జల, వర, ‘‘సర్వ ప్రదాయని’’ కాళేశ్వరం!

-అన్నింటికీ నీళ్లే ఆధారం..

-కాళేశ్వరాన్ని వదిలేస్తే కరువు ఖాయం!

-మళ్ళీ తెలంగాణ ఎడారి కావడం తధ్యం.

-తెలంగాణ వలసల రాష్ట్ర కావడం పెద్ద దూరంలో లేదు.

-ప్రగతి అంటే ప్రజల బతుకులు బాగుపడాలి.

-ఎకానమీ వృద్ధితో ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి.

-ప్రజల సంపన్నులు కావాలని ప్రభుత్వాలు కోరుకోవాలి.

-ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఖజానా లెక్కలు చూసుకోకూడదు.

-ప్రజలు సంపన్నులుగా మారే ప్రణాళికలు అమలు చేయాలి.

-కాళేశ్వరం అలాంటి గొప్ప దిక్సూచికి నిదర్శనం.

-తెలంగాణ రెండు రకాల ఆదాయ వనరులు మీద ఆధారపడి వుంది.

-ఆ రెండు రంగాలు నీటి అవసరాలతో ముడిపడి వుంది.

-వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ తెలంగాణకు అవసరం.

-పారిశ్రామిక ప్రగతి, పట్టణీకరణకు నీరు ఎంతో అవసరం.

-ప్రజలకు సాగు, త్రాగుకే కాదు నిర్మాణ రంగానికి నీరు ప్రధానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాళేశ్వరం నిజంగా తెలంగాణకు వరప్రదాయినే..అరవై ఏళ్ల తెలంగాణ గోసను తీర్చిందే. ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించిదే. అన్నమో రామ చంద్రా అని ఏడ్చిన తెలంగాణ అన్న పూర్ణగా మార్చిందే..వెయ్యి అడుగులకు బోర్లు చేసినా చుక్క నీరందని తెలంగాణలో, పది ఫీట్లలోనే నీరందించిన వర ప్రదాయినే..నలభై ఏళ్ల క్రితం పూడిపోయిన బావుల్లో కూడా నీరు చేసింది కాళేశ్వరం వల్లనే…నలభై ఏళ్లుగా వినియోగించని బావులు మళ్లీ సాగుకు పనికొచ్చాయంటే కారణం కాళేశ్వరమే…పాతాళంలో వున్న నీరును తెచ్చి సాగు చేసేందుకు వేసిన బోర్లు కరంటు అసవరం లేకుండా ఎల్లబోసినవి కాళేశ్వరం వల్లనే..అవును ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా వుండడానికి కారణం కాళేశ్వరమే… కాళేశ్వరం ఎప్పుడూ శనేశ్వరం కాదు. తెలంగాణకు పట్టిన శనిని తరిమిన అదృష్టమే కాళేశ్వరం. సరిగ్గా పన్నెండేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లపాటు కరవులో మగ్గిన తెలంగాణ ప్రాంతం. కరువు అంటే అలాంటి ఇలాంటి కరువు కాదు. భయంకరమైన కరువు. నీళ్లు లేకనా..కాదు..వానలు కురవకనా? లేదు. అన్నీ వున్నాయి. కాని తెలంగాణ నెత్తిన ఉమ్మడి పాలన అనే శని వచ్చి కూర్చన్నది. ఏలి నాటి శనికైనా కొంత కాలం వుంటుందేమో? కాని ఉమ్మడి పాలన శని 60 ఏళ్లు పట్టి తెలంగాణను పీడిరచింది. ఉమ్మడి పాలన మొదలైన నాటి నుంచే తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. రెండు రాష్ట్రాలు కలిసి నాటి నుంచే కొట్లాట మొదలైంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆరాటం, పోరాటం రెండూ మొదలయ్యాయి. కాని కనికరించిన వారు లేదు. కదిలిన వారు లేరు. తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేస్తుంటే పట్టించుకున్న పెద్దలు లేరు. డిల్లీ నేతలకు తెలంగాణ అన్యాయం కనిపించనంగా ఉమ్మడిపాలకులు మాయ చేసి, మభ్యపెడుతూ వచ్చారు. పాలకులుగా ముందుండి తెలంగాణ నేతలను వెనక్కి నెట్టేశారు. బలం లేనితెలంగాణ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను బలం చూసుకొని సీమాంద్ర నాయకులు పెత్తనం చేశారు. తెలంగాణ నిధులను ఆంద్రాకు ఎత్తుకెళ్లారు. తెలంగాణ నీళ్లను మలుపుకెళ్లారు. ఆఖరుకు తెలంగాణకు పని లేకుండా, ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోయారు. తెలంగాణను ఎండబెట్టారు. లేని కరువును తెచ్చి రుద్దారు. కనికరం లేనిపాలన సాగించారు. తెలంగాణ గోస పుచ్చుకున్నారు. గొంతెండుతున్న తెలంగాణను చూసి నవ్వుకున్నారు. తెలంగాణకు కష్టం తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మెతుకులు విదిల్చినట్లు ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు శంకుస్ధాపనలుచేసేవారు. ఆకాశంలో చుక్కలు చూపించి, ఓట్లు వేయించుకునేవారు. ఎప్పుడూ ఇదే తరీక..ఎన్నికలు అయిపోగానే మళ్లీ మెలిక. ఇదే ఉమ్మడి పాలకులు చేసిన మోసం..ద్రోహం..దౌర్జన్యం..ఆదిప్యతం. తలాపున పారుతున్న గోదావరి నీటిని తెలంగాణకు మళ్లిస్తే ఎండాకాలంలో ఆంద్రాకు చుక్క రాకుండాపోతుందనుకున్నారు. ఆంద్రాలో రెండో పంటకు నీళ్లివ్వాలంటే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు. తెలంగాణలో వున్న ప్రాజెక్టుల నీళ్లు కూడా పొలాలకు అందించలేదు. ఆంద్రాలో రెండో పండలకు అవసరమైనప్పుడు మాత్రం గెట్లెత్తుకున్నారు. శ్రీరాం సాగర్‌ నిర్మాణం నుంచి మొదలు, తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా, అది ఆంద్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఎగువన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి మొదలు కింద కిన్నెర సాని వరకు ఏపికి ఉపయోగ పడే ప్రాజెక్టులుగానే మార్చుకున్నారు. తెలంగాణకు చుక్కనీరించేందుకు మనసు రాలేదు. మిగులు జలాల కాలవలు ఆంద్రాకే, వరద జలాల కాలువలు ఆంద్రాకే ఇలా గోదావరి గలగల పారుతున్న సవ్వడి తప్ప, నీటిచుక్కను ఇవ్వలేదు. ఆఖరుకు సమ్మక్క సారక్క జాతర సమయంలో కూడా నీళ్లు వదిలేందుకు కూడా ఇష్టపడకపోయేవారు. ఇక కృష్ణా నది నీటిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని చెప్పేవారు. పాలమూరును ఏనాడు పట్టించుకోలేదు. కాని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనే పొక్కపెట్టి పోతిరెడ్డి పాడుపేరుతో వెనుక నుంచి వెనక్కే మళ్లించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో కుడిలో ఏడాదంతా నీళ్లు తీసుకెళ్లారు. ఎడమ కాలువకు అడగంగ అడగంగా అరకొర వదిలేవారు. పైగా కుడి కాలువ నుంచి ఏపి రైతులకు, కృష్ణాడెల్టాకు ఉచితంగా నీళ్లిచ్చేవారు. ఎడమ కాలువకు నీటి తీరువా వసూలు చేసేవారు. కుడికాలువపై వున్న ఎత్తిపోతల ఖర్చు ప్రభుత్వం భరించేది. ఎడమ కాలువ ఎత్తిపోతల ఖర్చు రైతుల నుంచి వసూలు చేసేది. ఇంతటి దుర్మార్గమైన పాలననుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాళేశ్వరం వచ్చింది. తెలంగాణ సాగుకు నీరుండేది కాదు. భూ గర్భ జలాలకు దిక్కులేదు. వర్షాకాలం కురిసే వానలకు కూడా పంటలు పండిరది లేదు. బావులు నిండేవి కాదు. బాగా కాలమైనా మూడు నెలలకు మించి నీరు సాగుకు సరిపోయేది కాదు. బోర్లు వేసుకున్నా నీరు రాక తెలంగాణ రైతులు అప్పుల పాలైపోయేవారు. ఆ అప్పులు తీర్చేందుకు కూలీలుగా మారిన దుస్తితి చూసింది తెలంగాణ. అలాంటి తెలంగాణ రూపు రేఖలు మార్చింది కేసిఆర్‌. ముమ్మాటికీ ప్రతి తెలంగాణ వాది ఒప్పుకోవాల్సిందే. పార్టీలకతీతంగా కాళేశ్వరం అంశంలో గొప్పగా చెప్పుకోవాల్సిందే. దురదృష్టమేమిటంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. నిజాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ పాలకులు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగితే బైట పెట్టడం తప్పు కాదు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని ఏ తెలంగాణ వాది కోరుకోవడం లేదు. కాని ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ఎండబెట్టడం సరైంది కాదు. కాళేశ్వరం మీద వేసిన కమీషన్‌ కూడా దాని నిర్మాణ సమయంత సాగ దీయడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. కాళేశ్వరంలో జరిగిందని రేవంత్‌ సర్కారు కమీషన్‌ వేసినప్పుడు ప్రజలు స్వాగతించారు. కాని కాళేశ్వరం నీటిని వినియోగం ఆపడం నుంచి ప్రజల్లో ఒకింత బిఆర్‌ఎస్‌పై సానుభూతి పెరుగుతోంది. రానున్న కాలంలో అది మరింత పెరిగే అవకాశంవుంది. ఆ తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్ధితి రాదు. కమీషన్‌ రిపోర్టు అందుకు అనుగుణంగా వచ్చినా ప్రజలు స్వాగతించరు. ఎందుకంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ లబ్దిపొందింది. రైతులు సంతోషంగా వున్నారు. గత ఏడాది విసృతంగా వానలు కురిశాయి. సమృద్దిగా రైతులకు నీరందింది. దానితో కాళేశ్వరంతో పని లేకుండా పంటలు పండాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే అది నిజమని ప్రజలు కూడా నమ్మారు. కాని గత సీజన్‌లో రైతులకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు కాలం కూడా ముఖం చాటేస్తుంది. ఇలాంటి పరిస్దితులు వస్తే, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, పంటలు ఎండిపోకుండా చూసుకోవడం కోసం నీళ్లను ఆదా చేసి, రైతులకు ఇచ్చేందుకే కాళేశ్వరం అని ప్రజలు గుర్తించే రోజు వస్తోంది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్దితి. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే అప్పటి బిఆర్‌ఎస్‌ పాలకుడు, కేసిఆర్‌ సుస్పష్టంగా చెప్పారు. మూడేళ్లు కాలం కాకపోయినా, కరువు వచ్చినా, తెలంగాణ రైతు నీళ్లకు ఇబ్బందులు ఎదురుకావని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నిజం కానున్నది. జూలై నెల వస్తున్నా వాన చినుకు జాడ లేదు. వర్షాలు ఇప్పుడు కురుస్తాయన్న సంకేతాలు కూడ కనిపించడం లేదు. ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఓ వైపు రైతులు సాగు మొదలు పెట్టారు. గతంలో పదేళ్లపాటు కాలం కోసం ప్రజలు ఎదురుచూడలేదు. అటు దేవాదుల, ఇటు కాళేశ్వరంతో పుష్కలంగా భూ గర్బ జలాలు వున్నాయి. హైదరాబాద్‌ కు కూడా మంచి నీటి కటకట రాలేదు. పారిశ్రమలకు నీరు అందలేదన్న మాట వినిపించలేదు. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే, ఆగష్టులో అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదరుకాకతప్పదు. ఇప్పుడు చెరువులు నింపాలన్నా, దేవాదులలో నీరు లేదు. ఇతర రిజర్వాయర్లలలో సమృద్దిగా నీరు లేదు. చెరువులుఎక్కడిక్కడ ఎండిపోయాయి. దీని ప్రభావం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద పడుతుంది. రైతు కన్నెర్ర చేస్తే ఇక కనికరించే పరిస్ధితి వుండకపోవచ్చు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడిపాలకులు అన్యాయంచేశారు. కాళేశ్వరం వున్నా నీటిని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం బద్‌నాం కాకతప్పదు. కాళేశ్వరంలో కుంగిన మూడు పిల్లర్లను బాగుచేస్తే బిఆర్‌ఎస్‌కు పేరొస్తుందని అనుకోవడం తగదు. కరవొచ్చి ఒక్క మడి ఎండినా, అది కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి నాంది జరుగుతుంది. కాంగ్రెస్‌ మరో పది కాలాల పాటు పాలించాలనుకుంటే, ప్రభుత్వం కొనసాగాలంటే నీటి సంక్షోభం లేకుంటే చూసుకుంటే మంచిది. లేకుంటే కాంగ్రెస్‌ చే జేతులా గడ్డు కాలం తెచ్చుకున్నట్లౌవుంది. బిఆర్‌ఎస్‌ను మరిపించేలా నీరివ్వండి. కాంగ్రెస్‌ను మళ్లీ మళ్లీ గెలిపించుకునేలా చేసుకోండి. రైతుకు నీళ్లందితే కాంగ్రెస్‌కు మేలు. రైతు ఏడిస్తే ఇదే కాంగ్రెస్‌కు గెలుపు ఆఖరు.

‘‘నో డైరెక్ట్‌’’..’’ఓన్లీ డైవర్ట్‌’’.

-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి.

-కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది.

-అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది.

-ప్రజా సమస్యలు చర్చించడం లేదు.

-ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం.

-మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి.

-సోషల్‌ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి.

-మీడియా, సోషల్‌ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి.

-రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి.

-ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే!

-ప్రతి అంశంలోనూ కప్పగంతులే.

-గెలిచిన పార్టీలు అంతా బాగుందనుకుంటున్నాయి.

-ఓడిన పార్టీలు గెలిచేందుకు తాపత్రయపడుతున్నాయి.

-అన్ని పార్టీలు కలిసి ప్రజా సమస్యలను గంగలో ముంచేస్తున్నాయి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాను రాను రాజకీయాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గత యాభైఏళ్ల రాజకీయాలకు ఇప్పటికీ పొంతన లేకుండాపోతున్నాయి. ఒకప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి, నిత్యం ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజలు ఆదరించేవారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులనే ఆదరించేవారు. ఏ పార్టీ అయినా నిరంతరం పోరాటంలో వుంటేనే అదికారంలోకి తెచ్చేవారు. అది కేంద్రంలోనైనా రాష్ట్రాలలోనైనా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసేవారు. కాని కాలం మారింది. మరీ ఈ రెండు దశాబ్ధాల కాలంలో నాయకులకు మాటలొస్తే చాలు. అబద్దాలు చెప్పడం వస్తే చాలు. నమ్మించడం తెలిస్తే చాలు. అవసరమైతే ప్రజలను సెంటిమెంటుతో ఒప్పిస్తేలు చాలు. కులం, మతం ఆసరాగా చేసుకొని రాజకీయాలుచేస్తే చాలు. ప్రజల్లో వున్న నమ్మకాలను పట్టుకొని రాజకీయాలు చేస్తేచాలు. అన్నట్లు తయారైపోయాయి. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేదు. సిద్దాంతాలు పట్టుకుంటే రాజకీయాలు సాగే రోజులు కాదు. అందుకే ఇప్పుడు రాజకీయాలకు సిద్దాంతాలు లేవు. పార్టీలు ఏనాడో రూపొందించుకున్న విలువలు లేవు. అందుకే సమాజంలో ఎవరు నాయకులౌతున్నారో? ఎవరు గెలుస్తున్నారో? ఎందుకు గెలుస్తున్నారో? కూడ అర్దంకాని పరిస్ధితులు ఎదురౌతున్నాయి. రాజకీయాలు చేయడాన్ని కూడా తమదైన శైలిలో నడిపించేవారికే రాజకీయ భవిష్యత్తులుంటాయి. నాయకులకు వ్యతిరేకంగా వున్న పార్టీలపై కూడా ప్రజలు కోపం పెంచుకుంటున్నారు. నాయకులకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో లేవు. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ దేశ వ్యాప్త రాజకీయాలను ఒక గ్రంధంగా మార్చొచ్చు. రామాయణం కన్నా పెద్ద కావ్యం రావొచ్చు. అయితే ఇక్కడ ఆటలో అరటిపండ్లు ప్రజలే అవుతున్నారు. ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజలే ఎనుకున్న ప్రజా ప్రభుత్వం. ఇది పేరుకే అన్నది ఇప్పటి కాలం నిజం చేస్తోంది. కొన్ని నిజాలు చాలా చేదుగా, ఘాటుగా కూడా వుంటాయి. 2014లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి బిజేపి పెద్దగా కష్టపడలేదు. కాని ఆ అదికారాన్ని వరసుగా మూడు సార్లు నిలబెట్టుకోవడానికి మాత్రం చేస్తున్న రాజకీయ విన్యాసం విచిత్రమైనది. ప్రజా సంక్షేమం గతంలో ఎప్పుడూ లేనంతగా చూపిస్తూ బిజేపి కేంద్రంలో తిరుగులేని పాలన కొనసాగిస్తుందా? అంటే ఔనని సమాదానం ఎంత మంది చెబుతారో మాత్రం చెప్పలేం. కాని బిజేపి పార్టీ మూలసిద్దాంతంలో ఒకటైన మతాన్నిమాత్రం గట్టిగా పట్టుకున్నది. హిందూ మతానికి ప్రమాదం వుందన్న భయాన్ని ప్రజల్లో రేకిత్తెంచగలిగింది. హిందూ సమాజాన్ని మాత్రం ఏకం చేయడంలో బిజేపి సక్సెస్‌ అయ్యింది. అదే కొనసాగిస్తూనే వుంది. అటు తిరిగి, ఇటు తిరిగి హిందూ పునరేకీకరణ అనేదే మూలసిద్దాంతమైపోయింది. అంతకు మించి ఏం చేస్తోంది అంటే చెప్పడానికి ఏదీ లేదు. కాని దేశం మాత్రం సుబిక్షంగానే వుంది. కరువు లేదు. ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేదు. కాని నిరుద్యోగం విపరీతంగా పెగిపోయింది. దేశంలో సాగు వెనుకబడిపోయింది. అయినా సమృద్దికరమైన ఆహారమే జనానికి అందుతోంది. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది అర్ధాకలితో బతుకుతున్నారు. ఆ వార్త మాత్రం ఎక్కడా కనిపించదు. వినిపించదు. ఆకలి కేకులున్నట్లు ఒక్క మీడియా రాయదు. ఇదే ఇప్పుడున్న రాజకీయాల్లో బెస్ట్‌ క్వాలిటీ. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే ఏ ఒక్క జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మానం చేసింది లేదు. రాష్ట్రాలలో కూడా ఏపి, తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు నిర్మాణం చేసినట్లు వార్తలు లేవు. ప్రశ్నించే నాయకులను కులం మీద దెబ్బకొట్టాలి. మతాన్ని ముడిపెట్టి రాజకీయాలు చేయాలి. బిజేపిని ప్రశ్నించే ప్రతి వారిని హిందూ వ్యతిరేకులని నిందించాలి. దేశ ద్రోహులని ముద్రలు వేయాలి. ఇలా ఇప్పటి వరకు మూడుసార్లు అధికారంలోకి కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా అధికారం దక్కించుకునేందుకు బిజేపి ఆడుతున్న రాజక్రీడలో ఎవరూ ఎదురు నిలబడి గెలవడం లేదు. 130 సంవత్సరాల చరిత్ర వున్న కాంగ్రెస్‌కూడా కాకావికలమైపోతోంది. బిజేపి డౌవర్ట్‌ పాలిటిక్స్‌ను మాత్రమే నమ్ముకొని రాజకీయాలు సాగిస్తోంది. కేంద్రం నుంచి గుజరాత్‌కు,ఉత్తరాదికి నిధులు ఎన్ని వెళ్తున్నా, కనీసం బిజేపి నాయకులు కూడా నోరెత్తలేని రాజకీయాలు రచిస్తోంది. కొనసాగిస్తోంది. ధరలు ఆశాకాశన్నంటుతున్నా ఎవరూ అడిగే పరిస్దితి లేదు. పక్క దేశాల కయ్యాలే రాజకీయంగా కాపాడుతాయన్నయని నమ్ముకుంటున్నారు. రాష్ట్రాలలో కూడా అదే పరిస్దితి. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్ని కావు. కాని అమలుచేసినవి కూడా పెద్దగా ఏమీ లేదు. కాని ఓట్ల రాజకీయంలో కొన్ని కీలకమైన అంశాలు జొప్పించి రాజకీయం కేసిఆర్‌ సాగించారు. నీళ్లను పట్టుకున్నాడు. ఆ విషయంలో పదేళ్ల కాలంలో చేయాల్సినంత చేశాడు. మిగత వాటిని వదిలేశాడు. అందుకే పదేళ్ల తర్వాత జనం కూడా కేసిఆర్‌ను వదిలేశారు. జనం కేసిఆర్‌ను కాదనుకుంటున్నారన్న సంగతి గ్రహించిన రేవంత్‌రెడ్డి తన రాజకీయం తాను మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకులు ఊహలకందని ఎత్తులు వేశారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు నోరు మూయించాడు. వారందిరినీ తన బాటలోకి తెచ్చుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో అమలు జరుతున్న కొత్త పథకాలు అంటే గ్యారెంటీ కార్డుకే పరిమితం చేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత బిఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ప్రకటించింది. అప్పుడు కేసిఆర్‌ కాంగ్రెస్‌ హమీలను కూడా కలుపుకొని ప్రచారం చేసుకున్నాడు. విజయం సాదించాడు. కాని 2023 ఎన్నికల్లోనూ ఆరు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల తర్వాత కేసిఆర్‌ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినా అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. కాని 2023 ఎన్నికల్లో సిఎం. రేవంత్‌ మొదటి దెబ్బ అక్కడి నుంచే మొదలు పెట్టారు. పదేళ్లు పాలించి, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసిఆర్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టాడంటూ బలంగా రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా గమనించేలా చేశారు. కేసిఆర్‌ చెప్పే మాటలు మోసమని నమ్మించగలిగారు. కాంగ్రెస్‌ ఒక్కసారి మాటిస్తే మర్చిపోయేది లేదని చెప్పారు. మోసం చేయడం కాంగ్రెస్‌ చరిత్రలోనే లేదన్నారు. ఒక్కొసారి కాస్తా ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని జనాన్ని నమ్మించారు. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇస్తాం..అని చెప్పడం మొదలు పెట్టారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఇలా చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని గ్యారెంటీ రూపంలో ప్రజలకు చేర్చారు. కార్డులు చేతిలో పెట్టారు. గెలిచారు. ఆ వెంటనే ఆట మొదలు పెట్టారు. జనాన్ని ఆరు గ్యారెంటీలు మర్చిపోయేలా చేయాలంటే బిఆర్‌ఎస్‌ నాయకుల నోరు మూయిస్తే చాలనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి తన సరికొత్త రాజకీయాన్ని సాగిస్తున్నారు. ఆఖరుకు ప్రతిపక్ష బిజేపి కూడ కాంగ్రెస్‌ను కాకుండా బిఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేసే రాజకీయాలు చేస్తున్నారు. సహజంగా అదికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కాని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి రెండూ బిఆర్‌ఎస్‌ను పుడ్‌ బాల్‌ ఆడేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నోరు తెరవకుండా చేస్తున్నాయి. వీటినే డైవర్ట్‌ పాలిటిక్స్‌ అంటారు. కాళేశ్వరం పై కమీషన్‌ వేశారు. అది జీడిపాకంలా సాగుతూనే వుంది. గత 18 నెలులగా జనంలోనానుతూనే వుంది. దానికి ఇప్పుడే అంతం వుండదు. ఇంకా సాగదీస్తూనే వుంటారు. జనం ఎప్పుడూ మాట్లాడుకోవడానికి ఏదో ఒక సమస్య వుండాలి. అందులోనూ బిఆర్‌ఎస్‌ నాయకులు దోషులని జనం ఎప్పుడూ నమ్ముతూ వుండాలి. అలా కేసిఆర్‌ మీద కాళేశ్వరం, కేటిఆర్‌ మీద కార్లరేస్‌ కేసు, కవిత మీద లిక్కర్‌ కేసు ఇలా ప్రతి నిత్యం ఇవే అంశాలు చర్చలకు రావాలి. మీడియాలో ఇవే అంశాలపై చర్చల మీద చర్చలు జరగాలి. ప్రజా సమస్యలు తెరమీదకు రాకూడదు. తాజాగా బనకచర్ల తెరమీదకు వచ్చింది. ఇదెంత కాలం సాగుతుందో…ఎవరి రాజకీయాలకు చుట్టుకుంటుందో చూడాలి. రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్రజలు అంత అమాయకులు కాదు. దేనిని నమ్మాలో..దేనిని నమ్మొద్దో తెలియని వాళ్లు కాదు. కాని అప్పుడప్పుడు రాజకీయాలలో ప్రజలు కూడా బోల్తాపడతారు. తర్వాత మళ్లీ తేరుకుంటారు. అయిన ఇప్పుడున్న పరిస్దితుల్లో రాజకీయ పార్టీలు మాత్రం డైవర్ట్‌ పాలిటిక్స్‌నే నమ్ముకున్నారు. పక్కన ఏపిలో కూడా ఇదే అమలు చేస్తున్నారు.

అక్రమ రైస్‌ మిల్లర్ల మోసాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రజా సంఘాల నిర్ణయం!

`జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోం : జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘‘అన్నంచిన్ని వెంకటేశ్వరరావు.

`ఈ విషయంపై తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ప్రకటించిన దళిత హక్కుల పోరాట సమితి.

వరంగల్‌ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్‌.

`త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్న సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి.

`రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రకటించారు.

`రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయాలని సమాలోచనలు!

`త్వరలో కోర్టులను ఆశ్రయించనున్న ప్రజా సంఘాలు.

`అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.

`రైతులను మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై ప్రజా సంఘాల ఆగ్రహం.

`హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్‌ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.

`జాయింట్‌ కలెక్టర్‌ కూడా మోసం జరిగినట్లు కమీషనర్‌కు నివేదిక పంపడం జరిగింది.

`ఖమ్మం జేసి సదరు మిల్లర్‌పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.

`ఇంకా మిల్లర్‌ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు.

`రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని ప్రజా సంఘాల హెచ్చరిక.

`హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్‌.

