పోలీస్ ఉద్యోగాలు సాధించిన వర్సిటీ విద్యార్థులను సన్మానించిన క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్.

కేయూ క్యాంపస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ ఫలితాలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 69 మంది కానిస్టేబుల్స్ ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జేఎల్ఎం ఒకరు ఎన్నికైనట్లు కోచింగ్ సెంటర్ సంచాలకులు డాక్టర్ టీ నాగయ్య తెలిపారు. అదేవిధంగా డీఎస్సీ మరియు జేఎల్ ఫలితాలలో కూడా అనేకమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందుతారని ఫ్రీ కోచింగ్ సంచాలకులు డాక్టర్ నాగయ్య తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ సంచాలకులు డాక్టర్ నాగయ్య అధ్యక్షతన భౌతిక శాస్త్ర సెమినార్ హాల్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ లాల్ హాజరై విద్యార్థులను అభినందించారు. శ్రావణి పూజ, మరియు అజయ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఎన్నికైనారని ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారని, 30 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఒకరు జేఎల్ ఎం అభ్యర్థి మరియు సెట్ యూజీసీ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్ లాల్ మాట్లాడుతూ పోలీస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారధిగా కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఫిజిక్స్ విభాగ అధిపతి ఆచార్య శ్రీలత, ఆచార్య మంజుల, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య తిరుమలా దేవి, డాక్టర్ చిలువేరు రాజకుమార్, డాక్టర్ ఆశీర్వాదం, హిమబిందు భవాని, మానస, రాకేష్, తేజస్విని, సందీప్, రమ్య, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!