BC Leader Defends Konda SurekhaBC Leader Defends Konda Surekha
బీసీ మహిళా మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్లపల్లి నేటి దాత్రి
బీసీ మహిళా మంత్రిగా..అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి..కోట్లాది రూపాయల నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేస్తూ..రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించేలా కృషి చేస్తున్న మహిళా ఫైర్ బ్రాండ్..బీసీల ముద్దుబిడ్డ..ఓరుగల్లు రుద్రమదేవిగా పేరు ప్రఖ్యాతలు గడించిన మంత్రి కొండా సురేఖమ్మ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించి, బీసీలపై విషం కక్కుతుందని, హిందువులంటే కేవలం బ్రాహ్మణులే కాదని, బీసీలు కూడా ఉన్నారని బీజేపీ గ్రహించాలని, బీసీ మహిళా మంత్రి కొండా సురేఖమ్మ తెలంగాణలో దేవాలయాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే..బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం వరంగల్ లో జరిగిన రైతు మేళాలో మంత్రి కొండా సురేఖమ్మ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ పార్టీ మీటింగులు పెట్టి జైశ్రీరామ్ అనడం తప్ప..రాష్ట్రంలోని దేవాలయాలకు గానీ, రాష్ట్ర అభివృద్ధికి గానీ ఒక్క పైసా నిధులు కేటాయించకపోవడం, రాష్ట్ర ఆలయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ..ఇతర రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తూ..వివక్ష చూపుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తే..ఆ మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించడమంటే..బీసీలపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ..బీసీలను బలహీన పరచడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బ్రాహ్మణ భావజాలం కలిగిన కమలనాధులు బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగాల పరంగా ఎదగకుండా కుట్రలు చేస్తుందని, జన గణనలో బీసీ కుల గణన చేపట్టకుండా, జనాభా దామాషా ప్రకారం చట్ట సభలలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందని, ఈ కుట్రలను బీసీ సమాజం చూస్తూ సహించబోదని, బీసీ సమాజమంతా ఏకమై బీజేపీని కాలగర్భంలో కలపడం ఖాయమని మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు.