`సివిల్‌ సప్లయ్‌ అధికారులు స్పందించకపోతే ఆందోళనకు ప్రజా సంఘాల కార్యాచరణ.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆరుగాలం శ్రమించే రైతులను మోసం చేయడం కొంత మంది మిల్లర్లకు అలవాటైంది. రైతులు కష్టం దోచుకోవడం నేర్చుకున్నారు. రైతులు పండిరచిన వడ్లను దోచుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ అదికారులు చోద్యం చూస్తున్నారు. తప్పు చేసిన మిల్లర్లను ఉపేక్షిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న అక్రమ మిల్లర్లపై చర్యలు తీసుకోవడం వదిలేసి, వారికి అధికారులు వంత పాడుతుంటారు. సహకరిస్తుంటారు. మిల్లర్ల అక్రమ సంపాదనలో అధికారులు కూడా అక్కడక్కడ భాగస్వాములౌతున్నారని సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు సంఘి ఏలేందర్‌ ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న మిల్లర్లకు వ్యతిరేకంగా త్వరలో తమ పార్టీ,సంఘాల ఉద్యమ కార్యాచరణ వుంటుందని వేర్వేరు ప్రకటనల్లో తెలియజేశారు. అంతే కాకుండా త్వరలోనే రైతు సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున నిరసలు తెలియజేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌సప్లై అధికారులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడంతోపాటు, అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులల్లో దాఖలు చేస్తామని నేటిధాత్రితో తెలిపారు. ఈ సందర్భంగా రవి, ఏలెందర్‌లు నేటిధాత్రితో మాట్లాడుతూ రైతులను అన్యాయానికి గురి చేస్తున్న మిల్లర్లను ఇక ఉపేక్షించేది లేదని వారికి శిక్షలు పడే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. నేటిధాత్రి అక్రమ మిల్లర్లపై సాగిస్తున్న అక్షర పోరాటాన్ని చాలా కాలంగా గమనిస్తున్నామన్నారు. అయినా కొంత మంది మిల్లర్లలో మార్పులు రావడం లేదన్నారు. అలాంటి మిల్లులు మూత పడేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మిల్లర్లు మింగిన రైతుల సొమ్ము కక్కించే వరకు తమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు రాష్ట్ర శాఖతోపాటు, అన్ని జిల్లాల శాఖలను కూడా అప్రమత్తం చేస్తామన్నారు. ఏక కాలంలో హన్మకొండ, వరంగల్‌ జిల్లాలతోపాటు, తెలంగాణలోని అన్ని రాష్ట్రాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తామన్నారు. అంతే కాకుండా అన్ని జిల్లాల్లోని సివిల్‌ సప్లయ్‌ కార్యాలయాల ముందు, అక్రమ మిల్లర్లు నిర్వహిస్తున్న మిల్లుల మందు కూడా నిరసనలు తెలియజేస్తామన్నారు. రైతుల పొట్ట గొడుతున్న మిల్లులను మూసి వేస్తే గాని మిగతా మిల్లర్లల్లో మార్పులు రావన్నారు. రైతులతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు దేశంలో అనేకం వున్నాయన్నారు. రైతు చట్టాలలో మార్పులు తెస్తామని కేంద్రం నిర్ణయం తీసుకుంటే రైతుల పక్షాన ప్రజా సంఘాల పోరాటం ఎలా విజయం సాదించిందో అందరికీ తెలుసన్నారు. మన దేశంలో రైతు చట్టాలు ఎంత బలంగా వున్నాయో అవగాహన లేని కొంత మంది అక్రమ మిల్లర్లు రైతులను మోసం చేయడం చిన్న వ్యవహారం అనుకుంటున్నారని ఆక్షేపించారు. వడ్ల విషయంలో రైతులను మోసం చేయడం పెద్ద నేరమన్న సంగతి తెలిసి కూడా మిల్లర్లు మోసం చేస్తే వారికి శిక్ష తప్పదన్నారు. గత కొంత కాలంగా నేటిధాత్రి దినపత్రికలో వస్తున్న వరుస కథనాలు చూస్తున్నామన్నారు. రైతుల కోసం నేటిధాత్రి ఇంత పోరాటం సాగిస్తుంటే తాము మౌనంగా వుండడం సరైందికాదని నిరసనలు తెలియజేయాలని, ఉద్యమాలు సాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఒక్క మిల్లరే ఇంత అరాచాకాలు సాగిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది మిల్లర్లు ఆయన బాటలో నడుస్తున్నారో నివేదికలు సిద్దం చేస్తామన్నారు. అసలు తనకు చెందని వడ్లను తన మిల్లులకు చేర్చుకోవడమే అక్రమ మిల్లర్‌ చేసిన తప్పు. ఆయనకు మేలు చేసేలా ఇతర మిల్లులకు అన్యాయంచేయడం అదికారులు చేసిన పెద్ద తప్పు. అలా ఇతర మిల్లులకు చెందాల్సిన వడ్లను దింపుకున్న మిల్లర్‌ జగన్‌, రైతులను మోసంచేయడం పెద్ద నేరం. ఇంత యధేచ్చగా రైతులను ఒక్క మిల్లర్‌ మోసం చేస్తుంటే అదికారులు ఏం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అదికారుల్లాగా హన్మకొండ అదికారులు ఎందుకు నిజాయితీగా పనులు చేయడం లేదని వారు నిలదీశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసుకోవాల్సిన అధికారులు అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ నేరాలు చేస్తున్నారని రవి, ఏలెదంర్‌లు అన్నారు. అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ, రైతులను మోసం చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకునేలా తాము అన్ని ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా కూడా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతులను మిల్లర్లు ఇంతగా మోసం చేస్తున్నట్లు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. నేటిధాత్రి ఎంతో ధైర్యంగా అక్రమ మిల్లర్లు సాగిస్తున్న అవినీతి దందాను బైట పెట్టి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. సహజంగా మిల్లర్లు చేసే మోసం ఇంత పెద్ద మొత్తంలో వుంటుందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, నేటిదాత్రి మూలంగా మిల్లర్ల బాగోతం మొత్తం బైటపడిరదన్నారు. రైతులను ఎన్ని రకాలుగా మిల్లర్లు మోసం చేస్తున్నారో ఒక్కొ అంశం మీద వరస కధనాలు రాయడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటిధాత్రి ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను వాళ్లు అభినందించారు. ఇలాగే సమాజంలో జరుగుతున్న అన్ని అక్రమాలు, మోసాలపై నేటిధాత్రి దృష్టిపెట్టాలని కోరారు. అక్రమ మిల్లర్ల వ్యహారం ఇక రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా తీసుకెళ్లి అక్రమ మిల్లర్ల బండారం బైటపెడతామన్నారు. రైతులను మోసం చేసిన వారికి శిక్ష పడేవరకు తాము ఉద్యమిస్తామని రవి, ఏలేందర్‌ తెలిపారు. 

                                   

నేటిధాత్రి జోలికొస్తే ఊరుకోం: అనం చిన్ని వెంకటేశ్వరరావు. జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.

సమాజంలో ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో…అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యకాలాపాలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో.. సమాజాభివృద్ది, ప్రగతి కోసం న్యితం ఆరాటపడేది, పోరాటం చేసేదే మీడియా. అలాంటి మీడియా అక్రమార్కులు జీర్ణించుకోలేదు. తమ అక్రమ సంపాదన వదులుకోలేరు. అన్యాయం చేయడం ఆపుకోలేరు. తోటి వారిని మోసం చేయడం మానుకోలేరు. కోట్ల కోసం ఏ గడ్డైనా తింటారు. అశుద్దమైనా ఆనందంగా భుజిస్తారు. అలాంటి వారి మంచి కోరుకోరు. ఎదుటి వారి నాశనమే కోరుకుంటారు. అక్రమాస్దులు కూడబెట్టుకుంటారు. అలాంటి వారికి నేటిధాత్రి దినపత్రిక మీద మాట్లాడే నైతికత వుండదు. ఆ హక్కు కూడా వుండదు. ఓ వైపు రైతులను నిండా ముంచుతూ, ప్రభుత్వాన్ని మోసంచేస్తూ, పర్యావరణాన్ని పాడు చేస్తూ, అన్ని రకాలుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ, సమాజంలో ఆర్ధిక అచారకానికి పాల్పడే వ్యక్తుల గుండెల్లో నేటి దాత్రి అక్షర అంకుశం. అలాంటి నేటిదాత్రిపై ఎలాంటి దాడులకు దిగినా జర్నలిస్టు సంక్షేమ సంఘం చూస్తూ ఊరుకోదు. నేటిధాత్రి యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాళ్లు సరిదిద్దుకుంటే మంచిది. రైతులను మోసం చేయడం ఆపుకుంటే ఎంతోమంచింది. అంతే కాని తాము చేసే అక్రమాలకు, అన్యాయాలకు నేటిదాత్రి అడ్డొస్తుందని లేనిపోని కుట్రలు చేస్తే తెలంగాణ జర్నలిస్టు సమాజమంతా కదులుతుంది. సమాజానికి మంచి చేసేవారిని ప్రోత్సహించడం, చెడు చేసేవారిని చీల్చిచెండాడడమే మీడియాకు తెలుసు. మీడియాకు శత్రువులంటూ, మిత్రులంటూ వుండరు. కావాలనే మిడియాతో అక్రమార్కులే శత్రుత్వాలు పెంచుకుంటుంటారు. అది అసలే మంచిది కాదు. నేటిధాత్రి యాజమాన్యం, జర్నలిస్టుల జోలికి ఎవరు వచ్చినా జర్నలిస్టు సంక్షేమ సంఘం ఉపేక్షించదు.

కార్మికులారా ఏకం కండి! సినీ గద్దల మాయలో పడకండి!!

 

`‘‘రోహౌస్‌’’లు ముందు టెంట్లు వేయండి!

`రెచ్చగొట్టి పబ్బం గడిపేవారితో అప్రమత్తంగా వుండండి.

??’’రోహౌస్‌’’ లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మరొక ‘‘రోహౌస్‌’’ ఓనరే చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కి పీర్యాదు చేసిన ఇప్పటివరకు చర్యలు లేవు.??

??కార్మికులు ధర్నాలు చేయాల్సింది ఫిల్మ్‌ చాంబర్‌ ముందు కాదు.??

`14 ఎకరాలు దోచుకున్న గద్దల రో హౌస్‌ ముందు నిరసనలు చేపట్టండి.

`‘‘రోహౌస్‌’’ లు అక్రమమని నినదించండి.

`‘‘రోహౌస్‌’’ లు కూల్చేదాకా నిరవదిక నిరసనలు కొనసాగించండి.

`అవినీతి పెద్ద ఎత్తున జరిగింది ‘‘రోహౌస్‌’’ లలోనే అది గమనించండి.

`‘‘ట్విన్‌ టవర్స్‌’’ నిర్మాణానికి అడ్డుపడితే మొదటికే మోసం వస్తుంది.

??14 ఎకరాలలో అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది.??

`కార్మికులను ఎగదోస్తున్న ‘‘రోహౌస్‌’’ పెద్దల కుట్రలు పసిగట్టండి.

`వారి కుటిల ఎత్తుగడలలో బలికాకండి.

??చిత్రపురి సొసైటీ లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి.??

`ప్రతి కార్మికుడు పాలు పంచుకునేలా చూడండి.

`ముందు ‘‘రోహౌస్‌’’ ల మీద దృష్టి పెట్టండి.

`కళ్ల ముందు కనిపిస్తున్న ‘‘రోహౌస్‌’’ లు కనిపించకుండా కనికట్టు కడుతున్నారు.

`అక్రమంగా నిర్మాణం చేసుకున్న ‘‘రోహౌస్‌’’ ల మీద అంతస్తులు చేపడుతున్నారు.

`‘‘రోహౌస్‌’’ ల 14 ఎకరాలు కూడా కార్మికుల సొంతమే.

`ఆ స్థలం వదిలేసి, అవకాశవాదుల మాటలు విని మోసపోకండి.

`తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొట్టే వారి పంచన చేరకండి.

`నిజా నిజాలు తెలుసుకోకుండా ‘‘రో హౌస్‌’’ పెద్దల వలలో పడకండి.

`నిజాలు గమనించి చిత్రపురి మీ సొంతమని తెలుసుకోండి.

`కార్మికుల కోసం ‘‘నేటిధాత్రి’’ అలుపెరగని అక్షర పోరాటం సాగిస్తోంది.

`కార్మికులకు ‘‘నేటిధాత్రి’’ చెప్పే నిజాలు చేరకుండా చేస్తున్నారు.

`చిత్రపురి సొసైటీలో లేనిపోని చిచ్చులకు మీరు బాధ్యులు కాకండి.

`పెనం మీద నుంచి పొయ్యిలో పడకండి.

`సినీ గద్దల మాటలు విని ఇంకా మోసపోకండి.

`ఏ రాజకీయ పార్టీ మీకు న్యాయం చేయదు.

`చిత్రపురి పేరుతో రాజకీయంగా పబ్బం గడుపునే వారున్నారు.

`ఏ రాజకీయ పార్టీ అండ కార్మికులకు అవసరం లేదు.

`కార్మిక నాయకులుగా రాజకీయ పార్టీలను ముందు పెట్టకండి.

`పోరాటం మీది, ఆరాటం మీది.

`అంతిమంగా ఎంత కాలమైన చిత్రపురి మీది.

`సినీ గద్దలతో పాటు, రాజకీయ పార్టీలు దూరుతాయి.

`ఇప్పటికే మీ జివితాలు ఆగమయ్యాయి.

`కార్మికుల పేరు చెప్పి రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారం కాకుండా సాగదీస్తున్నారు.

`చిత్రపురిలో సమస్యల సమరం రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు.

`చలిమంటలు చేసి సినీ గద్దలు చలికాచుకుంటున్నాయి.

`కార్మికుల బతుకులను జీవిత కాలం నాశనం చేస్తున్నాయి.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 చిత్రపురి సొసైటీ ఏర్పాటైన కాలం నుంచి కార్మికులను మోసం చేయడం, వారి అమాయకత్వాలను అలుసుగా చేసుకుంటున్నారు. సినీ పెద్దలు సమయానుకూలంగా కార్మికులను పావులుగా వాడుకుంటున్నారు. సినీ కార్మికులు అంటే నిర్మాతలు, దర్శకులు, నటలు కాదు. సినిమాలలో ఎదగలేక, ఎదుగూబొదులేక, సరైన అవకాశాలు రాక చిన్న చిన్న వేషాలకు పరిమితైననటులు. మిగతా అన్ని రంగాలలో చిన్న ఆదాయంతో బతికే వాళ్ల కోసమే చిత్రపురి. అలాంటి చిత్రపురిలో పెద్దలెందుకు దూరినట్లు. కార్మికుల భూముల్లో ఎందుకు వాలినట్లు. వీలైతే సినిమా పేరుతో కోట్లు సంపాదించుకునే పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కార్మికుల భూముల్లో వాలడం అంటే పేదల కడుపు కొట్టడమే. ఎలాగూ సినిమా మీద పిచ్చితో వచ్చినవారిని వెట్టి చారికీ చేయించుకుంటున్నారు. వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. వారి కష్టం దోచుకుంటున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఇచ్చిన భూములను కూడా ఆక్రమించుకోవడం అన్యాయం. దుర్మార్గం. ఇలా ఏళ్లు చిత్రపురి మీద బతుకుతున్న ఎంతో మంది మధ్య వర్తులు, దళారులు, కార్మికుల పొట్టగొడుతున్నవారున్నారు. చిత్రపురికి ఒక సొసైటీ ఏర్పాటు చేసింది పెద్దలకు ఆశ్రయం కల్పించమని కాదు. పేదలకు అన్యాయం జరగొద్దని..కాని చిత్రపురి సొసైటీ ఏం చేస్తోంది? గతంలో చేయాల్సిందంతా చేసిన వారు, తప్పుకున్నారు. తర్వాత వచ్చిన వారు కూడా పెద్దలకు కొమ్ముకాయడమే చూస్తున్నాము. అసలు చిత్రపురిలో రోహౌజ్‌లు నిర్మాణానికి సొసైటీ ఎందుకు ఒప్పుకున్నది. ఎలా ఒప్పుకున్నది. ఎవరి ప్రోధ్భలంతో ఒప్పుకున్నది. ఎవరి ఒత్తిళ్లు చిత్రపురి సొసైటీ మీద పనిచేసిందనేది కూడా కార్మికులకు తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే చిత్ర పురి అనేది కార్మికుల సొత్తు. కార్మికుల హక్కు. అంతే కాని సినీపెద్దల కోసం ఇచ్చింది కాదు. సినీ పెద్దలు వాలడానికి వీలులేదు. అయినా దూరిపోయారు. కార్మికుల భూములు లాక్కున్నారు. అదికారులను మభ్యపెట్టి రోహౌజ్‌లు నిర్మించుకున్నారు. ఈ విషయంలో కార్మికులను చైతన్యం చేసిన వారు లేదు. రోహౌజ్‌ల నిర్మాణం అనేది బైలాలోనే లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో. 658లో అసలే లేదు. సినీ పెద్దల ప్రస్తావన ఒక్క ముక్క కూడా లేదు. వారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం అన్ని రకాల షరతులతో జీవో విడుదల చేసింది. ఆ జీవోను తిమ్మిని బమ్మిని చేసి, కార్మికులను మోసం చేసి 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇప్పుడిప్పుడే కార్మికులకు అసలు నిజాలు తెలుస్తున్నాయి. నేటిధాత్రి దిన పత్రిక గత కొన్నేళ్లుగా చిత్రపురిలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై అనేక కధనాలు రాసింది. రోహౌజ్‌ల గుట్టు రట్టు చేసింది. రోహౌజ్‌ల నిర్మాణం అక్రమం, అనైతికం, చట్టరిత్యా నేరమని తేల్చి చెప్పింది. అసలు రోహౌజ్‌లలో కూడా ఒక్కొ గద్దలకు ఒకటికి రెండు రోహౌజ్‌లున్నాయి. ఆ రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నవారు ఇండియాలో కూడా లేనివారున్నారు. అమెరికా లాంటి దేశాలలో వున్నవారికి కూడా రో హౌజ్‌లు ఇచ్చారు. కార్మికుల స్ధలంలో ఇంతటి అన్యాయానికి ఎందుకు ఒడిగట్టారు? ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్లు నేటిధాత్రి గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులను నిద్రలేపుతూ వుంది. అయినా ఇప్పటికీ కార్మికులలో కొంత మందిని విడదీసి, సినీ గద్దలు మళ్లీ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు ధర్నాలుచేయిస్తున్నారు. నిరసనలు వ్యక్తంచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ట్విన్‌ టవర్స్‌లోనే కాదు, ఇతర అప్పార్టుమెంట్ల నిర్మాణంలో అవకతవలు, అవినీతి జరిగిందని కార్మికుల చేత ప్రశ్నింపజేస్తున్నారు. మంచిదే. కాని రోహౌజ్‌ల అమ్మకాలు,నిర్మాణాలపై కూడా నిరసలు తెలియజేయాల్సిన అవసరం వుంది. కార్మికులకు భూమిని కార్మికులకు అప్పగించాల్సిన అవసరం వుంది. ఆ రోహౌజ్‌లకు చెందిన 14 ఎకరాలు కార్మికులదే అన్న సత్యాన్ని తెలియజేయకుండా, కొంత మంది కార్మికులను ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. ఇంకా మభ్యపెడుతూనే వున్నారు. రోహౌజ్‌ల అమ్మకాల వల్ల వచ్చిన అదనపు ఆదాయాన్ని కార్మికుల కోసంనిర్మాణాలలో ఉపయోగించామని లేనిపోని లెక్కలు చెబుతున్నారు. 14 ఎకరాలలో కూడా పూర్తిగా కార్మికులకే ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇస్తే ఎంతో మంది కొనుగోలు చేసుకునేవారు. కార్మికులందరికీ న్యాయం జరిగేది. ఆ పద్నాలుగు ఎకరాలను ఇతరులకు, సినీ రంగానికి సంబంధం లేనికి వారికి కట్టబెట్టడం నేరం కాదని ఎవరు చెప్పారు. అలా అమ్మకాలు జరపొచ్చని ఎవరు అనుమతులిచ్చారు. మున్సిపల్‌ శాఖనుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మాణాలుచేశారు. మున్సిపల్‌ నుంచి వున్న ఆదేశాలను ఎందుకు తుంగలో తొక్కారు. రోహౌజ్‌ల కోసం కేటాయించిన భూమిలో కూడా భూమి హక్కులు ఎవరికీ బదలాయించలేదు. కార్మికులు తెలుసుకోవాలి. రో హౌజ్‌లైనా సరే అప్పార్టుమెంటు తరహాలోనే నిర్మాణం చేయాలని నిబంధనలు,మున్సిపల్‌ ఆదేశాలు స్పష్టంగా వున్నాయి. అంతే కాని రోహౌజ్‌లు వ్యక్తిగతంగా అప్పగించాలిన ఎక్కడాచెప్పలేదు. ఆ భూములు కొనుగోలు చేసుకున్నామని చెప్పుకుంటున్నవారికి సొంతం అసలే కాదు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్న స్ధలంలో నాలుగైదు అంతస్దులు నిర్మాణం చేసుకున్నా, అది పైన అంతస్ధులు కూడా సొసైటీ నుంచి కొనుగోలు చేయాలి. కాని అందుకు విరుద్దంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ పక్క రో హౌజ్‌లు కూల్చివేసి, ఆ స్దలం కార్మికులకు అప్పగించాలని డిమాండ్లున్నాయి. ఈ విషయంలో ఇంకా కార్మికులను తప్పుతోవ పట్టిస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకొని ఐదారేళ్లుగా నివాసాలు వుంటున్నారు. అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. సినిమాకు సంబంధం లేని వారిని ఎవరు కొనుగోలు చేయమన్నారు? ఎందుకు కొనుగోలు చేశారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ముప్పై,నలభై ఏళ్లుగానే కాదు, వంద సంవత్సరాల క్రితం నుంచి వుంటున్న వారిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. మాకు తెలియకుండా అప్పుడు కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ వినిపించుకోవడం లేదు. చట్టం గురించి తెలియక కొనుగోలుచేశామని చెబితే సరిపోదు. ఇక్కడ కూడ ఆంతే చిత్రపురిలో సినీ కార్మికులకు తప్ప మరొకరికి చోటు లేదు. ఐదారేళ్లుగా అక్కడ కోట్లు పెట్టి కొనుగోలు చేసి నివాసముంటున్నామంటే చట్టం ఒప్పుకోదు. అలా వాళ్లను మోసం చేసి, భూములు అమ్మిన వారిని నిలదీయండి. అంతే తప్ప కార్మికుల భూములను సొంతం చేసుకుంటామంటే కుదరదు. అందుకే కార్మికులారా! ఇప్పటికైనా ఏకం కండి. మాయమాటలు చెప్పేవారి మాటలు నమ్మకండి. చిత్రపురి సొసైటీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి. ఒక రోజు కాకపోతే వారం రోజులు సమావేశాలు ఏర్పాటుచేయమని కోరండి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై చిత్రపురిసొసైటీని నిలదీయండి. ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టకండి. ఆ వెంటనే రోహౌజ్‌ల ముందు టెంట్లేసుకోండి. నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టండి. కార్మికుల స్ధలాన్ని ఆక్రమించుకున్నవారు ఎందుకు ఖాళీ చేయరో చూడండి. తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే వారిని నమ్మకండి. మీకు మీరుగా నాయకులు కండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కార్మికులకు న్యాయం చేసింది లేదు. కార్మికుల పక్షాన పోరటం చేసినట్లు నటించి, రాజకీయ పార్టీలు సొసైటీకి తొత్తులుగా మారిపోయారు. వారు అనుకున్న లక్ష్యం నేరవేర్చుకుంటున్నారు. కార్మికులకు రాజకీయ పార్టీలు,నాయకులు కూడా అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కార్మికులంతా ఏకతాటిపైకి రండి. రాజకీయ నాయకులను ఎంటర్‌ చేయండి. వారి మాటలు నమ్మకండి. ఎవరి మాట నమ్మకండి. నిజా నిజాలు తెలుసుకోండి. జరిగిన తప్పులను గుర్తించండి. మోసం చేసిన వారి లెక్కలు తీయండి. మోసం చేసిన పెద్దలను బజారు కీడ్చండి. సినీమా అవకాశాలు పోతాయని భయపడకండి. సినిమాల వల్ల ఇక సంపాదించేదేమీ వుండదు. కనీసం పోరాటం చేస్తే నీడనైనా దొరుకుతుంది. సినీ పెద్దల మాయపడితే సినిమాలుండవు. ఉండడానికి ఇల్లూ వుండదు. జీవిత కాలం అద్దెబతుకులు, అరువు జీవితాలే మిగులుతాయి.

700 కోట్ల భూమిలో 225 మంది అక్రమంగా రాజ్యమేలుతున్నారు.

 

`‘‘సీఎం రేవంత్‌’’ ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎప్పుడు.

`’’మ్యానిఫెస్టో’’లో పెట్టిన అంశానికి తూట్లు పొడుస్తారా.

 

`సినీ కార్మికులకు ఇళ్ల కళ నెరవేర్చరా.

`‘‘నేటిధాత్రి’’ చిత్రపురి పై కార్మికుల పక్షాన అక్షర పోరాటం చేసినప్పుడల్లా చర్యలు తీసుకొని ఆ తరువాత మరచి పోవడం ఉన్నతాధికారులకు సాధారణంగా మారిపోయింది.

`‘‘రోహౌస్‌’’ లే అక్రమం..పైన అంతస్తుల ‘‘చట్ట విరుద్ధం’’!

`72 ‘‘రో హౌస్‌’’ లపై చట్ట విరుద్ధంగా అంతస్తులు వేస్తున్నారు.

`ఎవరికివారు ఇష్టానుసారంగా నిర్మాణం.

`కళ్ళు మూసుకున్న యంత్రాంగం.

`రో హౌస్‌ లు కూల్చితే తప్ప కార్మికులకు న్యాయం జరగదు.

`ఓ వైపు రోహౌస్‌లు కూల్చేయాలని డిమాండ్లున్నాయి.

`వాటినే నిబంధనలను అతిక్రమించి నిర్మాణం చేశారు.

`ఇప్పుడు మళ్ళీ పై అంతస్తుల మీద అంతస్తులేస్తున్నారు.

`రో హౌస్‌ ల నిర్మాణమప్పుడే పైన మరొకరికి అవకాశం వుంటుందన్న ప్రతిపాదన వుంది.

`దానిని కూడా తుంగలో తొక్కి నిర్మాణాలు సాగిస్తున్నారు.

`72 రో హౌస్‌ లపై చట్టవిరుద్ధంగా అంతస్తులు వేస్తున్నారు.

`కార్మికుల స్థలంలో సినీ పెద్దలు వాలడమే అన్యాయం.

`14 ఎకరాలలో వాలిన సినీ గద్దలు.

`కార్మికులను తరిమి ఆవాసాలు.

`ఇంత కాలమైన కార్మికుల కల కలగానే మిగిలిపోయింది.

`మున్సిపల్‌ ఆదేశాలు బుట్ట దాఖలు.

`చిత్రపురి సొసైటీ నామ్స్‌కు సమాధులు.

`భూమి కార్మకులది…రో హౌస్‌లు సినీ గద్దలకి.

`కష్టం కార్మికులది…వైభోగం గద్దలది.

`సొమ్ము కార్మికులది…ఆవాసం పెద్దలది.

`అన్ని రకాల హక్కులు కార్మికులవి.

`ఆక్రమణలో సినీ గద్దల చోటది.

`అన్యాయమైన కార్మికుల కన్నీళ్లు ఆవిరి.

