-పనిలో కి రాలేదు అని ఇంట్లో బంధించి కర్రతో దాడి
-కులం పేరుతో దూషణ
చెన్నూర్: నేటి ధాత్రి::
చెన్నూర్ రూరల్, కోటపల్లి మండలం అల్గామ గ్రామం లో కుల అహంకారం మరోసారి బయటపడింది.ఒరేయ్ అని పిలిచినందుకు ఏర్రయిపేట లో దళిత యువకుడిని కొట్టిచంపిన సంఘటన మరవకముందే మరో కుల అహంకారం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే ఆల్గామ గ్రామానికి చెందిన అంబాల బాపు తండ్రి వెంకటి అనే వ్యక్తిని 20-1-2024 శనివారం రోజున అదే గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన పాకాల మల్లయ్య పటెల్ తనకు పనికి రాలేదు అని కర్రతో విచక్షణ రహితంగా దాడిచేశాడు .మాదిగ లంజా కొడకా ఒక కులం తక్కువ వాడివి అయ్యుండి నేను చెప్పిన టైం కి పనిలో కి రాకుండా ఉంటావా అని తీవ్రంగా కొట్టి చేతులు కట్టేసి లాక్కొని వెళ్లి పాకాల మల్లయ్య ఇంట్లో బంధించి కొట్టాడు. కొన్ని గంటల తరువాత విషయం తెలుసుకున్న అంబాల బాపు తన బాబాయ్ కొడుకు అయినా శేఖర్ వచ్చి తలుపులు తీసి పాకాల మల్లయ్య దగ్గర బంది గా ఉన్న అంబాల బాపును.విడిపించాడు.బాధితుడు మాట్లాడుతూ మా గ్రామం లో కాపు వాళ్ళే అగ్రవర్ణాలు,వాళ్ళే ఇక్కడ భూ స్వాములు ప్రభుత్వ పరంగా వెనుకబడిన వారం అని ,కుల పరంగా అగ్రవర్ణ వారిమి అని ఇలా పనికి ఒక గంట ఆలస్యంగా వస్తె దాడులు చేస్తారు అన్నారు.వెంటనే పాకాల మల్లయ్య పటేల్ నీ అరెస్ట్ చేసి ఎస్ సి ,ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు