపెట్టిన తీర్మానానికి 124 సభ్యదేశాలు అనుకూలంగా ఓటువేశాయి.

హైడ్రాపై నేటిధాత్రి అందించిన కథనం బాగుంది: హైడ్రా కమీషనర్ రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస.

ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం.

హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్.

రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం.

శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్.

హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా నేటిధాత్రి దిన పత్రిక, నేటిధాత్రి డిజిటల్ మీడియాలో వచ్చిన కథనం చాలా బాగుందని కమీషనర్ రంగనాధ్ ప్రశంసించారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌తో నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం శని వారం బుద్ద భవన్‌లో వున్న కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్యంతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడంలో నేటిధాత్రి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. తాను నిత్యం నేటిధాత్రి దిన పత్రిక‌ను తప్పకుండా చూస్తుంటానని చెప్పారు. హైడ్రా పని తీరు, ప్రజల నుంచి ఇటీవల వస్తున్న స్పందనలను ఎంతో విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగిందన్నారు. అంతే కాకుండా హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా వుండబోతోంది, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా ఎలాంటి పాత్ర పోషించబోతోందనే విషయాలు ఎంతో స్పష్టత చెప్పారని రంగనాధ్ తెలిపారు. హైడ్రా లాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం కావాలంటే నేటిధాత్రి లాంటి మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైడ్రాపై ఇంకా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను మీడియా పరంగా నేటిధాత్రి తీసుకోవాలని రంగనాధ్ కోరారు. హైడ్రా విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా వుంటామన్నారు. హైడ్రా కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ, తమ కాలనీలలో దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న సమస్యలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారని రంగనాధ్ తెలియజేశారు. హైడ్రాతో తాము కొన్ని దశాబ్దాలగా అనుభవిస్తున్న సమస్యలు తీరుతుండడంతో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రంగనాధ్ గుర్తు చేశారు. అలాంటి అంశాలతో కూడిన నేటిధాత్రి కథనం కూడా అద్భుతంగా వుందని కమీషనర్ చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version