`రో హౌస్‌ల పేరుతో అంతస్తుల గద్దల సొంతమైంది.

`సీఎం రేవంత్‌ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                         

చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు చిత్ర సీమలో సినీ గద్దలు దూరారు. 14 ఎకరాలు సొంతం చేసుకున్నారు. అందులో రోహౌస్‌లు నిర్మాణం చేసుకున్నారు. వాటిపై ఇప్పుడు అంతస్ధులు పెంచుకుంటున్నారు. అడిగే దిక్కులేదు. అడిరదేందుకు ముందుకు వచ్చేవారు లేరు. అటు ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇటు మున్సిపల్‌ శాఖ నిర్లక్ష్యం వెరసి, కార్మికులకు తీరని అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనేవుంది. కార్మిక పక్షపాతిగా ఒకప్పటి తెలంగాణకు చెందిన సీనియర్‌ నటుడు సినీ కార్మికుల సంక్షేమాన్ని కోరి, తన స్ధలం కొంత ఇచ్చారు. ఆయనే దగ్గరుండి ప్రభుత్వం చేత 64ఎకరాలు ఇప్పించాడు. కార్మికులు రూపాయి, రూపాయి వేసుకున్నారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇంతలో ఆ నటుడు కాలం చేశాడు. ఆ స్ధలం మీద పెత్తనం కోసం గద్దలు వాలాయి. కార్మికులను తరిమేశాయి. కార్మికులకు చోటులేకుండాచేశాయి. కార్మికుల చెమటను గద్దలు అత్తరు చేసుకొని కులుకుతున్నాయి. ఇంత దుర్మార్గం ఎక్కడా వుండదు. సమాజంలో ఇంత నీతి మాలిన పని ఎక్కడా కనిపించదు. పైకి కార్మిక పక్షపాతుల్లా ఫోజులు కొట్టి, ఆఖరుకు ఆ కార్మికులకే చోటు లేకుండా చేసిన దుర్మార్గపు సమాజం సినీ లోకం. సినిమా పేరుతో ఎంతో మందిని మోసం చేస్తారు. వెట్టి చారికీ చేయించుకుంటారు. నిర్మాతలుగా మారిన వారు కోట్లు కూడబెట్టుకున్నారు. కార్మికుల కష్టం దోచుకొని వారి రక్తం తాగారు. సినీ సంక్షేమం అనగానే ఇలాంటి చిన్న చిన్న కార్మికుల చేత రక్తదానాలు చేయిస్తారు. ప్రచారం చేయించుకుంటారు. సినిమాల నిర్మాణంలో వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఇలా అన్ని రకాలుగా అన్యాయమైపోతున్నా సినీ కళామ తల్లిని నమ్ముకొని మంచిరోజులు రాకపోతాయా? అని జీవితం కాలం ఎదరుచూసి తనువు చాలించి సినీ కార్మికులు ఎంతో మంది వున్నారు. తాము లేకపోయినా తమ కుటుంబాలకు ఓ నీడ కావాలని కలలుగని, సంపాదించిన సొమ్మును చిత్రపురిలో ఇండ్లకోసం పెట్టుబడి పెట్టినవాళ్లున్నారు. ఇప్పటికీ నీడ లేక, అటు అవకాశాలు లేక, ఇటు సంపాదన చాలక, చస్తూ బతుకుతున్న కార్మికులు వేలల్లో వున్నారు. ఇది నాచిత్రపురి. ఇక్కడ నాకు ఇంత చోటొస్తుందని కలలుగన్న కార్మికులు ఎంతో మంది వున్నారు. శ్రమకోర్చి సంపాదించిన సొమ్మును చెమట చేతులతో సభ్యతాలు తీసుకున్న వాళ్లు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నారు. దుఖం అనుభవిస్తున్నారు. శాపాలు పెడుతున్నారు. అయినా గద్దలకు సిగ్గు శరం ఏమీ రావడం లేదు. సిగ్గూ ఎగ్గులేని సమాజంగా తయారైన సినిమా ప్రపంచంలో కార్మికుల కన్నీళ్లకు విలువ లేకుండా చేశారు. తెరమీద నటనలో కన్నీటికి కోట్లు కుమ్మరిస్తున్నారు. కొంత మంది కబంధహస్తాలలో పరిశ్రమను పెట్టుకొని కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. సినీ సభ్యత్వముంటే చాలు అదే ఐఎఎస్‌ పాసైనంత అల్ప సంతోషులు మోసం చేయడానికి చిత్ర పరిశ్రమ పెద్దలకు ఎలా మనసొస్తుందో తెలియదు. సినిమాల్లో కన్నీళ్లు, కష్టాలు, మనసులు, మమతలు, అనుబందాలు, ప్రేమలు, తిరుగుబాటు, చైతన్యం అన్ని చూపిస్తుంటారు. ప్రేక్షకులను రంజింపజేసి కోట్లు మూట గట్టుకుంటారు. ఆ సినిమాలకు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇవేవీ లేకుండా చేస్తున్నారు. వారి జీవితాలు వీది పాలు చేస్తున్నారు. కూడులేని, గూడు లేని రోడ్డుమీద బతుకులు చేస్తున్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన చిత్రపురిలో అసలైన సినీ పెద్దలు గద్దలుమా మారి 14 ఎకరాల్లో వాలిపోయారు. నిజానికి చిత్రపురికి సంబంధించిన 67 ఎకరాల్లో జీవో.నెంబర్‌. 658ప్రకారం అన్ని అప్పార్టుమెంట్లు మాత్రమే నిర్మాణం చేయాలి. అప్పార్టుమెంటు ప్లాట్లే కార్మికులు ఎవరైనా సరే అందించాలి. అందులో చిన్న చితాక నటుల, ఇతర కార్మికుల అందించాలని అప్పటి ప్రభుత్వం జీవో జారి చేసింది. దాన్ని కొంత మంది పెద్దలు అప్పట్లో తిమ్మిని బమ్మిని చేసి, అప్పటి మున్సిపల్‌ అధికారులకు తప్పు తోవ పట్టించి,నమ్మించి 14 ఎకరాలు వారి పరం చేసుకున్నారు. అలా 14 ఎకరాలు సొంతం చేసుకున్న సినీ పెద్దలు రోహౌజ్‌లు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెట్టుకున్నారు. అప్పటి సొసైటీ కూడా సినీ పెద్దలకు వంతపాడి వారికి కట్టబెట్టింది. తొలుత 1450 ఎస్‌ఎఫ్‌టిల స్ధలం కేటాయించి, మళ్లీ దాన్ని 2250 ఎస్‌ఎఫ్‌టికు మార్చుకున్నారు. కాని అది మున్సిపల్‌లో అప్రూవ్‌ కాలేదు. అయినా సినీ పెద్దలమనే అహంకారంతో అందర్ని బెదిరంచి రోహౌజ్‌లు నిర్మానం చేసుకున్నారు. అయితే అక్కడ కూడా రోహౌజ్‌ల నిర్మాణం జరిగినా, అవి కూడా అప్పార్టుమెంట్లలాగా, మిగిలిన మరింత మందికి పైన నిర్మాణాలు చేసి, ఇతరులు అందిస్తామని చెప్పారు. ఆ మాట తప్పారు. అవి వారి సొంతం చేసుకున్నారు. వాటిపై పూర్తి ఆదిపత్యం కొనసాగిస్తున్నారు. చిత్ర పురి సొసైటినీ కూడా దిక్కరించి, వారి ఇష్టాను సారం నిర్మాణాలు చేసుకుంటున్నారు. మొత్తం 225 రో హౌజ్‌లు నిర్మాణం జరిగాయి. అందులో ఇప్పుడు 72 రోహౌజ్‌ల పెద్దలు వాటిపై అంతస్ధుల మీద అంతస్ధులు నిర్మాణాలు చేసుకుంటున్నారు. అందుకు మున్సిపల్‌ అనుమతులు ఎక్కడా లేవు. రో హౌజ్‌ల నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి కార్మిక లోకం అడ్డుకుంటూనే వుంది. ఉద్యమాలు చేసింది. పోరాటాలు చేసింది. అయినా వారి వేదన అరణ్య రోధనే అయింది. ఆ స్ధలం విలువ కోట్లలో వుంటుంది. సినీ పెద్దలకు అసలు చిత్రపురిలో చోటు లేదు. వుండొద్దు కూడా..అలాంటి రోహౌజ్‌లు ఏకపక్షంగా నిర్మాణం చేసుకోవడం చట్టరిత్యా నేరం. వాటిని కూల్చేయాలిన కార్మికులు ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణాలున్న చోట అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే కనీసం మరో 3వేల మంది కార్మికులకు ఇండ్లు ఇవ్వొచ్చు. కాని కేవలం 225మంది పెద్దలు వాటిలో దూరిపోయారు. ఆ స్ధలాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికైనా మించిపోయంది లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోహౌజ్‌లను కూల్చివేస్తే కొన్ని వేల మంది కార్మికులకు న్యాయం జరుగుతుంది. అసలు రోహౌజ్‌ల నిర్మాణాలే చట్ట విరుద్దమంటుంటే, లెక్క చేయకుండా 72 మంది సినీ పెద్దలు వాటిపై మరిన్ని నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్కడ ఎలాంటి అదనపు నిర్మాణాలకు అనుమతులు లేవు. అయినా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. అలాంటి నిర్మాణాలు చేపడుతుంటే చిత్రపురి సొసైటీ ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిత్రపురి విషయంలో సొసైటీకి పూర్తి స్ధాయి అధికారాలున్నాయి. ఆ 67 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు సాగించాలన్నదానిపై పూర్తి హక్కులు సొసైటీకి మాత్రమే వున్నాయ. ఆ సొసైటీలో ఎవరి జోక్యం వుండకూడదు. సినీ పెద్దలు ఎంతటి వారైనా సరే వారి మాటలను సొసైటీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని సొసైటీ పెద్దలను కూడా లెక్క చేయకుండా, సినీ పెద్దలు ఇలాంటి అక్రమ నిర్మాణాలు సాగించడం నేరం. కార్మికులలో కొంతమంది సినీ పెద్దలకు వంతపాడుతూ, సొసైటీలోని ఇతర అప్పార్టుమెంట్ల విషయంలోనూ, ట్విన్‌ టవర్స్‌ లలో వివాదాలు సృష్టిస్తున్నారు. కాని 14 ఎకరాలు అక్రమంగా సినీ పెద్దలు ఆక్రమించుకున్నారన్నదానిపై కొన్ని కార్మిక సంఘాలు ప్రశ్నించకపోవడం విడ్డూరం. కార్మికుల్లో వున్న అనైక్యతను ఆసరా చేసుకొని సినీ పెద్దలు ఆటలాడుతున్నారు. కార్మికులను విభజించి పాలించు అనే రాజకీయం చేసి, కార్మికులకే తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ సంగతి కొంత మంది కార్మికులు గుర్తించలేకపోవడం గమనార్హం. అందుకే కార్మికులను వర్గాలుగా విభజించి, సినీ పెద్దలు నాటకాలు ఆడుతున్నారు. అందరు కార్మికులు ఏకమైతే తమ పప్పులుడకవని, కార్మికుల్లో వారికి వారికే లేనిపోని పంచాయతీలు పెడుతున్నారు. కొంత మంది కార్మికులకు అండగా వున్నట్లు నటించి, వారిని ఉసిగొల్పి చిత్రపురిని అబాసు పాలు చేయిస్తున్నారు. దాంతో సొసైటీ కూడా ఏం చేయలేకపోతోంది. ఇప్పటికైనా మించిపోలేదు. కార్మికులంతా ఏకమైన రోహౌజ్‌లు కూల్చివేత వరకు పోరాటం చేయాలి. అసలైన పోరాటం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ముందు రోహౌజ్‌ల కూల్చివేత జరిగితే, ఆ స్ధలంలో ఎంత లేదన్నా కనీసం మరో 3వేల మంది కార్మికులకు నీడ కల్పించొచ్చు. ప్రస్తుతం చేపడుతున్న ట్విన్‌ టవర్స్‌లాగా మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయొచ్చు. కార్మికలందిరకీ న్యాయంచేయొచ్చు. కార్మిక సోదరులు వాళ్ల మధ్య విభేదాలు పక్కన పెడితే, కార్మికుల సొంతింటి కల నెరవేరడం ఖాయం. లేకుంటే జీవితాంతం గూడు కోసం పోరాటమే శరణ్యం. ఏది కావాలో తేల్చుకుంటే సమీప భవిష్యత్తులోనే సొంతిళ్లు సొంతం చేసుకోవచ్చు. కార్మికులపక్షాన నేటిధాత్రి చేస్తున్న అక్షరపోరాటం నిజం చేసుకోండి. మీ సొంతింటికల నెరవేర్చుకోండి.

తప్పించుకోవడానికి జగన్‌ తప్పుల మీద తప్పులు!

`కమిషనర్‌ చౌహన్‌ ను అందరూ కలిసి మభ్యపెడుతున్నారా!

`మిల్లర్‌ అసోసియేషన్‌ అంతర్లీనంగా జగన్‌ ను ఎందుకు కాపాడుతున్నట్లు!

`జగన్‌ వెనుక ఉండి మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు నడిపిస్తున్నాడా?

`కమీషనర్‌ కు హన్మకొండ జేసి రాసిన లేఖతో బట్టబయలు.

`రైతులను ఒప్పించిన తర్వాతే బస్తాలలో కోత అని జగన్‌ వాదనలు.

`హన్మకొండ జిల్లాకు వడ్లను పంపించింది ఖమ్మం జేసి.

`వడ్లను అప్పగిస్తూ హన్మకొండ లోని ఇతర మిల్లులకు ఆర్వోలు.

`హన్మకొండ అధికారుల అత్యుత్సాహంతో జగన్‌ మిల్లులకు చేరిన వడ్లు.

`రైతుల వద్ద జగన్‌ వడ్లు కొనుగోలు చేయలేదు.

`అలా అయితే నేరుగా జగన్‌ మిల్లుల పేరు మీదే వడ్లు వచ్చేవి.

`ఇంతటి గందరగోళం నెలకొని వుండకపోయేది.

`అసలు ఖమ్మం నుంచి వచ్చింది వడ్లకు జగన్‌కు సంబంధమే లేదు.

`కనీసం మధ్య వర్తిత్వం కూడా జరగలేదు.

`జగన్‌ అసలు ఖమ్మం వెళ్లనే లేదు. రైతులను కలిసిందే లేదు.

`అలాంటప్పుడు జగన్‌ రైతులను ఎలా ఒప్పించినట్లు!

`జగన్‌ చెప్పిన విషయాలకు హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఎలా తలూపినట్లు?

`కమీషనర్‌ కు హన్మకొండ జేసి లేఖలో ఈ ప్రస్తావన ఎందుకు చేసినట్లు?

`జేసిని హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారులు తప్పు దోవ పట్టించారా?

`జగన్‌ను కాపాడతామని గతంలో అధికారులు అన్నంత పని చేశారా?

`కులమే ముఖ్యమని గతంలో చెప్పిన అధికారులు జగన్‌ను కాపాడుతున్నారా!

`రైతులను అడ్డంగా మోసం చేసిన జగన్‌ను ఎందుకు వెనకేసుకొస్తున్నట్లు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఒక తప్పు వంద తప్పులు చేయిస్తుంది. ఒక మోసం వంద మోసాలు చేసేలా చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అసత్యాలను చెప్పిస్తుంది. కాని తప్పు చేయొద్దన్న భావన వుంటేనే మనిషంటారు. లేకుంటే మోసగాడంటారు. రైతులను మోసం చేసిన వారిని దుర్మార్గులంటారు. ఆరు గాలం కష్టపడి ఎండననక, వాననక, రాత్రి పగలు తేడా లేకుండా ఒక్కొ గింజను అపురూపంగా చూసుకుంటాడు. చేలు నుంచి ఒక్క వడ్ల గింజ రాలినా కన్నీరు కారుస్తాడు. వరి చేలును కంటికి రెప్పలా చూసుకుంటాడు. కన్న బిడ్డలను పెంచుకున్నట్లు పెంచుకుంటాడు. అలాంటి రైతులను మోసం చేయడం పాపం. చట్టపరంగా నేరం. అన్నీ తెలిసినా కొంత మంది జగన్‌ లాంటి మిల్లర్లు మోసాలు చేస్తూనే వుంటారు. రైతుల గోస పుచ్చుకుంటూనే వుంటారు. అలాంటి వారిని ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. రైతులు చెమట కష్టంతో పండిరచే ఒక్కవడ్ల గింజను మోసం చేసినా, అది క్షమించరానిదే. ఇప్పుడున్న టెక్నాకలజీ ప్రకారం వడ్లలో వున్న తేమను క్షణాల్లో గుర్తించే అవకాశంవుంది. గతంలో వ్యాపారులు చెప్పిందే రైతు వినేవారు. రైతులను బెదిరించేవారు. ఇప్పుడున్న సదుపాయలు రైతులకు అప్పుడు లేవు. రైతులే తమ ఎడ్ల బండ్ల ద్వారా రైస్‌ మిల్లులకు, వ్యాపారులు వడ్లను తీసుకెళ్లేవారు. అప్పుడు వ్యాపారి చెప్పిందే చేసేవారు. అయినా అప్పుడు ఇంతగా మోసాలు లేవు. అరచేతిలో వడ్లుపట్టుకొని రైతుల రెండు చేతులతో నలిపి బియ్యం తీసి చూపించి, వ్యాపారుల నోరు మూయించేవారు. ఇప్పుడు ఆపరిస్దితి అవసరం కూడా లేదు. వడ్లలో వున్న తేమను ఖచ్చితంగా కొలిచే యంత్రాలు వచ్చాయి. అయినా రైతులను మోసంచేసేందుకు జగన్‌ లాంటి వ్యాపారులు చూస్తూనే వున్నారు. అయితే అవి అలాంటి ఇలాంటి మోసాలు ఏకంగా ప్రభుత్వం కల్లుగప్పే మోసం. రైతులకు తీరని అన్యాయంచేసే మోసానికి పాల్పడుతున్నారు. ఇక్కడ మిల్లర్‌ చేసిన మోసం గురించి వివరంగా చెప్పుకుందాం..తప్పుల మీద తప్పులు చేసి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాడో చూద్దాం..ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండ సివిల్‌ సప్లయ్‌కు మిల్లర్ల పేరు మీద పంపింపిన ఆర్వోలను రికవరీ చేశారు. ఇది ముమ్మాటికీ నేటిధాత్రి దినపత్రిక విజయం. రైతులకు మేలు చేసే విషయంలో అలుపెరగని అక్షర పోరాటం చేసిన నేటిధాత్రి వల్ల రైతులకు మరింత మేలు జరిగింది. అందుకు రైతులు కూడా నేటిధాత్రి దినపత్రికకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తోపాటు, సవిల్‌ సప్లై సిబ్బంది కూడా అభినందలు తెలిపారు. ఇది రైతుల కోసం నేటిధాత్రికి దక్కిన గౌరవం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇటీవల హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ కూడా మిల్లర్‌ జగన్‌ వడ్లను మాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సివిల్‌ సప్లైశాఖ కమీషనర్‌ కు లేఖ రాశారు. దాంతో జగన్‌ బండారం పూర్తిగా బైటపడిపోయింది. జగన్‌ చేసిన మోసం రుజువైంది. అయినా జగన్‌ తన వితండవాదాన్ని వదిలిపెట్టడం లేదు. తాను రైతులను ఒప్పించిన తర్వాతే వారి అనుమతితోనే వడ్లలో కోత పెట్టడం జరిగిందంటున్నాడని సమాచారం. అందువల్లనే బస్తాలను మాయం చేసినట్లు కూడ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడే జగన్‌ మరోసారి తప్పులో కాలేశాడు. ఖమ్మంజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండకు చెందిన మిల్లర్‌ జగన్‌కు వడ్లు పంపలేదు. ఇది మొదటి అంశం. ఖమ్మం జేసి జగన్‌కు ఎలాంటి ఆర్వోలు కూడా జారీ చేయలేదు. ఆర్వోలు హన్మకొండ జిల్లాలోని ఇతర మిల్లుల పేరు మీద ఆర్వోలు జారీ చేయడం జరిగింది. మిల్లర్‌ జగన్‌కు వ్యాపార పరంగా అత్యంత అనుకూలమైన కొంత మంది సివిల్‌ సప్లై అధికారులు ఆర్వోలు అందిన మిల్లర్‌ అన్‌ లోడ్‌ చేయాల్సిన బస్తాలను జగన్‌ మిల్లుకు మళ్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లుల వద్దకు చేరిన వడ్ల బస్తాలను సంబంధిత మిల్లర్లు అన్‌ లోడ్‌ చేసుకోవడం లేదంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం అందించి, వాటిని జగన్‌ మిల్లులకు మల్లించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు అడ్డుకున్నా, నిర్ధాక్షిణ్యంగా వాటిని జగన్‌ మిల్లులకు మళ్లించడం అదికారులు చేసిన పెద్ద పెరపాటు. అయినా ఇతర మిల్లర్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లు కూడా ఎదిరించలేదు. అధికారుల వద్ద జగన్‌కు వున్న పలుకుబడితో వారు కూడా సైలెంట్‌ అయ్యారు. ఒకప్పుడు వడ్లు వద్దే వద్దు అని మొండికేసిన జగన్‌ ఇప్పుడు కొట్లాడి మరీ వడ్లు తీసుకున్నాడు. జగన్‌కు వున్నవి రా రైస్‌ మిల్లులుకాదు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు. అయినా ఇప్పుడు రా రైస్‌ మిల్లర్ల పొట్టగొట్టి వారి వ్యాపారానికి అడ్డు తగిలి మరీ వడ్లు తీసుకున్నాడు. పైగా రైతులను మోసం చేశాడు. వడ్ల బస్తాల మాయంపై హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దాంతో జగన్‌ తాను రైతులను ఒప్పించి, మెప్పించి వడ్లలో తేమ శాతం ఎక్కువ వుండడంతో కోత కోశానని వివరణ ఇచ్చుకున్నాడని సమాచారం. అసలు హన్మకొండ జిల్లా మిల్లులకు ఖమ్మం నుంచి వడ్లు వస్తున్న సంగతే జగన్‌కు తెలియదు. హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర రైస్‌ మిల్లుల వరకు లారీలు చేరే దాకా జగన్‌కు సమాచారమే లేదు. ఖమ్మం జేసి నుంచి ఆర్వోలు జగన్‌కు మిల్లులకు వచ్చింది కాదు. అలాంటప్పుడు జగన్‌ రైతులను ఎప్పుడు కలిసినట్లు? ఎలా కలిసినట్లు? అదే నిజమైతే ఖమ్మం జేసి మొదట నేరుగా జగన్‌కే ఆర్వోలు జారీ చేసేవారు. జగన్‌కు కాదని ఇతర మిల్లులకు జారీ చేసేవారు కాదు. ఇతర మిల్లులకు జారీ చేసిన వడ్లను తన మిల్లులకు తోలుకుపోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. జగన్‌ ఒప్పించిన రైతులు ఎవరు? ఏఏ ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లో జగన్‌కు ఎలా తెలుసు? ఖమ్మం నుంచి హన్మకొండకు వడ్లు వచ్చిన తర్వాతే జగన్‌ వాటిని తన మిల్లులకు మరల్చుకున్నాడు. అలాంటప్పుడు ఏ రైతులను జగన్‌ ఒప్పించుకున్నాడో చెప్పాలి. ఆ రైతులు ఎవరో జగన్‌ వెల్లడిరచాలి. వారి చేత చెప్పించాలి? తప్పు చేసి కూడా ఇంకా ప్రబుత్వాన్ని మోసం చేస్తూ, రైతుల పేరు చెప్పి మాయమాటలు చెబుతున్న జగన్‌ మిల్లులను సీజ్‌ చేయాలి. విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేయించి, జగన్‌పై కేసులు నమోదు చేయాల్సి వుంటుంది. జగన్‌ వివరణతో రిపోర్టు తయారు చేసిన అదికారులు ఈ చిన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారా? జగన్‌ చెబుతున్నది అవాస్తవమని తేలిపోతుందని గమనించలేకపోయారా? జగన్‌ ఏది చెబితే దానిని సమర్దిస్తూ హన్మకొండ జిల్లా అదికారులు రిపోర్టు తయారుచేస్తారా? ఇలాంటి తప్పుడు వివరణల ద్వారా మళ్లీ జగన్‌ తనగోతిని తానే తవ్వుకుంటున్నాడని అదికారులు కూడా గుర్తించలేకపోయారా? అసలు ఈ ఆలోచన జగన్‌కే వచ్చిందా? లేక అదికారులే జగన్‌కు ఇలాంటి సలహా ఇచ్చారా? రైతులను ఒప్పించుకున్నానని చెప్పు. సమస్య తీరిపోతుందని భరోసా ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్‌కు కాపాడేందుకు కొంత మంది అదికారులు సన్నిహితులతో చెప్పిన మాటలు కూడా నేటిధాత్రి ప్రస్తావించింది. తమకు కులమే ముఖ్యమని, తమ కులానికి చెందిన జగన్‌న కాపాడతామని చెప్పిన అదికారులే కాపాడుతున్నట్లు స్పష్టమౌతోంది. గతంలో వారు చెప్పినట్లే జగన్‌ను వెనకేసుకొస్తున్నారనిపిస్తోంది. అందుకే ఆర్వోలు జారీ అయిన మిల్లులకు కాకుండా, జగన్‌ మిల్లులకు వడ్లు తరలించారు. ఆర్వోలు జారీ అయిన మిల్లర్లను అన్యాయం చేశారు. జగన్‌కు ఖమ్మం నుంచి వచ్చిన వడ్లన్నీ అంటగట్టారు. జగన్‌కు ఎల్ల వేళలా అండదండలు అందిస్తున్నారు. ఇక జగన్‌కు వెనక మిల్లర్ల అసోసియేషన్‌కు చెందిన ఓ నాయకుడు వున్నట్లు కూడా సమాచారం. అంతా ఆయన వెనకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడి స్వలాభం కోసం జగన్‌కు మద్దతు పలుకుతున్నట్లు చెప్పుకుంటున్నారు. జగన్‌కు అదికారుల పూర్తి లభించడంలో కూడా యూనియన్‌ రాష్ట్ర నాయకుడి హస్తం వుందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్‌ రైతులను మోసం చేయడం నేరం. తప్పు చేసిన దొరికిన జగన్‌ తప్పును అంగీకరించకుండా ఇంకా కుప్పిగంతులు వేయడం విడ్డూరం. అదికారుల సహాకారం వుందన్న దీమాతో వారి చేత కూడా తప్పులు చేయిస్తున్నాడు. ఉద్యోగులు తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్దితులు తెచ్చుకుంటున్నారు. జగన్‌పై చర్యలు తీసుకునేందుకు కమీషనర్‌ స్ధాయిలో కసరత్తు జరుగుతోంది. అప్పుడు జగన్‌ బండారం, ఉద్యోగుల వ్యవహారం అంతా బట్టబయలౌతుంది.

కాళేశ్వరంపై కూనంనేని విషం!

`కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీకే అవమానం!

`తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు!

`కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు

`తెలంగాణలో విద్యుత్‌ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు 

`రాజకీయంగా కేసిఆర్‌ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు

`ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం!

`కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది

`ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు!

`తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం

`పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల నైజం

`కాళేశ్వరం బాగు చేసి నీళ్లివ్వాలని కోరాల్సిన కూనంనేని

`తెలంగాణ రైతును ఆగం చేసే సలహాలివ్వడం దురదృష్టకరం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కమ్యూనిస్టులు పేద పక్షపాతి సిద్దాంతాలు తిలోదకాలిచ్చినట్లున్నాయి. పాలకపక్షాలకు అనుబంధంగా మాట్లాడితే గాని మనుగడ సాగించలేవని నిర్ణయానికి వచ్చినట్లున్నాయి. అందులోనూ తెలంగాణ అంటే కమ్యూనిస్టుపార్టీలకు ఆది నుంచి చిన్న చూపే. వివక్షలకు కేంద్రమే.అందుకే తెలంగాణ ప్రగతి కోసం కమ్యూనిస్టులు మాట్లాడిరదిలేదు. ప్రశ్నించింది లేదు. కాని అడుగుడునా అభివృద్దికి అడ్డుపడ్డారన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో ఏనాడు ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయలేదు. పైగా తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకున్న సందర్భం కూడా వుంది. కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ఏకతాటిపైకి వచ్చి అడ్డుకున్నసందర్బాలు కూడ వున్నాయి. అందుకే ఓ దశలో కేసిఆర్‌ దబ్బనం పార్టీలు కూడా వారిని విమర్శించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కాళేశ్వరం రద్దు చేయాల్సిందే అంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు సంచనల ప్రకటన చేశారు. కాలేశ్వరం అంటే కేసిఆర్‌, కేసిఆర్‌ అంటే కాళేశ్వరం అని గొప్పగా ప్రకటించుకున్న కేసిఆర్‌ ఇప్పుడు కమీషన్‌ మందు అబద్దాలు చెబుతున్నారన్నారు. నిజంగా కాళేశ్వరం గురించి తెలిసినా, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి తెలంగాణ రైతాంగం దృష్టిలో కూనం నేని సాంబశివరావు మరోసారి విలన్‌ అయ్యారని చెప్పక తప్పదు. తెలంగాణలో కాళేశ్వరం అంటే ఏమిటో ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడా? లేక కాంగ్రెస్‌ గొంతుకై మాట్లాడుతున్నాడా? అన్నది ఆయనే చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్‌ నిర్మాణం సమయంలో 50 టిఎంసిల రిజర్వాయర్‌ నిర్మాణం చేయొద్దని కమ్యూనిస్టులు పెద్దఎత్తున పోరాటం చేశారు. తెలంగాణకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించారు. కాని ఇప్పుడు వారి వ్యహార శైలి ఏమిటో పూర్తిగా అర్ధమౌతోంది. అంటే సిపిఐ పార్టీకి కాళేశ్వరం నిర్మాణం చేయడమే ఇష్టం లేదని అర్ధమౌతోంది. కాళేశ్వరం నిర్మాణం జరిగితే ఆంద్రాకు ఇబ్బంది అవుతుంది? ఇదీ కమ్యూనిస్టుల ఆలోచనలాగా వుంది. నిజానికి తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం. కమ్యూనిస్టులది సమైక్య వాదం. విశాలాంద్ర నినాదం. అందుకే ఇంకా ఆ భావన నుంచి కమ్యూనిస్టులు బైటకు రాలేకపోతున్నారు. మంచికో చెడుకో సిపిఎం పార్టీ ఆది నుంచి అదే స్టాండ్‌ మీదవుంది. తెలంగాణ ప్రకటించిన నాటికికూడా సమైక్యాంధ్ర నినాదాన్నే ఎత్తుకున్నది. ఏపిలో సమైక్య ఉద్యమం సాగించింది. కాని సిపిఐ మాత్రం మనుగడ కోసం తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చింది కాని, తెలంగాణ వాదం ఆ పార్టీలో లేదని కూనం నేని వ్యాఖ్యలతో తేలిపోతోంది. ఓ వైపు తెలంగాణ సమాజం మొత్తం కాళేశ్వరంతో నీళ్లందాయని నమ్ముతుంటే రైతులు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే కూనంనేని సాంబశివరావుకు తెలియడం లేదా? కాళేశ్వరం నీళ్ల ఖమ్మం జిల్లాలో కనిపించలేదా? ఇప్పటికీ ఎల్లంపల్లినీళ్లే తెలంగాణను ఆదుకుంటున్నాయా? అదే నిజమైతే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? తెలంగాణ ఉద్యమానికి సిపిఐ ఎందుకు ముద్దతిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఎలా కనిపించింది? ఎల్లంపల్లితోనే తెలంగాణ సాగు సాగితే ఏటా తెలంగాణకు కరువెందుకు వచ్చింది? తెలంగాణ పల్లెలు వలసలు ఎందుకు వెళ్లిపోయాయి? పాలమూరు ఎందుకు వలసల జిల్లా అయ్యింది? మాట్లాడే ముందు కనీసం సోయితో కూనంనేని మాట్లాడితే బాగుండని తెలంగాణ వాదులు కోరుతున్నారు. కాలేశ్వరం వల్ల ఎక్క ఎకరాకు నీరందలేని అసత్యాలు మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారా? లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ప్రకటనలు చేయొచ్చా? ఎల్లంపల్లి ద్వారా తెలంగాణ పంటలు పండితే 2014 వరకు తెలంగాణలో చెరువులెందుకు నిండలేదు. కాలువలెందుకు పారలేదు. వాగులు, వంకలు ఎందుకు జీవ కాలువలు కాలేదు. బోర్లు ఎందుకు వెయ్యి ఫీట్లు వేసినా నీళ్లు రాకపోయేవి. ఎండాకాలం సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో చుక్క నీరు కూడా అందకపోయేది. తెలంగాణలో బావులన్నీ ఎందుకు ఎండిపోయాయి? తెలంగాణ రైత సాగు వదిలేసి ఎందుకు వలసలు వెళ్లినట్లు? హైదరాబాద్‌లో పెద్ద పెద్ద రైతులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు? పాలమూరు నుంచి నిత్యం బొంబాయి, పూన, షోలాపూర్‌, బీవండి, సూరత్‌కు బస్సులు ఎందుకు నడిచినట్లు? ఈ సంగతులన్నీ కూనంనేనికి తెలియనివా? శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు కూడా కొంత కాలం ఆగితే నిర్మాణం చేసేవారు కాదు. అప్పుడే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకావడంతోపాటు ప్రధాని నెహ్రూ చొరవతీసుకొని ప్రాజెక్టు శంకుస్ధాపన చేశారు. అయినా ఎన్నేళ్లు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు సాగిందో కూనం నేనికి తెలియదా? 16లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా డిజైన్‌ చేసిన శ్రీరాం సాగర్‌ ను 14 ఎకరాలకు కుదించిన వారు ఎవరు? అలా నిర్మాణం చేసినా కనీసం ఐదు లక్షల ఎకరాలకు పారకం పారించారా? శ్రీరాంసాగర్‌లో నీళ్లున్నా తెలంగాణ రైతులకు నీళ్లు విడదల చేయమంటే చేసేవారా? తెలంగాణకు కరువొచ్చినా ఫరవాలేదని వదిలేసిన కాలం లేదా? ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు పూర్తి చేశారు. దాని వల్ల తెలంగాణ సాగు పెరిగిందా? కరువు తీరిందా? తెలంగాణ అదనపు స్ధిరీకరణ జరిగిందా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ గోసను కమ్యూనిస్టులు చూడలేదా? కాని తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసి, ఆంద్రాలో అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నా ఏనాడైనా సిపిఐ ప్రశ్నించిందా? రాయలసీమ కరువు మీద వున్న ప్రేమ పాలమూరు మీద సిపిఐ చూపించిందా? ఆంద్రాలో 70 టిఎంసిల కండలేరు నిర్మాణం చేస్తున్నప్పుడు కళ్లలో ఏం పెట్టుకున్నారు. అప్పుడు భూకంపాలు వస్తాయని ఎప్పుడైనా అన్నారా? వెలిగొండ 43 టిఎంసిలతో నిర్మాణం చేస్తుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? ఈ ఎత్తిపోతల వల్ల ప్రజా దనం వృదా అని ప్రశ్నించారా? లేదు. ఆంద్రాలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఎండబెట్టేందుకు సహకరించారు. పోతిరెడ్డి పాడు నుంచి మద్రాసు దాకా నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు నీళ్లియ్యాలని కొట్లాడిన చరిత్ర సిపిఐకి వుందా? లేదు. ఆంద్రాలో ఊరకళ్లు, బ్రహ్మంగారి మఠం, అలుగునూరు, అవుకు ఇలా అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసినా అడ్డుకోలేదు. అంతెందుకు పోలవరం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాకు నష్టం జరుగుతుందని ఏనాడైనా మాట్లాడిన సందర్భం వుందా? భద్రాద్రి రాముడు మునిగిపోయే ప్రమాదమున్నా ప్రశ్నించారా? ఇప్పుడు బనకచర్లకు గోదావరి నది నుంచి 200టిఎంసిల నీరు తరలించుకుపోవాలని ఏపి ప్రభుత్వం చూస్తుంటే సిపిఐ కళ్లు మూసుకున్నదా? తెలంగాణలోని కాళేశ్వరం రద్దు చేస్తే ఏపికి నీళ్లు వరదలా వెళ్తాయి. అటు పోలవరానికి పుష్కలంగా నీరందుతాయి. బనకచర్లకు కూడా నీళ్లు పారుతాయి. బనకచర్ల కూడాఎత్తిపోతల పధకమే? అది ఎలా సక్రమమౌతుంది? దానికి విద్యుత్‌ ఖర్చు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసిన అనేక రిజర్వాయర్లు నిండేందుకు ఎత్తిపోతల పథకాలకు ఖర్చు కావడం లేదా? పోతిరెడ్డి పాడు వల్ల ఎంత విద్యుత్‌ వినియోగమౌతుందో తెలియదా? అన్నీ తెలుసు. కాని కూనం నేనికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. తెలంగాణలో ఎమ్మెల్యేగా వుండాలి. ఆంద్రా ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సమస్యలతో వుండాలి. కమ్యూనిస్టులు ఉద్యమాలతో ఉనికిని కాపాడుకోవాలి. ఆ పార్టీల మనుగడ కోసం ప్రజలు కష్టాల పడాలి. అన్నమో రామచంద్రా అంటుంటే ప్రజలను ఆదుకుంటున్నట్లు, వారి పక్షనా పోరాటం చేస్తున్నట్లు కమ్యూనిస్టులు నటించాలి. నాయకులుగా వెలుగొందాలి. సిపిఐ స్వార్ధపూరిత రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ఆగం చేయాలి. గతంలో చంద్రబాబు రెండోసారి సిఎంగా గెలిచిన తర్వాత కరంటు చార్జీలు పెంచడం జరిగింది. అయితే అప్పుడు కమ్యూనిస్టులు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వారి చావులకు కారణమయ్యారు. కాని ఏపి రైతులు నీటి తీరువాతో సాగు సాగిస్తుంటారు. అందులోనూ బోర్లు వినియోగిస్తుంటారు. వారికి కరంటు బిల్లులు భారమౌతాయని వారి పక్షాన పోరాటం చేసేందుకు తెలంగాణ రైతులను రెచ్చగొట్టారు. అప్పుడూ కమ్యూనిస్టుల నిజస్వరూపం తేలిపోయింది. తెలంగాణ వచ్చినా, ఆంద్రా ప్రయోజనాలే మోస్తోంది. కూనం నేని వ్యాఖ్యలు తెలంగాన రైతాంగానికి ఆగ్రహం తెప్పించింది.

ఎన్టీఆర్‌ ఫస్ట్‌.. రేవంత్‌ నెక్స్ట్‌

`ఎప్పటికైనా నేను సీఎం అని చెప్పిన వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి.

`నేను సీఎం కావడమే నా లక్ష్యం అని చెప్పిన ఒకే ఒక్కడు రేవంత్‌ రెడ్డి.

`అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మరొకరు లేరు.

`సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు.

`గతంలో నేను సీఎం కావాలి అని చెప్పిన ఎన్టీఆర్‌.

`తర్వాత ధైర్యంగా చెప్పింది రేవంత్‌ రెడ్డి.

`సీఎం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన రేవంత్‌.

`అప్పటి కాంగ్రెస్‌ నాయకులు చేసిన అవమానం ఎన్టీఆర్‌లో కసి పెంచింది.

`అవమాన భారంతో సీఎం కావాలనుకున్న ఎన్టీఆర్‌.

`ముందు నుంచి సీఎం కావాలన్న లక్ష్యంతో ముందుకొచ్చిన రేవంత్‌.

`పదవుల కోసం ఎక్కడా ఎదురుచూడలేదు.

`రాజకీయ పదవులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

`సమయస్ఫూర్తితో రాజకీయాలు చేశాడు.

`ఉన్నత రాజకీయ పదవులే ఎంచుకుంటూ వెళ్లాడు.

`సామాన్య కార్యకర్తగా వుండడానికి ఎక్కడా ఇష్ట పడలేదు.

`అంది వచ్చిన అవకాశాలు వదులుకోలేదు.

`ఎవరికీ భయపడలేదు..కేసులు, జైళ్లు లెక్క చేయలేదు.

`అందుకే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు.

`కేసీఆర్‌ ఇంత ధైర్యంగా సీఎం కావాలని చెప్పలేదు.

`మనసులో సీఎం కావాలని అందరికీ వుంటుంది.

`తెలంగాణ వస్తే నేనే సీఎం అని కేసీఆర్‌ చెప్పుకోలేదు.

`దళితుడు సీఎం అని చెప్పి అధికారంలోకి వచ్చిండు.

`రేవంత్‌ రెడ్డి నేనే సీఎం అని కూడా అనేక సార్లు అన్నాడు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి సీఎం కావాలని కలలుగన్నాడు.

`అది నెరవేరడానికి ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాడు.

`సొంత పార్టీలోనే అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.

`ఆఖరుకు పాదయాత్ర చేసి సిఎం అయ్యారు.

`అప్పుడు కూడా నేనే సీఎం అని ఎప్పుడూ చెప్పలేదు.

`చంద్రబాబునాయుడు కూడా ఎప్పుడూ నేను సిఎం అవుతానని చెప్పింది లేదు.

`ఎన్టీఆర్‌ బతికున్నంత కాలం ఆయనే సిఎం అని అనేక సార్లు అన్నాడు.

`ఆఖరుకు ఎన్టీఆర్‌ కు పక్కన పెట్టి సిఎం అయ్యారు.

`నేను సీఎం అవుతా అని అవరోధాలెదురౌతున్నా చెప్పిన ఏకైక లీడర్‌ రేవంత్‌.

 

హైదరాబాద్‌ ,నేటిధాత్రి: 

  ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం వుంటుంది. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే డాక్టర్‌, ఇంజనీర్‌, లాయర్‌, కలెక్టర్‌ ఇలాంటి మాటలు వింటుంటాం. ఇప్పుడు కొద్దిగా పరిస్దితి మారింది. సాఫ్ట్‌ వేర్‌ అంజనీర్‌ అనే పదం పిల్లలకు కూడా తెలిసిపోయింది. గత తరంలో మాత్రం ప్రభుత్వఉద్యోగాలు గురించి మాత్రమే తల్లిదండ్రులు చెప్పేవారు. ఒకవేళ తమ పిల్లలు మెకానిక్‌ అవుతా అంటే ఆ తల్లిదండ్రులు షాక్‌ అయిన సందర్భాలు కూడా వుంటాయి. ఇన్ని కోట్ల మందిలో అందరూ చెప్పిన సమాదానం కన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు మాత్రం ప్రత్యేకం. చిన్నప్పుడు స్నేహితులతో ఎప్పుడు మాట్లాడినా లీడర్‌ నైతా అంటూ చెప్పేవారిన ఆయన సన్నిహితులు, చిన్న నాటి స్నేహితులు ఇప్పటికీ గర్తు చేస్తుంటారు. చిన్న నాటి నుంచే రేవంత్‌రెడ్డి లీడర్‌ లక్షణాలు పునికి పుచ్చుకున్నట్లు చెబుతారు. అలాగే ఆయన పెరిగి పెద్దై లీడర్‌గానే ఎదిగారు. సహజంగా లీడర్‌ కావాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఆ తర్వాత సర్పంచ్‌ ఇలా అంచెలంచెలుగా ఎదుగిన వారున్నారు. కాని ఒకే సారి జడ్పీటీసి అయిన నాయకులు చాలా తక్కువ. అది కూడా ఇండిపెండెంట్‌గా గెలవడం అంటే మాటలు కాదు. సామాన్యమైన విషయంకాదు. అందులోనూ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం, మరో వైపు బిఆర్‌ఎస్‌ పార్టీల హవా కొనసాగుతున్న తరుణంలో ఇండిపెండెంటుగా మిడ్జిల్‌ జడ్పీటీసి అయ్యారు. లీడర్‌గా తొలి మెట్టు ఎక్కేశారు. ప్రజా ప్రతినిధి అయ్యారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడు కూడా బలమైన మూడు రాజకీయపార్టీలను కాదని ,రేవంత్‌రెడ్డి గెలవడం అనేది గొప్ప అవకాశం. అలా మండలిలో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డిని ఓ మాజీ ఎమ్మెల్సీ ఏం కావాలని ఎమ్మెల్సీ అయ్యారు? అని ప్రశ్నిస్తే సిఎం. అని క్షణం ఆలోచించుకోకుండా రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు. నిజానికి ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి మాటను ఎవరూ నమ్మరు. అలాంటి సమాధానం ఎవరు చెప్పినా, మనసులో నవ్వుకుంటారు. లేక అవునా…అంటూ ధీర్ఘం తీస్తారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి? అనుకునే ఆత్మ విశ్వాసం నిండుగా వున్న రేవంత్‌ రెడ్డి సిఎం. కావాలన్న లక్ష్యమే ఇంత దూరం నడిపించింది. ఆయనలో ఆత్మవిశ్వాసమే కాదు, అతి విశ్వాసాన్ని కూడా నింపింది. లేకుంటే ఇంత దూరం వచ్చేవారు కాదు. సహజంగా ఎవరికైన ఒక దశలో అతి విశ్వాసం కూడా అవసరమౌతుందని రేవంత్‌రెడ్డి జీవితాన్ని చూస్తే అర్ధమౌతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలకు మాత్రమే సిఎం అయ్యే చాన్సులు వస్తాయి. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డికి తెలుగుదేశంలో సిఎం. అయ్యే అవకాశం వచ్చేదో లేదో కాని, తదాస్తు దేవతలు మాత్రం అప్పుడే దీవించారు. ఇంతలో తెలంగాణ ఉద్యమం బలపడిరది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వున్న వైఎస్‌ అకాల మరణం చెందారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ రానే వచ్చింది. తెలంగాణ నుంచి తెలుగుదేశం క్రమక్రమంగా కనుమరుగౌతూ వచ్చింది. అయితే ఇక్కడ మరికొన్నివిషయాలు చెప్పుకోవాలి. నిజానికి రేవంత్‌రెడ్డికి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కావాలని బలంగా వుండేది. కాని ఆ పదవికి అడుగడుగునా అప్పుడున్న తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడుకాకుండా అడ్డుపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతూ వచ్చింది. అప్పుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూశారు. ఏం మాయా మంత్రం చేశారో గాని కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. అయితే ఇక్కడ కూడా నల్లెరు మీద నడకసాగలేదు. కాంగ్రెస్‌లో ఎంట్రీ అంత సులువుగా జరగలేదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిన తర్వాత అవమానాలు తప్పలేదు. సీనియర్‌ నాయకులు బెదిరింపులు తప్పలేదు. అందుకు ఎదురీత రేవంత్‌రెడ్డికి తప్పలేదు. కాని ఆయన లక్ష్యం ఒక్కటే…తాను జీవితంలో సిఎం కావాలి! అనే లక్ష్యం ముందు అన్నీ చిన్నవిగా మారిపోయాయి. అటు కేసిఆర్‌ ప్రభుత్వ వేధింపులు, ఇటుకాంగ్రెస్‌ పార్టీలోసీనియర్‌ నాయకుల చిన్న చూపులు ఎన్ని వున్నా వెరవలేదు. బెదరలేదు. లక్ష్యం చేరే వరకు అలసిపోలేదు. అందుకే సిఎం అయ్యారు. ఆ సమయంలో కూడా తాను సిఎం. అవుతానన్న నమ్మకంతోనే ఆయన పార్టీని భుజాల మీద మోశాడు. కాంగ్రెస్‌ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తెచ్చాడు. తన పంతం నెగ్గించుకోవడమే కాదు, గమ్యం చేరాడు. లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఇలా రాజకీయాల్లో లక్ష్య సిద్దితోపాటు, కేసిఆర్‌ను పడగొట్టి నిలబతానని, సిఎం. అవుతానని చాలెంచ్‌ చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. తెలుగు రాజకీయ చరిత్రలోనే ఇలా సిఎం. అయిన నాయకుడు వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి. సిఎం కావాలన్న కలను నెరవేర్చుకున్న మరో నాయకుడు ఎన్టీఆర్‌. నిజానికి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఇక సినిమాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం సినీరంగంలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో రాజకీయాల వైపు మళ్లాలన్న ఆలోచన వచ్చింది. కాని ఏదో ఒక పదవి తీసుకోవాలని మాత్రమే అనుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఒకరిద్దరితో చర్చలు కూడా జరిపారు. కాని లాభం లేదన్న సమాధానం వినాల్సివచ్చింది. పైగా అవమానాలు కూడా ఎదురయ్యాయి. దాంతో ఎవరో ఇచ్చే పదవి నాకెందుకు? నేనే లీడర్లను తయారు చేస్తాను. ఇంత కాలం ఆదరించిన ప్రేక్షకులకు రుణం తీర్చుకుంటాను. సిఎం. అయి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటాననకున్నాడు. అప్పటికే రాజీవ్‌గాంధీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారన్న వార్త దావాణలంలా వ్యాపించింది. తెలుగువారి ఆత్మగౌరవం డిల్లీలో తాకట్టులో వుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. అదే సమయంలో తెలుగుజాతి విముక్తి, తెలుగు ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అదికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ను ఓడిరచి, సిఎం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాజకీయ నీరును అందించారు. కాంగ్రెస్‌లో హేమా హేమీలనుకున్న నాయకులంతా కొత్త వారి చేతిలో ఓడిపోయారు. అసలు నవయువకులెంతో మంది మంత్రులయ్యారు. అలా తనకు జరిగిన అవమానం నుంచి సిఎం. అవుతానాన్నారు. అయ్యారు. ఈ ఇద్దరు తప్ప చరిత్రలో తాను సిఎం. కావాలని అనుకున్నవారు లేదు. అయినవారు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో 1980 నుంచి సిఎం కావాలని కలలు గన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 వరకు ఎదరుచూడాల్సి వచ్చింది. సీనియర్ల ఎప్పుడు పోతారో..తాను సిఎం ఎప్పుడు అవుతానో అనుకునేవారని కొందరు చెబుతుండేవారు. కాని నేను సిఎం అవుతా ముందే చెప్పిన నాయకుడు కాదు. ఎమ్మెల్యే , మంత్రి అయిన తర్వాత సిఎం. ఆశలు చిగురించాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌పార్టీని గెలిపించారు. పాదయాత్ర సమయంలో కూడా ఆయన ఎక్కడా నేనే సిఎం అవుతానని చెప్పింది లేదు. అధిష్టానం ఎవరికి అవకాశమిస్తే వాళ్లే సిఎం. అవుతారని చెప్పాడు. అంతే కాని రేవంత్‌రెడ్డిలా సిఎం. అవుతానని చెప్పలేదు. ఇక ఏపి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకు సిఎం. కావాలన్న ఆశ వున్నప్పటికీ ఎప్పుడూ, ఎక్కడ చెప్పినట్లు లేదు. ఎన్టీఆర్‌ వున్నంత కాలం ఆయనే సిఎం. అని అనేక సార్లు చెప్పిన నాయకుడు చంద్రబాబు. కాకపోతే ఆ పరిస్ధితులు ఆయనను సిఎం. చేశాయి తప్ప, తాను సిఎం అవ్వడానికే రాజకీయాల్లో వచ్చానని ఏనాడు చెప్పలేదు. కకపోతే ఎవరికైనా మనసులో వుంటుంది. బైటకు పదిమందిలో పదే పదే చెప్పిన నాయకుడు రేవంత్‌ తప్ప మరేవరూ లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కేసిఆర్‌ కూడా తాను సిఎం. అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆంతరంగిక సమావేశాలలో అనేవారు అని కొంత మంది చెబితే వినడమే తప్ప ప్రజలకు నేరుగాచెప్పింది లేదు. ఆఖరుకు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రచారం చేశారు. నేనే సిఎం.అని కేసిఆర్‌ ఎక్కడ చెప్పలేదు. అయితే నేను సిఎం అవుతానని చెప్పిన ఇద్దరు లీడర్లలలో మరోక విషయంలోనూ పోలిక వుంది. ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి పేదల కడుపు రేవంత్‌ నింపుతున్నారు. ఈ విషయంలోనూ ఇద్దరూ చరిత్ర సృష్టించారు. చరిత్రలో నిలిచిపోతారు.

వందల విజిలెన్స్‌ రిపోర్ట్‌లు..గుట్టలు గుట్టలుగా బుట్ట ధాఖలు!

గత పదేళ్లలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చని దర్యాప్తులు!

-ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తులు!

-తూతూ మంత్రంగా తనిఖీలు!

-కొంత కాలం హడావుడీ కార్యక్రమాలు!

-ఏదో జరుగుతోందన్నట్లు ప్రకటనలు.

-లెక్కలు తేల్చినట్లు రిపోర్టులు!

-బుట్ట దాఖలు చేసి అక్రమార్కులకు అండదండలు.

-విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళే విజిలెన్స్‌ అధికారులు!

-రిజిస్ట్రేషన్‌ శాఖలో అక్రమాలు చేసేది, చేయించేది వాళ్లే?

-విజిలెన్స్‌ అధికారులుగా వచ్చి లెక్కలు చూసేది వాళ్లే!

-ఆ ఫైల్‌ను తమ టేబుల్‌ మీద పెట్టుకునేది వాళ్లే!

-దొంగ చేతికి తాళమివ్వడమంటే ఇదే!

-ఇలా పదేళ్లలో వందల ఎంక్వౌరీలు జరిగాయి!

-ఏ ఒక్కరికి కూడా శిక్షపడిన దాఖలాలు లేవు.

-గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖలలో విచ్చలవిడి అక్రమాలు.

??మైనింగ్‌ పేరు చెప్పి ఇసుకాసురులు రెచ్చిపోయారు!??

-వారికి అధికారులు వంత పాడారు!

-ఎంక్వౌరీలు వేసి ఎంతో మందిని దోషులుగా తేల్చారు!

-చర్యలు తీసుకోవడం వదిలేశారు..పైగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు.

??గ్రానైట్‌ తవ్వకాలలో లెక్కలేనంత అక్రమాలు జరిగాయి.??

??వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు.??

-‘‘నేటిధాత్రి’’ కొన్ని వందల కధనాలు రాసింది.

-గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

-ఇప్పటికీ మించిపోలేదు..

-ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు.

-ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

 ఓ వైపు వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటే అడుగుడునా అవినీతి చేసుకుంటూ, కోట్లు సంపాదించిన ఉద్యోగులున్నారు. ఉద్యోగుల సహకారంతో వందల కోట్లు సంపాదించిన వ్యాపారులున్నారు. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అటు వ్యాపారులు నుంచి పెద్దఎత్తున ముడుపులు తీసుకున్న ఉద్యోగులు అనేక శాఖలో వందల మంది వున్నారు. మరి అలాంటి వారికి శిక్షలు పడలేదా? అంటే పడలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. కారణం వారికి రాజకీయ పార్టీ నాయకులతోడు, ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా వుండడంతో ఇలాంటి అవినీతి కార్యకలాపాలు పెద్దఎత్తున జరిగిన సందర్భాలు అనేకం వున్నాయి. అలా తెలంగాణలో ఈ పదేళ్లకాలంలో జరిగిన అవినీతి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌ ,వైద్య శాఖల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తేలింది. అవినీతి ఆరోపణలు రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ ఎంక్వౌరీ వేయడం, అదికారులు వెల్లడం తూతూ మంత్రమైపోయింది. కొన్ని సార్లు ఒక రోజు, మరికొన్ని సార్లు మూడు నాలుగు రోజులు హడావుడి చేసి, వందల పేజీల ఎంక్వౌరీ రిపోర్టులు తయారు చేసిన సందర్బాలు కూడా అనేకం వున్నాయి. కాని ఫలితం ఏం జరిగింది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. ఆ ఎంక్వౌరీ రిపోర్టు బుట్టదాఖలౌతోంది. ఇదే తంతు. గత పదేళ్ల కాలంలో అనేక ఎంక్వౌరీలు జరిగాయి. వాటిని నేటిదాత్రి అనేక సార్లు రాసింది. కాని ఏం జరిగింది? ఎంక్వౌరీ చేయడం దగ్గరే ఆగిపోయింది. ఎంక్వౌరీ రిపోర్టు బైట పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. అయినా ఎక్కడా ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నది లేదు. ఏ అక్రమ వ్యాపారి మీద చర్యలు లేవు. ఇలా పదేళ్ల కాలంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. ప్రబుత్వానికి రావాల్సిన రాయల్టి కూడా అందకుండా పోయింది. వ్యాపారులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లో ఆస్దులు పోగేసుకున్నారు. కాని వారి మీద ఈగ కూడా వాలలేదు. వాటిలో కొన్ని మచ్చుకు చెప్పుకుందాం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దఎత్తున గ్రానైట్‌ వ్యాపారం సాగుతుంది. ఒక్క కరీంనగర్‌ పట్టణ చుట్టుపక్కలే కొన్ని వందల క్వారీలలో గ్రానైట్‌ వ్యాపారం సాగుతోంది. ఇక్కడి నుంచి విదేశాలలకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్‌ తరలిపోతుంది. అలా గ్రానైట్‌ వ్యాపారం సాగించే వ్యాపారులందరూ రాయల్టీ పెద్ద ఎత్తున ఎగవేతదారులే. అందులో బడాబడా వ్యాపారులే కాదు, రాజకీయ నాయకులు కూడా వున్నారు. దాంతో అదికారులు ఆ వ్యాపారాల వైపు తొంగి చూడరు. వాళ్లు చెప్పిందే రాసుకుంటారు. క్షేత్ర స్దాయి పరిశీలన జరగదు. ప్రభుత్వ అనుమతులు ఎంత వరకు వున్నాయి. వ్యాపారులు ఎంత వ్యాపారంచేస్తున్నారు. ప్రభుత్వం ఎంత స్థలానికి పర్మిషన్‌ ఇచ్చింది. వ్యాపారులు ఎంత స్ధలంలో గ్రానైట్‌ తవ్వకాలు సాగిస్తున్నారు. అనేది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అదో మాయా ప్రపంచం అనికూడా నేటిధాత్రి అనేక కధనాలు రాసింది. ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చిన స్ధలం పక్కన దళిత రైతుల భూములు కూడా తీసుకొని గ్రానైట్‌ వ్యాపారం సాగిస్తున్నకంపనీలున్నాయి. కంపనీలు సాగిస్తున్న వ్యాపారంపై ప్రభుత్వం పూర్తి స్ధాయి దృష్టిపెట్టాల్సిన అవసరంవుంటుంది. గ్రానైట్‌ కంపనీల మూలంగా వ్యాపారికి తప్ప ప్రభుత్వానికి కూడా పెద్దగా రాయల్టీ అందడం లేదు. పైగా పర్యావరణం పాడౌతోంది. చెరువులు ఆనవాలులేకుండాపోతున్నాయి. వ్యవసాయ పొలాలు ఆగమౌతున్నాయి. గ్రానైట్‌ రాళ్ల రవాణ వల్ల ప్రజలకు అనేక అవస్దలు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రజలుకూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా లెక్కకు మించి గ్రానైట్‌ తవ్వకాల జరుపుతున్న కంపనీలపై విజిలెన్స్‌ ఎంక్వౌరీలు జరిగాయి. కాని రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఆయా కంపనీలపై చర్యలు తీసుకున్నది లేదు. వ్యాపారుల చెల్లించాల్సిన రాయల్టీ వసూలు చేసింది లేదు. కింది స్ధాయి అదికారుల నుంచి పై స్ధాయి దాకా అదికారులు అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము మధ్యలోనే మాయమౌతోంది. విజిలెన్స్‌ రిపోర్టులు మరుగున పడిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఒక పెద్ద మాయా ప్రపంచం. ఈ గ్రానైట్‌ వ్యాపారం కరీంనగర్‌తోపాటు, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పెద్దఎత్తున జరగుతుంది. ఈ మూడు జిల్లాల్లో అనేక సార్లు ఎంక్వౌరీలు జరిగాయి. కాని రాయల్టి వసూలు చేసింది లేదు. మొత్తం ఈ వ్యవస్ధలో పూర్తిస్దాయి ఎంక్వరీలు చేపడితే ప్రభుత్వానికి వేల కోట్లు చేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్‌లో గతంలో గోదావరి నది మీద జరిగే అక్రమ వ్యాపారంపై పెద్దఎత్తున నేటి దాత్రి స్టోరీలు రాసింది. ఇసుక వ్యాపారం మొదలు పెట్టినప్పుడు చిన్న స్ధాయి వ్యక్తులంతా డాన్‌లుగా మారిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో ఒక డీలర్‌గా పనిచేసిన వ్యక్తి , ఇసుక వ్యాపారంచేసి డాన్‌ శ్రీను అనేంత పేరు సంపాదించుకున్నాడు. అలా అదికారులు అతనికి సహకరించారు. ఈపదేళ్ల కాలంలో వందలకోట్ల రూపాయలు ఆ వ్యక్తి సంపాదించాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కోట్లలో ఎగ్గొట్టాడు. ఈ విషయం అధికారులందికీ తెలుసు. దానిపై విచారణ కూడా జరిగింది. కాని రాయల్టీ వసూలు చేసిన దిక్కులేదు. ఇలా ఇసుక వ్యాపారులు ఎంతో మంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ వందల కోట్లలో వుంటుంది. ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గతంలో అనేకసార్లు విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగింది. రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఏం జరిగింది? ఏ ఒక్కరి మీద కూడా కేసు నమోదు జరగలేదు. వారికి శిక్షపడిరది లేదు. అలా ఇసుక వ్యాపారం సాగిస్తున్న వారిపై వున్న రాయల్టీ వసూలుకు ఇప్పటికైనా పూనుకుంటే కొన్ని వందల కోట్లు వసూలుచేయొచ్చు.అది ఆ ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా విషయమే. కాని కరీంనగర్‌తోపాటు, ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌లో పెద్దఎత్తున ఇసుక వ్యాపారం సాగుతుంది. భూపాల పల్లి నుంచి పెద్దఎత్తున ఇసుక తరిలిపోతుంది. ఖమ్మం నుంచి నుంచి కూడా ఇసుక పెద్దఎత్తునరవాణ జరగుతుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా ఇసుక వ్యాపారులకు కోట్లు కుమ్మరిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇసుక వ్యాపారం సాగని ప్రాంతం లేదు. కాని ఎంత ఇసుక తరలి వెళ్తోంది. ఎంత ప్రభుత్వానికి రాయల్టీ వెళ్తోందనేది లెక్కలు తీస్తే అసలు నిజం బైట పడుతుంది. తెలంగాణలో జరిగే మొత్తం ఇసుక వ్యాపారాల మీద ఏక కాలంలో విజిలెన్స్‌ ఎంక్వౌరీలు వేసి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అదికారుల నుంచి మొదలు, వ్యాపారుల దాకా తిన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించొచ్చు. ఇక మరో కుంభకోణాలు అనేకం వెలుగులోకి వచ్చిన శాఖలో రిజిస్ట్రేషన్‌ శాఖలో బైట పట్టాయి. ఈ శాఖలో అవినీతి అనేది కింది స్ధాయి నుంచి పై స్దాయిదాకా వుంటుంది. ఇది అందిరికీ తెలిసిందే. అయినా చర్యలు తీసుకునేవారు ఎవరు? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతంలో బైట పడిన బాగోతాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా రిజిస్ట్రేషన్‌ స్టాంపుల తయారీ వెలుగులోకి వచ్చింది. అది అప్పట్లో పెద్ద సంచనలమైంది. కాని ఏం జరిగింది. అదికారుల మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇలా తెలంగాణలోని అనేక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగిన అవినీతిపై అనేక విజిలెన్స్‌ ఎంక్వౌరీలు జరిగాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే? ఎక్కడైతే అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయో? అక్కడ విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేసేది కూడా ఆరోపణలుఎదుర్కొంటున్న అదికారే కావడం విశేషం. ఇలాంటి ఎంక్వౌరీలు ఎక్కడైనా జరుతాయా? ఏ అధికారి మీద ఆరోపణలు వస్తే అదే అదికారి చేత ఎంక్వైరీ చేయించడం అంటేనే ఆ ఎంక్వౌరికీ ఎంత నిజాయితీ వుంటుందో,ఎంత పకడ్భందీగా సాగుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇలా జరిగిన అనేక విజిలెన్స్‌ ఎంక్వౌరీలు బుట్టలకే చేరాయి. విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న అదికారే, తన కార్యాలయంలో విజిలెన్స్‌ ఎంక్వౌరీ చేపట్టడమనేంత గొప్ప విచారణ ప్రపంచంలో కూడా ఎక్కడా జరక్కపోయి వుండొచ్చు. ఇక వైద్య శాఖలో కూడా జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్ధితి. ముఖ్యంగా డిహెచ్‌గా పనిచేసిన గడల శ్రీనివాస్‌పై విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగింది. పెద్దఎత్తున అవినీతి జరిగిందని తేలింది. కరోనాసమయంలో కేంద్రంనుంచి వచ్చిన నిధులను కూడా వదల్లేదని తేలింది. ఆఖరుకు ఆసుపత్రులకు వేసే సున్నాల సొమ్ముకూడా మింగిండన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన ఉద్యోగంలో వుండగానే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని చూశాడు. ప్రజా ప్రభుత్వం రాగానే వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకొనివిదేశాలు చెక్కేశాడు. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే తవ్వితే కొన్ని వందలు ఎంక్వౌరీలు బైట పడతాయి. ఒక ఉద్యోగిగా గడల ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా, టికెట్‌ ఇస్తే అని ఓ రాజకీయ పార్టీతో బేరం కూడా అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, గత ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఆయన కూడా ఖమ్మం జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కాని కుదలేదు. ఇలా ఈ శాఖలే కాదు, దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి, ఎంక్వౌరీలకు లెక్కలేదు. వాటికి మోక్షం జరిగింది లేదు. అధికారులకు శిక్ష పడిరదిలేదు. వ్యాపారుల నుంచి వసూలు చేసింది లేదు. అంతా మాయా…ఎంక్వౌరీ మరో పెద్ద మాయ.

పూర్తిగా మారిపోతున్న జమ్ముాకశ్మీర్‌

గణనీయంగా తగ్గిన ఉగ్రవాదం

 ప్రజల ప్రాధాన్యత ఉపాధిపైనే

మతఛాందసవాదం స్థానంలో సెక్యులరిజం

గణనీయంగా తగ్గిన ఉగ్రసంఘటనల వల్ల మరణాలు

డెస్క్‌,నేటిధాత్రి: 

గత ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్‌ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు.

Shine Junior Colleges

ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను పాకిస్తాన్‌ ఆపడంలేదు. అయితే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం జమ్ము`కశ్మీర్‌లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. వీటిని ఏదోవిధంగా అడ్డుకొని ప్రపంచానికి కశ్మీర్‌ను ఒక పెద్ద సమస్యగా చూపాలనుకుంటున్న పాకిస్తాన్‌ చర్యలను మనదేశం ఏవిధంగా కట్టడి చేస్తుందనేదే ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ప్రతి దేశపౌరుడిలో దీనిపై ఆందోళన వ్యక్తం కావడం సహజం. ఈనేపథ్యంలో జమ్ము`కశ్మీర్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిస్థితి ఎట్లా వుంటుందనేది ఇప్పుడు ప్ర ధానంగా చర్చించాల్సిన అంశం. 

ప్రకృతి సౌందర్యం, ఎండ వెలుగుల్లో వెండిలా మెరిసే విస్తరించిన హిమాలయాలు, సమున్నత సాంస్కృతిక వైభవంతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లే జమ్ము`కశ్మీర్‌ గత మూడు దశా బ్దాలుగా ఉగ్రవాదం రూపంలో భౌగోళిక సంఘర్షణకు లోనవుతూనే వుంది. ఇంత జరుగుతున్నా పర్యాటకులను తనవైపు ఆకర్షించడంలో జమ్ము`కశ్మీర్‌ తన ప్రత్యేకతను అన్నివేళల్లో నిలుపుకుంటూనే వచ్చింది. 370 అధికరణం రద్దు తర్వాత పర్యాటకులకు స్వర్గధామంగా మరిన్ని సొబగులతో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, తన సౌందర్యాన్ని మరింత ఆకర్షణీ యంగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదం శిథిలమయం చేస్తున్నా, తన ది వ్యమైన సౌందర్యం ఎక్కడా చెక్కుచెదరలేదు. నేటి మారిన పరిస్థితుల్లో ఇప్పటివరకు ప్రాకృతిక సౌందర్యంతో అలరారిన ఈ ప్రాంతంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఆభరణాలతో మెరిసిపోయే సౌందర్యవతిలా, మనదేశానికి అద్భుత మణికిరీటంగా మారగలదు. 

370 అధికరణం రద్దుకు ముందు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా అన్నీ అడ్డంకులే. ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు, జమ్ముాకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకు న్నాయి. మిగిలిన దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే, జమ్ముాకశ్మీర్‌ ఉగ్రవాద గాయాలతో నిరంతరం బాధపడాల్సి వచ్చేది. అన్నింటికి సైంధవుడిలా అడ్డుపడుతున్న ఈ 370 అధికరణాన్ని రద్దు చేయడంతో రాష్ట్రం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సమానంగా మారిపో యింది. రాజ్యాంగం ఇక్కడ కూడా అమలు కావడంతో అన్ని రకాల అవకాశాలకు ద్వారాలు తెరచుకున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జమ్ముాకశ్మీర్‌ రాష్ట్రాన్ని ఇప్పుడు జమ్ముాకశ్మీర్‌ మరియు లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టింది.

ఇప్పటివరకు అంతర్లీనంగా మరుగున పడిన ఆధునికత క్రమంగా జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించ నుంది. డేటా సెంటర్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్‌ పార్క్‌లు, రక్షణరంగ స్టార్టప్‌లు, తయారీ రంగ ప్రవేశం వంటివి ఒకప్పుడు కల! కానీ నేడవి వాస్తవరూపం దాల్చడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను కేంద్రం రూపొందించి అమలు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డేటాసెంటర్లకు పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. జమ్ము`కశ్మీర్‌లోని చల్లని వాతావరణం వీటికి ఎంతో అనుకూలం. మిగిలిన దేశంతో పోలిస్తే ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ ఖర్చు దాదాపు 40% వరకు తగ్గుతుంది! సరిగ్గా ఇటువంటి శీతల వాతావరణం ఉన్న పోలెండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ఒక పెద్ద డేటాసెంటర్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. మారిన పరిస్థితుల్లో ఇటువంటి డేటా సెంటర్లను శ్రీనగర్‌ మరియు జమ్ము`కశ్మీర్‌లోని ఇతర అనుకూల ప్రాంతాల్లో ఎందుకు నెలకొల్పకూడదన్న పశ్న్ర సహజంగానే ఉదయిస్తుంది. ఇక్కడి హైడ్రోఎలక్రిక్‌ ప్రాజెక్టులనుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వల్ల చౌకధరలోనే ఇది లభ్యమవుతుంది. 

జమ్ముాకశ్మీర్‌లో వ్యవసాయం కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటోంది. సంద్రాయంగా సాగుచేసే ఉద్యానవన పంటనలనుంచి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపునకు మారే అవకా శాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే పండ్లు, కుంకుమ పువ్వుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సేంద్రీయ విధానంలో వీటి ఉత్పత్తులను చేపట్టవచ్చు. వీటికి తోడు కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రత్యక్ష మార్కెట్‌ లింకేజ్‌, ఆ గ్రోాప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటివి రైతుల ఆదాయాన్ని బాగా పెంచడమే కాదు, అను బంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయగలవు.

ఇక రక్షణరంగానికి చెందిన స్టార్టప్‌లు, రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, సాంకేతికపరమైన ఎకోసిస్టమ్‌తో పాటు ప్రత్యేక డిఫెన్స్‌ కారిడార్లను అభివృద్ధి పరచినట్లయితే, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో పనిచేసే మన సైనిక దళాలకు అవసరమైన వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ఎంతో సంక్లిష్టమయంగా వుండే భౌగోళిక పరిస్థితుల్లో జవాన్లు పనిచేయడానికి అనువైన సామ గ్రిని సమకూర్చవచ్చు. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు సహజంగానే ఐ.టి./ఐటీఈ మరియు ఎల క్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువకు లకు ఆవసరమైన నైపుణ్య శిక్షణను వేర్వేరు కార్యక్రమాల ద్వారా అందిస్తే, అత్యంత విలువైన హ్యూమన్‌ కేపిటల్‌ తయారవుతుంది. విద్యుత్‌ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసే యూనిట్లు, సెమికండక్టర్‌ తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా జమ్ము`కశ్మీర్‌లో పారిశ్రామిక దృశ్యమే సమూలంగా మారిపోతుంది. గత జనగణన ప్రకారం జమ్ము కశ్మీర్‌ జనాబా 12.3 మిలియన్లు. అద్భుతమైన మానవ వనరులు కలిగిన ప్రాంతం. దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానత వల్ల యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 

అభివృద్ధి అవకాశాలు సరే. జమ్ముాకశ్మీర్‌లో భద్రత, సుస్థిరత అనేవి ఇప్పుడ ప్రధానాంశాలుగా వున్నాయి. ఇప్పటివరకు జమ్ముాకశ్మీర్‌ ‘‘సున్నితమైనాసైన్యం గుప్పిట్లో’’ వుండే ప్రాంతమన్న అభి ప్రాయం బలంగా నాటుకుపోయింది. అటువంటి అభిప్రాయం కలిగినవారు ఇప్పుడు తమ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముాకశ్మీర్‌ పోలీసులు ఇప్పుడు అనుక్షణం డేగకళ్లతో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. మరింత విస్తరించిన భద్రతా వ్యవస్థ కారణంగా నేడు జమ్ముాకశ్మీర్‌ ఒక స్థాయి భద్రత కలిగిన ప్రాంతంగా వుంది. 9/11 దాడుల తర్వాత దేశీయ విమానసర్వీసుల్లో భద్రతను మరింతగా పెంచారు. పలితంగా దేశీయ విమానయానం మ రింత భద్రంగా మారింది. ఉగ్రవాద సంఘటనలు రాష్ట్రంలో కనీసస్థాయికి తగ్గిపోయాయి. రాళ్లు విసరడం, మాటిమాటికి బంద్‌లు, హర్తాళ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నింటికంటే ముఖ్య మైన అంశమేంటంటే స్థానికంగా ఉగ్రవాద నియామకాలు తగ్గిపోవడం. 2018లో ఇవి 119గా వుండగా, 2023 నాటికి కేవలం 12కు పడిపోవడం గమనార్హం. 2018 నుంచి భద్రతాసిబ్బంది, సాధారణ పౌరులు, సైనిక చర్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉదాహరణకు 2018లో 271 మంది ఉగ్రవాదులు హతం కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 87కు పడిపోయింది. 2024లో ఈ సంఖ్య మరింతగా తగ్గిపోయింది. ఇక సాధారణ పౌరుల మరణాల విషయానికి వస్తే 2018లో వీరి సంఖ్య 86 కాగా, 2022 నాటికి 30కి, 2023లో 12కు పడిపోయింది. అదేవి ధంగా భద్రతా జవాన్ల మరణాలు 2018లో 95 వుండగా 2022 నాటికి 30కి, 2023 నాటికి 4కు పడిపోయింది. ముఖ్యంగా మరింత విస్తరించిన భద్రతా వలయం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే మూలాలను ధ్వంసం చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ప్రత్యక్ష పాలన కింద వుంచడంతో కేంద్ర ప్రభుత్వం తన పథకాలను నేరుగా అమలు చేయగలుగుతోంది.

అయితే జమ్ముాకశ్మీర్‌ ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకోవడానికి మరింత సమన్వయ సహకారాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్యాకేజీలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నది. 370 అధికరణం రద్దు తర్వాత 106 కేంద్ర చట్టాలను అమల్లోకి తీసుకురాగా, అమల్లోవున్న చాలా రాష్ట్ర చట్టాలను రద్దుచేశారు. 2023 డిసెంబర్‌ 11న సుప్రీంకోర్టు తన అతి కీలకమైన తీర్పులో 370 అధికరణం రద్దును సమర్థించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక పురోగతిలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల రా ష్ట్రంలో శాంతి సుస్థిరతలు దీర్ఘకాలం చెక్కుచెదరకుండా కొనసాగగలవు. 

జమ్ముాకశ్మీర్‌లో కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టడంతో జమ్ము ప్రాంతంలో అసెంబ్లీ సీ ట్లు 37 నుంచి 42కు పెరగ్గా, కశ్మీర్‌ లోయలో 46 నుంచి 47కు పెరిగాయి. రాష్ట్రంలో మొట్ట మొదటిసారి 9 సీట్లను గిరిజన తెగలకు కేటాయించం విశేషం. డీడీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో కొత్త పార్టీలు పాల్గనడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందనడానికి గొప్ప ఉదాహరణ. ప్రజలు వేర్పాటువాదం నుంచి, జాతీయ రాజకీయాలవైపు మరలడం శుభపరిణా మం. అన్ని వ్యవస్థలతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా అమల్లోకి తీసుకురావడం వల్ల జమ్ముాకశ్మీర్‌ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా వుండబోతున్నదన్న విశ్వాసం కలుగుతోంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ‘‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల ప్రపంచం’’ జమ్ముాకశ్మీర్‌నుంచి ఇక ఎంతోకాలం దూరంగా వుండలేదు. పెట్టుబడిదార్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇతర భాగస్వాములు ఇక్కడ తమ పెట్టుబడులను విస్తరించడం ద్వారా భారత్‌ మణికిరీటంగా భావించే జమ్ముాకశ్మీర్‌ ఆర్థిక పునరభివృద్ధికి దోహదకారులు కావాలి. 

 జమ్ముాకశ్మీర్‌లో ఇప్పటివరకు తాండవమాడిన మతఛాందసవాదం, వేర్పాటువాదం స్థానాలను సెక్యులరిజం, నేషనలిజంలు ఆక్రమించాయి. హింస స్థానంలో శాంతి సుస్థిరమవుతోంది. అయితే ఇంకా ఉగ్రవాద మూలాలు సమూలంగా నాశనం కాలేదన్నది వాస్తవం. కానీ ఇప్పటి చర్యలే కొనసాగితే, త్వరలోనే ఈ మహమ్మారినుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడగలదనడంలో ఎంతమా త్రం సందేహం లేదు.­

సైద్ధాంతిక హింసలో సామాన్యులే సమిధలు

ప్రపంచంలో హింసకు దారితీస్తున్న మతచాందసవాదం

`మత ఛాందసవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్‌

`అభివృద్ధి ఏమాత్రం పట్టని పాక్‌ పాలకులు

`ఉపాధిలేక ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు

`ఆభివృద్ధిని వదలి, మతాన్ని పట్టుకు వేలాడుతున్న వైనం

Shine Junior Colleges

`పతన పథంలో పయనిస్తూ, అహంకారం వీడని పాక్‌ పాలకులు

`భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇంకా యత్నాలు

`చావుదెబ్బతిన్నా బుద్ధి మార్చుకోని పాక్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

గత ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌ దాడి సైద్ధాంతిక హింసకు నిదర్శనమని కొందరు నిపుణులు స్ప ష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఉగ్రదాడులను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన సామాన్య పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ కు పాల్పడటం కనిపిస్తుంది. జమ్ము`కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏప్రిల్‌ నెలలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులైన పర్యాలకుల్లో ప్రథానంగా హిందువులు ఒక క్రైస్తవుడు మరో ముస్లిం వ్యక్తి వున్న సంగతి తెలిసిందే. మాజీ యు.ఎస్‌. అధికారి, మరో భాషావేత్త, జర్నలిసు ్టఅవతాన్‌ కుమార్‌ల ప్రకారం పహల్గామ్‌ సంఘటన చూడటానికి ఒకచోట జరిగిన సంఘటనగా కనిపిస్తున్నప్పటికీ, దీని ప్రతిస్పందనలు ఆమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. పహల్గామ్‌ దాడి సంఘటన పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయ్య బా సంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌కు సంబంధించిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేది స్పష్టమైంది. ముఖ్యంగా వీరు ముస్లిమేతరులు ప్రధానంగా హిందువుల ను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడి ఇది. దాడికి పాల్పడేముందు ఉగ్రవాదులు ప్రశ్నించడమే కాకుండా ఇస్లామిక్‌ కలీమాను చదవమని ఆదేశించి, ఆవిధంగా చదవలేనివారిపై కాల్పులు జరిపి మరీ హత్యచేసారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం.

