Grand Ambedkar Jayanti Celebrations in Kondaparthi
కొండపర్తిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నేటిధాత్రి – అయినవోలు
https://youtu.be/iVSPrhfij-c?si=_xQ8CgKmb590KGDW
అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో స్థానిక ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 10వ వార్డు సభ్యులు కట్కూరి రాజు మాదిగ కుల సంఘం అధ్యక్షులు కట్కూరి రహీం హాజరై అంబేద్కర్ జీవిత చరిత్ర, సమాజానికి చేసిన సేవలను వివరించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు.
కార్యక్రమంలో ఆదర్శ యూత్ గౌరవ సలహాదారు కట్కూరి రమేష్, గౌరవ అధ్యక్షులు కట్కూరి రాజు (జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత), మాజీ అధ్యక్షులు కట్కూరి వంశీ (అజయ్), మాదాసి సతీష్, కుల సంఘం ఉపాధ్యక్షులు మాదాసు సునీల్, కోశాధికారి గద్దల సుమన్, గద్దల ప్రభాకర్, బొజ్జ చిరంజీవి, కట్కూరి శోభన్, మాదాసు భాగ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కట్కూరి విష్ణు, యూత్ సభ్యులు కట్కూరి సృజన్, పోలేపాక రాజేష్, కట్కూరి చెక్రి, ప్రభాస్, సూర్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