ఉగ్రవాదులు ముందుగా హిందువులను, క్రైస్తవుడిని వేరుగా నిలబెట్టి సమీపంనుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఇదే సమయంలో మహిళలను వారినుంచి వేరుచేసి, తాము చేస్తున్న ఈ హింసాకండను అధికార్లకు చెప్పాల్సిందిగా కోరడం గమనార్హం. ఈవిధంగా ఇతర మతంవారిని వేరుచేసి, హతమార్చడం కేన్యాకు చెందిన అల్‌షబాబ్‌ ఉగ్రవాద సంస్థ గతంలో చేసింది. ము ఖ్యంగా క్రైస్తవులను వేరుచేసి వారిపై దాడిచేసి హత్యాకాండకు పాల్పడిరది. ఈరకమైన హత్యా కాండకు గ్లోబల్‌ ఉగ్రవాద భావజాలంలో మూలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘‘రెసిస్టెన్స్‌’’ లేదా ‘‘ఇంతిఫదా’’ పేరుతో స్థానిక ప్రాంతాల్లో ఇటువంటి దారుణాలకు పాల్పడటం కనిపిస్తుందని వారుపేర్కొన్నారు. దీని ద్వారా ఇజ్రాయిల్‌`పాలస్తీనా వంటి ప్రాంతీయ సంఘర్షణలు నిరంతరాయం గా కొనసాగుతుండటం వర్తమాన చరిత్ర! ఇటువంటి హత్యాకాండకు బలైనవారిలో నైజీరియాకుచెందిన యూదులు, క్రైస్తవులున్నారు. వీరేకాదు యాజ్దిలు, ద్రుజ్‌, అల్‌వైట్‌, అహమ్మదీయ ము స్లింలు, కాప్ట్‌లు, సిక్కులు, బహాయీలు కూడా ఇటువంటి సైద్ధాంతిక హింసాకాండకు బలవుతు న్నారు. 2023, అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు చేసిన దాడితో పహల్గామ్‌ సంఘటనను పోలుస్తున్నారు. ఇటువంటి దాడుల్లో బాధితులను దుర్మార్గులుగా చూపుతూ, తాముచేసే హత్యాకాండను సహేతుకంగా చూపడానికి యత్నించడం కనిపిస్తుంది. పహల్గామ్‌ దాడికి ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ తాను బాధ్యురాలిగా ప్రకటించింది. 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత జమ్ము`కశ్మీర్‌లో జనాభాపరమైన మార్పుకోసం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ ఈ దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. ఇది కేవలం తన హంతకకృత్యాన్ని సమర్థించుకోవడానికి చేసిన ఒక అసంబద్ధ వాదనగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 2008 ముంబయి దాడుల తర్వాత సామా న్యులపై జరిపిన అతి తీవ్రమైన దాడి ఇది. ఈ దాడి భారత్‌`పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రగల్చమే కాదు, ఈ ప్రాంతంలో భద్రతాపరమైన వైఫల్యాలను కూడా ఎత్తిచూపింది. ఊహించని రీతిలో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘాతుకం ప్రజలను ఒక్కసారి భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడివారక్కడ పారిపోవడమే కాదు, తక్షణం కశ్మీర్‌కు పర్యాటకుల రాక నిలిచిపోవడంతో, టూరిస్టులతో కళకళలాడిన ప్రదేశాలు వెలవెలపోయాయి. ఈ పర్యాటకంపై ఆధారపడి జీవించే కొ న్ని వేలమంది కశ్మీరీలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఈ సైద్ధాంతిక హింసాకాండకు స్థానికుల మద్దతు లభించలేదన్నది సత్యం. స్థానిక కశ్మీరీలు బాధితుల పక్షమే వహించారు. ఉగ్రవాదుల దమనకాండను ఖండిరచడమే కాదు, తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతినడంతో తీవ్రవాదుల పై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవిధంగా సైద్ధాంతిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత వర్గాలన్నీ ఏకం కావాలల్సి అవసరం వున్నదని ఆయా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీరు జరిపే పోరాటం ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా కాకుండా, సామాన్య పౌరులపై హింసను చట్టబద్ధం చేస్తున్న సిద్ధాంతాన్ని నిరసిస్తూ కొనసాగాలన్నది వీరి అభిమతం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ హింసాత్మక భావజాలాన్ని నిరోధించడానికి బహుళజాతి సమాజాలు ఏకంకాకపోతే, మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతున్నదని వీరు హెచ్చరిస్తున్నా రు. అందువల్లనే ఇటువంటి ఉగ్రవాదంపై వ్యూహాత్మక వ్యతిరేకత అవసరమని వారు స్పష్టం చే స్తున్నారు. 

మనదేశం కూడా కచ్చితంగా ఇటువంటి విధానాన్నే అనుసరిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై దాడులు జరపడం ఇటువంటి వ్యూహాత్మక వ్యతిరేకతలో భాగమే. ఏప్రిల్‌ 22 పహల్గామ్‌ దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన రీతిలో భారత్‌ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముందచెత్తడమే కాదు, హింసను ప్రేరేపించే ఏభావజాలాన్ని సహించబోమన్న బలమైన హెచ్చరికను జారీచేసినట్లయింది. ప్రపంచంలోని అత్యధిక దేశాలు నేడు ఈ హింసాత్మక ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారత్‌ జరిపిన దాడులకు అన్ని వైపులనుంచి మద్దతు లభించడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్‌ను మట్టికరిపించి ప్రపం చంలో అప్పటివరకు తనపై వున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చుకునేలా చేసింది. అయితే ఉగ్రవాదమే ఊపిరిగా ఉన్న పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌, ఈనెల 9వ తేదీన పాక్‌లోని ఫార్వర్డ్‌ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లను పొగడిన తీరును పరిశీలిస్తే, భారత్‌ చేపట్టిన సైని కచర్య వారిలో మార్పును తీసుకొస్తుందని భావించడం ఒక భ్రమేనన్న సత్యాన్ని వెల్లడిచేసింది. మనదేశం చేతిలో చావుదెబ్బలు తిని, తానే గెలిచానని చెప్పుకోవడం పాకిస్తాన్‌కే చెల్లింది. ఇప్పు డు తాజాగా ఆసిం మునీర్‌ ఫార్వర్డ్‌ పోస్లును సందర్శించడం ద్వారా పరోక్షంగా భారత్‌ను సవా లు చేస్తున్నట్టే భావించాలి. 

బుద్ధి మార్చుకోని పాక్‌

ఉగ్రవాద ఫ్యాక్టరీగా పేరు సుస్థిరం చేసుకున్న పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో తన మొండి వైఖరి, అహేతుక డిమాండ్లతో ఇతర దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. భద్రతా మండలిలో ఆంక్షల కమిటీ, తాలిబన్‌ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీలకు అధ్యక్షపదవి కావాలని డిమాండ్‌ చే స్తోంది. గత జనవరిలోనే ఐక్యరాజ్య సమితి కమిటీల నియామక ప్రక్రియ పూర్తికావాల్సి వుండగా, పాకిస్తాన్‌ మొండి వైఖరివల్ల ఇప్పటివరకు వాటి ఏర్పాటు ఆలస్యమైంది. మండలిలోని ఇతర సభ్యదేశాలు పాక్‌ వ్యవహారశైలితో విసిగిపోయారనే చెప్పాలి. చివరకు భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్‌ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టి మమ అనిపించారు. ఈ పదవి నామమాత్రమే అయినప్పటికీ, సాటి సభ్యదేశాలు ఇందుకు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాయి. ఏదోవిధంగా ఈ పదవులు చేపట్టి, ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యం చేసుకునేందుకు అది తీవ్రంగా యత్నిస్తోంది. గతంలో కూడా కొందరు హిందువులను ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏదోవిధంగా ఉగ్రవాద సంబంధిత కమిటీలకు అధ్యక్ష పదవి సాధిస్తే ఒకవైపు భారత్‌ను వేధించడమే కాకుండా మరోవైపు తాలిబన్లను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యంగా చేసే యత్నాలకు మద్దతిచ్చేందుకు ఏ ఇతర దేశమూ సిద్ధంగా లేదు. తాను పెంచి పోషించిన తాలిబన్లు తనకు వ్యతిరే కంగా, భారత్‌కు అనుకూలంగా మారడాన్ని పాకిస్తాన్‌ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకనే తాలిబన్లను ఏదోవిధంగా భయపెట్టి, ఆఫ్ఘనిస్తాన్‌ను తన నియంత్రణలో వుంచుకోవాలన్నది పాక్‌ ఆకాంక్ష. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ రెం డూ మతవాదానికే కట్టుబడి వున్నప్పటికీ, తాలిబన్‌ ప్రభుత్వం మతం తిండిపెట్టదన్న సత్యాన్ని గుర్తించింది. ఫలితంగా ప్రజలకు తిండి, నిత్యావసరాలు, దేశాభివృద్ధికోసం భారత్‌సహకారం అవసరమన్న వాస్తవ ధోరణితో ముందుకెళుతోంది. పాకిస్తాన్‌ను నమ్ముకుంటే మతచాందసం తప్ప ఒరిగేదేమీ వుండదన్న సత్యం దానికి బాగా తెలిసొచ్చి దూరంపెడుతోంది. దీనికితోడు పాకిస్తాన్‌ తీసుకున్న ఆఫ్ఘన్‌ వ్యతిరేక చర్యలు కూడా తాలిబన్ల వ్యతిరేకతకు ప్రధాన కారణం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం హింసాత్మక భావజాలంతో, మతఛాందసవాదంలో మునిగిన దేశాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. వాటి ప్రస్థానం పాతాళంవైపునకే కొనసాగింది. పాకిస్తాన్‌ ఇప్పు డు ఇదే బాటలో నడుస్తోంది.

కన్నేయ్‌…కమ్మేయ్‌!?

`ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో మాజీ ‘‘మున్సిపల్‌ చైర్మన్‌’’ నిర్వాకం.

`ఆక్రమించుడు…అమ్ముకునుడు!

`నాయకుడు రియల్‌ వ్యాపారి అవతారమెత్తాడు.

`అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు.

`కనిపించిన భూములన్ని మింగేశాడు.

`ప్రభుత్వ భూములపై కన్నేయాలే..వెంచర్లు చేసి అమ్మేయాలే!

`వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ ఆదాయం.

`ఆ మున్సిపాలిటీలో ఆ లీడర్‌ ఆడిరది ఆట..పాడిరది పాట.

`గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదు.

`ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చి, వెంచర్‌ వేసిన ఘనుడు.

పేద దళితులకు 2005 లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కోట్ల రూపాయల మొరం కొల్లగొట్టిన నాయకుడు.

దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేసిండు

దళితులకిచ్చిన భూమిలోకి వెల్లాల్సిన రోడ్డును మాయం చేసి వెంచర్‌ లో కలిపేసిండు.

`ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంతటా భూములను చుట్టేసిండు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

భూ మాయ అంటే ఇది. ఓ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నిర్వాకమది. కనిపించిన భూములపై కన్నేయడం, వాటిని కమ్మేయడం కొంత మంది అక్రమ రియల్‌ వ్యాపారులకు భూ దందాతో నేర్చుకున్న విద్య. అదే రియల్‌ వ్యాపారులు రాజకీయ నాయకులైతే, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుంటే, అదే వ్యాపారి ఏకంగా ప్రజా ప్రతినిధి అయితే ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడా అదే జరిగింది. ఆ ప్రజా ప్రతినిధి తన పరిధిలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆ పక్కనే వున్న ప్రైవేటు భూములను అడ్డికి పావుసేరుకు కొనేయడం, రెండూ కలిపి వెంచర్లు చేయడం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రియల్‌ దందా దండిగా చేశాడు. కనిపించిన భూములపై కన్నేశాడు. కొనేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమించుడు…అమ్ముకునుడు! మొదలుపెట్టిండు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రజా ప్రతినిధికి అండగా పార్టీ పెద్దలు అండగా నిలిచారు. సహకరించారు. పైగా గత పాలకుల కులం కూడా కలివచ్చింది. వేలు విడిచిన చుట్టరికం తోడైంది. ఇక అడ్డే ముంది. ఆగేదే ముంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడు. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల విలువైన భూములకు సున్నం పెట్టేశాడు. ఆ మున్సిపల్‌ పరిధిలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ పక్కనే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో దళితులకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి వెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొవ్వ వుంది. ఆ తొవ్వను ఆక్రమించుకున్నాడు. సదరు చైర్మన్‌ కొనుగోలు చేసిన స్థలానికి సమీపంలో ప్రభుత్వ పార్కు స్థలం వుంది. ఏ రియల్‌ వ్యాపారి అయిన వెంచర్‌ చేసే సమయంలో కచ్చితంగా కాలనీకి అవసరమైన పార్క్‌ ఏర్పాటు చేయడం తప్పని సరి. ఆ మున్సిపల్‌ పరిధిలో చైర్మన్‌ ఏర్పాటు చేసిన వెంచర్‌ కు ప్రభుత్వ పార్కు స్థలం కూడా కలిసి వచ్చింది. ఆ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చేసిన వెంచర్‌ లో పార్కును ఏర్పాటు చేయలేదు. పైగా ప్రభుత్వ పార్కును తన వెంచర్‌ కు కలిపేసుకొని అదే పార్కుగా వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నాడు. అలా కూడా ప్రభుత్వాన్ని నిండా ముంచేశాడు. నాయకుడు రియల్‌ వ్యాపారి అవతారమెత్తడంతో అడిగే వారు లేకుండా పోయారు. ఏదైనా కంప్లైంట్‌ ఇవ్వాల్సి వచ్చినా ఆ చైర్మన్‌ కే ఇవ్వాలి. ఒకవేళ అధికారులకు పిర్యాదు చేసినా అది చైర్మన్‌ టేబుల్‌ పైకి చేరాలి. ఇంకేముంది ఆ చైర్మన్‌ది ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ మరో ఘనకార్యం కూడా వుంది. దళితులకు గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూమి వుండడం కూడా వెంచర్‌కు కలిసొచ్చింది. ఆ వెంచర్‌కు అవసరమైన మొరం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఖర్చు కూడా మిగిలిపోయింది. వెంచర్‌ కోసం అవసరమైన మొరం మొత్తం పక్కనే వున్న దళితుల భూమి నుంచి తరిలించాడు. అలా సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన మొరం తవ్వుకుపోయాడు. దళితుల భూమిని బొందల గడ్డ చేశాడు. పెద్ద ఎత్తున తీసిన గుంతలు వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద గుంతలు తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క గుంత చిన్నపాటి చెరువులా తాడి చెట్టు లోతున మొరం తవ్వించాడు. వర్షాకాలంలో అటు వైపు ఈత రాని వాళ్లు పడితే ప్రాణాలతో బతికే అవకాశం కూడా వుండదు. ఇక ఆ భూమిలో దళితులు సాగు చేసుకోలేరు. ఇండ్లు కట్టుకోలేరు. ఆ గుంతలను పూడ్చుకోవాలంటే ఆ దళితులకు కోట్ల రూపాయలు కావాలి. సదరు చైర్మన్‌ ఆ దళితులు తమ భూమి వద్దకు వెళ్లడానికి ఓ దారి వుండేది. ఆ దారిని చైర్మన్‌ మాయం చేసి వెంచర్‌ లో కలిపేసుకున్నాడు. దళితులకు దారి లేకుండా చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వెంచర్‌ లో ప్లాట్లు కొనుగోలు చేసి, బిల్డింగ్‌లు కట్టుకున్న వాళ్లంతా అగ్ర కులాలకు చెందిన వాళ్లు. అగ్ర కులాల కుటుంబాలున్న ఇండ్ల ముందు నుంచి దళితులు వెళ్తారా? అని వారిని బెదిరించినట్లు కూడా సమాచారం. అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. కనిపించిన భూములన్ని మింగేశాడు. వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకున్నాడు. గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదనే మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం లేకుండా దళితులకు అన్యాయం చేసిండు. ఏకంగా రోడ్డును మాయం చేసి వెంచర్‌ లో కలిపడమంటే తనకు ఎదురులేదు తిరుగులేదనుకున్నాడు. మళ్ళీ వాళ్ల పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఆశలతో ఈ ఒక్క చోటే కాదు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వెంచర్లు అనేకం చేశాడు. వాటిపై త్వరలో వరుస కధనాలు నేటిధాత్రి లో వస్తాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అంతటా భూములను చుట్టేసిండని ఈ చైర్మన్‌ పేరు మారుమ్రోగిపోయింది. చైర్మన్‌ అక్రమాలను చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారులు సహకరించలేదు. ప్రజల మాట వినిపించుకోలేదు. పైగా అన్ని రకాలుగా చైర్మన్‌ ను సహకరించారు.

దేశంలో వేగంగా శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్‌ రైళ్లు

గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి

98 శాతం బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ పూర్తి

కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించిన చీనాబ్‌ వంతెన

రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు

డెస్క్‌,నేటిధాత్రి:
జార్ఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులు కొడెమా`బర్కాఖానా (133కి.మి)డబ్లింగ్‌ మరియు బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌ (185కి.మి).
కొడెమా`బర్కాఖానా డబ్లింగ్‌:
ఇది పాట్నారాంచీ మధ్య మరింత వేగంగా సమర్థవంతమైన రైల్‌ లింక్‌ను ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో రద్దీని తగ్గించడమే కాకుండా, సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రైళ్లు ఎటువంటి ఆలస్యం లేకుండా గమ్యాలను చేరుకోవడానికి ఈ లైన్‌ దోహదం చేస్తుంది.
బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌
ఈ రైల్వేలైన్‌ బళ్లారి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపు రం జిల్లాల మధ్య అనుసంధానతను పెంచుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు రaార్ఖండ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఏడు జిల్లాలను కవర్‌ చేస్తాయి. అంతేకాదు భారతీయ రైల్వేలు మరో 318 కిలోమీటర్ల దూరం విస్తరించడమే కాదు, 1408 గ్రామాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మొత్తం గ్రామాల జనాభా 28.19లక్షలు! బగ్గు, ముడి ఇనుము, ఉక్కు, సిమెంట్‌, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత శీఘ్రంగా కొనసాగ గలదు. అంతేకాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా మరో 49 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సాధ్యం కాగలదు. ఇదే సమయంలో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా రవాణా కొనసాగడం ఈ ప్రాజెక్టులో ప్రధానాంశం. ఈ ప్రాజెక్టుల వల్ల 52కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగం రైల్వేలకు తగ్గడమే కాదు, 264 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చు. అంటే ఇది 11కోట్ల మొక్కలను నాటినదానికి సమానం.
తిరుపతి` పాకాలాకాట్పాడి రైల్వేలైన్‌
104 కిలోమీటర్ల దూరం వుండే ఈ రైల్వే లైన్‌కు 2025, ఏప్రిల్‌ 9న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ లైన్‌ నిర్మాణానికి రూ.1332కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అయితే ఇదే నెల 4వ తేదీన కేంద్ర కేబినెట్‌, రూ.18,658 కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన 15 జిల్లాలను కవర్‌ చేస్తాయి.
ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపడుతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బహుళ విధాల రవాణావ్యూహాలను అమలు పరచడం ద్వారా, నిరంతర అనుసంధాన కలిగించడం ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆత్మనిర్భర భారత్‌ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
గత పదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి
గత పదేళ్ల కాలంలో భారత్‌లో మౌలిక సదుపాయాల వృద్ధి అద్భుతమైన రీతిలో కొనసాగిందనే చెప్పాలి. వీటివల్ల దేశంలో భౌతిక అనుసంధానత పెరగడంతో పాటు, తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన రీతిలో రవాణా సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రగతి, ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ, భారత్‌మాల, సాగరమాల మరియు ఉడాన్‌ వంటి ప్రాజెక్టులు దేశంలో అనుసంధానతను మరింతగా పెంచాయి. వీటిల్లో ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను 2021, అక్టోబర్‌ 13న కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ఆర్థిక జోన్లను బహుళ నమూనా మౌలికసదుపాయాల ద్వారా అనుసంధానత పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ సమీకృత వేదిక కింద ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్లను సమర్థవంతంగా వినియోగించగలిగారు. ఈ పథకం కింద రైల్వేలు, రోడ్లు, పోర్టులు, నీటి ప్రయాణమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
రైల్వేల్లో ఇటీవలి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి చీనాబ్‌ వంతెన. ఇది ప్రపంచంలోనే అతి ఎతైౖన వంతెన. ఇక రెండది అంజిఖడ్‌ బ్రిడ్జి. ఇది మొట్టమొదటి రైల్వే కేబుల్‌ వంతెన. ఈ రెండిరటిని జూన్‌ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. చీనాబ్‌ వంతెన ఎత్తు 359 మీటర్లు కాగా, దీనికోసం 1315 మీటర్ల పొడువున నిర్మించిన ఆర్క్‌ బ్రిడ్జిని ఉక్కుతో నిర్మించారు. ఇది పెనుగాలులను, పెద్ద విస్ఫోటాలను తట్టుకోగలదు. వీటి తర్వాత చె ప్పుకో దగింది కొత్త పంబన్‌ వంతెన. ఇది భారత్‌లో నిర్మించిన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ కలిగిన సముద్ర రైలు వంతెన. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. చెప్పు కోవాల్సిన మరో పెద్ద రైలు ప్రాజెక్టు కోసి రైల్‌ మహాసేతు. 2020, సెప్టెంబర్‌ 18న ప్రధాని న రేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. ఇది భారత్‌`నేపాల్‌ సరిహద్దులో అత్యంత కీలకమైన వంతెన!
వందేభారత్‌ రైళ్లు
ఇవి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెమీ హైస్పీడ్‌ రైళ్లు. ప్రస్తుతం ఇవి దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 333 జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. ప్రస్తుతం దే శంలో 68 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు (136 సర్వీసులు) నడుస్తున్నాయి. మొత్తం 400 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక నాన్‌`ఎసి కేటగిరీకి చెందిన అమృత్‌ భారత్‌ రైళ్ల నిర్మాణం ప్రస్తుతం చెన్నైలోని ఐ.సి.ఎఫ్‌.లో జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మూడు అమృత్‌భారత్‌ రైళ్లు (ఆరు సర్వీసులు) నడుస్తున్నాయి. నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు తక్కువ దూరాల్లో వుండే నగరాల మధ్య నడుపుతారు. వీటినే ఇంటర్‌`సిటీ నెట్‌వర్క్‌ కింద పరిగణిస్తా రు. ఇవి కపుర్తలాలోని ఆర్‌సీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు నమోభారత్‌ రైళ్లు (రెండు సర్వీసులు) నడుస్తున్నాయి. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో 200 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, వంద ఆమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు, 17500 జనరల్‌ నాన్‌`ఏసీ కోచ్‌లు దేశవాసులకు అద్బుతమైన ప్రయాణానుభవాన్ని ఇవ్వనున్నాయి.
ఇప్పటివరకు దేశంలో 98శాతం బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయింది. రెండువేల రై ల్వే స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర భవనాల్లో వంద శాతం ఎల్‌ఇడీ బల్బులను వాడుతున్నారు. ఇక కోచ్‌ల విషయానికి వస్తే 2014 నుంచి ఇప్పటివరకు 37వేల ఎల్‌.హెచ్‌.బి. కోచ్‌ల నిర్మాణం జరిగింది. ఇవి ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తాయి. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7,134 కోచ్‌ల ఉత్పత్తి జరిగింది. గతంతో పోలిస్తే ఇది 9శాతం అధికం! రైళ్ల భద్రతకు ‘కవచ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా తయారైన వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది లాజిస్టిక్‌ ఖర్చులను తగ్గించడ మే కాకుండా, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది అనుకూలం. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశంలో 1300 స్టేషన్లను పునరభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 68 రైల్వేస్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో తక్కువ ధరకే మందులు అందుబాటులో వుంటాయి.

కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం.

-లంచాలు తీసుకోకుండా వుండలేం?

-రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము.

-ఇరుక్కొని ఇబ్బందులు పడలేం.

-మొదటికే మోసం తెచ్చుకోలేం.

-బలవంతంగా కొలువు చేయలేం.

-రాజకీయాల ఒత్తిడి భరించలేం.

-చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం.

-హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం.

-రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం

-కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం.

-అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం.

-కుటుంబానికి దూరంగా వుండి బతకలేం.

-ట్రాన్స్‌ఫర్ల బారిన పడి ఈ వయసులో ఒంటరి జీవితాలు అనుభవించలేం.

-కనికరించండి..విముక్తి ప్రసాదించండి.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల వేడుకోలు.

-ఇప్పటికే చాలామంది నిజాయితీగల ఉద్యోగులు నిరవదిక సెలవల్లో ఉన్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి
ఈ కొలువులు మాకొద్దు మహా ప్రభో అని కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా వున్న ఉద్యోగులు కొందరు తమ ఆంతరంగికుల వద్ద చెప్పుకుంటున్నారు. రిటైర్‌ మెంటు దగ్గరగా వున్న ఉద్యోగులు చాల మందిది ఇదే అభిప్రాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు రిటైర్మెంట్‌వయసు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్త వారిలో కొంత కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం పెంచింది. అదే పెద్ద భారమనుకుంటే, మళ్లీ ఈ ప్రభుత్వం మరింత పెంచే ఆలోచనలు చేస్తుందన్న వార్తలు వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆందోళణకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. పైగా ఇంత కాలం అదీ ఇదీ తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు కూడా వున్నారు. ఇప్పుడు కూడా ఏదీ లేకుండా పనిచేయలేకపోతున్నాం. మరో వైపు రాష్ట్ర సర్కారు ఏసిబి దాడుల నేపధ్యం కూడా తోడౌతుంది. మరో వైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పని చేసినా కష్టమే..చేయకపోయినా కష్టమే! చేస్తే ఊరికే చేయొద్దని అంటారు. చేస్తే తప్పంటారు. రాజకీయ నాయకులు తెచ్చే పనుల్లో ఎంత నిజాయితీ వుంటుందో అందరికీ తెలిసిందే. చేయకపోతే వారు ఊరుకోరు. చేయమని చెప్పే ధైర్యం మాకు లేదు. ఇచ్చింది తీసుకొని పనిచేయాలంటే భయమేస్తోంది. ఎక్కడ ఏసిబికి చిక్కి చిక్కుల్లో పడతామేమే అన్న భయం వెంటాడుతోంది. ఈ వయసులో లేని పోసి సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని పనులు చేయలేక, నాయకులకు ఎదురు చెప్పలేక ఓ వైపు సతమతమౌతున్నాం. ప్రతి వారు వచ్చిన పని చేయమని బెదిరించేవారు తయారయ్యారు. నీతిగా పనిచేయాలంటే కొన్ని పనులు కావు. అవినీతికి పాల్పడితే ఎప్పుడు పట్టుబడతామో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి మరింత పవర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందిని పెంచే కసరత్తు కూడా జరుగుతోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్దం కాకుండా వుంది. బాదితుల పక్షాన నిలిస్తే నాయకులు ఊరుకోరు. నాయకుల పక్షాన తప్పు చేస్తే బాధితులు సహించరు. ఇద్దరి మధ్య నలిగిపోతూ పనిచేయలేని పరిస్దితి ఎదురౌతోంది. నాయకులు చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు తప్పని సరి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ట్రాన్స్‌ఫర్లను ఆహ్వానించలేం. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వెళ్లలేం. కుటుంబాన్ని వదిలేసుకొని వెళ్లే పరిస్దితి లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వుంటున్నాయి. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అక్కడికి కుటుంబంతో వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు. ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లి వుండే అవకాశంలేదు. ఏ క్షణం ఎలా వుంటుందో ఆరోగ్య పరిస్దితులు అనే భయం కూడా వెంటాడుతోంది. దాంతో పనులు చేయలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యభర్తల వయసు ఎలాగూ 55 దాటివుంటుంది. భర్త ఉద్యోగి అయితే అతని వెంట కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేని పరిస్థితి. భర్త ఉద్యోగం చేసే స్ధలాలకు భార్య వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఎక్కడికో మారు మూల మండలాలకు ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ నరకం చెప్పనలవి కానిది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం అవసరమా? అనే పరిస్దితుల్లో వున్నామని చాల మంది ఉద్యోగులు తెలిసిన వారి ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిస్ధితులను బట్టి మెదులుకోవాలి. నాయకుల తీరును బట్టి మసలుకోవాలి. ఉద్యోగ వర్గాలపై రాజకీయ నాయకుల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రియల్‌ వ్యాపారం పెరిగిన తర్వాత మా కష్టాలు మాకు వున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు వుంటుంది. ఆ సమయంలో ఇచ్చే దాన్ని తీసుకోకుండా వుండలేం. నాయకులు వచ్చిన పుణ్యానికి చేయకు? అంటారు. తీసుకుంటే పుణ్యానికి చేస్తున్నావా? అని నిలదీస్తారు. బాధితులు వచ్చి నానా బూతులు తిడుతుంటారు. అన్యాయం చేస్తున్నారని కేసులు పెడుతుంటారు. వాటన్నింటినీ ఈ వయసులో ఎదుర్కొనే శక్తి లేదు. పొరపాటో, గ్రహపాటో ఎదురైతే, పుసుక్కున ఏసిబికి చిక్కితే జైలు జీవితం అనుభవించలేం. అలాగని బలవంతంగా కొలువులు చేయలేకపోతున్నాం. వయసు మీద పడుతోంది. ఒత్తిడితో మానసిక ఆందోళలకు గురయ్యే పరిస్తితి వుంటోంది. రాజకీయ నాయకులు తర్వాత ఆదుకోవడం అంటూ ఏమీ వుండదు. వాళ్ల పని వారు చేయించుకొని వెళ్తారు. చేతులు దులుపుకుంటారు. పొరపాట్లు చేయించి, మాకేం సంబందం అంటారు. ఉద్యోగులను ఇరికిస్తుంటారు. వారికి ఆ స్వేచ్చ వుంది. ఉద్యోగులకు ఆస్వేచ్చ లేదు. చేతులు దులుపేసుకుంటా? చట్టం వదిలిపెట్టదు. ఎరక్కొపోయి, ఈ వయసులో ఇరుక్కోవడం ఎందుకు? అన్న ప్రశ్నలే వారి మెదల్లోలో మెదులుతున్నాయి. రిటైర్‌ మెంటు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు ప్రబుత్వ ఇవ్వాల్సిన నిదులు ఇవ్వకపోయినా బాండ్లు ఇచ్చినా తీసుకుంటాం. అది ఐదేళ్లకు ఇచ్చిన సరిపెట్టుకుంటాం. కాని ఈ ఉద్యోగాలు మేం చేయలేం. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించండని కోరుతున్నారు. హాయిగా రిటైర్‌ మెంటు తీసుకొని ముదిమి వయసులో ఎంతో కొంత సంతోషంగా వుంటామంటున్నారు. నాయకులు చెప్పే ప్రతి పనిని చేయలేకపోతున్నాం. కనికరించండి. విముక్తి ప్రసాదించండి? అని కొంత మంది అదికారులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్దితులను తాళలేక చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవ్‌లు పెట్టుకొని ఇంటి వద్ద వుంటున్నారు. ఎప్పుడు రిటైర్‌ మెంటు ఇచ్చినా సంతోషమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆనందంగా తప్పుకుంటామంటున్నారు. చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవుల్లో వుండడం వల్ల, చాలా కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు బాద్యతలు నిర్వహిస్తున్నారు. రెండు మూడేళ్ల సర్వీసు వున్న ఉద్యోగులు కొలువులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పదేళ్ల కాలంగా గత ప్రభుత్వ పార్టీ నాయకులు చెప్పినవి చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా అదికారంలో లేకపోవడంతో ఈ పార్టీ నాయకుల పనులు మళ్లీ చేయాలంటే చేయలేకపోతున్నారు. గతంలో ఏమేం చేశారో మాకు తెలుసంటూ ఈ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేసినప్పుడు మేం చెప్పినట్లు ఎందుకు చేయరంటూ కోపం ప్రదర్శిస్తున్నారు. కాదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడం కన్నా, నాలుగు రోజులు హాయిగా బతకాలంటే రిటైర్‌మెంటు ఒక్కటే దారి అని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది అందరి ఉద్యోగుల మనోగతం మాత్రం కాదు. కొంత మంది రిటైర్‌మెంటుకు అతి సమీపంలోవున్న ఉద్యోగుల ఆవేదన మాత్రమే. వారి ఆందోళనలో న్యాయం వుందా? లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ఇంత కాలం పనిచేసి, ఇప్పుడు తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమో కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వ్యవస్ధలను అందరూ కలిసి భ్రష్టు పట్టించారన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. తమ దాకా వస్తే ముఖం చాటేస్తారన్నది వాస్తవం. తప్పుకొని తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నది మరింత నిజం.

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌

`అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం

`ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం

`అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు

`ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు

`నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

`అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది

`త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది

`అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి

`ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు

`తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు

`చిన్న మిల్లర్లు తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు

`తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చు

`మిల్లర్‌కు సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం

`మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందొచ్చు

`ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

`నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు

`రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రైతుల వడ్లను మాయం చేసినట్లు ఆరోపణలున్న హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలుంటాయని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. త్వరలోనే చర్యలుంటాయన్నారు. నీతిగా చేయాల్సిన వ్యాపారంలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతుంటారన్నారు. గతంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో,పై స్థాయి దాక వివరాలు అందకపోవడంతో వారి ఆటలు సాగాయి. దురదృమేమంటే కొంత మంది అధికారుల ప్రోద్బలం కూడా అక్కడక్కడ తోడవ్వడంతో అక్రమాలకు అవకాశం కలిగింది. కాని పరిస్థితులు మారాయి. ఎప్పటిలాగే ఇప్పుడూ తమ ఆటలు చెల్లుతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు చేసిన తప్పులే కాదు, గతాన్ని కూడా తవ్వి తీసే పని మొదలౌతుంది. హన్మకొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు. ఇకపై రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్‌ను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు. రైతులను మోసం చేయడం చిన్న తప్పు అనుకుంటున్నారు. కానీ పెద్ద నేరమని తెలియక చేసినా? తెలిసి చేసినా శిక్షార్హులౌతారు. రైతులను మోసం చేసిన జగన్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి అధికారులుంటే ఒక్క వడ్ల గింజ కూడా మోసం జరగదన్నారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని కమీషనర్‌ చౌహాన్‌ అబ్బురపడిపోయారు. అధికారులకేం తెలుసు అని కొంత మంది అక్రమ మిల్లర్లు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. కానీ ఉద్యోగ నిర్వహనలో శాఖల్లో మెలకువలు తెలుసుకొని ముందుకెళ్లే అధికారులు కూడా వుంటారని రుజువైంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులందరినీ కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. అధికారులు సమిష్టిగా, నీతి వంతంగా, కార్యదక్షత చూపిస్తే ఎంతో బాగుంటుందన్నారు. ఖమ్మం జిల్లా అధికారుల టీం వర్క్‌ భేష్‌ అన్నారు. అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శమయ్యారని కొనియాడారు. ఏ శాఖ ఉద్యోగులైనా సరే తమ కర్తవ్య నిర్వహణ ముఖ్యమని సూచించారు. ఇకపై అధికారులెవరైనా సరే అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక నీతి, నిజాయితీ వ్యాపారం చేసే మిల్లర్లను అధికారులు ఎవరైనా వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి అలాంటి మిల్లర్‌ తోడే అవసరమన్నారు. రైతులను మోసం చేసే వారిని పక్కన పెట్టుకొని, నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లను ఇబ్బందుల పాలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైతే అక్రమ మిల్లర్లు ముద్రపడ్డారో, వారికి సహకరిస్తున్నారో అలాంటి వారి చిట్టా అంతా నా దగ్గర వుందన్నారు. త్వరలోనే కార్యచరణ వుంటుందన్నారు. అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి అనే విషయాన్ని వెలులోకి తెచ్చిన నేటిధాత్రి దిన పత్రికను చౌహాన్‌ అభినందించారు. ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు అన్నారు. ఇకపై తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న మిల్లర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని నేటిధాత్రి దృష్టికి వచ్చినా వివరాలు అందించాలని కోరారు. అంతే కాకుండా నా వద్దకు నేరుగా రాలేక, ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చొరవ తీసుకొచ్చినా సరే అని నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ఇకపై తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు అని కూడా కమీషనర్‌ స్పష్టం చేశారు. తన కార్యాలయానికి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణలో వున్న మిల్లర్లందరికీ సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందవచ్చని సూచించారు. అధికారులెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు తెలిపారు.

మార్కెట్‌ డిమాండ్‌ ఘనం…విమానాల సంఖ్య స్వల్పం

నత్తకు పోటీపడుతున్న పౌర విమానయాన రంగం విస్తరణ

చిన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే దేశీయ అవసరాలకు ఉత్తమం

పెద్ద విమానాలకోసం సంక్లిష్ట డిజైన్లకోసం ఇప్పుడే కుస్తీపట్టనవసరంలేదు

తక్షణావసరాలపై దృష్టిపెట్టాలి

‘ఉడాన్‌’ లక్షం నెరవేరాలంటే చిన్న విమానాలే శ్రేయస్కరం

నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యమున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే ఘనం

ప్రపంచంలో ఇప్పటికి వాణిజ్య విమానాలు తయారుచేసే కంపెనీలు ఏవని ప్రశ్నిస్తే బోయింగ్‌, ఎయిర్‌బస్‌ అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. ఆ రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగాఅంతటి ప్రాచుర్యాన్ని పొందాయి. మరి ప్రపంచంలో ఈ కంపెనీలు మాత్రమేనా? మరే ఇతర కంపెనీలు ఇదేమాదిరిగా వాణిజ్య విమానాలను తయారుచేయడానికి ఎందుకు ముందుకు రావడంలేదన్నది సహజంగానే ఉదయించే ప్రశ్న. ఇదిలావుండగా భారత్‌, చైనా వంటి దేశాల్లో విమానయాన రంగంలో విస్తృత మార్కెట్‌ అవకాశాలున్నప్పటికీ, అవి విస్తరించలేకపోవడానికి ప్రధాన కారణం, వాణిజ్య విమానాల తయారీ సంస్థలు కేవలం పై రెండు మాత్రమే కావడం! ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్డర్లకు తగిన వేగంతో వీటి ఉత్పత్తి జరగకపోవడం వల్ల దశాబ్దాల పాటు ఆర్డర్‌ ఇచ్చిన విమానం సరఫరాకోసం వేచివుండాల్సిన పరిస్థితి వల్ల విమానయాన రంగంవిస్తరణ నత్తకు అన్నమాదిరిగా వుంటోంది. మరి దీనికి పరిష్కారం లేదా? వాణిజ్య విమానాల తయారీకి ఇతర దేశాలు ఎందుకని పూనుకోవడంలేదన్న సందేహం వ్యక్తమవడం కూడా సహజమే. చైనా ఇందుకు ముందుకు వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని అది ముందుకు కదలలేక చతికిలబడిరది. ఎందుకంటే విమాన తయారీకి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌ వంటికి ఇంకా పశ్చిమదేశాల చేతుల్లోనే వున్నాయి. ఒక దేశం విమానం తయారుచేయాలంటే అందుకవసరమైన సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడక తప్పదు. అంటే వాటి దయాదాక్షిణ్యాలపైనే దీని అభివృద్ధి ఆధారపడివుంటుంది. అంతేకాదు వాణిజ్య విమానాల తయారీ అంత తేలిక కాదు. ఇదో సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియ. ఇది కూడా ఇతర దేశాల్లో విమానాల తయారీ జరగకపోవడానికి కారణం. 

డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు

మనదేశంలో పౌరవిమానయాన మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. విమాన ప్రయాణికుల డిమాండ్‌అధికంగా వున్నప్పటికీ, అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువగా వుండటం పెద్ద అవరోధంగా మారింది. విమానాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం, ఇప్పటికీ దేశీయంగా ప్రయాణికుల విమానాలు తయారుకాకపోవడం దేశీయంగా వైమానికరంగం విస్తరణను అడ్డు కుంటోందనే చెప్పాలి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఇండిగో వంటి సంస్థలకు తమ వాణిజ్య పరిధిని విస్తరించాలనుకున్నా, విమానాలు అందుబాటులో లేకపోవడం వాటి కాళ్లకు సంకెళ్లు వేసినట్టవుతోంది. కేవలం 2023`24 మనదేశీయ వైమానిక సంస్థలు 1359 విమానాలకోసం బోయింగ్‌,ఎయిర్‌బస్‌ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాయంటే, ఈ రంగంలో డిమాండ్‌ ఏవిధంగా వున్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ వీటి డెలివరీలు వచ్చేసరికి కొన్నేళ్లు పడుతుంది! ఫలితంగా మార్కెట్‌ విస్తరణకుసంస్థల ఉత్సాహంపై ఇది నీళ్లు చల్లినట్లవుతోంది. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. 2024`25లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7.5% వృద్ధి న మోదు చేయడం ఇందుకు ఉదాహరణ. అంటే వీరి సంఖ్య 165.7 మిలియన్లకు చేరుకుంది. మరి పెరుగుతున్న డిమాండ్‌కు మనదేశంలో విమానాల తయారీ జరుగుతున్నదా? అంటే లేదనే చెప్పాలి. అసలు ప్రయాణికుల విమానాల తయారీ మనదేశంలో ఇంకా శైశవస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఈ రంగంలో చేసిన కృషి ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను దృష్టిలో వుంచుకొని బలీయంగా అడుగులు ముందుకేయక తప్పదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చైనా విమాన తయారీరంగా ఎటువంటి కష్టనష్టాలు ఎదుర్కొంటున్నదీ అవగాహన చేసుకొని మరీ మనం ముందుకు సాగాల్సిన అవసరం వుంది.

చైనా విమాన తయారీరంగం ప్రస్థానం

చైనాలో కమర్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) ప్రయాణికుల విమానాలను తయారుచేయడానికి ఎంతో కృషిచేస్తున్నది. అయితే ఇందుకు అవసరమైన ఇంజిన్లు, సాంకేతిక సహకా రం అమెరికానుంచే రావాలి. ఇప్పుడు రెండుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, యు.ఎస్‌. విధించిన ఆంక్షల తెబ్బ ఈ సంస్థ చేపట్టే కార్యక్రమంపై పడిరది. అంటే ఒక వాణిజ్య లేదా ప్రయాణికుల విమానం తయారుచేయడానికి అవసరమైన ముఖ్యమైన భాగాలపై విదేశాల పై ఆధారపడటం వల్ల కలిగే ఇబ్బందులకు చైనా ఉదాహరణగా నిలుస్తోంది. నిజానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికుల విమానాలను తయారుచేసే పనిలో తలమునకలుగా వున్నప్పటికీ, నూటికి తొంభయిశాతం వైఫల్యాలే ఎదురయ్యాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది షాంఘై`వై10 జెట్‌లైనర్‌ గురించి. ఇది అచ్చం బోయింగ్‌`707 విమానం మాదిరిగానే వుండేది. ఇందులో అమెరికా తయారీ ‘ప్రాట్‌ Ê విట్నీ జెటి3డి’ ఇంజిన్లు వాడారు. 1980లో తొలివి మానం ఆకాశంలోకి అట్టహాసంగా ఎగిరింది. కానీ ఈ ప్రాజెక్టు కేవలం మూడు విమానాల త యారీతో మూతబడిరది. ఇందుకు కారణం వుంది. ఇందులో ఉపయోగించింది అప్పటికి 25 సంవత్సరాల పురాతన సాంకేతిక పరిజ్ఞానం! అప్పటికే పశ్చిమ దేశాల తయారీ విమానాల్లో అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పుడు, ఈ పాత చింతకాయపచ్చడి లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టుకొని వేలాడటమేంటన్న ప్రశ్నలు ఉదయించడంతో, ఈ విమానాల తయారీని పక్కన పెట్టేశారు. అయితే చైనా తన ప్రయత్నాలను మానలేదు. 1980`90 మధ్యకాలంలో అనటోన్‌ ఎన్‌`24 రకం విమానానికి ప్రతికృతిగా జియాన్‌ ఎంఏ`60 విమానాన్ని, హర్బిన్‌ వై`12 అనే 17 సీట్ల విమానాన్ని తయారుచేసింది. వీటిని ఎక్కువగా సైనిక, రవాణా, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో ప్రయాణికుకోసం కూడా ఉపయోగించారు కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తర్వాత 2008లో కమర్షియల్‌ ఎయర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) స్థాపన జరిగింది. గతంలోని అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఏఆర్‌జే21 అనే రీజినల్‌ జెడ్‌ను తయారుచేసింది. తర్వాత దీన్ని సి909గా పేరు మార్చారు. విమాన సర్టిఫికేషన్‌ సాధించడంలో సంక్లిష్టతలను అధిగమించడానికి అవసరమైన అనుభవం కోసమే ఏఆరర్‌జే21 ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఇందుకోసం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండి`80, యుక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్‌ సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ సిఎఫ్‌`34 ఇంజిన్లను వాడారు. చివరకు 2016 జూన్‌లో ఏఆర్‌జే21ను వాణిజ్యపరంగా చెంగ్డూ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తొలిసారి ఉపయోగించింది. అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 14 సంవత్సరాల తర్వాత కానీ ఇది పట్టాలెక్కలేదు!!

ఏఆర్‌జే21 విమానాన్ని తయారుచేసిన అనుభవంతో, సీఓఎంఏసీ సి919 ప్రోగ్రామ్‌ను ప్రారం భించింది. బోయింగ్‌`737, ఎయిర్‌బస్‌ఎ`320లకు పోటీగా దీన్ని తయారుచేసింది. విమానాలతయారీలో చైనాకు గొప్ప ముందడుగుగా చెప్పినప్పటికీ ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధికం పశ్చిమదేశాలదే! అదీకాకుండా ఇందులో వాడిన ఉపకరణాల్లో 3/5వ వంతుఅమెరికానుంచి దిగుమతి చేసుకున్నవే! మొట్టమొదటి సి919 విమానాన్ని 2022లో డెలివరీ ఇ వ్వగా 2023లో వాణిజ్యసేవలు ప్రారంభించింది. ఇప్పుడు సీఓఎంఏసీ ఏటా 50`75 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళుతోంది. దేశీయంగా వున్న డిమాండ్‌కు తట్టుకునేరీతిలో వీటి ఉత్ప త్తిని మరింత పెంచాలన్నది కూడా సంస్థ లక్ష్యం. ఇప్పటికి ఈ విమాన తయారీలో 60శాతం వరకు భాగాలు చైనాలోనే తయారవుతున్నాయి. మిగిలిన 40శాతం సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికానుంచి దిగుమతి చేసుకున్నదే. సీఓఎంఏసీ సంస్థ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణం, 2020లో ప్రభుత్వం నుంచి 49 నుంచి 72 బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల సబ్సిడీ, గ్రాంట్ల రూపంలో మద్దతు లభించింది. వీటితో పాటు ఆర్‌Ê డి సహకారం కూడా అందింది. దీంతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆర్డర్లు ఇవ్వడం కూడా సంస్థ నిలదొక్కుకోవడానికి కారణమైంది. నిజం చెప్పాలంటే సీఓఎంఏసీ అభివృద్ధికి సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌, జీఈ, హానీవెల్‌, సోఫ్రాన్‌, కోలిన్స్‌ ఏరోస్పేస్‌ వంటి పశ్చిమదేశాల సంస్థల నుంచిఅందిన సరఫరాలు ఎంతో దోహదం చేశాయి. ఇప్పుడు చైనా దేశీయ ఉపకరణాలపై దృష్టి పె ట్టింది. సి919 విమానంకోసం దేశీయంగా సీజే`1000జె ఇంజిన్‌ తయారుచేస్తోంది. అయితే దీని తయారీకి కూడా ఇప్పుడు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతోంది. ఇంత వేగంగా ముందుకెళుతున్నా, ఈరంగంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం వెనుకబడే వుందని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని ఈ రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిరది. 

భారత్‌ నేర్చుకోవాల్సిన పాఠాలు

స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి పౌరవిమాన తయారీపై ఏ ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టిపె ట్టింది లేదు. చైనాలో మాదిరిగా కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ), లేదా పాశ్చాత్య దిగ్గజ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ వంటి సంస్థల ఏర్పాటు గురించి ప్రభు త్వాలు ఆలోచించకపోవడం విచిత్రం! అయితే పూర్తిగా ప్రయత్నించలేదని చెప్పడం కూడా తప్పే.ఎందుకంటే ఈదిశగా యత్నించినప్పటికీ, పూర్తిస్థాయి నిబద్ధతతో అవి కొనసాగలేదనేది సత్యం. మనదేశం మొట్టమొదటగా 1991లో ‘సరస్‌’ పేరుతో వాణిజ్య విమానాల తయారీరంగంలోకి అడుగుపెట్టింది. దీని కింద మొట్టమొదటి ఫ్లైట్‌ 2004లో ఎగిరింది. అయితే ఈ రంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటివరకు విమానతయారీకి అవసరమైన డిజైన్‌ ఇప్పటివరకు రూపొందలేదు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లు సంయుక్తంగా ఇప్పుడు 90సీట్ల సామర్థ్యమున్న ప్రాంతీయ రవాణా విమానాన్ని (ఆర్‌టీఏ) అభివృద్ధి చేస్తున్నాయి. ఆర్‌టీఏ డిజైన్‌ మరియు అభివృద్ధికి రెండు బిలియన్లఅమెరికన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ (ఎస్‌పీఎల్‌) తయారీపట్ల మొగ్గు చూపుతోంది.

‘సరస్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఎన్‌ఏఎల్‌. ఇదే కార్యక్రమం కింద ఈ సంస్థ సరస్‌`ఎంకె2 రకం విమానాల రూపకల్పనలో తలమునకలుగా వుంది. ఈ విమానం 19 సీట్ల సామ ర్థ్యం కలది. 2017లో కేంద్రం ఈ ప్రాజెక్టుకోసం రూ.6వేల కోట్లు కేటాయించింది. దీనికి సం బంధించిన తొలి విమానం 2027 డిసెంబర్‌లో ఎగురుతుందని అంచనా. ఆలస్యమైనా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు.

చైనాకు చెందిన సీఓఎంఏసీ సంస్థ అనుభవాలను పరిశీలిస్తే, చిన్న పరిమాణంలోని ప్రాంతీయ జెట్‌ల తయారీపై దృష్టి పెడితే ప్రయోజనకరంగా వుండవచ్చు. ఎందుకంటే దేశీయ అవసరాల రీత్యా ఇటువంటి చిన్న విమానాల తయారీ మనకు ఉపయుక్తంగా వుండగలవు. సరికొత్త విప్లవాత్మక డిజైన్లకోసం కుస్తీ పట్టేకంటే, అందుబాటులోని సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసనీయత కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేయగలిగితే ప్రస్తుతానికి మనదేశీ య విమానరంగం డిమాండ్లను అందుకోవచ్చు. వీటికి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక వ్యవస్థలను పశ్చిమ దేశాలనుంచి దిగుమతి చేసుకోక తప్పదు. పశ్చిమదేశాలపై ఆధారపడక తప్పకపో యినప్పటికీ విమానయాన రంగంలో మనం ప్రవేశించగలుగుతాం కదా! అదీకాకుండా వీటిని దేశీయంగా వివిధ రూట్లలో తేలిగ్గా నడపవచ్చు. దేశవ్యాప్తంగా 90G విమానాశ్రాయాలను కలి 

 పేవిధంగా 625 రూట్లతో రూపొందించిన ‘ఉడాన్‌’ అవసరాలు తీరతాయి. ఉడాన్‌ కింద టుటైర్‌, త్రీటైర్‌ పట్టణాలకు విమాన సదుపాయం కల్పించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సా ధించడంలో ‘ఆర్టీఏ`90’, ‘సరస్‌ ఎకె`2’ రకం విమానాలు ఎంతగానో దోహదం చేయగలవు. నూటికి నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలు తయారుచేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. పశ్చిమదేశాల సాంకేతిక సహకారంతో వేగంగా ఈ చిన్న విమానాల తయారీ చేపట్ట వచ్చు. 

ప్రస్తుతం భారత్‌ మల్టిపుల్‌ ఫైటర్‌ జెట్‌ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా వడోదరలో టాటాఎయిర్‌బస్‌, సి295 సైనిక రవాణా విమానాన్ని తయారుచేస్తోంది. ఇటువంటిప్రాజెక్టులకు అవసరమైన ఎరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ తయారుచేసి ఎప్పటికప్పుడు అందించే చిన్న సంస్థలు మనదేశంలో పుష్కలంగా వున్నాయి. సి295 సైనిక రవాణా విమానానికి సంబంధించిన13వేల విడిభాగాలను దేశీయంగా 37 సప్లయర్స్‌ తయారుచేస్తున్నారు. ఈ నైపుణ్యాలు, ప్రయాణికుల విమానాల తయారీకి కూడా ఉపయోపడగలవు. అదేవిధంగా టాటా సంస్థ కర్నాటకలోని కోలార్‌లో ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్‌ అసెంబ్లీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈవిధం గా ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీ ఎకోసిస్టమ్‌ మనదేశంలో వృద్ధి చెందడం, వీటి ఎగుమతులకు దోహదం చేయగలవు. ప్రస్తుతం మన ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ ఎగుమతుల విలువ రెండు బిలియన్‌ డాలర్లుగా వుంది. ఈ ఎగుమతులను పదిరెట్లు పెంచడం ద్వారా, అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ మార్కెట్‌లో 10శాతం చేజిక్కించుకోవాలన్నది మనదేశ లక్ష్యం. ప్రస్తుతం గ్లోబల్‌దిగ్గజ సంస్థలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌, రోల్స్‌రాయిస్‌ వంటి సంస్థలు తమకు కావలసిన కాంపొనెంట్స్‌కోసం అధికంగా భారత్‌పైనే ఆధారపడుతున్నాయి. ఆవిధంగా ఔట్‌సోర్సింగ్‌ను మనకు ఇవ్వడం వల్ల వాటి తయారీ ఖర్చు 15ా20 శాతం తగ్గడమే కాదు, అత్యంత నాణ్యమైన ఉత్పత్తు లు మననుంచి వారు పొందగలుగుతున్నారు. ఈనేపథ్యంలో రోల్స్‌రాయిస్‌ సంస్థ మనదేశానికిచ్చే ఔట్‌సోర్సింగ్‌ను రెట్టింపు చేయాలన్న ఆలోచనలో వుంది. ప్రస్తుతం ప్రతి వాణిజ్య ఎయిర్‌ బస్‌ విమానంలో మనదేశంలో తయారీ కాంపొనెంట్స్‌ పెద్దమొత్తంలోనే వుంటున్నాయి! ఇప్పటికే నా ణ్యమైన ఎరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీలో గ్లోబల్‌ మార్కెట్‌లో మనదేశానికి మంచిపేరుంది. ఇందులో సాధించే నైపుణ్యం మనదేశం పౌర విమానాల తయారీకి ఎంతగానో ఉపయోగపడగలదు. నైపుణ్యం విషయంలో మనం చైనా అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోవాలి. విమానాలకు సంబంధించి ఉపావ్యవస్థలను స్వల్పకాలం పాటు మనం దిగుమతి చేసుకున్నా, వీటికి ప్రత్యా మ్నాయాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఇప్పుడు సీఓఎంఏసీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యే మనకూ పునరావృతం కాగలదు. చైనానుంచి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏమంటే, ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టుకు సుస్థిరంగా, దీర్ఘకాలం పాటు నిధులను సమ కూర్చడం తప్పనిసరి. ఉదాసీనంగా కొనసాగించిన సరస్‌ ప్రాజెక్టు మాదిరిగా మరే ఇతర ప్రాజె క్టు వుండకూడదు. దానివల్ల ప్రయోజనం వుండదు. ప్రతి విమానం తయారీ వెనుక ప్రభుత్వం సంపూర్ణ మద్దతివ్వాలి. ఉదాహరణకు ఎయిర్‌బస్‌ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి 22 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ లభించింది. ఫలితంగా ఎ380, ఎ350 విమానాలను తయారుచేయగలిగింది. ఇదే సమయంలో ప్రైవేటు రంగానికి కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. మొ త్తంమీద చెప్పాలంటే విమానాల తయారీరంగంలో ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వీటి తయారీలో మన కంటూ ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాల్సి వుంటుంది.

`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?

`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ.

`మద్రాసుకు నీళ్లిచ్చారు.

`తెలంగాణను ఎండబెట్టారు.

`పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు.

`రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు.

`పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు?

`తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు.

`తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు.

`అంత ఖర్చు సాద్యం కాదన్నారు.

`ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు.

`ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు.

`తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు.

`నీళ్లన్నీ కిందకు వదిలేసి ఆంద్రాకు న్యాయం చేస్తున్నారు.

`తెలంగాణ ఎండబెట్టి ఆంద్రాకు నీళ్లు వదిలేస్తున్నారు.

`కేసిఆర్‌ హయాంలో రాజమండ్రికి నీటి కరువొచ్చింది.

`కాంగ్రెస్‌ హయాంలో ఇప్పుడు ధవళేశ్వరం కళకళలాడుతోంది.

`తెలంగాణకు ఉమ్మడి పాలకులు ఎప్పటికీ శత్రువులే!

`ఉమ్మడి పాలకులకు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి ఆంద్రా పాలకులు తెలంగాణ నీళ్లను తరలించుకుపోయారు. నిధులు ఆంద్రాకు మళ్లించుకున్నారు. నియామకాలన్నీ కట్టబెట్టుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఇంకా ఎలా అన్యాయం చేయాలన్న ఆలోచనలే చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని బనకచర్లను తెరమీదకు తీసుకొచ్చారు. వెంటనే దాని పనులు మొదలుపెట్టారు. సముద్రంలో కలిసే నీటిని వృధాగా పోకుండా, వరద జలాల మీద ఆధారపడి బనకచరర్ల నిర్మాణం చేపడతామని ఏపి ప్రభుత్వం అంటోంది. నిజానికి వరద పోటేత్తే సమయంలో వాడుకునే పరిస్థితి వుంటుందనేది శుద్ద అబద్దం. ఎప్పుడైతే ప్రవాహ ఉదృత్తి మోతాదులో వున్నప్పుడే నీటిని వాడుకుంటారు. కాని మాటలకు మాత్రం వరద జాలలను మాత్రమే వినియోగించుకుంటామని చెప్పడం ఏపి పాలకులకు అలవాటైంది. ఉమ్మడి రాష్ట్ర్రంలో కూడా అదే చెప్పేవారు. పోతిరెద్డి పాడు విషయంలోనూ అదే చేశారు. దాంతో ఏపిలో నిర్మాణం చేసిన అనేక ఎత్తిపోతల ప్రాజెక్టుల రిజర్వాయర్లకు అదే సమాదానం చూపించారు. కాని నికర జలాలు మాత్రమే ఎత్తుకుపోతున్నారు. అది గత అరవై సంవత్సరాలుగా సాగుతూనే వుంది. ఇంకా సాగిస్తూనే వున్నారు. ఏ నదికైనా కింది రాస్ట్రానికి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం వుంటుందన్న సాకుతో పరిమితికి మించి నీటిని వాడుకోవడానికే ఏపి ఆనాటి నుంచి అలవాటు చేసుకున్నది. రాష్ట్రం విడి పోయిన తర్వాత ఆ వాదన మరింత ఎక్కువగా చేస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఏపి ప్రభుత్వం బనకచర్లకు నీళ్లు తరలించుకుపోతున్నా స్పందించడం లేదని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. పోలవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసుకునేందుకు రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఓ వైపు శ్రీశైలం నుంచి ఇప్పటికే రాయలసీమకు పోతిరెడ్డిపాడు మొదలుపెట్టి, చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. కాని తెలంగాణకు మంచినీటిని అందించేందుకు కూడా ఏనాడు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలైనా సరే గోదావరి నీటిని బనకచర్లకు వందల టిఎంసిల నీటిని తరలించుపోయే కుట్ర చేస్తున్నారు. కేంద్రం ఆశీస్సులతో మళ్లీ తెలంగాణకు తీరని అన్యాయంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్‌ ఫ్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు నోరు రావడం లేదానే అని ఆరోపణలు వి నిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 లోక్‌సభ సీట్లు గెలిచిన బిజేపి బనకచర్ల మీద సమర్ధవంతంగా మాట్లాడితే ఆపార్టీకే ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో బిజేపికి మరింత మద్దతు దొరికే అవకాశముంది. పైగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బనకచర్లకు కేంద్రం ఎలాంటి అనుమతులివ్వలేదంటున్నారు.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సంస్ధ వ్యాప్కో సూచనలతో కట్టిన కాళేశ్వరాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం ఆశీస్సులతో తెలంగాణ అన్యాయం చేసే బనకచర్లపై మాత్రం మాట్లాడేందుకు రెండు జాతీయ పార్టీల నాయకులు పూర్తి స్ధాయిలో ఎందుకు స్పఏదించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బనకచర్ల లాంటి అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం అనుమతులు లేకుండా నిర్మాణం సాద్యమౌతుందా? ఇంత హడావుడిగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టే కుట్ర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ప్రశ్నించపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇది మన కళ్లముందు కనిపిస్తున్నదే అయినా పెద్దగా స్పందన రావడం లేదు. గెలిపించిన తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రమాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వుంది. పదేళ్లపాటు పచ్చగా, కాళేశ్వరం ద్వారాకోటి ఎకరాల మాగాణగా మారిన తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందనేది జల ఇంజనీర్ల అభిబ్రీపాయం. దశాబ్దాల పాటు కరువుతో అల్లాడిన తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులు ఇష్టపలేదు. ఏపి పాలకులు, పార్టీలు తెలంగాణకు మరోసారి తీరని అన్యాయంచేస్తున్నాయి. తెలంగాణను అరవైఏళ్లు పీల్చి పిప్పి చేశారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణంచేయలేదు. ఎన్నికల ముందు పునాది రాళ్లు వేయడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. పదవుల కోసం మాత్రమే రాజకీయాలు చేసిన తెలంగాణ నాయకులు ఏపి నాయకులకు తొత్తులుగా మారిపోయారు. దాంతో తెలంగాణలో ప్రాజెక్టు అనే పేరు వినిపించకుండా చేశారు. తెలంగాణ అనే పదాన్ని నిషేదించేదాకా తెచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ అనేందుకు ధైర్యం చాలడం లేదు. ఇలాంటి పాలకుల వల్ల ఇప్పటికే తెలంగాణ మళ్లీ పదేళ్లు వెనక్కిపోయింది. ఇంకా ఇలాగే వుంటే యాభై ఏళ్లు వెనక్కి పంపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేమన్నారు. నిధులు ఇవ్వలేమన్నారు. ఎత్తిపోతల సాద్యం కాదన్నారు. కాని ఏపిలో మాత్రం అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మాణంచేసుకున్నారు. అందులో రాయలసీమలోనే వందల టిఎంసిల నీళ్లతో కూడిన ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. తెలంగాణ ప్రజలు అదికారం కట్టబెట్టినా ఆంద్రా నాయకులకు ఎదురు మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు నిదులు లేవని చెప్పిన ఉమ్మడిపాలకులు ఏపిలో కండలేరు నిర్మాణం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆసియాలోనే అతి పెద్ద మట్టి నిర్మాణంతో జలాశయం నిర్మాణం చేశారు. పదకొండు కిలోమీటర్ల పొడవు కట్ట నిర్మాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులతో కండలేరు కట్టుకున్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టిఎంసిలో నిర్మాణం చేస్తే భూకంపం వస్తుందని భయపెట్టిన తెలంగాణ ద్రోహులకు, కండలేరు కనిపించలేదు. 1985లోనే కండలేరును 68 టిఎంసిల నీటి సామర్ధంతో నిర్మాణంచేశారు. ఎప్పుడూ 50 టిఎంసిల నీటికి తక్కువ కాకుండా నింపుకుంటూ వచ్చారు. తిరుపతి నగరమేకాదు, ఆఖరుకు తమిళనాడు రాజదానికి చెన్నైకి మంచినీటిని సరఫరా చేశారు. అమ్మకు అన్నం పెట్టని వాళ్లు పినతల్లికి గాజులు చేయించినట్లు చేశారు. తెలంగాణకు మంచినీరు ఇవ్వడానికి ఇష్టపడని తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు చెన్నై నగర ప్రజల మంచినీళ్ల కోసం ఆలోచించారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైదాకా నీళ్లు తరలించుకున్నారు. ఇలా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల సాద్యం కాదని చెప్పిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపిలో ఎత్తిపోతల పధకాలు వేలాది కోట్లు ఖర్చు చేసి కడుతుంటే కళ్లు మూసుకున్నారు. ఇదే కాకుండా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద రిజర్వార్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ప్రధానమైనవి వెలింగొండ ప్రాజెక్టు. సుమారు 43 టిఎంసిల సామర్ధ్యంతో తెలంగాణ నిదులను వాడుకొని నిర్మాణం చేసుకున్నారు. దాని కింద అనేక చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణంచేసుకున్నారు. ఊరకళ్లు రిజర్వాయర్‌ 10 టిఎంసిల సామర్ధ్యంతో కట్టారు. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ను 17 టిఎంసిల సామర్ధ్యంతో చేపట్టారు. పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఇలా దోచుకెళ్లారు. అలుగునూరు ప్రాజెక్టుకు 10 టిఎంసిలతో నిర్మించుకున్నారు. అవుకు 9 టిఎంసిలతో రిజర్వాయర్‌ పూర్తి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. వీటి కింద కొన్ని వందల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిదులతో చేపట్టారు. ఆఖరుకు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ తూములు పగుల గొట్టి మరీ నీళ్లను దోపిడీ చేసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా సాగునీటి అవసరాలకోసం నిర్మాణం జరిగిన రాజోలి బండ తూములు పగలగొట్టి మరీ నీళ్లు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులకు చేసిన ఖర్చుల సగం ఖర్చు చేసినా తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తెలంగాణలో ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ అంతా సస్యశ్యామలమయ్యేది. అయినా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. నీళ్లిచ్చి తెలంగాణ బాగు పడడం చూడాలనుకోలేదు. తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణ నిధులతో ఆంద్రా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఏపిని అన్నపూర్ణ అని పిలిపించుకున్నారు. తెలంగాణను ఆకలి కేకలు వింటూ ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు కూడా మరో సారి బనకచర్ల పేరుతోమరో పెద్ద జలదోపడీ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ వాదులు మేలుకోకపోతే, నీటి పంపకాల సమయం వచ్చినప్పుడు మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం జరిగే అవకాశం వుంది.

‘‘నేటిధాత్రి’’కి ‘‘గుమస్తా’’ నోటీసులు!

`నిజానికి, నిర్భయానికి నిదర్శనం ‘‘నేటిధాత్రి’’.

`ఈ పిట్ట బెదిరింపులు ‘‘నేటిధాత్రి’’ చాలా చూసింది.

`రైతు ప్రయోజనాలే నేటిధాత్రి’’కి ముఖ్యం.

`రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం.

`2016 లో ‘‘నేటిధాత్రి’’ రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది.

`‘‘నేటిధాత్రి’’ చేసింది ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం.

`ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్‌ ఆటలాడుతున్నాడు!

`వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్‌ వడ్లు మాయం చేస్తున్నాడు!

`చిన్నా, చితక వ్యవహారం అనుకుంటున్నాడు

`కేంద్ర ప్రభుత్వం అన్ని గమనిస్తోంది.

`కేంద్రం రంగంలోకి దిగితే అసలు సినిమా అప్పుడు తెలుస్తోంది.

`కిలాడి జగన్‌ ను ఉసిగొల్పుతున్న జగత్‌ కిలాడీలు ఎవరో ‘‘నేటిధాత్రి’’ కి తెలుసు.

`మిల్లర్‌ జగన్‌ చేసిందే అన్యాయం, ఘోరం.. నేరం.

`నేరం చేసి బరితెగిస్తామంటే మీడియా ఊరుకుంటుందా?

`ప్రభుత్వం కళ్లు మూసుకుంటుందా?

`పాపం పండే సమయం చట్ట పరంగా రాకుండా వుంటుందా?

`‘‘నేటిధాత్రి’’ కథనంతో యంత్రాంగం కదలకుండా వుంటుందా?

`సివిల్‌ సప్లైలో ఎంత మందిని మేనేజ్‌ చేయగలరు.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి వారు ఒక్కరు చాలు.

`ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది.

`‘‘నేటిధాత్రి’’ ఎప్పుడూ తప్పుడు వార్తలు రాయదు.

`21 సంవత్సరాల ట్రాక్‌ రికార్డులో మచ్చ లేదు.

`తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు.

`బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తుంది.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌ మిల్లులకు నోటీసులిచ్చింది నిజం కాదా?

`2 వేల బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా?

`ముగ్గురు బలమైన మంత్రులున్న ఖమ్మం రైతులను మోసం చేయడం అంత సులువనుకున్నావా?

`జగన్‌ మిల్లుల నుంచి మురుగు నీరు ఇరిగేషన్‌ కాలువలో కలుస్తున్నది నిజం కాదా?

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా?

`అనవసరంగా జగన్‌ ఆటలో అరటిపండౌతున్నాడు.

`జగత్‌ కిలాడీల బాగోతం బైటకు రాకుండా జగన్‌ను ముందు పెట్టి ఆడిస్తున్నారు.

`‘‘నేటిధాత్రి’’కి నోటీసులిచ్చి జగన్‌ మరింత ఇరుక్కున్నాడు.

`తెలంగాణలో మిల్లర్లు మింగిన వడ్ల లెక్కలు వెయ్యి కోట్లౌతుంది.

`రైతులను మోసం చేసిన వారి బండారం బైట పెట్టడం ‘‘నేటిధాత్రి’’ కర్తవ్యం.

`రైతుల వడ్లు జగన్‌ మాయం చేయడం నేరం.

`ఈ రెండిరటికీ తేడా తెలియక ఎగిరితే జగన్‌ ఎల్లెలుకల పడడం ఖాయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

  రైతుల వడ్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా జగన్‌ అలియాస్‌ మిల్లర్‌ జగన్‌ నేటిదాత్రి దినపత్రికకు నోటీసులు పంపించారు. జగన్‌ వ్యవహారం ఎలా వుందంటే దొంగే దొంగ అన్నట్లుంది. ఆరు గాలం కష్టించి రైతులు పండిరచిన వడ్లును అన్యాయంగా మాయం చేసినప్పుడు తాను తప్పు చేస్తున్నానని గుర్తురాలేదా? తాను చేసేది పెద్ద నేరమన్న సంగతి తెలియదా? పొరపాట్లు చేసుకుంటూ పోయే వ్యక్తిని నేటిధాత్రి జగన్‌ చాలా గొప్ప పని చేశాడంటూ కీర్తించాలనుకుంటున్నాడా?ఏమిటి? చేసిందే పాడు పని. పాపిష్టి పని. పాపపు పని. రైతులను అన్యాయం చేయడమే పెద్ద ఘోరమైనపని. అంతా చేసి తన పరువుకు భంగం కలిగిందని నేటిధాత్రికి నోటీసులు పంపితే బెదిరిపోతుందనుకున్నాడో ఏమో? మిల్లర్‌ జగన్‌ చేసినపని అందరికీ తెలుసు. జిల్లా అధికారులకు తెలుసు. జగన్‌ చేసిన పని ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ యంత్రాంగానికి తెలుసు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏకంగా జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులకు సూచించారు. ఖమ్మం జిల్లానుంచి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయినా జగన్‌ మేకపోతు గాంభీర్యం ఎక్కడో ప్రదర్శించాల్సిందిపోయి, నేటిదాత్రికి నోటీసులు పంపించి మరింత తప్పు చేసినట్లైంది. నేటిధాత్రి ఇలాంటి పిట్ట బెదిరింపులు గత 24ఏళ్లలో అనేకం చూసింది. జగన్‌ అనేవ్యక్తి తప్పు చేయకుంటే నేటిధాత్రిలో వార్త అయ్యేదే కాదు. హన్మకొండ జిల్లాల్లో ఏ మిల్లర్‌ చేయని నీచమైనపని చేసి, తాను సచ్చీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం కూడా హర్షించదు. ఇప్పుడిప్పుడే జగన్‌ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఖమ్మం జిల్లా నుంచి ఇది వరకు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వడ్ల వివరాలు కూడా అన్నీ త్వరలో పూర్తి వివరాలు రానున్నాయి. పెద్దఎత్తున రైతులను జగన్‌ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వస్తోంది. జగన్‌ మీద వర్తాల పరంపర ఆగిపోలేదు. ఇప్పుడే మొదలైంది. ముందు ముందు మరిన్ని కథనాలున్నాయి. జగన్‌ చేసిన తప్పుల లెక్కలు అన్నీ బైటకు వస్తాయి. ఎందుకంటే నేటిధాత్రికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రైతులను మోసం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తిలేదు. ఉదారత ప్రదర్శించే అవకాశం లేదు. రైతులను మోసం చేసిన వారు ఎంత పెద్ద వాళ్లైనా సరే నేటి ధాత్రి వదిలిపెట్టదు. పైగా చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, జగన్‌ తాను చేసిన సుద్దపూస పని గొప్పగా వుందనుకుంటున్నాడో ఏమో? నేరం చేసి కూడా ఇంకా బరితెగిస్తామంటే నేటిధాత్రి ఊరుకోదు. తప్పులు, మోసాలు చేసిన వారికి పాపం పండే సమయం ఎప్పుడో అప్పుడు వస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేటిధాత్రిలో వచ్చిన కథనాలలో తప్పు వుంటే జగన్‌ మీడియా ముఖంగా వివరాలు వెల్లడిరచవచ్చు. పూర్తి వివరాలు బైట పెట్ట వచ్చు. ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన మిల్లులలో 2వేల వడ్ల బస్తాల మాయాజాలంపై నోటీసులు అందిన మాట వాస్తవం కాదా? తనకు నోటీసులు రాలేదని జగన్‌ చెప్పగలరా? ఈ వివరాలు ఎందుకు బైట పెట్టడం లేదు. అదికారులు ఎంత మందిని జగన్‌ మేనేజ్‌ చేయగలడు. ఎంత కాలం వారు కాపాడగలరు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినసమయంలో తప్పకుండా వారు స్పందించాల్సిందే. జగన్‌పై కేసులు నమోదు చేయాల్సిందే. లేకుంటే అధికారులు తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాల్సిందే. జగన్‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదన్న భ్రమల్లో వున్నట్లున్నాడు. రెండు మూడు రోజుల్లో అంతా తేలుతుంది. అప్పుడే తొందరెందుకు? పిల్లికండ్లు మూసుకొని పాలు తాగినట్లు, తన మిల్లులో వడ్లు మాయమైతే గుర్తించేదెవరు అని అనుకున్నాడు. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వడ్ల బస్తాల మీద లెక్కలు రాయిస్తారని పసిగట్టలేపోయాడు. రాత్రికి రాత్రి వడ్లు తరలించి, లేవని చేతులు దులుపుకుంటే సరిపోతుందనుకున్నాడు. కాని ఒక సమర్ధవంతమైన ఐఏఎస్‌ అధికారి సరిగ్గా పని చేస్తే ఎలా వుంటుందో జగన్‌కు ముందు ముందుతెలుస్తుంది. జగన్‌ లాంటి అక్రమార్కుల పని పట్టాలంటే ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి ఉన్నతాదికారి ఒక్కరు చాలు. ఇంత కాలం తిన్నదంతా కక్కించేందుకు పెద్దగా సమయం పట్టదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లైలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా కమీషనర్‌కు వెళ్తూనే వుంది. కమీషనర్‌ చౌహాన్‌ అన్నీ గమనిస్తూనేవున్నారు. నేటిధాత్రికి సుద్దపూసలాగా జగన్‌ నోటీసులు పంపడం కూడా వారి దృష్టికి వెళ్లింది. నేటిధాత్రి అనేది ఒక బ్రాండ్‌. మీడియా రంగంలో నేటిధాత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాదు, స్ధానం వుంది. రెండున్న దశాబ్ధాల కాలంలో తప్పుడు వార్తలు రాయడం అన్నది జరిగింది లేదు. ఇప్పటి వరకు తప్పుడు వార్తలనే మచ్చ లేదు. తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు, నేరాలు చేస్తున్న జగన్‌ తన పరువు గురించి ప్రస్తావించడమే విచిత్రంగా వుంది. నేటిధాత్రికి పంపిన నోటీసుల్లో వడ్ల ప్రస్తావన చేసిన జగన్‌ తన మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు. తమ మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీటి ప్లాంట్ల గురించి ఎందుకు చెప్పలేదు. ఆ నీరుంతా ఇరిగేషన్‌ కాలువలో కలవడం లేదని నిరూపించగలడా? కాలువల్లో పారుతున్న మురుగునీటికి మిల్లుల నుంచి వెలువడుతున్న నీరు కాదని రుజువు చేసుకోలగడా? ఇటు ఇరిగేషన్‌ శాఖకు నష్టం చేస్తూ, అటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును మోసం చేస్తూ, ప్రజల ప్రాణాలకు హాని తలపెడుతున్న జగన్‌ కూడా నీతులు వల్లించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. తెలంగాణలో ముగ్గురు మంత్రులున్న ఏకైక జిల్లా ఖమ్మం. అలాంటి జిల్లాకు చెందిన రైతులు మోసం చేస్తే వదిలేస్తారని జగన్‌ ఎలా అనుకుంటున్నాడో? ఎవరు రక్షిస్తారనుకుంటున్నాడో? ఎందుకంటే జగన్‌కు పూర్తిగా రైతుల చట్టాలు తెలియనట్లున్నాయి. ఇంత కాలం నేటిధాత్రిలా చెప్పిన మీడియా లేకపోవడం కూడా జగన్‌కు కలిసొచ్చినట్లుంది. ఆహార భద్రతా చట్టాలు ఎంత పకడ్భందీగా కేంద్రం అమలు చేస్తుందో ఎప్పుడూ విననట్లుంది. 2019కి మందు తెలంగాణలో సివిల్‌ సప్లైలో జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి రాసిన వరుస కధనాలతో కదిలిన కేంద్రం సబ్సిడీలు అప్పుడు ఆపేసింది. ఇంత వరకు వాటిని విడుదల చేయలేదు. అంతటి ట్రాక్‌ రికార్డు నేటిధాత్రి సొంతం. తప్పులు చేసి కూడా పరువు, ప్రతిష్ట అని జగన్‌ చెప్పుకోవడమే సిగ్గు చేటు. అలాంటి వారిని వదిలిపెట్టిన చరిత్ర నేటిధాత్రికి లేదు. బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేసిన చరిత్ర నేటిధాత్రిది. ఆ సంగతి తెలిసి కూడా జగన్‌ చేసిన తప్పు సరిదిద్దుకోకుండా నోటీసులు ఇవ్వాలనుకోవడం మరో తప్పుకు కారణమైంది. నేటిధాత్రి చేసేదే ఇన్‌వెస్టిగేషన్‌ జర్నలిజం. ఆ సంగతి జగన్‌కు తెలియకపోవడం విచారకరం. జగన్‌ చేసింది చిన్నా చితకా వ్యవహారంకాదు. దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులను మోసం చేసిన మిల్లర్లు ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో తెలుసుకుంటే మంచిది. అనేక రాష్ట్రాలలో బస్తా వడ్లు మాయం చేసిన మిల్లర్లపై కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. ఇక్కడ అదికారుల ఉదాసీనతతో మిల్లర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా కిలాడీ జగన్‌ వెనుక వున్న జగత్‌ కిలాడీలు ఎవరో కూడా నేటిధాత్రికి తెలుసు. జగన్‌కు ఉసిగొల్పి ఆట లాడిస్తున్నవారి మాటలతో మొదటికే జగన్‌ మోసం తెచ్చుకుంటున్నాడు. ఆఖరుకు ఆటలో అరటి పండు కావడమే తరువాయి అన్న సంగతి జగన్‌ తెలుసుకోలేకపోతున్నాడు. అనసవరంగా సివిల్‌ సప్లైతో సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఎగదోసే వాళ్లు ఎగదోస్తారు? ఒక్కరిని ముందు పెట్టి ఆడిరచాలనుకుంటారు? కారణం ఇతరులు చేసే తప్పుల మీద చర్చలు రాకుండా చూసుకుంటారు. వడ్ల మాయం సంగతి ఒక్క జగన్‌కే సొంతం కాదు. తెలంగాణ వ్యాప్తంగా చాల మంది జగన్‌ లాంటి మిల్లర్లు సాగిస్తున్నారు. అవన్నీ బైటకు వచ్చే సమయం ముందు ముందు వుంది. ఆ లెక్కలన్నీ తేలిస్తే వేల కోట్లవుతున్నాయి. రైతులను ఏఏ మిల్లర్‌ ఎంత మోసం చేశాడన్నది కమీషనర్‌ స్ధాయిలో అన్ని లెక్కలున్నాయి. అవి కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. అప్పుడు జగన్‌కే కాదు, అందిరకీ వుంటుంది?

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి..

తహసిల్దార్ రజనీకుమారి.

రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

 

రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.

 

 

We should take advantage of the land.Tehsildar Rajnikumari.

ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.

`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.

`అమరావతి దేవతల రాజధాని!

`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.

`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.

`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.

`అదే దేవతల రాజధానిగా భావించాలి.

`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.

`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!

`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!

`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!

`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!

`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.

`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.

`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.

`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!

హైదరాబాద్‌,నేగిధాత్రి:

తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్‌ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్‌ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్‌ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్‌గా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version